డుమిని ‘సూపర్’ సెంచరీ | JP Duminy super century | Sakshi
Sakshi News home page

డుమిని ‘సూపర్’ సెంచరీ

Published Fri, Jul 18 2014 1:11 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

డుమిని ‘సూపర్’ సెంచరీ - Sakshi

డుమిని ‘సూపర్’ సెంచరీ

దక్షిణాఫ్రికా 455/9 డిక్లేర్డ్  
 శ్రీలంకతో తొలి టెస్టు

 
 గాలె: డుమిని (206 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో శ్రీలంకతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 455 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
 
 ఓవర్‌నైట్ స్కోరు 268/5తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా.. కొద్దిసేపటికే స్టెయిన్ (3), ఆ తరువాత డి కాక్ (51)లు అవుటవడంతో 314 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టెయిలెండర్లతో కలిసి డుమిని వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టెస్టుల్లో తన మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మోర్కెల్ (22) అవుటైన వెంటనే దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పెరీరాకు నాలుగు (4/162), లక్మల్‌కు మూడు (3/75) వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు వికెట్లేమీ కోల్పోకుండా 30 పరుగులు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement