కేప్ టౌన్:ఇటీవల దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జేపీ డుమినీ తాను తీసుకున్న నిర్ణయం సరైనదిగా అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా టెస్టు ఫార్మాట్ వీడ్కోలకు ముందు తరుచు అత్యల్ప వ్యక్తిగత స్కోర్లకే పరిమితమవుతూ వస్తున్న తరుణంలో సఫారీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సరైన చర్యగానే డుమినీ స్పష్టం చేశాడు. ' లార్డ్స్ లో టెస్టు మ్యాచ్ తరువాత మైదానం నుంచి నడుచుకుంటూ వస్తున్న తరుణంలో నా టెస్టు కెరీర్ లో ఏదొకటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా. ముఖ్యంగా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని లార్డ్స్ టెస్టులోనే అనుకున్నా. నా నిర్ణయం సరైనదే. చాలా మంది యువ క్రికెటర్లు తమ హస్తాన్ని సఫారీ జట్టుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టెస్టు ఫార్మాట్ కు గుడ్ చెప్పడంతో పరిమిత ఓవర్ల క్రికెట్ పై సీరియస్ గా దృష్టి సారించడానికి ఆస్కారం ఉంది' అని డుమినీ తెలిపాడు.
గత నెల్లో జేపీ డుమినీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్లలో ఒకరైన డుమినీ ఇక టెస్టు క్రికెట్ లో నిలకడైన ఫామ్ ను కొనసాగించలేక దానికి వీడ్కోలు చెప్పాడు. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి డుమినీ వీడ్కోలు తీసుకున్నాడు. 46 టెస్టు మ్యాచ్ లు ఆడిన డుమినీ..2,103 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్ లో 42 టెస్టు వికెట్లను డుమినీ సాధించారు. గత జూలై నెలలో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో డుమినీ చివరిసారి కనిపించారు.2019 వరల్డ్ కప్ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే క్రమంలో టెస్టు ఫార్మాట్ కు డుమినీ వీడ్కోలు చెప్పడం మరొక కారణం.
Comments
Please login to add a commentAdd a comment