అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 132 పరుగుల టార్గెట్‌నే నిర్దేశించగా, సన్‌రైజర్స్ దాన్ని ఇంకా రెండు బంతులు ఉండగా ఛేదించి క్వాలిఫయర్-2లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి(32; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఏబీ డివిలియర్స్(56;43 బంతుల్లో 5 ఫోర్లు)లు మాత్రమే రాణించారు. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు మొయిన్ అలీ ఫ్రీహిట్‌లో రనౌట్ కావడం ఆశ్చర్యపరిచింది. ఫ్రీహిట్ బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా షాట్ ఆడిన మొయిన్ అలీ.. పరుగు కోసం యత్నించాడు. అది రిస్క్ అని తెలిసినా తొందరపాటులో మొయిన్ తడబడ్డాడు. దానికి రనౌట్ కావడంతో డగౌట్‌లో ఉన్న కోహ్లి ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశాడు.(కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!)
ఇదిలా ఉంచితే, అసలు బంతి వికెట్ కీపర్ వరకూ చేరకుండానే బెయిల్స్‌ను గిరాటేయడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. వాషింగ్టన్ సుందర్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి కీపర్‌గా ఉన్న ఏబీ డివిలియర్స్‌ను ముందుగానే పడేశాడు.ఆ బంతిని వార్నర్ కవర్స్‌లో ఆడగా, అంతకుముందే బెయిల్స్ పైకి లేచిపోయాయి. అయితే అక్కడ ఏమి జరిగిందనే దానిపై కాసేపు గందరగోళం నెలకొంది. వార్నర్ వికెట్లను హిట్ చేశాడా.. అనే సస్పెన్స్ చోటు చేసుకుంది. కానీ చివరి ఏబీడీ బెయిల్స్‌ను ముందుగానే పడేశాడని తేలడంతో ఆ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ బంతిని ఆడకుండా కీపర్ బెయిల్స్‌ను లేపేస్తే అది నో బాల్‌గా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment