న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అమీ సాటర్త్‌వైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సాటర్త్‌వైట్ గురువారం ప్రకటన చేసింది. కాగా తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను న్యూజిలాండ్ క్రికెట్ రద్దు చేయండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాటర్త్‌వైట్ తెలిపింది. "నేను కాంట్రాక్ట్‌ను పొందనందుకు చాలా నిరాశ చెందాను. నేను మరికొంత కాలం న్యూజిలాండ్ క్రికెట్‌లో కొనసాగాలని భావించాను.
అయితే న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. రాబోయే రోజుల్లో జట్టు మరింత రాణించాలని కోరుకుంటున్నాను. న్యూజిలాండ్ జట్టుకు ఇన్నాళ్లు ప్రాతినిద్యం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై నా కుటంబంతో గడపాలని నిర్ణయించకున్నాను" అని సాటర్త్‌వైట్ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక 2007 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సాటర్త్‌వైట్ న్యూజిలాండ్ మహిళా క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకుంది.
2018 నుంచి 2109 వరకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా సాటర్త్‌వైట్ పనిచేసింది. ఇక న్యూజిలాండ్ తరపున 145 వన్డేలు ,111 టీ20 మ్యాచ్‌లు ఆడిన సాటర్త్‌వైట్ .. వరుసగా 4639, 1784 పరుగులు సాధించింది. అదే విధంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 76 వికెట్లు పడగొట్టింది. కాగా 2007లో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 6 వికెట్లు పడగొట్టి సాటర్త్‌వైట్ సంచలనం సృష్టించింది.
చదవండి: IPL 2022: కార్తీక్ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్.. గంభీర్ రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్..!
Comments
Please login to add a commentAdd a comment