
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 పానీయాల విభాగంలో స్పాన్సర్‌షిప్ డీల్‌ను ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. అందుకోసం రిలయన్స్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించింది. గతేడాది ఈ స్పాన్సర్‌షిప్ హక్కులను కోకాకోలా సొంతం చేసుకుంది. పానీయాల విభాగంలో ఈ డీల్‌ను దక్కించుకోవడంతో రిలయన్స్‌కు చెందిన కంపాకోలా విక్రయాలు పెరిగి, దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని కంపెనీ భావిస్తుంది.
వేసవిలో సేల్స్ పెంచుకోవాలని సాఫ్ట్‌డ్రింక్స్ కంపెనీలు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాయి. సరిగ్గా ఐపీఎల్ అదే సమయంలో ప్రారంభం కానుండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని మరింత ముందుకుసాగాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే రిలయన్స్ ఈ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపా కోలాతో పాటు ఆర్‌సీపీఎల్ తన స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్, రాస్‌కిక్ గ్లూకో ఎనర్జీని టీ20 లీగ్ సందర్భంగా ప్రచారం చేస్తోంది.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటుపై త్వరలో నిర్ణయం
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి రూపొందించిన ‘స్పిన్నర్’ ప్రమోషన్స్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అనే ఐదు ఐపీఎల్ జట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. రూ.10 ధర కలిగిన రాస్‌కిక్ గ్లూకో ఎనర్జీ కూడా ఈ టోర్నమెంట్‌లోనే అరంగేట్రం చేస్తోంది. ఐపీఎల్ 2025 కోసం టెలివిజన్, ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి మొత్తం ప్రకటనల ఆదాయం గత సంవత్సరం కంటే 8-10% పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సుమారు రూ.4,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment