టెస్టులకు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గుడ్ బై | Australia's Clarke set to retire - reports | Sakshi
Sakshi News home page

టెస్టులకు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గుడ్ బై

Published Sat, Aug 8 2015 4:20 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

టెస్టులకు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గుడ్ బై

టెస్టులకు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గుడ్ బై

నాటింగ్హామ్: యాషెస్ సిరీస్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు 34 ఏళ్ల క్లార్క్ ప్రకటించాడు. క్లార్క్ సుధీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.  గాయాల కారణంగా బ్యాటింగ్లో రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు యాషెస్ సిరీస్ పరాజయం అతనిపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంగ్లండ్లో జరుగుతున్న యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 1-3తో ఓడిపోయింది. శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్  తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం క్లార్క్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఈ సిరీస్లో నామమాత్రమైన చివరి, ఐదో టెస్టు ఆడాల్సివుంది. క్లార్క్కు ఇదే చివరి టెస్టు. 2004లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన క్లార్క్ తన కెరీర్లో 114 మ్యాచ్లు ఆడాడు. 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8605 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్).

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement