Retire
-
నమీబియా ఓపెనర్ అరుదైన ఫీట్.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే
నమీబియా ఓపెనర్ నికోలాస్ డేవిన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా డేవిన్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన డేవిన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యచేధనలో నమీబియా ఓపెనర్‌గా వచ్చిన డేవిన్ తడబడ్డాడు. ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొనేందుకు డేవిన్ తీవ్రంగా శ్రమించాడు. తన ఆడిన 16 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్.. డెవిన్ వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో డెవిన్ రిటైర్ట్ ఔట్‌గా డగౌట్‌కు చేరాడు. అతడి తన స్ధానంలో డేవిడ్ వైస్ క్రీజులోకి వచ్చాడు. అయితే 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇలా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగలేదు. ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నమీబియాపై 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. -
న్యూజిలాండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లకే రిటైర్మెంట్
న్యూజిలాండ్ మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ బెర్నాడిన్ బెజుడెన్‌హౌట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బెజుడెన్‌హౌట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడంచింది. తను స్థాపించిన ఛారిటబుల్ ది ఎపిక్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించేందుకు బెజుడెన్‌హౌట్ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా దక్షిణాఫ్రికాకు చెందిన బెజుడెన్‌హౌట్.. 2014లో తన సొంతదేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కానీ తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2017లో న్యూజిలాండ్‌కు మాకాం మార్చింది. ఈ క్రమంలో 2018లో కివీస్ తరపున ఆమె డెబ్యూ చూసింది. 30 ఏళ్ల బెజుడెన్‌హౌట్ ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 20 వన్డేలు, 29 టీ20లు ఆడింది. అందులో నాలుగు వన్డేలు, 7 టీ20ల్లో సౌతాఫ్రికా ఆమె ప్రాతినిథ్యం వహించింది."న్యూజిలాండ్‌కు క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాడు. వైట్ ఫెర్స్తో నా ప్రయాణం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. చాలా విషయాలను నేర్చుకున్నాను. ఈ రోజు నేను క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇకపై ది ఎపిక్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాను. ఈ నా అద్బుత ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ ఆమె ఓ ప్రకటనలో పేర్కొంది. -
పెద్దల సభలో 68 మంది రిటైర్మెంట్!
న్యూఢిల్లీ: తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. పార్లమెంట్లో ఎగువసభ/ పెద్దలసభగా పిలుచుకునే రాజ్యసభలో ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్నవాళ్లలో.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జయా బచ్చన్ కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న ఈ 68 స్థానాల్లో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిషికేషన్ జారీ అయ్యింది. ఆప్ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్‌కుమార్ గుప్తాలు జనవరి 27న తమ పదవీకాలం పూర్తవనుంది. ఇక సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది. ఎస్డీఎఫ్ నేత హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తవుతుంది. ►తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, వైఎస్సార్సీపీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. ►ఇక ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్ 6, మధ్యప్రదేశ్ 5, పశ్చిమ బెంగాల్ 5, కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3, ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్ 2, ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్‌గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేపీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవీయా,యు మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరన్భాయ్ రత్వా ఉన్నారు. ►గుజరాత్‌కు చెందిన అమీ యాగ్నిక్. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్, శివసేన (ఉద్దవ్) సభ్యుడు అనిల్ దేశాయ్ మహారాష్ట్ర నుంచి పదవీ కాలం పూర్తి కానుంది. ►మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ కైలాష్ సోనీ, కాంగ్రెస్ సభ్యుడు రాజమణి పటేల్ ఎగువసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ►కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్‌కు చెందిన ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పెద్దల సభ నుంచి వైదోలగనున్నారు. ►పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అబిర్ రంజన్ బిస్వాస్, సుభాసిష్ చక్రవర్తి, మహమ్మద్ నడిముల్ హక్, శాంతాను సేన్, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ పదవీ విరమణ చేయున్నారు. ►బీహార్‌లో ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ నుంచి అనిల్ ప్రసాద్ హెద్డే, బశిష్ట నారాయణ్ సింగ్, బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీ, కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది. ►ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నుంచి అనిల్ అగర్వాల్, అశోక్ బాజ్‌పాయ్, అనిల్ జైన్, కాంత కర్దమ్, సకల్దీప్ రాజ్‌భర్, జీవీఎల్ నరసింహారావు, విజయ్ పాల్ సింగ్ తోమర్, సుధాంషు త్రివేది, హరనాథ్ సింగ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయ బచ్చన్ పదవీ విరమణ చేస్తున్నారు. ►చత్తీస్‌గఢ్, హర్యానా నుంచి బీజేపీ తరపున సరోజ్ పాండే, డీపీ వాట్స్ పదవీ విరమణ చేయనున్నారు. ►జార్ఖండ్‌లో బీజేపీ నుంచి సమీర్ ఒరాన్, కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పదవీ విరమణ చేయనున్నారు. ►కేరళలో సీపీఎం పార్టీ నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, కేసీఎం సభ్యుడు జోస్ కె మణి జూలైలో పదవీ విరమణ పొందుతున్నారు. ►నామినేటెడ్ సభ్యుల్లో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. -
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం ఈ క్యాష్‌రిచ్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆదివారం రాయుడు వెల్లడించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న తుదిపోరులో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక 2010లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాయుడు.. ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడాడు. 2010 నుంచి 2017 సీజన్ వరకు ముంబైఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018 సీజన్లో చెన్నైసూపర్‌కింగ్స్ జట్టులోకి రాయుడు చేరాడు. 2013, 2015,2017 సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. "ముంబై, సీఎస్కే వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. 204 మ్యాచ్‌లు, 14 సీజన్లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు నా కెరీర్లో ఉన్నాయి. ఈ రోజు ఆరో టైటిల్ సాధిస్తాని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా ఈ అద్భుతప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్ తీసుకోను" అంటూ ట్విటర్లో రాయుడు పేర్కొన్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 4329 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో ఒక సెంచరీ ఉంది. చదవండి: IPL 2023 Final: అప్పుడు అంచనాలే లేవు.. కానీ ఇప్పుడు! అచ్చం ధోనిలాగే.. 2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏 — ATR (@RayuduAmbati) May 28, 2023 -
సురేష్ రైనా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా వేదికగా రైనా ప్రకటించాడు. "భారత్‌కు, నా రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా నా కెరీర్లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, సీఎస్కే, నా అభిమానులకు ధన్యవాదాలు" అంటూ రైనా ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొన్న రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిస్టర్ ఐపీఎల్ మిగిలిపోయాడు. కాగా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ టోర్నీలో ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఇక ఐపీఎల్లో11 సీజన్లలో చెన్నైసూపర్ కింగ్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. ఇక 18 టెస్టులు,226 వన్డేలు,78 టీ20ల్లో భారత్ తరపున మిస్టర్ ఐపీఎల్ ప్రాతినిథ్యం వహించాడు. It has been an absolute honour to represent my country & state UP. I would like to announce my retirement from all formats of Cricket. I would like to thank @BCCI, @UPCACricket, @ChennaiIPL, @ShuklaRajiv sir & all my fans for their support and unwavering faith in my abilities 🇮🇳 — Suresh Raina🇮🇳 (@ImRaina) September 6, 2022 చదవండి: CSA T20 League: జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ . -
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అమీ సాటర్త్‌వైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సాటర్త్‌వైట్ గురువారం ప్రకటన చేసింది. కాగా తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను న్యూజిలాండ్ క్రికెట్ రద్దు చేయండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాటర్త్‌వైట్ తెలిపింది. "నేను కాంట్రాక్ట్‌ను పొందనందుకు చాలా నిరాశ చెందాను. నేను మరికొంత కాలం న్యూజిలాండ్ క్రికెట్లో కొనసాగాలని భావించాను. అయితే న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. రాబోయే రోజుల్లో జట్టు మరింత రాణించాలని కోరుకుంటున్నాను. న్యూజిలాండ్ జట్టుకు ఇన్నాళ్లు ప్రాతినిద్యం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై నా కుటంబంతో గడపాలని నిర్ణయించకున్నాను" అని సాటర్త్‌వైట్ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక 2007 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాటర్త్‌వైట్ న్యూజిలాండ్ మహిళా క్రికెట్లో తనదైన ముద్ర వేసుకుంది. 2018 నుంచి 2109 వరకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా సాటర్త్‌వైట్ పనిచేసింది. ఇక న్యూజిలాండ్ తరపున 145 వన్డేలు ,111 టీ20 మ్యాచ్‌లు ఆడిన సాటర్త్‌వైట్ .. వరుసగా 4639, 1784 పరుగులు సాధించింది. అదే విధంగా తన అంతర్జాతీయ కెరీర్లో 76 వికెట్లు పడగొట్టింది. కాగా 2007లో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 6 వికెట్లు పడగొట్టి సాటర్త్‌వైట్ సంచలనం సృష్టించింది. చదవండి: IPL 2022: కార్తీక్ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్.. గంభీర్ రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్..! -
రిటైర్మెంట్ ప్రకటించిన సన్‌రైజర్స్ బౌలర్!
భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బిపుల్ శర్మ దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికా తరుపున ఆడేందుకు బిపుల్ శర్మ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డొమిస్టిక్ క్రికెట్లో పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ తరుపున బిపుల్ శర్మ ఆడాడు.105 టీ20 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ 1203 పరుగులతో పాటు, 84 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2010 సీజన్‌కు గాను బిపుల్ శర్మ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు. ఈ సీజన్లో 104 పరుగులతో పాటు, 8వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 18 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ శర్మ 83 పరుగులతో పాటు, 9వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 33 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ శర్మ 187 పరుగులతో పాటు, 17వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అమెరికా తరుపున ఉన్ముక్త్ చంద్ కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Auction: సెంచరీతో మెరిశాడు.. వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయి! -
సంచలన ప్రకటన చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె మరోసారి వార్తల్లోనిలిచారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. తాను 2022 ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శనివారం ప్రకటించారు. తద్వారా తన కుమార్తె సారా డ్యూటెర్టె దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గాన్ని క్లియర్ చేస్తున్నాడనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. తాను వైస్ ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడినన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పోటీనుంచి, రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది తన కుమార్తె పోటీకి మార్గం సుగమం చేశారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రోడ్రిగో విధేయుడు, సెనేటర్ క్రిస్టోఫర్ "బోంగ్" వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయనుండటం విశషం. కాగా 2022 ఎన్నికలకు గాను రోడ్రిగో డుటెర్టె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఆరేళ్లు కాలపరిమితిని పూర్తిచేసుకున్న ఆయన, టాప్ పొజిషన్ కోసం మళ్లీ పోటీ చేయడానికి అర్హుడు కాదు. అయితే సారా డ్యూటెర్టేకు లైన్ క్లియర్ చేసేందుకే ఆయన రేసునుంచి తప్పుకున్నారని న్యాయ, రాజకీయాల ప్రొఫెసర్ ఆంటోనియో లా వినా అన్నారు. ఈ ఫైర్ బ్రాండ్ మళ్లీ మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. -
అంతర్జాతీయ హాకీకి భారత స్టార్ ప్లేయర్ గుడ్‌బై..
Sv Sunil Retires From International Hockey: భారత స్టార్ ప్లేయర్ ఎస్వీ సునీల్ అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్... తన 14 ఏళ్ల కెరీర్లో 264 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 72 గోల్స్ చేశాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆడిన సునీల్ టోక్యో గేమ్స్‌కు మాత్రం ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన భారత టీమ్‌లో సునీల్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: Viral Video: సచిన్‌ను చూసాక ఇషాన్ కిషన్ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్ -
సక్సెస్ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా..
సూళ్లూరుపేట: కేరళలోని కన్నూరు జిల్లా పయ్యనూర్ అనే మారుమూల గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జని్మంచిన కున్హికృష్ణన్ ఇస్రో శాస్త్రవేత్త, ప్రొఫెసర్ యూఆర్‌రావు స్పేస్ సెంటర్ (బెంగళూరు) డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు. పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సక్సెస్‌ను అందించిన ఘనత ఆయనదే. 1986లో ఇస్రోలో ప్రవేశం కేరళలోని పయ్యనూరులోనే కున్హికృష్ణన్ ప్రాథమిక విద్యాభాసం. 1981లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. త్రివేండ్రం యూనివర్సిటీలో ఎల్రక్టానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 1986లో పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం కేరళలోని త్రివేండ్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో మెకానిజం వెహికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్లో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఈ విభాగంలో మంచి పరి«ణితి సాధించిన తర్వాత 2009లో పీఎస్ఎల్వీ సీ12, పీఎస్ఎల్వీ సీ13 , పీఎస్ఎల్వీ సీ15 ప్రయోగాలకు అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తూ వీఎస్ఎస్సీ నుంచి షార్కి వచ్చి ప్రయోగాలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి విజయవంతం చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ ఇంటిగ్రేషన్ విషయంలో మంచి ఫలితాలు చూపించడంతో పీఎస్ఎల్వీ సీ 15 ప్రయోగం నుంచి పీఎస్ఎల్వీ సీ 27 వరకు 13 పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసి అన్ని ప్రయోగాలను విజయవంతం చేశారు. ఆ తర్వాత ఆయన షార్ డైరెక్టర్‌గా పదోన్నతి కలి్పంచి షార్ డైరెక్టర్‌గా 2015 నుంచి 2018 దాకా సక్సెస్ పుల్ డైరెక్టర్‌గా పేరు గడించారు. ఆయన డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో 17 పీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఐదు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేశారు. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళ్యాన్–1 ప్రయోగానికి ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించింది కూడా పి కున్హికృష్ణన్ కావడం విశేషం. ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఇతని ప్రతిభను గుర్తించి బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్‌రావు స్పేస్ సెంటర్ డైరెక్టర్ (ఉపగ్రహాల తయారీ కేంద్రం)కు బదిలీ చేశారు. ఇస్రోలో అన్ని రకాలుగా సేవల అందించి దేశానికి ఉపయోగపడిన కున్హికృష్ణన్ సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఎన్నో అవార్డులు ►2010 : మొట్టమొదటగా ఇస్రో ఇండిజువల్ మెరిట్ ఆవార్డును అందుకున్నారు. ►2011 : ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు ►2013 : పీఎఫ్ఎల్వీ సీ25–మంగళ్యాన్–1 ప్రయోగాన్ని సక్సెస్ పుల్గా నిర్వహించినందుకు ఇస్రో టీమ్ ఎక్స్‌లెన్స్ అవార్డు టీమ్ లీడర్‌గా అందుకున్నారు. ►2013 : ఇస్రో ఫెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు. ►2015 : స్వదేశీ శాస్త్ర పురస్కార్ ►2017 : మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ అవార్డు. ►2018 : ఇస్రో అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఆవార్డు. ►2020 : తమిళనాడు స్టేట్ సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా)వారు ఎమినెంట్ ఇంజినీర్ అవార్డులను అందుకున్నారు. చదవండి: నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు.. వారెప్పటికీ అనాథలు కారు..! -
15 మంది కస్టమ్స్ ఆఫీసర్లపై వేటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోమారు అధికారులపై కొరడా ఝళిపించింది. అవినీతి, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో ఇటీవల ఆదాయపన్ను అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులపై వేటువేసింది. అవినీతి, ముడుపులు అందుకున్నారన్న ఆధారాలతో ప్రభుత్వం మంగళవారం 15 మంది సీనియర్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించింది. అందులో ఒకరు ప్రిన్సిపల్ కమిషనర్ హోదా ఉన్న అధికారి కావడం గమనార్హం. వీరిలో కొందరు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ముడుపులు అందుకోవడం, ప్రభుత్వ సొమ్మును కాజేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడం వంటి అభియోగాలతో సీబీఐ ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేసిందని ఆర్థిక శాఖాధికారులు పేర్కొన్నారు. వీరిలో ప్రిన్సిపల్ ఏడీజీగా పనిచేస్తున్న అనూప్ శ్రీవాస్తవపై 1996లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఓ సొసైటీకి భూమిని కొనుగోలు చేయడానికి సహకరించారని సీబీఐ కేసు నమోదు చేసింది. జాయింట్ కమిషనర్ నళిన్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. ఫండమెంటల్ రూల్స్, క్లాస్ జే లోని 56వ నిబంధనను ఉపయోగించి రాష్ట్రపతి వీరిని తొలగించారు. రానున్న మూడు నెలలపాటు యధావిధిగా వేతనాలు అందుతాయని తెలిపారు. మూడు నెలల ముందు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ అధికారులను తొలగించే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెన్నై కమిషనర్ జీ శ్రీ హర్షలను సీబీఐ వలపన్ని పట్టుకుంది. వీరితో పాటు కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్లు అతుల్ దీక్షిత్, వినయ్ బ్రిజ్ సింగ్‌లు ఉన్నారు. ఢిల్లీ జీఎస్టీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ అమ్రేశ్ జైన్, భువనేశ్వర్ జీఎస్టీ జోన్‌కు చెందిన ఎస్ఎస్ బిష్త్, ముంబై జీఎస్టీ జోన్‌కు చెందిన వినోద్ సంగా, వైజాగ్ జీఎస్టీ జోన్‌కు చెందిన రాజు శేఖర్, అలహాబాద్ జీఎస్టీ జోన్‌కు చెందిన మొహమ్మద్ అల్తాఫ్‌లు ఉన్నారు. వీరితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ డిప్యూటీ కమిషనర్ అశోక్ అశ్వాల్ కూడా ముందస్తు పదవీవిరమణ చేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. -
ప్రపంచకప్ తర్వాత వన్డేలకు డుమిని గుడ్‌బై
ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్ల జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. ఇప్పటికే క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఇమ్రా¯Œ తాహిర్ (దక్షిణాఫ్రికా) ఈ మెగా ఈవెంట్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతామని ప్రకటించగా... వీరి సరసన తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని చేరాడు. 34 ఏళ్ల డుమిని 2017లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా... జూ¯Œ –జూలైలో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. ఇప్పటి వరకు 193 వన్డేలు ఆడిన డుమిని 5,047 పరుగులు చేసి, 68 వికెట్లు పడగొట్టాడు. -
హెరాత్... ముందుగానే వీడ్కోలు
కొలంబో: శ్రీలంక వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనహెరాత్ అనుకున్నదాని కంటే ముందుగానే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాడు. 40 ఏళ్ల హెరాత్... ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ అనంతరం రిటైర్ కానున్నట్లు గతంలో తెలిపాడు. తాజాగా నవంబర్ 6 నుంచి గాలెలో జరుగనున్న మొదటి టెస్టే తనకు చివరిదని ప్రకటించాడు. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు సోమవారం ధ్రువీకరించింది. ‘దేశానికి వెలకట్టలేని సేవలందించిన హెరాత్‌కు ధన్యవాదాలు. అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటే అయినా, నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని పేర్కొంది. ఇప్పటివరకు శ్రీలంక తరఫున 92 టెస్టులు ఆడిన హెరాత్ 430 వికెట్లు పడగొట్టాడు. 71 వన్డేల్లో 74 వికెట్లు... 17 టి20ల్లో 18 వికెట్లు తీశాడు. 1999లో గాలెలో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన అతడు... అదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (800) తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో లంకబౌలర్ హెరాతే. -
హాకీకి సర్దార్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత హాకీలో మరో స్టార్ ప్లేయర్ శకం ముగిసింది. 12 ఏళ్లుగా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సర్దార్ సింగ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కొత్త కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏళ్ల ఈ హరియాణా ప్లేయర్ వివరించాడు. హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సర్దార్ 2006లో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 307 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున బరిలోకి దిగాడు. మిడ్ ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ... ఆటను నియంత్రిస్తూ... ఫార్వర్డ్ ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశాలు సృష్టిస్తూ... ప్రత్యర్థి ఆటగాళ్ల దాడులను మధ్యలోనే తుంచేస్తూ... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2008 నుంచి 2016 వరకు భారత్‌కు కెప్టెన్ వ్యవహరించాడు. ‘ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ హాకీ ఆడుతున్నా. ఇప్పుడు సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికి... కుర్రాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నా. కుటుంబ సభ్యులు, హాకీ ఇండియా, మిత్రులతో చర్చించాకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నా’ అని సర్దార్ వివరించాడు. ‘నా నిర్ణయానికి ఫిట్నెస్ సమస్య కాదు. మరో మూడేళ్లు ఆడే ఫిట్నెస్ నాలో ఉంది. ప్రతి దానికి సమయం అంటూ ఉంటుంది కదా. హాకీకి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని భావించా’ అని సర్దార్ వివరించాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడిన సర్దార్కు 2012లో ‘అర్జున’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడతానని... 2010, 2018 ఏషియాడ్‌లో కాంస్యం, 2014 ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడైన సర్దార్ వివరించాడు. -
క్రికెట్‌కు జాన్సన్ గుడ్‌బై
సిడ్నీ: అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ ప్రకటించాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్ ప్లేయర్ ఇప్పటి వరకు కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడాడు. ఇక నుంచి టీ20 లీగ్‌ల్లో సైతం ఆడనని ఆదివారం స్పష్టం చేశాడు. ‘ఇక నా క్రికెట్ కెరీర్ అయిపోయింది. నేను నా చివరి బంతి వేసాను. చివరి వికెట్‌ను కూడా తీసుకున్నాను. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ రోజు ప్రకటిస్తున్నా. నేనింకా కొన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతానని భావించాను. కానీ నాశరీరం అందుకు సహకరించడం లేదు. పూర్తిగా అలసిపోయాను. ఈ ఏడాది ఐపీఎల్లో నాకు కలిగిన వెన్ను నొప్పి ఆటను ముగించాలని నన్ను హెచ్చిరించింది. దీంతో నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. మిగిలిన నా జీవితాన్ని ఆస్వాదిస్తాను.’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఆసీస్ ప్లేయర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కెరీర్లో 73 టెస్టుల్లో 313, వన్డేల్లో 153 మ్యాచుల్లో 239, టీ20ల్లో 38 వికెట్లను జాన్సన్ పడగొట్టాడు. ఆసీస్ తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాన్సన్ 2015లో తన చివరి టెస్టు, వన్డేను ఆడాడు. -
క్రికెట్ కు సంగక్కర గుడ్ బై
కొలంబో: దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుబ్ బై చెప్పిన శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కర తాజాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు సైతం వీడ్కోలు చెప్పాడు. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్ లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు సంగాక్కర తాజాగా ప్రకటించాడు. ' మరికొన్ని నెలల్లో 40వ ఒడిలోకి వెళ్లబోతున్నా. ఇంకా ఆడాలని ఉన్నా శరీరం సహకరించడం లేదు. దాంతో ఇక పూర్తిగా క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇంగ్లండ్ లో ఆడబోయే కౌంటీ క్రికెట్ నాకు చివరిది. కొన్ని రోజుల్లో నా క్రికెట్ కెరీర్ ముగుస్తుంది. సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదొక రోజు ఆటకు గుడ్ బై చెప్పక తప్పదు'అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో సంగా స్పష్టం చేశాడు. 2015లో టెస్టు క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 134 టెస్టుల్లో 57.40 సగటుతో 12,400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఏడాది నుంచి సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో కౌంటీల్లో వెయ్యి పరుగులు సాధించిన సంగా.. మిడిల్సెక్స్ పై రెండు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. -
నేను ఎందుకు రిటైరయ్యానంటే..: సచిన్
ముంబై:అంతర్జాతీయ స్థాయిలో్ సత్తా చాటుకోవాలంటే ఫిట్ నెస్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం పూర్తి ఫిట్ గా ఉన్నప్పుడే గేమ్ పై దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ శరీరం అంతగా అనుకూలించడం లేదంటే ఇక ఆటకు దూరంగా ఉండమని సంకేతాలు అందినట్లే. ఇదే పరిస్థితి మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కూడా ఎదురైందట. 2013 అక్టోబర్ నెలలో తన శరీరం, మనసు కూడా పూర్తిగా క్రికెట్ కు అనుకూలించడం మానేశాయట. ఒక్కసారిగా తనలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి తొలుత కొంత ఆశ్చర్యపడినప్పటికీ, ఆ తరువాత క్రికెట్ కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని విషయాన్ని తాను గ్రహించినట్లు సచిన్ తెలిపాడు. ఇటీవల ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డిన్ లో జాయిన్ అయిన సచిన్ తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ' 2013 అక్టోబర్ లో చాంపియన్స్ లీగ్ ఆడుతున్న సమయంలో నాలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక రోజు జిమ్ కు వెళ్లేందుకు శరీరం సహకరించలేదు.. బలవంతంగా నిద్ర లేచాను. నా 24 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఏ రోజూ శారీరక వ్యాయమం చేయకుండా ఉండలేదు. అటువంటిది ఉన్నట్టుండి జిమ్ చేయడానికి శరీరం సహకరించలేనట్లు అనిపించింది. అప్పుడే అనిపించింది ఇక అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని. ఆ క్రమంలోనే చాంపియన్స్ లీగ్ ఆడే మ్యాచ్ ల్లో లంచ్, టీ విరామాల్లో ఎంత సమయం నాకు అవసరం అవుతుందనే విషయాన్ని చెక్ చేసుకునే వాణ్ని. నా రిటైర్మెంట్ కు సమయం వచ్చేసిందని అప్పుడే అనిపించింది. అదే సమయంలో ప్రొఫెషనల్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. నువ్వు ఎప్పుడు రిటైర్ కావాలనేది ప్రపంచ నిర్ణయించకూడదు.. నువ్వే నిర్ణయించుకోవాలి అనే విషయం జ్ఞప్తికి వచ్చింది. దాంతోనే నా రిటైర్మెంట్ గురించి ఆలోచనలో పడ్డా. ఆ తరువాత నెలకి క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నా'అని సచిన్ పేర్కొన్నాడు.2013 నవంబర్ 14వ తేదీన ముంబైలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్రిది అల్విదా...
షార్జా: ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అభిమానులచే ముద్దుగా ‘బూమ్.. బూమ్’ అని పిలిపించుకునే 36 ఏళ్ల ఆఫ్రిది 1996లో అరంగేట్రం చేశాడు. దీంతో 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ముగింపునకు ఇదే సరైన సమయంగా భావించాడు. అయితే 2010లోనే అతను టెస్టుల నుంచి తప్పుకోగా... 2015 ప్రపంచకప్ అనంతరం వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పి కేవలం టి20లకే పరిమితమయ్యాడు. 2016లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్లోనే జట్టు వెనుదిరగడంతో కెప్టెన్సీకి రాజీనామా చేసి ఆటగాడిగా కొనసాగేందుకు ఇష్టపడ్డాడు. అయితే సెలక్టర్లు మాత్రం అతడి పేరును పరిశీలనకు తీసుకోలేదు. దీంతో తప్పుకోవడమే మేలని ఆఫ్రిది భావించాడు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడుతున్నాడు. ‘నేను నా అభిమానుల కోసం ఆడుతున్నాను. మరో రెండేళ్ల పాటు పీఎస్ఎల్లో ఆడతాను. కానీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నాను. అంకితభావంతో పూర్తి ప్రొఫెషనల్‌గా ఇంతకాలం దేశానికి ఆడాను’ అని ఆఫ్రిది తెలిపాడు. -
మరో సిరీస్‌కు డివిలియర్స్ దూరం
రిటైర్మెంట్ ఆలోచన లేదన్న దక్షిణాఫ్రికా స్టార్ జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ టెస్టు కెరీర్ మరోసారి సందేహంలో పడింది. వచ్చే మార్చిలో న్యూజి లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని అతను ప్రకటించాడు. సరిగ్గా ఏడాది క్రితం తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన ఏబీ, మోచేతి గాయం కారణంగా మూడు టెస్టు సిరీస్‌లలో పాల్గొనలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి అతను పూర్తిగా ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే తాను టెస్టుల నుంచి రిటైర్ కావడం లేదని కూడా అతను ధ్రువీకరించాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా ఈ ఫార్మాట్‌కు ప్రస్తుతం దూరంగా ఉంటున్నట్లు డివిలియర్స్ చెప్పాడు. ఈ నెల 25న శ్రీలంకతో జరిగే టి20 మ్యాచ్‌తో అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. ‘నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అందువల్ల జాగ్రత్తగా మ్యాచ్‌లను ఎంచుకోవాల్సి ఉంది. కాబట్టి టెస్టులు ఆడటం లేదు. నా ప్రధాన లక్ష్యం 2019 ప్రపంచ కప్ గెలవడం’ అని అతను చెప్పాడు. -
ఓ దిగ్గజం విడ్కోలు
రియో డి జనీరో: ప్రపంచ క్రీడా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. రికార్డు స్థాయిలో 22 స్వర్ణాలతో ఒలింపిక్స్ కొలనును ఉర్రూతలూగించిన అమెరికా దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్ తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 100 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించిన అనంతరం అతను తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రియో ఒలింపిక్స్‌తో కెరీర్ ముగిస్తున్నానని ఫెల్ప్స్ చెప్పాడు. గతంలోలాగా మరోసారి పునరాగమనం చేసే ఆలోచన అసలే లేదని, ఇదే తన తుది నిర్ణయమని అతను స్పష్టం చేశాడు. ‘ఈతతో 24 ఏళ్లుగా నాకు అనుబంధం పెనవేసుకుపోయింది. ఇన్నేళ్లలో నేను ఏది అనుకుంటే అది చేయగలిగాను. నా కెరీర్‌ను ముగిస్తున్న తీరు పట్ల గర్వంగా ఉన్నాను. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మానసికంగా మరింత దృఢంగా ఉన్న స్థితిలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సహచరి నికోల్, కొడుకు బూమర్తో మరింత సమయం గడపాల్సి ఉంది’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానించాడు. అత్యద్భుత కెరీర్... 31 ఏళ్ల ఫెల్ప్స్ తొలి సారి 15 ఏళ్ల వయసులో సిడ్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 200 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్లో ఐదో స్థానంతో అతని పోరాటం ముగిసింది. అయితే ఆ తర్వాత ఏథెన్స్‌తో మొదలు పెట్టి తాజాగా రియో వరకు అతను నాలుగు ఒలింపిక్స్‌లో కలిపి 27 పతకాలు కొల్లగొట్టాడు. ఇందులో ఏకంగా 22 స్వర్ణాలతో ఆల్‌టైం గ్రేట్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్, పాన్ అమెరికా చాంపియన్‌షిప్ పోటీలు కలిపి అంతర్జాతీయ స్థాయిలో 65 స్వర్ణాలు సహా 81 పతకాలు గెలుచుకోవడం విశేషం. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించినా మరో రెండేళ్లకు తిరిగొచ్చి మళ్లీ స్విమ్మింగ్‌పై తనదైన ముద్ర వేసిన ఈ లెజెండ్ ఇప్పుడు పూర్తిగా ఈతకు దూరమవుతున్నాడు. చివరిగా ఒక్కసారి ఫెల్ప్స్ రిటైర్మెంట్ ప్రకటించినా... ఆదివారం ఉద యం (భారత కాలమానం ప్రకారం గం.7.34ని) అతడిని ఆఖరిసారిగా కొలనులో చూడవచ్చు. పురుషుల 4x100 మీ. మెడ్లే రిలేలో అతను పాల్గొనబోతున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో అమెరికా ఎన్నడూ ఓడని ఈ ఈవెంట్లో కూడా పతకం గెలిస్తే ఫెల్ప్స్ మొత్తం 28 పతకాలతో ముగిస్తాడు. లేదంటే 27తో సరి. డియర్ ఫెల్ప్స్... సగటు భారత క్రీడాభిమానులుగా మాకు స్విమ్మింగ్ గురించి పెద్దగా తెలియదు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి ఒలింపిక్స్ పుణ్యమాని ఈ ఆటను చూస్తున్నాం. నిజానికి ఒలింపిక్స్‌లో ఇంకా చాలా ఆటలు ఉన్నా... స్విమ్మింగ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నాం. దీనికి కారణం నువ్వు. ఈతలో ఇన్ని రకాలు ఉంటాయని కూడా మాలో చాలామందికి తెలియదు. ఫ్రీ స్టయిల్, బటర్‌ఫ్లయ్ , మెడ్లే... ఇలా విభిన్నమైన ఆటలు ఉంటాయని తెలుసుకోవడానికి కారణం కూడా నువ్వే. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి నువ్వు ఆరు స్వర్ణాలు గెలిచినప్పుడు ప్రపంచం అబ్బురపడింది. స్విమ్మింగ్‌లో ఓ స్టార్ ఉంటాడని మాకూ తెలిసింది. ఆ తర్వాత 2008లో బీజింగ్‌లో ప్రతి రోజూ ఓ స్వర్ణం చొప్పున ఎనిమిది స్వర్ణాలు గెలిచావని తెలిసినప్పుడు... ‘మనిషేనా..’ అనే సందేహం కలిగింది. ఇక లండన్‌లో నాలుగు స్వర్ణాలు మాత్రమే గెలిచినప్పుడు నీ జోరు తగ్గిపోయిందేమో అనుకున్నాం. ఆ ఒలింపిక్స్‌తో ఆటకు వీడ్కోలు చెప్పావని తెలిసినప్పుడు రెండు రకాల స్పందనలు. ఒకటి... మళ్లీ ఇలాంటి దిగ్గజాన్ని చూడలేమేమో అనే బాధ. మరొకటి... వచ్చే ఒలింపిక్స్‌లో కొత్త వాళ్లకు అవకాశం వస్తుందనే ఆశ కూడా కలిగింది. కానీ రెండేళ్ల క్రితం నువ్వు రిటైర్మెంట్ను విరమించుకున్నావ్. ఆ క్షణంలో నువ్వు మళ్లీ పాత ఫెల్ప్స్లా ఈదుతావనే నమ్మకం మాత్రం లేదు. రెండేళ్లు విరామం తీసుకున్న వ్యక్తి తిరిగి ఈత కొలనులో అంత చురుగ్గా కదలడం అసంభవమనే మాటా వినిపించింది. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత ప్రమాణాలతో పోటీలు జరిగే చోట మళ్లీ స్వర్ణాలు గెలుస్తాడా..? ఏమో చూద్దాం అని వేచి చూశాం. రెండేళ్ల పాటు నీ గురించి పెద్దగా వార్తలు, విశేషాలు లేవు. పైగా మద్యం తాగి కారు నడుపుతూ శిక్షకు గురవడం లాంటి సంఘటనల వల్ల ఏదో మూల చిన్న అనుమానం. కానీ రియోలో బరిలోకి దిగగానే అర్థమైపోయింది... ఫెల్ప్స్లో జోరు ఏమాత్రం తగ్గలేదని. పోటీ పడ్డ ప్రతి ఈవెంట్లో స్వర్ణం గెలవడం ఏంటసలు..? మానవమాత్రులకు ఇది ఎలా సాధ్యం. మాకు స్వాతంత్య్రం రాక ముందు నుంచీ 116 ఏళ్ల క్రీడల చరిత్రలో 26 పతకాలు వస్తే... నీకు 16 ఏళ్లలో 27 పతకాలు ఎలా వచ్చాయబ్బా..? కాస్త నీ సీక్రెట్స్ మా వాళ్లకు చెప్పి పుణ్యం కట్టుకోరాదు. చిన్నప్పుడు నీకు ఏ విషయం ఎక్కువసేపు గుర్తుండేది కాదని విన్నాం. మరి గజినీలా ఈతను మాత్రం ఎందుకు మరచిపోలేదో..! నీ వల్ల అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది మాత్రం నీ సహచరుడు, స్నేహితుడు లోచే. తాను స్వర్ణం గెలుస్తాడని ఆశించిన ప్రతిసారీ నువ్వు గెలుస్తుంటివాయె..! ప్రతిసారీ రజతంతో సరిపెట్టుకుంటున్నాడు పాపం. మెడల్ అందుకోవడానికి వచ్చి నీ పక్కన నిలుచుని వెండి పతకం అందుకుంటూ నవ్వుతున్నాడుగానీ... పాపం లోపల ఎంత కుమిలిపోతున్నాడో. నాలుగేళ్ల క్రితం నువ్వు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అతనే సంబరపడి ఉంటాడు. ఏదో టీమ్ ఈవెంట్లలో మాత్రం నీతో కలిసి స్వర్ణం అందుకుంటున్నాడు. రియోలో కూడా తన స్వర్ణ ఆశలను ఆవిరి చేస్తివి. మా దగ్గర రెండు దశాబ్దాల పాటు సచిన్ ధాటికి గొప్ప గొప్ప క్రికెటర్లు కూడా రెండో స్థానానికి పరిమితమైనట్లు... స్విమ్మింగ్‌లో నీ దెబ్బకి లోచే కూడా అలాగే అయిపోయాడు పాపం. అదేదో సినిమాలో మా బ్రహ్మానందం చెప్పినట్లు ‘క్రియేటర్స్‌కి కూడా ఎమోషన్స్ ఉంటాయ్’.. అని రియోలో నువ్వూ చూపించావ్. 200మీటర్ల బటర్‌ఫ్లై స్వర్ణం గెలవగానే పరిగెడుతూ వెళ్లి నీ బిడ్డను ముద్దాడిన దృశ్యం చెప్పింది... నువ్వెంత కసిగా మెడల్స్ కోసం రియోకు వచ్చావో అని. ఏమైనా నీ ఈత మాకు వినోదం. నీ రికార్డులు మాకు లక్ష్యాలు. నీ పతకాలు మాకు స్ఫూర్తి... మాకే కాదు... క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ఏ దేశస్తుడైనా ముందు నీ గురించి తెలుసుకోవాలి. ఒక మనిషి ఇంత పెద్ద పెద్ద ఘనతలు సాధించడం సాధ్యమే అనే విశ్వాసం రావాలంటే నీ కథ చదవాలి. ఇక నిన్ను ఈత కొలనులో చూసే అవకాశం లేదని ఓ వైపు బాధగా ఉన్నా... ఇలాంటి గొప్ప అథ్లెట్ ఘనతలకు సాక్షులుగా నిలిచామని సంతృప్తిగా ఉంది. ఒలింపిక్స్ క్రీడా సంరంభం ఉన్నంతకాలం నీ పేరు ఉంటుంది. చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. గుడ్‌బై ఫెల్ప్స్. - సగటు భారత క్రీడాభిమాని ఫెల్ప్స్‌ను కొట్టిన మొనగాడు..! 21 ఏళ్ల స్కూలింగ్ సంచలనం x 100 మీటర్ల బటర్ ఫ్లయ్‌లో స్వర్ణపతకం ఎనిమిదేళ్ల క్రితం ఆ కుర్రాడు తాను కూడా స్విమ్మింగ్ స్టార్ ఫెల్ప్స్లా కావాలనుకున్నాడు. అతని ఘనతలనే స్ఫూర్తిగా తీసుకొని సాధన చేశాడు. నాడు ఫెల్ప్స్తో కలిసి దిగిన ఫోటోను అపురూపంగా దాచుకున్నాడు. ఇప్పుడు రెండు ఒలింపిక్స్‌లు ముగిసే సరికి తన అభిమాన స్విమ్మర్నే ఓడించే స్థాయికి చేరుకున్నాడు. 21 ఏళ్ల ఆ సింగపూర్ సంచలనం పేరు జోసెఫ్ స్కూలింగ్. 100 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్లో సత్తా చాటిన స్కూలింగ్ (50.39 సెకన్లు) అగ్ర స్థానంతో స్వర్ణ పతకం సాధించాడు. ఈత కొలనులో ఎదురు లేకుండా సాగుతున్న ఫెల్ప్స్‌కు అతను షాకిచ్చాడు. 22 స్వర్ణాలతో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఫెల్ప్స్‌ను కూడా ఓడించేవాడు ఒకడు ఉన్నాడని స్కూలింగ్ నిరూపించాడు. తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన స్విమ్మర్ నుంచి తనకు ఎదురైన పోటీకి స్వయంగా అమెరికా దిగ్గజం కూడా అచ్చెరువొందాడు. చివరకు ఫెల్ప్స్ రజతం (51.14 సె.)తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మరో ఇద్దరికి కూడా రజతం అందించారు. గతంలో 1969లో మాత్రమే ఇలా ఒకే టైమింగ్‌తో ముగ్గురు రజతాలు గెలుచుకున్నారు. -
ఇర్విన్ మెడలో మళ్లీ బంగారం!
అమెరికా స్విమ్మర్ ఆంథోనీ ఇర్విన్ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణం సాధించాడు. 22 ఏళ్ల వయసులోనే 2003లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004 సునామీ బాధితుల సహాయార్ధం తన బంగారు పతకాన్ని ఇ-బేలో వేలం కోసం ఇచ్చేశాడు! అయితే గత లండన్ ఒలింపిక్స్‌తో మళ్లీ స్విమ్మింగ్‌లోకి పునరాగమనం చేసినా పతకం దక్కలేదు. కానీ ఈ సారి పట్టుదలగా పోరాడి తనకిష్టమైన 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో స్వర్ణం అందుకున్నాడు. 21.40 సెకన్ల టైమింగ్‌తో అతనికి ఈ పతకం దక్కింది. 35 ఏళ్ల వయసులో పసిడిని పట్టిన ఇర్విన్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో అతి పెద్ద వయసులో పతకం గెలిచిన ఆటగాడిగా ఘనత వహించాడు. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
-
గాన గంధర్వుడు రిటైర్ అవుతున్నారా?
హైదరాబాద్: గానగంధర్వుడు డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయిదు దశాబ్దాల సుదీర్ఘ కరియర్‌కు ముగింపు పలకబోతున్నారా? పాటల పల్లకీలో ఊరేగుతూ 49 సం.రాల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలాంటి అనుమానాన్ని రేకిత్తిస్తోంది. పాటలకు న్యాయం చేయలేను అని అనిపించినపుడు పాటలు పాడటం నిలివేయాలని భావిస్తున్నానంటూ బాలూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. పాటలు పాడేందుకు భౌతికంగా,మానసికంగా తన బలం సరిపోదన్నారు. సామర్ధ్యం లేనపుడు.. పరిశ్రమను ఇంకా పట్టుకొని వేలాడం సముచితం కాదని పేర్కొన్నారు. జీవితంలో అన్ని అవకాశాలు అడగక్కుండానే వచ్చి వరించాయన్నారు. సుదీర్ఘ కాలం సినీ కళామతల్లికి సేవ చేసే అదృష్టం కలిగడం చాలా సంతోషంగా ఉందని ఇక తనకు ఎలాంటి కోరికలు లేవని తెలిపారు. రోజుకు 11గంటలకు పనిచేస్తూ.. ప్రతీరోజు ఒక సవాల్‌గా స్వీకరించానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో తెలుగు సినీ నేపథ్యగాయకుడిగా తెరపైకి వచ్చిన ఆయన ప్రస్థానంలో ఎక్కడా వెనకడుగులేదు. హీరోలకు, నటులకు అనుగుణంగా పరకాయ ప్రవేశం చేసి ఆకట్టు కోవడం ఆయన ప్రత్యేకత. తన అద్భుతమైన గాత్రంతో తెలుగు వారి మదిలో బాలుగా మిగిలిన లెజెండ్ ఆయన. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,తులు, హిందీ, ఇంగ్లీషు, లాంటి దాదాపు 15 భాషల్లోగానస్వరాలను ప్రేక్షకులకు అందించి, ఎన్నో అభినందనలను, అవార్డు, రివార్డులను సొంతం చేసుకున్నారు. నటుడిగానూ, సంగీత దర్శకుడిగాను పనిచేసి ప్రేక్షకాభిమానుల అభిమానాన్ని చూరగొన్నారు. బాలుకి 29 సార్లు నంది అవార్డులు, కలైమామణి, విశ్వగానయోగి, నాదనిధి, గానగంధర్వ వంటి బిరుదులను పొందారు. 2001వ సంవత్సరంలో పద్మశ్రీ, 2011వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలు ఆయను వరించాయి. ప్రముఖ హిందీ గాయకుడు మహ్మద్ రఫీ తన అభిమాన గాయకుడనీ, ఆ లెజండ్రీ గాయకుడినుంచి చాలా నేర్చుకున్నానన్నారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన గురువుగారు కోదండిపాణికి ఆజన్మాంతం రుణపడి వుంటానన్నారు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేయకపోవడం, శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించకపోవడం తన జీవితంలో తీరని లోటని బాలు పేర్కొన్నారు. -
వన్డేలకు యూనిస్ ఖాన్ గుడ్‌బై
అబుదాబి: అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు పాక్ సీనియర్ క్రికెటర్ యూనిస్ ఖాన్ గుడ్‌బై చెప్పాడు. 2000సంవత్సరంలో పాక్ జట్టులో చోటు సంపాదించిన యూనిస్ అంచెలంచెలుగా ఎదిగి పాక్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగే మ్యాచ్ అనంతరం వన్డే ఫార్మాట్‌నుంచి తప్పుకుంటున్నట్లు యూనిస్ ఖాన్ ప్రకటించాడు. 2000 ఫిబ్రవరిలో కరాచీలో శ్రీలంకతో జరిగిన మ్యచ్‌లో వన్డే ఆరంగేట్రం చేసిన యూనిస్ పాక్ జట్టుకు 15 ఏళ్లుగా సేవలందించాడు. 264 వన్డే మ్యాచ్‌లాడిన యూనిస్ 7240 పరుగులు సాధించాడు. తన కెరీర్లో 7 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. నేటి మ్యాచ్ అతనికి 265వ మ్యాచ్. టెస్టుల్లో 9 వేల పరుగులు చేసిన పాక్ తొలి ఆటగాడిగా యూనిస్ నిలిచాడు. జట్టుకు అవసరమైన సేవలు చేశాను, అతి త్వరలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని గతవారం చెప్పిన యూనిస్ బుధవారం వీడ్కోలు విషయాన్ని బహిర్గతం చేశాడు. -
ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ కు సెహ్వాగ్ వీడ్కోలు
-
బర్త్‌డే రోజే వీరూ గుడ్‌బై
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రవేసి విధ్వంసకర బ్యాట్సమెన్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే దుబాయ్‌లో మాస్టర్స్ లీగ్ కు సంబంధించిన మీడియా సమావేశంలో రిటైర్ కానున్నట్లు చూచాయగా వెల్లడించిన వీరేంద్ర సెహ్వాగ్.. మంగళవారం తాను అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లతో పాటు, ఐపీఎల్ నుంచి కూడా వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈరోజు తన 37వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం 2013 మార్చిలో తన ఆఖరి టెస్టు ఆడిన సెహ్వాగ్, అదే ఏడాది జనవరిలో చివరిసారిగా వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్లో రెండు ‘ట్రిపుల్ సెంచరీలు’ చేసిన ఏకైక భారత ఆటగాడైన సెహ్వాగ్, వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. 2007లో టి20, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన సెహ్వాగ్ టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మాస్టర్ చాంపియన్స్ లీగ్ -2020పై సంతకం చేసిన సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోలేక తప్పలేదు. ఆ లీగ్ లో కేవలం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు మాత్రమే పాల్లొనాలి. 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 49.34 సగటుతో 23 సెంచరీలతో 8,586 పరుగులు చేశాడు. కాగా, 251 వన్డేలు ఆడి 35.05 సగటుతో 15 సెంచరీలతో 8,273 పరుగులను నమోదు చేశాడు. ఇక ట్వంటీ 20 ల్లో 19 మ్యాచ్ లు ఆడి 21.88 సగటుతో 394 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 319. కాగా, వన్డేల్లో అత్యధిక స్కోరు 219. 1999లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వన్డే ఆరంగేట్రం చేసిన వీరు.. ఆపై రెండేళ్లకు అంటే 2001 నవంబర్ లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో చోటు సంపాదించాడు. తొలుత టెస్టుల్లో సరిపోతాడా?అనే అనుమానాలు వచ్చినా.. అది నిజం కాదని నిరూపించాడు. భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. క్రికెట్ దిగ్గజాల ప్రశంసల్లో కొన్ని! *సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి అచ్చు తన బ్యాటింగ్ లాగానే ఉంటుందని వెస్టిండీస్ లెజెండ్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసించడం నిజంగా వీరు గొప్పతనంగా చెప్పవచ్చు. వీరు క్రీజ్ లో బ్యాట్ పట్టుకుని ఉన్నాడంటే బంతిని బలంగా విరుచుకుపడే విధానం తన ఆట శైలిని గుర్తు చేస్తుందంటూ రిచర్డ్స్ కొనియాడాడు. *2011, డిసెంబర్ 8 వ తేదీన వెస్డిండీస్ తో ఇండోర్ లో జరిగిన నాల్గో వన్డేలో సెహ్వాగ్(219; 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్స్ లు) డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఒక ఆసక్తిర కామెంట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మీరు గనుక క్రికెట్ అభిమాని అయితే విండీస్ పై విధ్వంసం సృష్టిస్తున్న సెహ్వాగ్ ఆటతీరును చూడండి. మీరు తక్షణమే వెళ్లి టీవీలు ఆన్ చేయండి అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన పీటర్సన్ కామెంట్ చేశాడు. *మరొక భారతీయుడు తన రికార్డును అధిగమించడం చాలా సంతోషంగా ఉందంటూ సెహ్వాగ్ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. *వన్డే క్రికెట్ లో సచిన్ డబుల్ సెంచరీ చేసిన తరువాత సెహ్వాగ్ నుంచి కూడా మరొక డబుల్ వస్తుందని తాను ముందుగానే నమ్మినట్లు మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. *ఒక భారతీయుడే తన రికార్డును అధిగమించడం చాలా సంతోషంగా ఉందంటూ సెహ్వాగ్ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. *తాను ఎప్పుడు సర్ వివియన్ రిచర్గ్స్ బ్యాటింగ్ చూడలేదు. కానీ సెహ్వాగ్ విధ్వంసాన్ని చూశాను. వన్డేల్లో 219 పరుగులు చేయడం మామూలు విషయం కాదు. దీన్ని అధిగమించడం ఎవరీ సాధ్యం కాదు అంటూ సెహ్వాగ్ బ్యాటింగ్ ను ఉద్దేశిస్తూ క్రిస్ గేల్ చేసిన కామెంట్. వీరేంద్ర సెహ్వాగ్ అనగానే అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయిన కొన్ని ఇన్నింగ్స్‌లను చూస్తే.... టెస్టులు * 2003 (మెల్బోర్న్): ఆస్ట్రేలియాపై ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఐదు గంటల్లోనే 195 పరుగుల ఇన్నింగ్స్. * 2004 (ముల్తాన్): భారత్ తరఫున తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ (319). సక్లాయిన్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఈ ఘనత. * 2008 (అడిలైడ్): ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులతో భారత్‌కు తప్పిన ఓటమి. * 2008 (చెన్నై): 278 బంతుల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు (దక్షిణాఫ్రికాపై). * 2009 (ముంబై): మూడో ‘ట్రిపుల్ సెంచరీ’ మిస్. శ్రీలంకపై 254 బంతుల్లో 293. * 2010 (కోల్‌కతా): 174 బంతుల్లో 165. టెస్టుల్లో నంబర్‌వన్‌గా సెహ్వాగ్. వన్డేలు * 2001 (కొలంబో): సచిన్ గైర్హాజరులో వన్డేల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. 69 బంతుల్లో సెంచరీ...సెహ్వాగ్ స్టయిల్ బయటపడింది. * 2002 (కొలంబో): చాంపియన్స్ ట్రోఫీ సెమీస్. ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీతో భారత్ ఫైనల్‌కు. * 2009 (హామిల్టన్): 60 బంతుల్లో సెంచరీతో భారత్ తరఫన కొత్త రికార్డు. * 2009 (రాజ్‌కోట్): 102 బంతుల్లో 146 పరుగులతో 414 పరుగుల జట్టు రికార్డు స్కోరులో కీలకపాత్ర. * 2011 (ఇండోర్): 140 బంతుల్లో వన్డేల్లో డబుల్ సెంచరీ.. -
యూఎస్ ఓపెన్‌లో పెన్నెట్టా సంచలన విజయం
-
సలామ్ సంగ
భారత్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్న సంగక్కర రెండో టెస్టే ఈ దిగ్గజానికి ఆఖరిది అతనో పరుగుల యంత్రం. దశాబ్దం న్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు వెన్నె ముక. పోరాట యోధుడు. సహచరులంతా పెవిలియ న్కు క్యూ కడుతున్నా, ఆఖరి బంతి వరకు అభిమా నుల ఆశలను నిలబెట్టడానికి పోరాడతాడు. అందుకే సంగక్కర బ్యాటింగ్ అంటే శ్రీలంక ఊగిపో తుంది. ప్రత్యర్థులు ఒకటికి రెండుసార్లు వ్యూహాలను సరిచూసుకుంటారు. అలాంటి దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెప్పబోతున్నాడు. ఇప్పటికే వన్డేల నుంచి తప్పుకున్న సంగ... భారత్‌తో రెండో టెస్టు తర్వాత పూర్తిగా రిటైర్ కాబోతున్నాడు. క్రీడావిభాగం సంగక్కరకు పరుగుల దాహం ఎక్కువ. అతను టెస్టుల్లో చేసిన 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడమే దీనికి నిదర్శనం. ఓ మైలురాయిని దాటగానే చాలా మంది క్రికెటర్లలా సంబరపడిపోడు. మరింత బాధ్యతగా ఆడతాడు. ఈ లక్షణమే అతణ్ని శ్రీలంక క్రికెట్లో ‘ఆల్‌టైమ్ గ్రేట్’ లలో ఒకడిగా నిలబెట్టింది. నిజానికి సంగక్కరలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. 37 ఏళ్ల వయసులో 2014లో అతను అసాధారణంగా పరుగులు చేశాడు. 72 సగటుతో ఏకంగా 1438 టెస్టు పరుగులు సాధించాడు. అందుకే అతను మిగిలిన ఫార్మాట్ల నుంచి రిటైరైనా టెస్టుల్లో మాత్రం కొనసాగాలని శ్రీలంక బోర్డు విజ్ఞప్తి చేసింది. అయినా అతను అంగీకరించలేదు. నిస్వార్థుడు... తన కెరీర్లో సంగక్కర ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్లని పట్టించుకోలేదు. సొంత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేశాడు. అందుకే రిటైర్మెంట్ విషయంలోనూ ఎవరి మాటా వినలేదు. నిజానికి తను ఏడాది క్రితమే రిటైర్ అవ్వాలనుకున్నాడ ట. బోర్డుకు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలపాలని భావించాడు. అయితే అనుకోకుండా అదే సమయంలో జయవర్ధనే రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఆ విషయాన్ని మహేళ తొలుత సంగక్కరకే చెప్పాడట. దీంతో సంగక్కర తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. ‘ఒకేసారి ఇద్దరు సీనియర్ క్రికెటర్లు తప్పుకుంటే జట్టుపై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మహేళ నిర్ణయం వినగానే నేను ఓ ఏడాది ఆడాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పడం శ్రీలంక క్రికెట్ గురించి అతనెంత ఆలోచిస్తాడో చెప్పడానికి ఉదాహరణ. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ (15921) తర్వాత ఉన్న ముగ్గురూ 13 వేల పైచిలుకు పరుగులు చేశారు. ప్రస్తుతం సంగక్కర ఖాతాలో 12,305 పరుగులు ఉన్నాయి. మరో రెండేళ్లు క్రికెట్ ఆడితే సచిన్‌ను అధిగమించకపోయినా... సచిన్‌కు చేరువలోకి వస్తాడు. ఈ జాబితాలో రెండో స్థానానికి చేరతాడు. అలాగే ఒక్క డబుల్ సెంచరీ కొడితే బ్రాడ్‌మన్ సరసన నిలుస్తాడు. ఈ రికార్డులేవీ తనని ఊరించలేదు. ‘ఓ రెండేళ్లు ఆడితే మహా అయితే మరికొన్ని రికార్డులు వస్తాయి. కానీ వాటికోసం నా కెరీర్‌ను పొడిగించుకోవడం అర్థంలేని విషయం. నేను పూర్తిస్థాయిలో నా జట్టుకు న్యాయం చేసే సత్తాతో ఆడగలనా లేదా అనే విషయం నాకే ఎక్కువగా తెలుస్తుంది. నా సహచరుల కళ్లలోకి ధైర్యంగా చూస్తూ మాట్లాడేలా నా ఆట ఉండాలి. కాబట్టి ఇప్పుడు రిటైర్ కావడమే సరైన నిర్ణయం’ అన్న సంగక్కర మాటలు తనెంత గొప్పగా ఆలోచిస్తాడో చెప్పడానికి నిదర్శనం. మార్కు చూపిస్తాడా! తను వెళ్లే ముందు తన మార్కును చూపించడం సంగకు అలవాటు. టి20 ఫార్మాట్‌కు టైటిల్ సాధించి వీడ్కోలు చెప్పాడు. వన్డేల నుంచి తప్పుకునే ముందు చివరి ఐదు ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. తన ఆఖరి టోర్నీ ప్రపంచకప్‌లో వరుస మ్యాచ్‌లలో ఈ నాలుగు శతకాలు చేయడం విశేషం. త నలో ఇంకా చాలా సత్తా ఉందనడానికి ఇది నిదర్శనం. అలాగే టెస్టుల నుంచి కూడా తన మార్కు చూపించే వెళతాడు. మరో రెండు డబుల్ సెంచరీలు కొడితే డాన్ బ్రాడ్‌మన్ (12) రికార్డును అధిగమిస్తాడు. రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు కొట్టడం తేలికేం కాదు. అయితే అది సంగక్కర లాంటి యోధుడికి అసాధ్యం కూడా కాదు. తన చివరి టెస్టు సిరీస్‌ను చిరస్మరణీయంగా మలచుకోవాలని సంగ కోరుకోవడంలో తప్పు లేదు. అటు శ్రీలంక జట్టు సహచరులు కూడా తమ దిగ్గజం కోసం భారత్‌తో తొలి రెండు టెస్టులు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..! భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం రిటైర్మెంట్ తర్వాత సంగక్కర ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. కౌంటీలు, ఐపీఎల్ లాంటి టోర్నీలు తను ఇంకా ఆడే అవకాశం ఉంది. అయితే స్వదేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం పని చేయాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించగల సత్తా తనలో ఉందని, బోర్డు అనుమతిస్తే ఆ బాధ్యతలు తీసుకుంటానని అంటున్నాడు. మరోవైపు తన ప్రియ మిత్రుడు జయవర్దనేతో కలిసి ఇప్పటికే ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. ఇద్దరి భాగస్వామ్యంలో మరిన్ని వ్యాపారాలు రాబోతున్నాయి. -
టెస్టులకు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గుడ్ బై
నాటింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు 34 ఏళ్ల క్లార్క్ ప్రకటించాడు. క్లార్క్ సుధీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయాల కారణంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు యాషెస్ సిరీస్ పరాజయం అతనిపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-3తో ఓడిపోయింది. శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం క్లార్క్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఈ సిరీస్‌లో నామమాత్రమైన చివరి, ఐదో టెస్టు ఆడాల్సివుంది. క్లార్క్‌కు ఇదే చివరి టెస్టు. 2004లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన క్లార్క్ తన కెరీర్లో 114 మ్యాచ్‌లు ఆడాడు. 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8605 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్). -
మహేంద్ర సింగ్ ధోని తిరిగి ఇంటికి పయనం?
మెల్ బోర్న్: టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి భారత్ కు పయనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెల్ బోర్న్ టెస్ట్ అనంతరం తన టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ధోనీని భారత్ కు రప్పించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. జనవరి 6వ తేదీ నుంచి సిడ్నీలో నాల్గో టెస్ట్ ఆరంభం కానుంది. ఆస్ట్రేలియాలో జరిగిన నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కాస్త కలత చెందిన ధోనీ మొత్తంగా టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు. తన రిటైర్మెంట్ విషయం గురించి రెండేళ్ల కిందటే ప్రస్తావించిన ధోనీ..వన్డే, ట్వంటీ 20 ఫార్మెట్లలో పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు గాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఒకవేళ నాల్గో టెస్ట్ ఆరంభమయ్యే లోపు ధోనీ భారత్ కు వస్తే మాత్రం టీమిండియా జట్టులో వెలితి స్పష్టంగా కనబడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
ధోనీ అనూహ్య నిర్ణయం; టెస్టు క్రికెట్‌కు గుడ్ బై
-
టెస్టు క్రికెట్‌కు ధోనీ గుడ్ బై
-
ధోనీ కెప్టెన్సీ.. గతమెంతో ఘనం
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ ధోనీ అనూహ్య నిర్ణయం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొన్నటిదాకా విజయవంతమైన కెప్టెన్‌గా మన్ననలందుకున్న ధోనీ అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇటీవల టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవడం, ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన ధోనీ ఆ మరుసటి ఏడాది 2005లో ధోనీ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ తన కెరీర్లో 90 టెస్టులు ఆడాడు. 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ధోనీ అత్యుత్తమ స్కోరు 224. ఆస్ట్రేలియాతో ఈ రోజు ముగిసిన మూడో టెస్టే ధోనీకి ఆఖరి మ్యాచ్. ధోనీ సారథ్యంలో భారత్ ఎన్నో ఘనవిజయాలు సాధించింది. టెస్టు క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 60 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించిన మహీ 27 మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలందించాడు. కాగా విదేశీ గడ్డపై భారత్ పరాజయాలు చవిచూడటంతో విమర్శలు వచ్చాయి. వన్డేల్లోనూ ధోనీ అద్భుతాలు చేశాడు. స్వదేశంలో జరిగిన గత వన్డే ప్రపంచ కప్‌లో భారత్ ధోనీ కెప్టెన్సీలోనే కప్ సొంతం చేసుకుంది. వన్డేల్లో 250 మ్యాచ్‌లు, పొట్టి క్రికెట్లో 50 మ్యాచ్‌లు ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ కొనసాగనున్నాడు. -
టెస్టు క్రికెట్‌కు ధోనీ గుడ్ బై
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. టెస్టు క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ కూడా ధోనీ ఆడటం లేదు. జనవరి 6 నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు. -
హ్యూస్ 'జెర్సీ నెంబర్ 64' రిటైర్
మెల్బోర్న్: ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ గౌరవార్థం అతని అంతర్జాతీయ వన్డే జెర్సీని రిటైర్ చేశారు. హ్యూస్ జెర్సీ నెంబర్ 64ను ఇకమీదట ఎవరికీ కేటాయించరు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ చెప్పాడు. హ్యూస్ జెర్సీని రిటర్ చేయాలని ప్రతిపాదించగా, క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించిందని క్లాక్ వెల్లడించాడు. హ్యూస్ లేని లోటు తీర్చలేనిదని, డ్రెస్సింగ్ రూమ్ మునుపటిలా ఉండదని క్లార్క్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశవాళీ మ్యాచ్‌లో తలకు బౌన్సర్ తగిలి హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే.