
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని, అతడి భార్య స్యూ విడాకులు తీసుకున్నారు. తమ 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొంత కాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు ఎట్టుకేలకు తెరపడింది.
గతేడాది నవంబర్ నుంచి డుమిని, స్యూ విడిపోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో వారి విడాకుల విషయం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఒకొకరు తమ సోషల్ మీడియా ఖాతాలో తొలిగించారు.
అన్నీ ఆలోచించాకే మేము ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా 12 ఏళ్ల వైవాహిక బంధంలో ఎన్నో మరుపురాని క్షణాలను ఆస్వాదించాము. అంతకమించి మా బంధానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు జన్మించడం మా అదృష్టం. మా నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాము.
దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించకండి. మేము ఇద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి, మంచి స్నేహితులగా కొనసాగుతాము. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇట్లు మీ జేపీ అండ్ సూ అని ఇద్దరూ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
జేపీ డుమిని,స్యూ 2011 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఇటీవలే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు.
డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్‌కు చేరింది. ఇక కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. డుమిని తన అంతర్జాతీయ కెరీర్‌లో 9,154 పరుగులు చేశాడు.
చదవండి: ‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’