australia cricket
-
ఒక్క పరుగు.. 8 వికెట్లు.. కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్
ఆస్ట్రేలియా దేశీ టోర్నీ వన్డే కప్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం ఎదురైంది. టాస్మానియాతో మ్యాచ్‌లో 52 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. ఈ స్కోరుకు కేవలం ఒక్క పరుగు జతచేసి మిగిలిన ఎనిమిది వికెట్లు నష్టపోయింది. ఆ ఒక్క రన్ కూడా వైడ్ రూపంలో విశేషం. మరి డిఫెండింగ్ చాంపియన్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఇంత భారీ షాకిచ్చిన ఆ బౌలర్లు ఎవరంటే?!లిస్ట్-ఏ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టాస్మానియా కెప్టెన్ జోర్డాన్ సిల్క్.. వెస్టర్న్ ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఓపెనర్ ఆరోన్ హార్డీ(7)ని పేసర్ టామ్ రోజర్స్ అవుట్ చేయగా.. మరో ఓపెనర్ ఆర్సీ షార్ట్(22) వికెట్‌ను బ్యూ వెబ్‌స్టర్ పడగొట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ బాన్‌క్రాఫ్ట్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. ఈ క్రమంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాతి ఓవర్ నుంచే టాస్మానియా స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ తన మ్యాజిక్ మొదలుపెట్టాడు. 16వ ఓవర్లో రెండు వికెట్లు తీయగా.. వెస్టర్న్ ఆస్ట్రేలియా స్కోరు 52-4గా మారింది. ఇక ఆ తర్వాత వెబ్‌స్టర్ వెనుదిరిగి చూడలేదు. పేసర్ బిల్లీ స్టాన్‌లేక్‌తో కలిసి.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దిమ్మతిరిగేలా షాకిస్తూ వరుసగా పెలివియన్‌కు పంపాడు.వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిల్లీ స్టాన్లేక్ రెండు వికెట్లు కూల్చగా.. 18వ ఓవర్ ఆఖరి బంతికి వెబ్‌స్టర్ తనఖాతాలో మరో వికెట్ జమచేసుకున్నాడు. అదే విధంగా.. 20వ ఓవర్లో మరో రెండు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. ఆ మరుసటి ఓవర్లో పదో వికెట్‌ను కూల్చాడు. దీంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా 20.1 ఓవర్లలో 53 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 28 బంతుల వ్యవధిలో వైడ్ రూపంలో ఒక్క పరుగు పొంది.. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక 53 పరుగులకే చాప చుట్టేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా వన్డే కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.మరోవైపు.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా కేవలం 8.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 55 పరుగులు చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆరు వికెట్లతో చెలరేగిన బ్యూ వెబ్‌స్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఆర్సీ షార్ట్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs NZ 2nd Test: చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లి -
Gareth Morgan: 6 బంతుల్లో 6 వికెట్లు
గోల్డ్‌కోస్ట్: ఆ్రస్టేలియా క్లబ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. గోల్డ్‌కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్–3 పోటీల్లో ఒక బౌలర్ ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. ముద్గీరబ నేరంగ్ అండ్ డిస్ట్రిక్ట్స్ క్లబ్ కెపె్టన్ గారెత్ మోర్గాన్ ఈ ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ సీసీ జట్టుపై అతను ఈ రికార్డు సృష్టించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ క్లబ్ 39 ఓవర్లలో 174/4 వద్ద నిలిచింది. చివరి ఓవర్లో మరో 5 పరుగులు చేస్తే చాలు. అయితే గారెత్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించడంతో 4 పరుగుల తేడాతో గెలుపు ముద్గీరబ జట్టు సొంతమైంది. అంతకుముందే ఈ ఇన్నింగ్స్‌లో మరో వికెట్ తీసిన గారెత్ మొత్తంగా 7/16తో ముగించాడు. గతంలో ప్రొఫెషనల్ క్రికెట్లో నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్), అల్ అమీన్ (బంగ్లాదేశ్), అభిమన్యు మిథున్ (భారత్) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు. -
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
ఇండియాకి వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉందా..?
-
స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన
క్రికెట్లో స్లో ఓవర్ రేట్ పెద్ద మైనస్. సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకి ఎదురవుతూ జట్లకు శాపంగా మారుతుంది. బ్యాటింగ్.. బౌలింగ్ ఇలా ఏ సమయంలోనైనా నిర్ణీత సమయంలోగా మ్యాచ్‌ను పూర్తి చేయకపోతే స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ సహా ఆటగాళ్లకు జరిమానా విధిస్తూ వస్తున్నారు. అయితే ఈ రూల్‌లో ఐసీసీ కాస్త మార్పులు చేసింది. ఇకపై స్లో ఓవర్ రేట్ నమోదైతే.. మ్యాచ్ ఫీజులో కోత విధించకుండా.. ఫీల్డింగ్ జట్టులో కొత్త నిబంధన తీసుకొచ్చింది. సాధారణంగా పవర్ ప్లే అనంతరం 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం ఉంటుంది. స్లో ఓవర్ రేట్ నమోదైతే స్లాగ్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండేలా రూల్ తీసుకొచ్చింది. తాజగా ఈ నిబంధన మ్యాచ్ విజయాలపై ప్రభావం చూపుతుంది. అయితే స్లో ఓవర్ రేట్‌కు మరో ప్రధాన కారణం.. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లు. బౌండరీ వెళ్లిన ప్రతీసారి బంతి తీసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. దీనివల్ల కూడా మ్యాచ్ నిర్ణీత సమయంలోగా పూర్తవ్వడం లేదు. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ ఒక వినూత్న ఆలోచన చేసింది. ఇకపై బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన తర్వాత ఆ బంతి తీసుకురావడానికి గ్రౌండ్‌లోని సపోర్ట్ స్టాఫ్ సహా డగౌట్లో ఉన్న ఆటగాళ్లను ఉపయోగించాలని భావిస్తుంది. బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టిన ప్రతీసారి ఫీల్డర్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ స్ట్రాటజీని ఉపయోగించగా.. అది చక్కగా పనిచేసింది. ఈ పని ద్వారా స్లో ఓవర్ రేట్‌ను దాదాపు నియంత్రించొచ్చు అనేది ఆసీస్ క్రికెట్ వాదన. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ ఐసీసీ అనుమతితో టి20 వరల్డ్‌కప్‌లో ఇలాంటి రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో దీనిని అమలు చేస్తున్నారు. A clever ploy from the Aussies who are keen to avoid the fielding restriction penalty if overs aren't bowled in time during this #T20WorldCup pic.twitter.com/5e73KABQcd — cricket.com.au (@cricketcomau) October 19, 2022 చదవండి: 'టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్-2022కు ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును గురువారం ప్రకటించింది. తొలి టీ20కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. మిగితా రెండు టీ20లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ సిరీస్‌లో తొలి టీ20కు స్టార్ ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్,ఆడమ్ జంపాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కాగా వీరి స్థానంలో స్టోయినిస్, ఆగర్, రిచర్డ్సన్ జట్టులోకి వచ్చారు. ఇక ఇంగ్లండ్-ఆసీస్ మధ్య తొలి టీ20 పెర్త్ వేదికగా ఆక్టోబర్ 9న జరగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌తో రెండు టీ20 సిరీస్‌లో తలపడుతోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్ 15నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్, అష్టన్ అగర్, మిచెల్ స్వెప్సన్, నాథన్ ఇల్లీస్, కేన్ రిచర్డ్సన్ ఇంగ్లండ్‌తో మిగితా రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కేన్ జంపా చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్ -
'క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ'
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. లంక అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స దిగిపోవాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్ భవనాన్ని ముట్టడించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రాజపక్స అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా రెండు రోజులపాటు లంకలోనే ఉన్న రాజపక్స దుబాయ్‌కు పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇక జూలై 13న(బుధవారం) రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ లంకతో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ విజయవంతంగా సిరీస్‌ను ముగించుకుంది. తమ దేశంలో పర్యటించినందుకు లంక అభిమానులు సైతం మ్యాచ్ వేదికగా లవ్ యూ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమ దేశానికి బయలుదేరేముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ‘ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మాకు ఆతిథ్యమిచ్చినందుకు థాంక్యూ శ్రీలంక. ఈ పర్యటనకు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులం. ఇక్కడున్నన్ని రోజులు మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. మాకు ఎల్లవేళలా మద్దతునిచ్చారు. ఈ పర్యటనను మేము ఎప్పటికీ మరిచిపోలేం. మీ దేశంలో నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే.. దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు తలెత్తినా మీ ముఖం నుంచి చిరునవ్వు చెదరలేదు. మేం ఎక్కడికి వెళ్లినా మాకు ఘన స్వాగతం పలికారు. థాంక్యూ. నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడకు హాలీడేకు రావడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. కాగా వార్నర్ లంక జాతీయ జెండాను షేర్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేరుగా లంక పర్యటనకు వెళ్లారు. లంకలో జూన్ 7 న మొదలైన ఆసీస్ పర్యటన సోమవారం గాలేలో ముగిసిన రెండో టెస్టుతో పూర్తైంది. ఈ టూర్ లో ఆసీస్.. టీ20 సిరీస్ ను గెలుచుకుని వన్డే సిరీస్‌ను కోల్పోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను మాత్రం ఆస్ట్రేలియా సమం చేసుకుంది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) చదవండి: ఆసీస్ అగ్రపీఠాన్ని కదిలించి మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక -
ఆసీస్ హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించారు. జస్టిన్ లాంగర్ తర్వాత ఈ ఫిబ్రవరిలో మెక్ డొనాల్డ్‌కు తాత్కాలికంగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. తాజా గా ఆయన్నే నాలుగేళ్ల పాటు పూర్తిస్థాయి కోచ్‌గా నియమించారు. ఆయన కోచింగ్‌లోని ఆస్ట్రేలియా ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో 1–0తో టెస్టు సిరీస్ గెలిచింది. వన్డేల్లో 1–2తో ఓడి ఏకైక టి20లో నెగ్గింది. ‘కీలకమైన బాధ్యతల కోసం మేం చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం. అయితే మెక్‌డొనాల్డ్ తానేంటో ఇదివరకే నిరూపించుకున్నారు. ఆయన పనితీరు, అంకితభావం నచ్చే నాలుగేళ్ల కాంట్రాక్టు ఇచ్చాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ తెలిపారు. గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన మెక్‌డొనాల్డ్ 2019లో ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో చేరారు. ఆస్ట్రేలియా తరఫున 2009లో నాలుగు టెస్టులు ఆడి మొత్తం 107 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2022: ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్ -
ఇలాంటి ఆటగాడిని నేనెప్పుడూ చూడలేదు!
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్. సన్‌రైజర్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటకే ఆడిన మ్యాచుల్లో మూడు ఆఫ్ సెంచరీలు చేసి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ విషమై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఇటువంటి ఆటను తన కెరీర్లో ఎన్నడూ చూడలేదని అన్నాడు. ‘అతడికి ఇది మొదటి ఐపీఎల్ అయినా మూడు ఆఫ్ సెంచరీలు సాధించాడని తెలిపడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాట్రెల్ వేసిన షాట్ బంతికి తడబడ్డా ఆ తర్వాత మ్యాచుల్లో క్వాలిటీ ఉన్న బౌలర్లు వేసిన షాట్ బంతులను సమర్ధంగా ఎదుర్కున్నాడని అన్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన షాట్ బంతులను ముందే గుర్తించి చక్కగా ఆడాడని, దీనిని బట్టి అతడు త్వరగా నేర్చుకునేతత్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చాడు. భారత జట్టుకు ఆడగల సత్తా అతడిలో ఉందని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. (ఇదీ చూడండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’) -
ప్రపంచకప్ ఎప్పుడు జరిగినా...
మెల్బోర్న్: టి20 ప్రపంచకప్ నిర్వహణలో సొంత ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం తమకు సమస్య కాదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లీ అన్నారు. టోర్నీలో పాల్గొనే ఇతర 15 జట్లను దేశంలోకి వచ్చేలా చేసి వారికి ఆతిథ్య ఏర్పాట్లు చేయడమే పెద్ద సవాల్ అని ఆయన చెప్పారు. ప్రపంచకప్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నా... ఎప్పుడు టోర్నీ జరిగితే అప్పుడు ప్రేక్షకులను మాత్రం అనుమతిస్తామని హాక్లీ స్పష్టం చేశారు. ‘ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించడం అంటే ఇబ్బంది ఉండదు. కానీ 15 జట్ల ఆటగాళ్లు ముందు దేశంలోకి వచ్చేలా అనుమతులు తీసుకోవాలి. వారి సహాయక సిబ్బంది, అధికారులు కూడా అదనం. కనీసం ఒక నగరంలో ఆరేడు జట్లను ఉంచి అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. దీంతో పోలిస్తే అభిమానులు మైదానంలో వచ్చి మ్యాచ్‌లు చూడేలా చేయడం మా దృష్టిలో చిన్న విషయం. కాబట్టి ఎప్పుడు ఈ మెగా ఈవెంట్ జరిగినా ప్రేక్షకులను అనుమతిస్తాం’ అని సీఈఓ స్పష్టం చేశారు. -
కోట్లు పోతున్నాయి
ట్యాంపరింగ్‌తో పరువు ఎలాగూ పోయింది...ఏడాది పాటు బ్యాట్‌ను ఇంట్లో మూలన పెట్టేయాల్సిందే... కానీ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు వీటితో పాటు ఆర్థికపరంగా కూడా భారీ స్థాయిలో నష్టం జరగనుంది. ఆటపరంగా, ఆర్జనపరంగాఆస్ట్రేలియా క్రికెట్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నవీరిద్దరిపై తాజా పరిణామాలతో పెద్ద దెబ్బే పడబోతోంది. ఐపీఎల్‌కు దూరం కావడంతో పెద్ద మొత్తం కోల్పోయిన వీరిద్దరు సంవత్సరం పాటు ఇతర మ్యాచ్ ఫీజుల డబ్బులు కూడాపోగొట్టుకుంటారు. అన్నింటికి మించి వ్యక్తిగత స్పాన్సర్షిప్ ఒప్పందాలు దూరం కావడం వల్ల జరిగే నష్టం కూడా చాలా పెద్దది. సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియా జట్టు రాబోయే షెడ్యూల్‌ను బట్టి చూస్తే సంవత్సర కాలంలో ఆ జట్టు 12 టెస్టులు, 26 వన్డేలు, 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడబోతోంది. కచ్చితంగా మూడు ఫార్మాట్లలో కూడా తుది జట్టులో ఉండగలిగే స్మిత్, వార్నర్ ఈ మ్యాచ్‌లు అన్నింటికీ దూరమవుతున్నారు. ఇంగ్లండ్ పర్యటన (ఐదు వన్డేలు, ఒక టి20), పాకిస్తాన్‌తో యూఈఏలో సిరీస్ (3 టెస్టులు), స్వదేశంలో దక్షిణాఫ్రికా (ఐదు వన్డేలు, 3 టి20లు), భారత్ (నాలుగు టెస్టులు) ఇందులో అతి ప్రధానమైనవి. ఇవి కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగే సిరీస్‌లకు కూడా వీరిద్దరు దూరం కానున్నారు. ఐపీఎల్ దెబ్బ... స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్, వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి ముందు తమతో అట్టి పెట్టుకున్నాయి. నిబంధనల ప్రకారం ఇద్దరిని చెరో రూ. 12 కోట్ల మొత్తానికి ఆయా ఫ్రాంచైజీలు ఉంచుకున్నాయి. స్మిత్ బ్యాటింగ్‌కంటే కూడా అతని నాయకత్వ ప్రతిభకారణంగానే రాయల్స్ ఎంచుకుందనేది వాస్తవం. 45 రోజుల వ్యవధిలో అతను ఇంత పెద్ద మొత్తం కోల్పోతున్నాడు. మరోవైపు 2016లో జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా వార్నర్‌కు సన్‌రైజర్స్ ప్రత్యేక విలువ ఇచ్చింది. అందుకే కెప్టెన్‌గా తొలగించడంలో తొందర పడలేదు. బ్యాట్స్‌మన్‌గానైనా అతడిని ఆడించాలనే ఆలోచనే చివరి నిమిషం వరకు కూడా వారిలో కనిపించింది. అయితే నేరుగా బీసీసీఐ అడ్డు చెప్పడంతో మరో అవకాశం లేకుండా పోయింది. కాంట్రాక్ట్ మొత్తమూ... ప్రస్తుతం స్మిత్, వార్నర్ మ్యాచ్ ఫీజు రూపంలో ఆసీస్ బోర్డు నుంచి చెరో 5 లక్షల 80 వేల ఆస్ట్రేలియా డాలర్లు తీసుకుంటున్నారు. వార్షిక కాంట్రాక్ట్ రూపంలో స్మిత్‌కు 15 లక్షల డాలర్లు, వార్నర్‌కు 8 లక్షల 16 వేల డాలర్లు లభిస్తున్నాయి. ఐపీఎల్ మొత్తంతో పాటు దీనిని కలిపితే స్మిత్ ఏడాదికి 45 లక్షల 80 వేల ఆసీస్ డాలర్లు, వార్నర్ 38 లక్షల 96 వేల ఆసీస్ డాలర్లు పోగొట్టుకుంటారు. మన కరెన్సీలో చూస్తే స్మిత్‌కు రూ. 22 కోట్ల 90 లక్షలు... వార్నర్‌కు రూ. 19 కోట్ల 48 లక్షల నష్టం జరగనుంది. ఏ రకంగా చూసినా మైదానంలో ఆట ద్వారా దక్కే ఆర్జనను వీరు భారీగా కోల్పోయినట్లే లెక్క. స్పాన్సర్లూ వెనక్కి... ట్యాంపరింగ్‌తో దేశ ప్రజలందరి దృష్టిలో విలన్లుగా మారిన క్రికెటర్లతో అనుబంధం కొనసాగించడం ఏ సంస్థకైనా కష్టమే. బ్రాండ్ అంబాసిడర్లుగా తమ ఉత్పత్తుల స్థాయిని పెంచాల్సినవాళ్లు చేసిన పనితో తమ ప్రతిష్ట ఇంకా దెబ్బ తినవచ్చని వారు భయపడటం సహజం. అందుకే ఇప్పుడు వీరిద్దరి స్పాన్సర్లలో ఎంత మంది కొనసాగుతారో చెప్పడం కష్టం. వార్నర్‌తో ఒప్పందం పునరుద్ధరించుకోబోమని ఎల్జీ ఇప్పటికే ప్రకటించింది. అతనికి నెస్లే మైలో, టయోటా, అసిక్స్, గ్రే నికోల్స్‌తో ఒప్పందం ఉంది. స్మిత్‌కు న్యూ బ్యాలెన్స్ ప్రధాన స్పాన్సర్ కాగా...జిల్లెట్, ఫిట్‌బిట్, వీట్ బిక్స్ తదితర సంస్థలతో పెద్ద ఒప్పందాలు ఉన్నాయి. క్రికెట్‌పరంగా కోల్పోయే డబ్బుతో పాటు ఇవన్నీ కూడా జత కలిస్తే ట్యాంపరింగ్ వీరిద్దరిపై ఎంత ప్రభావం చూపించబోతోందో అర్థమవుతుంది. ఇందుకే వారికి శిక్ష తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనను ఉల్లంఘించినందుకే ముగ్గురు ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రధానంగా నాలుగు అంశాలను ఇందులో ప్రస్తావించింది. అవి 1) క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడం 2) స్థాయికి తగినట్లు ప్రవర్తించకపోవడం 3)క్రికెట్ ప్రయోజనాలకు హాని కలిగించడం 4) ఆటను వివాదాస్పదం చేయడం. వీటితోపాటు ఆటగాళ్లు వ్యక్తిగతంగా చేసిన తప్పులనూ పేర్కొంది. దాని ప్రకారం ఎవరెలా అంటే... స్టీవ్ స్మిత్: 1. బంతి ఆకారాన్ని కృత్రిమంగా మార్చే ఆలోచన గురించి ఇతడికి తెలుసు. 2. ట్యాంపరింగ్ ప్రణాళిక అమలు కాకుండా నిరోధించలేదు. 3. ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువును మైదానంలో దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. బాన్‌క్రాఫ్ట్ ప్రయత్నాలపై మ్యాచ్ అఫీషియల్స్, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలతో పాటు ప్లాన్‌ను పొడిగించి, అందులో అందరినీ భాగస్వాములుగా చేసేందుకు ప్రయత్నించడం. డేవిడ్ వార్నర్: 1. ట్యాంపరింగ్ ఆలోచనను రూపొందించడం. 2. బంతి ఆకారం దెబ్బతీసేలా జూనియర్ ఆటగాడికి సూచనలు చేయడం. 3. బంతి స్వరూపాన్ని ఎలా మార్చవచ్చో సలహాలివ్వడంతో పాటు వివరించి చూపడం. 4. ప్లాన్ అమలును నిరోధించడంలో విఫలమవడం. 5. తన పరిజ్ఞానంతో మ్యాచ్ అధికారులను తప్పుదోవ పట్టించడం, ట్యాంపరింగ్‌లో భాగం కావడం. 6. మ్యాచ్ అనంతరం కూడా తన ఆలోచనను స్వచ్ఛందంగా వెల్లడించకపోవడం. బాన్‌క్రాఫ్ట్: 1. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ఆలోచనలో నేరుగా పాల్గొనడం. 2. ట్యాంపరింగ్ ప్రయత్నాన్ని కొనసాగించడం 3. తన దగ్గర ఉన్న వస్తువును దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. మ్యాచ్ అధికారులు, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం. -
సరదాగా చేసిన ఓ పనికి ఐదు పరుగుల పెనాల్టీ
-
'కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తప్పవు'
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన విమర్శలపై ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందించాడు. 1999లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో వార్న్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడానికి జట్టు ప్రయోజనాలే కారణమని, కెప్టెన్‌గా తన బాధ్యతలను నిర్వర్తించానని, కఠిన నిర్ణయాలు తప్పవని ఆనాటి సంఘటనను స్టీవ్ వా వెల్లడించాడు. స్టీవ్ వా స్వార్థపరుడని, తాను ఆడిన క్రికెటర్లలో అతనే అత్యంత స్వార్థపరుడంటూ వార్న్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై స్టీవ్ వా స్పందిస్తూ.. ఓ సమాధానంతో వార్న్ వ్యాఖ్యలను ఖండించలేనని అన్నాడు. తుది జట్టు నుంచి వార్న్‌ను తొలగించాలన్నది కఠిన నిర్ణయమని, అయితే కెప్టెన్‌గా తన విధులను నిర్వర్తించానని చెప్పాడు. వార్నే కాదు ఏ ఆటగాడినయినా తొలగించాలన్నది సులభం కాదని, జట్టు ప్రయోజనాల రీత్యా తప్పదని అన్నాడు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు జాన్సన్ గుడ్ బై
పెర్త్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు ప్రకటించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల పెర్త్ టెస్టే జాన్సన్‌కు ఆఖరి మ్యాచ్. టెస్టుల్లో అత్యిధిక వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా జాన్సన్ ఘనత సాధించాడు. టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు. 153 వన్డేలాడి 239 వికెట్లు తీశాడు. కాగా, రిటైర్మెంట్ ప్రకటించిన జాన్సన్‌కు సచిన్ టెండూల్కర్ తన శుభాభినందనలు తెలిపాడు. అతడు ఎప్పుడూ చాలా స్పెషల్ బౌలర్ అని ప్రశంసించాడు. Good luck to @MitchJohnson398 who has always been a special bowler. Got to know him well at @mipaltan and enjoyed his aggressive approach! — sachin tendulkar (@sachin_rt) November 17, 2015 -
టెస్టులకు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గుడ్ బై
నాటింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు 34 ఏళ్ల క్లార్క్ ప్రకటించాడు. క్లార్క్ సుధీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయాల కారణంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు యాషెస్ సిరీస్ పరాజయం అతనిపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-3తో ఓడిపోయింది. శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం క్లార్క్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఈ సిరీస్‌లో నామమాత్రమైన చివరి, ఐదో టెస్టు ఆడాల్సివుంది. క్లార్క్‌కు ఇదే చివరి టెస్టు. 2004లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన క్లార్క్ తన కెరీర్లో 114 మ్యాచ్‌లు ఆడాడు. 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8605 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్). -
ఆస్ట్రేలియా పేసర్ హారిస్ రిటైర్మెంట్
లండన్: ఆస్ట్రేలియా పేసర్ రియాన్ హారిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు వెంటనే గుడ్ బై చెబుతున్నట్టు 36 ఏళ్ల హారిస్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. క్రికెట్ ఆడేందుకు ఇక తన శరీరం సహకరించదని, వైదొలగడానికి ఇదే సరైన సమయమని వెల్లడించాడు. హారిస్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హారిస్ 27 మ్యాచ్‌ల్లో 113 వికెట్లు పడగొట్టాడు. ఇక 21 వన్డేల్లో 44, మూడు టి-20ల్లో4 వికెట్లు తీశాడు. -
మిస్ యూ ‘పప్’
మైకేల్ క్లార్క్... ఆస్ట్రేలియా క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. ఆటగాడిగా, నాయకుడిగా, స్నేహితుడిగా మైదానంలో, బయటా కూడా అందరి మనసులు దోచుకున్న వ్యక్తి. మైదానంలో ఈల వేసి సహచరులను సరదాగా పిలుస్తాడు... మైదానం వెలుపల కష్టమొస్తే పెద్దన్నలా అండగా నిలబడతాడు. అందుకే తను ఆటగాళ్లు మెచ్చిన కెప్టెన్ అయ్యాడు. 2011లో పాంటింగ్ రిటైర్మెంట్ తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్న ‘పప్’... 33 ఏళ్లకే వన్డేలకు వీడ్కోలు చెపుతాడని ఆనాడు ఊహించి ఉండడు. అయితేనేం... తన కల సాకారం చేసుకుని సగర్వంగా వీడ్కోలు పలికాడు. గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతూ, వన్డేల్లో తమ జట్టులోనే పెరిగిన పోటీలో అడపాదడపా వెనకబడుతున్నాడనే విమర్శలను మోస్తూ... అతి కష్టమ్మీద ప్రపంచకప్ ఆడాడు. నిజానికి ఈ టోర్నీకి ముందు తను బరిలోకి దిగుతాడో లేదో తెలియని సందిగ్దం. భారత్‌తో తొలి టెస్టు తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రపంచకప్ సమయానికి కోలుకుంటానని హామీ ఇచ్చి జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. అయినా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే ఎలాగైనా ప్రపంచకప్ ఆడాలి, స్వదేశంలో టైటిల్ గెలవాలనే తపనతోనే చాలా వేగంగా గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగాడు. భారత్‌తో సెమీస్ ముగియగానే తాను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. తన శరీరం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సహకరించడం లేదని, టెస్టుల్లో ఎక్కువ కాలం ఆడాలనే కోరికతో వన్డేల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. దీంతో ఫైనల్‌కు ముందే సహచరుల్లో పట్టుదల పెంచాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా తన కెప్టెన్సీ ముద్రను స్పష్టంగా చూపించాడు. ప్రతి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో సిద్ధమై వచ్చాడు. అలాగే తన వనరులను అత్యంత సమర్థంగా వాడుకుని తానెందుకు అద్భుతమైన కెప్టెనో మరోసారి నిరూపించాడు. -సాక్షి క్రీడా విభాగం -
బౌన్సర్లతోనే మొదలు!
ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఆస్ట్రేలియా నెట్స్‌లో దూకుడు తగ్గించని క్రికెటర్లు నేడు క్లార్క్‌కు ఫిట్నెస్ టెస్ట్ అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఎట్టకేలకు విషాదం వీడి ఆట వైపు కదిలింది. ఫిల్ హ్యూస్ మరణం, తదనంతర పరిణామాలు, అంత్యక్రియల తర్వాత జట్టు సభ్యులంతా ఇప్పుడు తొలి సారి పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టారు. మొదటి టెస్టు మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. నెట్స్‌లో ప్రాక్టీస్ సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లలోని సహజమైన దూకుడు బయట పడింది. హ్యూస్ దుర్ఘటన నేపథ్యంలో ఆ జట్టు బౌన్సర్లకు దూరంగా ఉండవచ్చని చాలా మంది విశ్లేషించారు. అయితే దీనిని పటాపంచలు చేస్తూ జట్టు పేసర్లు సెషన్ ఆసాంతం షార్ట్ పిచ్ బంతులే విసిరారు. మిషెల్ జాన్సన్, పీటర్ సిడిల్, జోష్ హాజల్‌వుడ్ తమ బ్యాట్స్‌మెన్‌కు వరుసగా బౌన్సర్లు సంధిం చారు. ప్రాక్టీస్ చూస్తే హ్యూస్ మృతి ప్రభావం ఆసీస్‌పై లేనట్లే కనిపించింది. ‘మేమెప్పుడూ ఇలాగే ఆడతాం. ఇదే తరహాలో ఆడి మేం మంచి ఫలితాలు సాధించాం కాబట్టి మారాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే టెస్టు క్రికెట్‌ను మా శైలిలోనే ఆడతాం. మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది’ అని ఈ సందర్భంగా ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ వ్యాఖ్యానించారు. అండగా జూనియర్ బౌలర్లు: భారత జట్టు బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా జూనియర్ క్రికెటర్లను తమ ప్రాక్టీస్‌లో భాగం చేసింది. భారత్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆడిన ఐదుగురు బౌలర్లు మొదటి టెస్టు వరకు ఆసీస్ టీమ్‌తోనే ఉండి వారికి సహకరిస్తారు. క్లార్క్ ఆడతాడా!: తొలి టెస్టులో క్లార్క్ బరిలోకి దిగడంపై దోబూచులాట ఇంకా కొనసాగుతోంది. శనివారం అతనికి ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నారు. బౌన్సర్‌తో ప్రారంభించండి!: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విసిరే తొలి బంతి బౌన్సర్ కావాలని మాజీ పేసర్ మెర్వ్ హ్యూస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో వైపు పరిస్థితులను అర్థం చేసుకొని షెడ్యూల్లో మార్పులకు అంగీకరించిన భారత జట్టుకు, మేనేజ్మెంట్కు ఆసీస్ మాజీ క్రికెటర్, సీఏ డెరైక్టర్ మైకేల్ కాస్పరోవిచ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ‘పిచ్’కూ రిటైర్మెంట్... బౌన్సర్ తగిలి ఫిల్ హ్యూస్ కుప్పకూలిన ఏడో నంబర్ పిచ్‌పై ఇక ముందు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించబోమని సిడ్నీ మైదానం క్యురేటర్ పార్కర్ చెప్పాడు. -
అబాట్‌ను ఎవరూ నిందించలేదు: క్లార్క్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అబాట్‌కు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ పూర్తి మద్దతు ప్రకటించాడు. ఫిలిప్ హ్యూస్ విషాద మరణం ఘటనలో అబాట్‌ను ఎవరూ నిందించడం లేదని, అందులో అతని తప్పు లేనేలేదని క్లార్క్ అన్నాడు. ఆసీస్ క్రికెట్ జట్టు అబాట్‌కు అండగా ఉంటుందని చెప్పాడు. దేశవాళీ మ్యాచ్‌లో అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగిలి యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో షాక్‌కు గురైన అబాట్‌కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హ్యూస్ సోదరి కూడా అబాట్‌ను కలసి ఓదార్చారు. -
ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్‌గా ఫించ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా టి-20 క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా ఓపెనర్ అరోన్ ఫించ్‌ను నియమించారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్, టెస్టు క్రికెట్‌పై దృష్టిసారించేందు కోసం ఆసీస్ టి-20 కెప్టెన్ పదవికి జార్జి బెయిలీ రాజీనామా చేశాడు. దీంతో బెయిలీ స్థానంలో ఫించ్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నియామకాన్ని ప్రకటించింది. టి-20 ఫార్మాట్లో ఫించ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో పుణె వారియర్స్, ఆసీస్ దేశవాళీ జట్టు మెల్బోర్న్ రెనెగాడెస్ జట్లకు ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
కంగారూల చేతిలో కుక్ సేన కుదేలు
అడిలైడ్: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలయింది. 218 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి కుక్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 101.4 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటయింది. రూట్(87), ప్రయర్(69), పీటర్సన్(53) అర్థ సెంచరీలు చేసినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది. ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4, హరీస్ 3 వికెట్లు పడగొట్టారు. జాన్సన్, లియన్, స్మిత్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోరు 570/9 డిక్లేర్డ్ కాగా, ఇంగ్లండ్ 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు132/3 వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మొత్తం 8 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. తొలి టెస్టులోనూ ఆస్ట్రేలియా గెల్చిన సంగతి తెలిసింది. తాజా విషయంలో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.