JP Duminy Named As Head Coach Of Paarl Royals In SA20 League - Sakshi
Sakshi News home page

SA T20 League: పార్ల్ రాయల్స్ హెడ్‌ కోచ్‌గా జేపీ డుమిని

Published Thu, Sep 15 2022 4:38 PM | Last Updated on Thu, Sep 15 2022 5:22 PM

JP Duminy named head coach of Paarl Royals - Sakshi

డుమిని

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా పార్ల్‌ రాయల్స్‌ను ఐపీఎల్‌ ఫ్రాంజైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ జట్టు కోచింగ్‌ స్టాప్‌ సభ్యల పేర్లను పెర్ల్‌ రాయల్స్‌  ప్రకటించింది. పార్ల్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జేపీ డుమిని ఎంపికయ్యాడు.

స్పిన్‌ బౌలింగ్‌, స్ట్రాటజీ కోచ్‌గా ప్రోటిస్‌ మజీ ఆటగాడు రిచర్డ్ దాస్ నెవ్స్.. మార్క్ చార్ల్టన్ (బ్యాటింగ్ కోచ్), ఏటీ రాజమణి ప్రభు( మెంటల్‌ కండిషనింగ్ కోచ్), మాండ్లా మాషింబీ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), లిసా కీట్లీ( టాక్టికల్ కోచ్‌) రస్సెల్ ఆస్పెలింగ్(జట్టు కేటాలిస్ట్‌)గా నియమితులయ్యారు. ఇక 2020 జనవరిలో డుమిని అన్ని రకాల క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు.

ప్రోటిస్‌ తరపున 46 టెస్టులు..199 వన్డేలు, 81 టీ20ల్లో ఆడాడు. డుమిని ప్రస్తుతం బోలాం‍డ్‌ దేశీవాళీ జట్టుకు హెడ్‌ కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా పార్ల్‌ రాయల్స్‌ ఇప్పటికే డేవిడ్‌ మిల్లర్‌, మెకాయ్‌, జోస్‌ బట్లర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో ఒప్పంతం కుదుర్చుకుంది. ఈ సరికొత్త దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది.
చదవండి: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement