
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్. సన్‌రైజర్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటకే ఆడిన మ్యాచుల్లో మూడు ఆఫ్ సెంచరీలు చేసి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ విషమై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఇటువంటి ఆటను తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని అన్నాడు.
‘అతడికి ఇది మొదటి ఐపీఎల్ అయినా మూడు ఆఫ్ సెంచరీలు సాధించాడని తెలిపడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాట్రెల్ వేసిన షాట్ బంతికి తడబడ్డా ఆ తర్వాత మ్యాచుల్లో క్వాలిటీ ఉన్న బౌలర్లు వేసిన షాట్ బంతులను సమర్ధంగా ఎదుర్కున్నాడని అన్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన షాట్ బంతులను ముందే గుర్తించి చక్కగా ఆడాడని, దీనిని బట్టి అతడు త్వరగా నేర్చుకునేతత్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చాడు. భారత జట్టుకు ఆడగల సత్తా అతడిలో ఉందని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు.
(ఇదీ చూడండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’)
Comments
Please login to add a commentAdd a comment