ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్‌లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు.
ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది.
అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు.
కాగా టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం.
చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు
Comments
Please login to add a commentAdd a comment