viacom media company
-
పారామౌంట్ గ్లోబల్‌తో రిలయన్స్ డీల్
న్యూఢిల్లీ: పారామౌంట్ గ్లోబల్ సంస్థ భారత్‌లోని టీవీ వ్యాపార విభాగం వయాకామ్ 18లో తమకున్న 13.01 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించనుంది. ఇందుకు సంబంధించి పారామౌంట్ గ్లోబల్‌కి చెందిన రెండు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 4,286 కోట్లుగా ఉంటుందని వివరించింది. రిలయన్స్‌కి చెందిన టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌కి వయాకామ్18 అనుబంధ సంస్థ. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అందులో రిలయన్స్‌కి 57.48 శాతం వాటా ఉంది. పారామౌంట్ గ్లోబల్‌తో ఒప్పందం పూర్తయ్యాక ఇది 70.49 శాతానికి పెరుగుతుంది. తమ కంటెంట్‌కి సంబంధించి వయాకామ్18కి లైసెన్సును ఇకపైనా కొనసాగిస్తామని పారామౌంట్ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు, రిలయన్స్–స్టార్ డిస్నీ జాయింట్ వెంచర్ పూర్తి కావడం తదితర అంశాలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది. మీడియాలో రిలయన్స్ మరింత పటిష్టం.. 2014లో నెట్వర్క్18లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ ఆ తర్వాత నుంచి మీడియా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసుకునేందుకు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదపడనుంది. సదరు జాయింట్ వెంచర్లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోనీ, నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన మీడియా వెంచర్స్ అన్నీ నెట్వర్క్18 కింద ఉన్నాయి. ఇది టీవీ18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు, ఇతరత్రా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ చానల్స్‌ని నిర్వహిస్తోంది. అలాగే, మనీకంట్రోల్డాట్కామ్, బుక్‌మైషో వంటి సంస్థల్లోనూ నెట్ట్ వర్క్18కి వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్‌కి జియోసూ్టడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెండు లిస్టెడ్ కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీల్లో (డెన్, హాథ్‌వే) మెజారిటీ వాటాలు ఉన్నాయి. -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్‌కప్‌లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్‌న్యూస్ -
మా లక్ష్యం అదే, ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌పై నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు!
2023 -2027 ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ‘వయాకామ్–18’ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా క్రికెట్ లవర్స్‌ను ఉద్దేశిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ నీతా అంబానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో ప్రతీ క్రికెట్ అభిమానికి రిలయన్స్ సంస్థ వరల్డ్ క్లాస్ ఐపీఎల్ కవరేజ్‌ను అందించేందుకు కృషి చేస్తుందని అనున్నారు. ఇందు కోసం పూర్తి శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తామని అన్నారు. అంతేకాదు భారత్‌కు మరింత పేరును తెచ్చే ఈ ఐపీఎల్ లీగ్‌తో మా అనుబంధాన్ని పెంచుకోవడం మరింత గర్వకారణంగా ఉందని నీతా అంబానీ పేర్కొన్నారు. కాగా, క్రికెట్ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఐపీఎల్ డిజిటల్ రైట్స్ కోసం జరిగిన వేలంలో ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించున్న విషయం తెలిసిందే. THREE BIG WINS FOR VIACOM18: --TRIUMPHS WITH DIGITAL STREAMING RIGHTS FOR INDIAN SUBCONTINENT --ACQUIRES INDIA STREAMING RIGHTS FOR SPECIAL PACKAGE OF MATCHES --BAGS GLOBAL TV AND DIGITAL RIGHTS FOR MAJOR CRICKETING NATIONS #Viacom18 #NitaAmbani @flameoftruth @RelianceUpdates pic.twitter.com/7S2EsZBHZ1 — Pankaj Upadhyay (@pankaju17) June 16, 2022 -
వయాకామ్ చేతికి ప్రిజమ్ టీవీలో 50% వాటా
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన వయాకామ్ మీడియా సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన నెట్వర్క్ 18 గ్రూప్ సంస్థ ప్రిజమ్ టీవీలో 50 శాతం వాటాను రూ.940 కోట్లకు కొనుగోలు చేసింది. ఈటీవీ మరాఠి, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బంగ్లా, ఈటీవీ ఒరియా తదితర ప్రాంతీయ భాషా చానెళ్లను ప్రిజమ్ టీవీ నిర్వహిస్తోంది. ఇటీవలనే ఈ చానెళ్లన్నంటినీ కలర్స్ చానెళ్లుగా రీబ్రాండ్ చేశారు. ఈ లావాదేవీకి విదేశీ పెట్టుబడులు ప్రోత్సాహాక బోర్డ్ క్లియరెన్స్‌లు పొందామని వయాకామ్ వెల్లడించింది.