
ఐపీఎల్‌కు డుమిని దూరం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ జేపీ డుమిని వచ్చే నెలలో మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి వైదొలిగాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే డుమిని వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.