
క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) 2025-26 సీజన్ కోసం మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. సోమవారం(ఏప్రిల్ 7)తో 23 మంది ఆటగాళ్లతో కూడిన లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీలకు చోటు దక్కలేదు. క్లాసెన్ సౌతాఫ్రికా వైట్ బాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి.. అతడు ఎక్కువగా ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా క్రికెట్ కూడా అతడితో ఇంకా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కాగా క్లాసెన్ హండ్రెడ్ లీగ్ కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎస్ఎకు అతడు తెలియజేశాడు. అదేవిధంగా ఈ స్టార్ వికెట్ కీపర్ గతేడాదే టెస్టులకు విడ్కోలు పలికాడు.
ఇవన్నీ అతడి కాంట్రాక్ట్ రిటైన్ విషయంలో సౌతాఫ్రికా క్రికెట్ పరిగణలోకి తీసుకుంది. గతంలో క్వింటన్ డికాక్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు.
మరోవైపు అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీ గత కాలంగా రెగ్యూలర్‌గా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌లకు సౌతాఫ్రికా క్రికెట్ ప్రమోషన్ ఇచ్చింది. హైబ్రిడ్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో వీరిద్దరికిచోటు దక్కింది.
దక్షిణాఫ్రికా 2025-26కు సెంట్రల్ కాంట్రాక్టులు లిస్ట్
టెంబా బావుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగీ ఎన్‌గిడి, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్‌సిక్‌బ్యాడ వెర్రేన్నే, లిజాడ్ విలియమ్స్
హైబ్రిడ్ కాంట్రాక్టులు: డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్