2023 -2027 ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ‘వయాకామ్–18’ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా క్రికెట్ లవర్స్‌ను ఉద్దేశిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ నీతా అంబానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో ప్రతీ క్రికెట్ అభిమానికి రిలయన్స్ సంస్థ వరల్డ్ క్లాస్ ఐపీఎల్ కవరేజ్‌ను అందించేందుకు కృషి చేస్తుందని అనున్నారు. ఇందు కోసం పూర్తి శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తామని అన్నారు. అంతేకాదు భారత్‌కు మరింత పేరును తెచ్చే ఈ ఐపీఎల్ లీగ్‌తో మా అనుబంధాన్ని పెంచుకోవడం మరింత గర్వకారణంగా ఉందని నీతా అంబానీ పేర్కొన్నారు.
కాగా, క్రికెట్ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఐపీఎల్ డిజిటల్ రైట్స్ కోసం జరిగిన వేలంలో ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్ మరోసారి చేజిక్కించున్న విషయం తెలిసిందే.
THREE BIG WINS FOR VIACOM18:
— Pankaj Upadhyay (@pankaju17) June 16, 2022
--TRIUMPHS WITH DIGITAL STREAMING RIGHTS FOR INDIAN SUBCONTINENT
--ACQUIRES INDIA STREAMING RIGHTS FOR SPECIAL PACKAGE OF MATCHES
--BAGS GLOBAL TV AND DIGITAL RIGHTS FOR MAJOR CRICKETING NATIONS #Viacom18 #NitaAmbani @flameoftruth @RelianceUpdates pic.twitter.com/7S2EsZBHZ1
Comments
Please login to add a commentAdd a comment