మహేంద్ర సింగ్ ధోని తిరిగి ఇంటికి పయనం? | mahendra singh dhoni may send to home! | Sakshi
Sakshi News home page

మహేంద్ర సింగ్ ధోని తిరిగి ఇంటికి పయనం!

Published Thu, Jan 1 2015 11:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

మహేంద్ర సింగ్ ధోని తిరిగి ఇంటికి పయనం?

మహేంద్ర సింగ్ ధోని తిరిగి ఇంటికి పయనం?

మెల్ బోర్న్: టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి భారత్ కు పయనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మెల్ బోర్న్ టెస్ట్ అనంతరం తన టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ధోనీని భారత్ కు రప్పించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. జనవరి 6వ తేదీ నుంచి సిడ్నీలో నాల్గో టెస్ట్ ఆరంభం కానుంది.

 

ఆస్ట్రేలియాలో జరిగిన నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కాస్త కలత చెందిన ధోనీ మొత్తంగా టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు.  తన రిటైర్మెంట్ విషయం గురించి రెండేళ్ల కిందటే ప్రస్తావించిన ధోనీ..వన్డే, ట్వంటీ 20 ఫార్మెట్లలో పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు గాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఒకవేళ నాల్గో టెస్ట్ ఆరంభమయ్యే లోపు ధోనీ భారత్ కు వస్తే మాత్రం టీమిండియా జట్టులో  వెలితి స్పష్టంగా కనబడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement