న్యూజిలాండ్ మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ బెర్నాడిన్ బెజుడెన్‌హౌట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బెజుడెన్‌హౌట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడంచింది. తను స్థాపించిన ఛారిటబుల్ ది ఎపిక్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించేందుకు బెజుడెన్‌హౌట్ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా దక్షిణాఫ్రికాకు చెందిన బెజుడెన్‌హౌట్.. 2014లో తన సొంతదేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కానీ తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2017లో న్యూజిలాండ్‌కు మాకాం మార్చింది. ఈ క్రమంలో 2018లో కివీస్ తరపున ఆమె డెబ్యూ చూసింది. 30 ఏళ్ల బెజుడెన్‌హౌట్ ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో 20 వన్డేలు, 29 టీ20లు ఆడింది. అందులో నాలుగు వన్డేలు, 7 టీ20ల్లో సౌతాఫ్రికా ఆమె ప్రాతినిథ్యం వహించింది.
"న్యూజిలాండ్‌కు క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాడు. వైట్ ఫెర్స్‌తో నా ప్రయాణం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. చాలా విషయాలను నేర్చుకున్నాను. ఈ రోజు నేను క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఇకపై ది ఎపిక్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాను. ఈ నా అద్బుత ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ ఆమె ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment