
బ్రిస్టల్: మాజీ చాంపియన్ల సమరం జరగనేలేదు. అసలు టాసే వేయలేదు. పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ ఎడతెరిపిలేని వర్షంలో కొట్టుకుపోయింది. ఒక్క బంతి అయిన పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. సమయం గడుస్తున్నకొద్దీ చినుకు ఆగలేదు. దీంతో ఓవర్ల కోతతోనైనా మ్యాచ్‌ను నిర్వహించాలనుకున్న ఫీల్డ్ అంపైర్లు నిగెల్ లాంగ్, ఇయాన్ గౌల్డ్‌లకు నిరీక్షణ తప్పలేదు. కనీసం 20 ఓవర్ల ఆటైనా జరుగదా అనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. వరుణుడు ఎంత మాత్రం కరుణించకపోవడంతో ఇక్కడి కౌంటీ గ్రౌండ్ తడిసిముద్దయింది. ఔట్ ఫీల్డ్ చెరువును తలపించడంతో మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని నిర్ణయించిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పాయింట్ల పట్టిక