చాలా సందర్భాల్లో సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటాం. ఇందుకు ఏదీ అనర్హం కాదేమో. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ వేసే సమయంలో తనకు కూడా సెంటిమెంట్ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. సాధారణంగా క్రికెట్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి మాత్రమే టాస్ వేయడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. టాస్ కాయిన్‌ను ఎగురవేయడానికి సహచర ఆటగాడు జేపీ డుమినీని నియమించుకున్నాడు.