నమీబియా ఓపెనర్ నికోలాస్ డేవిన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా డేవిన్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన డేవిన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యచేధనలో నమీబియా ఓపెనర్‌గా వచ్చిన డేవిన్ తడబడ్డాడు. ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొనేందుకు డేవిన్ తీవ్రంగా శ్రమించాడు.
తన ఆడిన 16 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్.. డెవిన్ వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో డెవిన్ రిటైర్ట్ ఔట్‌గా డగౌట్‌కు చేరాడు. అతడి తన స్ధానంలో డేవిడ్ వైస్ క్రీజులోకి వచ్చాడు.
అయితే 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇలా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగలేదు. ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నమీబియాపై 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment