‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు’ గా ఉంది దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి. ఇప్పటికే గాయంతో తొలి మూడు వన్డేలకు సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ దూరం అయిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆదివారం జరిగే రెండో వన్డే ముందే ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి వన్డేలో అద్భుత సెంచరీతో జట్టుకు అండగా నిలిచిన కెప్టెన్ డుప్లెసిస్ చేతి వేలి గాయంతో పూర్తి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.