JP Duminy
-
చెత్త రికార్డు సమం చేసిన డికాక్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా సాతాఫ్రికాతో నిన్న (మార్చి 25) జరిగిన తొలి మ్యాచ్‌లో పర్యాటక వెస్డిండీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించడంతో 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. విండీస్ మరో 3 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్నోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. విండీస్‌ను కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (18 బంతుల్లో 43; ఫోర్, 5 సిక్సర్లు) అజేయమై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్,బ్యాటర్ క్వింటన్ డికాక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన (గోల్డన్ డక్) డికాక్.. సౌతాఫ్రికా తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా జేపీ డుమినీ, ఆండైల్ ఫెలుక్వాయో సరసన చేరాడు. వీరు ముగ్గురు టీ20ల్లో 6 సార్లు డకౌటయ్యారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోగా.. వన్డే సిరీస్‌ను 1-1తో (వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దైంది) సమం చేసుకుంది. తొలి టీ20లో విండీస్ గెలవడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
SA T20 League: పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా జేపీ డుమిని
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా పార్ల్ రాయల్స్‌ను ఐపీఎల్ ఫ్రాంజైజీ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ జట్టు కోచింగ్ స్టాప్ సభ్యల పేర్లను పెర్ల్ రాయల్స్ ప్రకటించింది. పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని ఎంపికయ్యాడు. స్పిన్ బౌలింగ్, స్ట్రాటజీ కోచ్‌గా ప్రోటిస్ మజీ ఆటగాడు రిచర్డ్ దాస్ నెవ్స్.. మార్క్ చార్ల్టన్ (బ్యాటింగ్ కోచ్), ఏటీ రాజమణి ప్రభు( మెంటల్ కండిషనింగ్ కోచ్), మాండ్లా మాషింబీ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), లిసా కీట్లీ( టాక్టికల్ కోచ్) రస్సెల్ ఆస్పెలింగ్(జట్టు కేటాలిస్ట్)గా నియమితులయ్యారు. ఇక 2020 జనవరిలో డుమిని అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. The team behind the team for our first ever #SA20 campaign. 🙌💗#RoyalsFamily pic.twitter.com/L25o4ZqUbT — Paarl Royals (@paarlroyals) September 15, 2022 ప్రోటిస్ తరపున 46 టెస్టులు..199 వన్డేలు, 81 టీ20ల్లో ఆడాడు. డుమిని ప్రస్తుతం బోలాండ్ దేశీవాళీ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా పార్ల్ రాయల్స్ ఇప్పటికే డేవిడ్ మిల్లర్, మెకాయ్, జోస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఒప్పంతం కుదుర్చుకుంది. ఈ సరికొత్త దక్షిణాఫ్రికా టీ20 లీగ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. చదవండి: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్.. ధోనికి నో చాన్స్!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై కమ్ముకున్న ‘కరోనా నీడలు’ ఇంకా అలానే ఉన్నాయి. 13వ ఐపీఎల్ జరుగుతుందని కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఈ లీగ్‌ను సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ అలా జరగాలంటే టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడాల్సి ఉంటుంది. దాంతో ఐపీఎల్ నిర్వహణ సాధ్యమా.. కాదా అనేది నిర్వహకులే తేల్చుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంచితే, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు తమ అత్యుత్తమ జట్లను ప్రకటిస్తున్నారు. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ జేపీ డుమినీ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఇద్దరు భారత క్రికెటర్లకు చోటు కల్పించిన డుమినీ.. ఐపీఎల్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనికి చాన్స్ ఇవ్వలేదు. వికెట్ కీపర్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చిన డుమినీ.. ధోనిని ఎంపిక చేయలేదు. కాగా, తన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టుకు విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అదే సమయంలో భారత్ నుంచి రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు. డుమినీ ఆల్‌టైమ్ జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, రోహిత్‌శర్మ, ఏబీ డివిలియర్స్, కీరోన్ పొలార్డ్, రసెల్, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీ ధరన్, లసిత్ మలింగా, ఇమ్రాన్ తాహీర్ -
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్; తోసుకున్న ఆటగాళ్లు..!
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ ఆసాంతం విజయపరంపర సాగించిన ‘యువ’భారత్ జట్టు ఫైనల్లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి ‘కప్పు’ను ముద్దాడింది. అయితే, తమ జట్టు విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. (చదవండి : అయ్యో... ఆఖరికి ఓడింది) విజయానందంలో ఉన్న బంగ్లా ఆటగాళ్లలో ఒకరు టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడారు. అసలే ఓటమి బాధలో ఉన్న మన ఆటగాళ్లకు బంగ్లా ఆటగాళ్ల చేష్టలు కోపం తెప్పించాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు తోసుకునే దాకా మ్యాటర్ వెళ్లింది. వెంటనే స్పందించిన ఫీల్డ్ అంపైర్లు ఇరువురికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ ట్విటర్లో పోస్టు చేశాడు. బంగ్లా గెలిచిందిలా..! 178 పరుగుల లక్ష్యంతో బంగ్లా ఛేదనకు దిగగా.. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. దీంతో 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి బంగ్లా విజయాన్నందుకుంది. బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలబడి గెలిపించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
రికార్డు ఫిఫ్టీతో చెలరేగిపోయాడు..!
బ్రిడ్జిటౌన్: దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ చెలరేగి పోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా బార్బోడాస్ ట్రిడెంట్స్ తరఫున ఆడుతున్న డుమనీ.. గురువారం ట్రిన్‌బాగ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీని 15 బంతుల్లోనే సాధించడం ఇక్కడ విశేషం. సీపీఎల్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా నమోదైంది. తొలి మూడు పరుగులు చేయడానికి ఐదు బంతులు ఆడిన డుమినీ.. ఆ తర్వాత మెరుపులు మెరిపించాడు. మిగతా 47 పరుగుల్ని మరో 10 బంతుల్లో సాధించి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి సీపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఎవిన్ లూయిస్ సాధించగా, దాన్ని డుమినీ బ్రేక్ చేశాడు. ఈనెల ఆరంభంలో లూయిస్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌లో డుమినీకి జతగా చార్లెస్(58), కార్టర్(51)లు రాణించడంతో బార్బోడాస్ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఆ తర్వాత 193 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. దాంతో బార్బోడాస్ 63 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హేడన్ వాల్ష్ ఐదు వికెట్లతో నైట్‌రైడర్స్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా డుమినీ రెండు వికెట్లు సాధించాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డారెన్ బ్రేవో(28)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
ప్రపంచకప్ తర్వాత వన్డేలకు డుమిని గుడ్‌బై
ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్ల జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. ఇప్పటికే క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఇమ్రా¯Œ తాహిర్ (దక్షిణాఫ్రికా) ఈ మెగా ఈవెంట్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతామని ప్రకటించగా... వీరి సరసన తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని చేరాడు. 34 ఏళ్ల డుమిని 2017లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా... జూ¯Œ –జూలైలో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. ఇప్పటి వరకు 193 వన్డేలు ఆడిన డుమిని 5,047 పరుగులు చేసి, 68 వికెట్లు పడగొట్టాడు. -
వన్డేలకు డుమినీ గుడ్ బై!
కేప్‌టౌన్: త్వరలో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి వైదొలగబోతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించిన డుమినీ.. టీ20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతానని పేర్కొన్నాడు. 2017లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న డుమినీ, వన్డే ఫార్మాట్ నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు వరల్డ్‌కప్‌ను ఎంచుకున్నాడు. వన్డేల్లో తనకు వరల్డ్‌కప్ చివరిదంటూ డుమినీ ప్రకటించాడు. ‘గత కొన్నినెలలుగా నా వన్డే రిటైర్మెంట్పై ఆలోచనలో పడ్డా. వన్డేలకు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని బలంగా నమ్ముతున్నా. వరల్డ్‌కప్ తర్వాత తప్పుకోవడానికి సిద్ధమయ్యా. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సతమతమయ్యా. కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఇక వన్డేలు చాలనుకున్నా. అంతర్జాతీయ, దేశవాళీ టీ20 ఫార్మాట్లో కొనసాగుతా’ అని డుమినీ తెలిపాడు. ఇప్పటివరకూ డుమినీ 193 వన్డేలు ఆడగా 37. 39 సగటుతో 5,047 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 68 వికెట్లు సాధించాడు. రాబోయే వరల్డ్‌కప్ డుమినీకి మూడోది. గతంలో 2011, 2015 వరల్డ్‌కప్ టోర్నీల్లో డుమినీ పాల్గొన్నాడు. -
టాస్ కలిసి రావడం లేదని..
ఈస్ట్ లండన్: చాలా సందర్భాల్లో సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటాం. ఇందుకు ఏదీ అనర్హం కాదేమో. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ వేసే సమయంలో తనకు కూడా సెంటిమెంట్ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. సాధారణంగా క్రికెట్లో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి మాత్రమే టాస్ వేయడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. టాస్ కాయిన్‌ను ఎగురవేయడానికి సహచర ఆటగాడు జేపీ డుమినీని నియమించుకున్నాడు. గత మంగళవారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భాగంగా టాస్ వేసేందుకు డుప్లెసిస్‌తో పాటు డుమినీ కూడా మైదానంలోకి వచ్చాడు. ఇక్కడ టాస్ వేసేందుకు కాయిన్‌ను డుమినీ చేతికిచ్చాడు డుప్లెసిస్. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడంతో డుమినీని సెంటిమెంట్‌గా నమ్ముకున్నాడు. ఈ క్రమంలోనే డుమినీ చేత టాస్ వేయించాడు. దక్షిణాఫ్రికా టాస్ గెలవడంతో డుప్లెసిస్ నమ్ముకున్న సెంటిమెంట్ నిజమైనట్లయ్యింది. మరొక విషయం ఏంటంటే, ఆ మ్యాచ్‌లో డుమినీ తుది జట్టులో లేడు. కాగా, ఇలా డుమినీ చేత టాస్ వేయించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్న డుప్లెసిస్.. ఆ క్షణాల్ని ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. డుమినీ టాస్ వేయడంలో స్పెషలిస్టు అంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇది మంచి మజాను తీసుకొచ్చిందన్నాడు. -
‘టాస్’ సెంటిమెంట్..
-
అదే మా ఓటమికి ప్రధాన కారణం
-
అదే ఓటమిపై ప్రభావం చూపింది: డుమినీ
కేప్‌టౌన్: టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో ఓటమి చెందడం పట్ల దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమినీ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి భారత బౌలర్లు నియంత్రణతో కూడిన బౌలింగ్ చేయడమే ప్రధాన కారణమని డుమినీ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు పవర్ ప్లేలో అద్బుతంగా బౌలింగ్ చేసి తమను హిట్టింగ్ చేయకుండా కట్టడి చేశారన్నాడు. తొలి ఆరు ఓవర్లలో బౌండరీలను సాధించడం కంటే కూడా సింగిల్స్ తీయడమే గగనంగా మారిపోయిందన్నాడు. భారత పేసర్లు నకుల్ బాల్స్, స్లో బంతులతో తమను బాగా ఇబ్బంది పెట్టారన్నాడు. దాంతో పవర్ ప్లేలో 30 పరుగులు వెనుకబడిపోయామని, అదే ఓటమిపై ప్రభావం చూపిందని డుమినీ విశ్లేషించాడు. ఇక్కడ క్రెడిట్ మొత్తం భారత జట్టుదేనని ప్రశంసించాడు. చివరి టెస్టులో భారత జట్టు విజయం సాధించిన తర్వాత ఆ జట్టులో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందన్నాడు. దాంతోనే వరుసగా రెండు సిరీస్‌లను కైవసం చేసుకుని తమకు షాకిచ్చారన్నాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఎదురైన ఓటముల నుంచి పాఠం నేర్చుకున్నామన్నాడు. ఇదొక అద్భుతమైన సిరీస్‌గా డుమినీ అభివర్ణించాడు. తమ యువ క్రికెటర్లు వచ్చిన అవకాశాల్ని బాగా ఉపయోగించుకోవడం శుభపరిణామం అని డుమినీ పేర్కొన్నాడు. -
బుమ్రా ఔట్.. ఠాకుర్ ఇన్
సెంచూరియన్ : భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలి టీ20 గెలిచి ఉత్సాహంగా ఉన్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. సొంత గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ప్రొటీస్ జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుండగా.. టీమిండియాలో బుమ్రా స్థానంలో యువ బౌలర్ శార్ధుల్ ఠాకుర్ వచ్చాడు. జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రైనా, మనీశ్ పాండే, ధోని, పాండ్యా, భువనేశ్వర్, ఉనాద్కట్, చహల్, శార్ధుల్. దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్), హెన్డ్రిక్స్, స్మట్స్, మిల్లర్, బెహర్దీన్, క్లాసెన్, మోరిస్, ఫెలుక్వాయో, జూనియర్ డాలా, డేన్ ప్యాటర్సన్, షమ్సీ. -
'మనల్ని అద్దంలో చూసుకుందాం'
సెంచూరియన్:టీమిండియాతో తొలి టీ 20లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ వైఫల్యం చెందడంపై ఆ జట్టు కెప్టెన్ జేపీ డుమినీ అసహనం వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్ చాలా దుర్బలంగా ఉన్న కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. దీనికి సీనియర్ బ్యాట్స్మెన్లతో ఆటగాళ్లకు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందన్నాడు. ఒకసారి జట్టుగా అద్దంలో చూసుకుందామని ఆటగాళ్లకు చురకలంటించాడు. ఆ తర్వాత మన ప్రదర్శనని మెరుగు పరుచుకుందామన్నాడు. 'మనల్ని మనమే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎలా మెరుగ్గా ఆడాలనే దానిపై ఎవరికి వారే సమీక్ష జరుపుకుందాం. ఇక్కడ కొత్త ఆటగాళ్లు, సీనియర్ అనే తేడా ఏమీ ఉండదు. కెరీర్లో ఎత్తు పల్లాలు అనేవి సహజం. రాబోయే మ్యాచ్‌ల్లో సత్తాచాటడానికి యత్నిస్తాం. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేసి గెలుపు బాట పడతాం. తొలి టీ20 కొన్ని చేతుల్లోకి వచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్నాం. బుధవారం జరిగే రెండో టీ20లో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా మెరుగైన ప్రదర్శన చేద్దాం' అని సహచరులకు డుమినీ హిత బోధ చేశాడు. -
'ఇంకా ముగిసిపోలేదు'
కేప్‌టౌన్: తమ జట్టుపై టీమిండియా వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ మిగతా మ్యాచ్‌ల్లో సత్తాచాటి సిరీస్‌ను సమం చేస్తామని దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ఆటగాడు జేపీ డుమినీ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ సగం వన్డే సిరీస్ మాత్రమే అయిన విషయాన్ని డుమినీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. తదుపరి వన్డేలకు ఏబీ డివిలియర్స్ జట్టుతో కలవడం కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 'ఇంకా సిరీస్ ముగిసిపోలేదనే విషయం మాకు తెలుసు. సిరీస్‌ను కాపాడుకోవడానికి మాకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది. తదుపరి మూడు వన్డేలకు డివిలియర్స్ అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఏబీ రాక మాలో అమితమైన ఆత్మవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. కచ్చితంగా వరుస విజయాలు సాధించి సిరీస్‌ను సమం చేస్తాం' అని డుమినీ తెలిపాడు. అయితే దక్షిణాఫ్రికా పిచ్‌లపై భారత్ ఆడుతున్న తీరును డుమినీ కొనియాడాడు. ప్రధానంగా తమ పిచ్‌లపై ఏ రకంగా బౌలింగ్ చేయాలో టీమిండియా బౌలర్లు బాగా వంటబట్టించుకున్నారన్నాడు. తమ జట్టును భారీగా పరుగులు సాధించకుండా భారత బౌలర్ల రాణించడమే వారి వరుస విజయాలకు ప్రధాన కారణమన్నాడు. మరీ ముఖ్యంగా భారత స్పిన్నర్లు వేసే గుగ్లీలను టచ్ చేయడానికి తమ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందన్నాడు. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్లకు వికెట్లను సమర్పించుకుని వరుస మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన విషయాన్ని డుమినీ అంగీకరించాడు.అయితే ఏబీ పునరాగమనం జట్టుకు కలిసొచ్చే అంశంగా పేర్కొన్నాడు.. -
డుమినీ సరికొత్త రికార్డు
న్యూలాండ్స్: గత కొన్ని నెలల క్రితం టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ కొత్త రికార్డు సృష్టించాడు. లిస్ట్ ' ఎ' క్రికెట్లో ఒకే ఓవర్లో 37 పరుగులు సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. బుధవారం జరిగిన మొమెంటమ్ వన్డే కప్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేప్ కోబ్రాస్ కు సారథిగా వ్యవహరిస్తున్నడుమిని 6, 6, 6, 6, 2, 5 (నోబాల్), 6 పరుగులతో చెలరేగి ఆడాడు. స్పిన్నర్ ఎడ్డీ లీ వేసిన ఈ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత రెండు పరుగులు తీసిన డుమినీ.. నోబాల్‌కు బౌండరీ సాధించాడు. ఒక చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఫలితంగా లిస్ట్ 'ఎ' క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఇక లిస్ట్ 'ఎ' క్రికెట్లో ఒకే ఓవర్లో చిగుంబుర (జింబాబ్వే) అత్యధికంగా 39 పరుగులు సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోబ్రాస్ ఘన విజయం సాధించింది. డుమిని(70 నాటౌట్; 37 బంతుల్లో) చెలరేగి ఆడి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. -
'అప్పుడే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నా'
కేప్ టౌన్:ఇటీవల దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జేపీ డుమినీ తాను తీసుకున్న నిర్ణయం సరైనదిగా అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా టెస్టు ఫార్మాట్ వీడ్కోలకు ముందు తరుచు అత్యల్ప వ్యక్తిగత స్కోర్లకే పరిమితమవుతూ వస్తున్న తరుణంలో సఫారీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సరైన చర్యగానే డుమినీ స్పష్టం చేశాడు. ' లార్డ్స్ లో టెస్టు మ్యాచ్ తరువాత మైదానం నుంచి నడుచుకుంటూ వస్తున్న తరుణంలో నా టెస్టు కెరీర్ లో ఏదొకటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా. ముఖ్యంగా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని లార్డ్స్ టెస్టులోనే అనుకున్నా. నా నిర్ణయం సరైనదే. చాలా మంది యువ క్రికెటర్లు తమ హస్తాన్ని సఫారీ జట్టుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టెస్టు ఫార్మాట్ కు గుడ్ చెప్పడంతో పరిమిత ఓవర్ల క్రికెట్ పై సీరియస్ గా దృష్టి సారించడానికి ఆస్కారం ఉంది' అని డుమినీ తెలిపాడు. గత నెల్లో జేపీ డుమినీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్లలో ఒకరైన డుమినీ ఇక టెస్టు క్రికెట్ లో నిలకడైన ఫామ్ ను కొనసాగించలేక దానికి వీడ్కోలు చెప్పాడు. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి డుమినీ వీడ్కోలు తీసుకున్నాడు. 46 టెస్టు మ్యాచ్ లు ఆడిన డుమినీ..2,103 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్ లో 42 టెస్టు వికెట్లను డుమినీ సాధించారు. గత జూలై నెలలో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో డుమినీ చివరిసారి కనిపించారు.2019 వరల్డ్ కప్ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే క్రమంలో టెస్టు ఫార్మాట్ కు డుమినీ వీడ్కోలు చెప్పడం మరొక కారణం. -
టెస్టు క్రికెట్‌కు సఫారీ క్రికెటర్ వీడ్కోలు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ జేపీ డుమినీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్లలో ఒకరైన డుమినీ ఇక టెస్టు క్రికెట్ కు దూరంగా ఉండబోతున్న విషయాన్ని వెల్లడించారు. దాంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు డుమినీ పేర్కొన్నారు. తన నిర్ణయ తక్షణమే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల డుమినీ స్పష్టం చేశారు. 'దక్షిణాఫ్రికా తరపున టెస్టు మ్యాచ్ లను ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. నా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం. అదే సమయంలో 16 ఏళ్లపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కూడా గర్వంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే నా ముందున్న లక్ష్యం'అని డుమినీ తెలిపారు. ఇప్పటివరకూ 46 టెస్టు మ్యాచ్ లు ఆడిన డుమినీ..2,103 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్ లో 42 టెస్టు వికెట్లను డుమినీ సాధించారు. గత జూలై నెలలో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో డుమినీ చివరిసారి కనిపించారు. -
ఐపీఎల్‌కు డుమిని దూరం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ జేపీ డుమిని వచ్చే నెలలో మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి వైదొలిగాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే డుమిని వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. -
అప్పుడే టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలి!
పెర్త్: ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సిరీస్ లో భాగంగా న్యూఇయర్ టెస్టు నుంచి ఉద్వాసనకు గురైన దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమినీ అప్పుడే తన టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెబుదామనుకున్నాడట. ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సెలక్టర్ అష్వెల్ ప్రిన్స్ తాజాగా స్పష్టం చేశాడు. 'జనవరిలో డుమినీ టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అప్పుడు టెస్టులకు దూరంగా కావాలని డుమినీ నిశ్చయించుకున్నాడు. దాన్ని నాతో చెప్పాడు. అదే విషయాన్ని మా సెలక్షన్ కమిటీకి చెప్పా. ఆ సయమంలో డుమినీ ఫామ్ పరంగా కొంతవరకూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. చాలానిజాయితీగా అతని గురించి నాకు చెప్పాడు. సుమారు 12 ఇన్నింగ్స్ ల్లో డుమినీ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాననే విషయం అతన్ని ఎక్కువగా బాధించింది. అయితే దక్షిణాఫ్రికాకు డుమినీ చాలా ముఖ్యమైన ఆటగాడు. నిర్ణయాన్ని మార్చుకోమని అతనికి చెప్పా. ఆ మేరకు సెలక్షన్ కమిటీ అతనికి నచ్చజెప్పింది. దాంతో వెనక్కి తగ్గాడు. ఆనాటి డుమినీ ఫీలింగ్‌కు, ఇప్పుడు ఆస్ట్రేలియాతో భారీ సెంచరీ ఫీలింగ్‌తో పోల్చుకుంటే అప్పటి డుమినీ నిర్ణయం తప్పని అతనికి తెలుస్తుంది' అని ప్రిన్స్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డుమినీ 141 పరుగులు చేసి దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం సాధించడానికి దోహద పడ్డాడు. -
డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా డుమిని
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-8 సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జేపీ డుమిని వ్యవహరిస్తాడు. ‘ఢిల్లీ ఫ్రాంచైజీ నాపై ఉంచిన నమ్మకానికి, మద్దతుకు ధన్యవాదాలు. జూనియర్, సీని యర్ మేళవింపుతో ఉన్న జట్టును నడిపించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సీజన్లో మెరుగ్గా ఆడి విజేతగా నిలిచేం దుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్న డుమిని అన్నాడు. మరోవైపు ఢిల్లీ జట్టును నడిపించేందుకు డుమిని సరైన వ్యక్తి అని చీఫ్ కోచ్ కిర్‌స్టెన్ అభిప్రాయపడ్డారు. -
డుమిని ‘సూపర్’ సెంచరీ
దక్షిణాఫ్రికా 455/9 డిక్లేర్డ్ శ్రీలంకతో తొలి టెస్టు గాలె: డుమిని (206 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో శ్రీలంకతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 455 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 268/5తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా.. కొద్దిసేపటికే స్టెయిన్ (3), ఆ తరువాత డి కాక్ (51)లు అవుటవడంతో 314 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టెయిలెండర్లతో కలిసి డుమిని వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టెస్టుల్లో తన మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మోర్కెల్ (22) అవుటైన వెంటనే దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పెరీరాకు నాలుగు (4/162), లక్మల్‌కు మూడు (3/75) వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు వికెట్లేమీ కోల్పోకుండా 30 పరుగులు చేసింది.