![JP Duminy to retire from ODIs after World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/16/Untitled-8.jpg.webp?itok=_AkVJyWM)
ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్ల జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. ఇప్పటికే క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఇమ్రా¯Œ తాహిర్ (దక్షిణాఫ్రికా) ఈ మెగా ఈవెంట్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతామని ప్రకటించగా... వీరి సరసన తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని చేరాడు.
34 ఏళ్ల డుమిని 2017లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా... జూ¯Œ –జూలైలో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. ఇప్పటి వరకు 193 వన్డేలు ఆడిన డుమిని 5,047 పరుగులు చేసి, 68 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment