![Tata Group as IPL title sponsor till 2028 - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/21/ipl.jpg.webp?itok=CbqeTygf)
ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానుల్ని చూరగొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను భారత దిగ్గజ సంస్థ ‘టాటా’ గ్రూప్ పొడిగించుకుంది. ఐదేళ్ల కాలానికి రూ.2500 కోట్ల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ సీజన్ నుంచి 2028 వరకు మళ్లీ టాటా ఐపీఎల్‌గా అలరించనుంది. టాటా సంస్థ గత రెండేళ్లుగా ఐపీఎల్‌తో కొనసాగుతోంది. 2022, 2023 సీజన్లలో టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. తాజా ఒప్పందం విలువ ఐపీఎల్ టైటిల్ హక్కుల చరిత్రలోనే అత్యధిక మొత్తమని బీసీసీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment