SA VS WI 1st T20: Unwanted Record For Quinton De Kock - Sakshi
Sakshi News home page

SA VS WI 1st T20: చెత్త రికార్డు సమం చేసిన డికాక్‌

Published Sun, Mar 26 2023 1:10 PM | Last Updated on Sun, Mar 26 2023 2:31 PM

SA VS WI 1st T20: Unwanted Record For Quinton De Kock - Sakshi

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా సాతాఫ్రికాతో నిన్న (మార్చి 25) జరిగిన తొలి మ్యాచ్‌లో పర్యాటక వెస్డిండీస్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించడంతో 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. విండీస్‌ మరో 3 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్నోయి లక్ష్యాన్ని ఛేదించింది.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మిల్లర్‌ (22 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. విండీస్‌ను కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ (18 బంతుల్లో 43; ఫోర్‌, 5 సిక్సర్లు) అజేయమై విధ్వంసకర ఇ​న్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్‌,బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన (గోల్డన్‌ డక్‌) డికాక్‌.. సౌతాఫ్రికా తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన ఆటగాడిగా జేపీ డుమినీ, ఆండైల్‌ ఫెలుక్వాయో సరసన చేరాడు. వీరు ముగ్గురు టీ20ల్లో 6 సార్లు డకౌటయ్యారు. 

ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌ జట్టు టెస్ట్‌ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోగా.. వన్డే సిరీస్‌ను 1-1తో (వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దైంది) సమం చేసుకుంది. తొలి టీ20లో విండీస్‌ గెలవడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement