దుబాయ్ : విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ ఐపీఎల్ 13వ సీజన్‌లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్‌గా అదరగొడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున బరిలోకి దిగిన హోల్డర్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగంగా నిలిచాడు. అయితే విచిత్రమేంటంటే హోల్డర్ వచ్చిన తర్వాత లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కాగా శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో జేసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ పాత్ర పోషించాడు. మొదట బౌలింగ్‌లో 3 వికెట్లు, తర్వాత బ్యాటింగ్‌లో 20 బంతుల్లో 24 పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలకంగా నిలిచి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను వరించాడు ఈ సందర్భంగా కీలక మ్యాచ్‌లో విజయం సాధించనందుకు చాలా ఆనందంగా ఉందని హోల్డర్ పేర్కొన్నాడు.(చదవండి : వైరలవుతున్న మీమ్స్.. పాపం ఆర్‌సీబీ)
'సరైన సమయంలో మా బ్రెయిన్ వాడాం.. అందుకే ఆర్‌సీబీపై విజయం సాధించాం . మ్యాచ్‌కు ముందే ఎలా విజయం సాధించాలన్నదానిపై చాలా సేపు చర్చ జరిగింది. టాస్ గెలిస్తే బౌలింగ్ ఏంచుకొని ఆర్‌సీబీని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనుకున్నాం. అనుకున్నట్లే టాస్ గెలవడంతో మా బౌలర్లు సరైన సమయంలో బ్రెయిన్ వాడి.. తమ నైపుణ్యతను చూపించి వరుస విరామాల్లో వికెట్లు తీశారు. ఆ తర్వాత స్కోరు చేదనలో బ్యాట్స్‌మెన్ల పని సులువైంది. మెయిన్‌బౌలర్ భువనేశ్వర్ గైర్హాజరీలోనూ మా బౌలర్లు చక్కగా రాణిస్తున్నారు. (చదవండి : 'వాళ్లను చూస్తే 90లలో మమ్మల్ని చూసినట్లుంది')
ముఖ్యంగా సందీప్ శర్మ తక్కువ ఎకానమితో వికెట్లు తీస్తుండడం.. నటరాజన్ యార్కర్లతో చెలరేగుతుండడం.. రషీద్ ఖాన్ లెగ్ స్నిన్ మహిమ.. నదీమ్ పేస్‌తో చెలరేగడం.. వెరసి మా బౌలింగ్ ఇప్పుడు అద్భుతంగా ఉంది. వీరికి తోడు తాజాగా నేను తోడవ్వడం కలిసివచ్చింది. నిజానికి గత కొన్నేళ్లుగా భుజం గాయాలతో పాటు పలు సర్జరీలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఐపీఎల్ పుణ్యమా అని ఈ సీజన్‌లో బాగానే ప్రాక్టీస్ లభించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కష్టపడితే చాలు.. మరోసారి ఫైనల్లో అడుగుపెడతాం. అని చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment