
డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా డుమిని
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-8 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జేపీ డుమిని వ్యవహరిస్తాడు. ‘ఢిల్లీ ఫ్రాంచైజీ నాపై ఉంచిన నమ్మకానికి, మద్దతుకు ధన్యవాదాలు. జూనియర్, సీని యర్ మేళవింపుతో ఉన్న జట్టును నడిపించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
ఈ సీజన్‌లో మెరుగ్గా ఆడి విజేతగా నిలిచేం దుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్న డుమిని అన్నాడు. మరోవైపు ఢిల్లీ జట్టును నడిపించేందుకు డుమిని సరైన వ్యక్తి అని చీఫ్ కోచ్ కిర్‌స్టెన్ అభిప్రాయపడ్డారు.