హ్యూస్ 'జెర్సీ నెంబర్ 64' రిటైర్
మెల్బోర్న్: ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ గౌరవార్థం అతని అంతర్జాతీయ వన్డే జెర్సీని రిటైర్ చేశారు. హ్యూస్ జెర్సీ నెంబర్ 64ను ఇకమీదట ఎవరికీ కేటాయించరు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ చెప్పాడు. హ్యూస్ జెర్సీని రిటర్ చేయాలని ప్రతిపాదించగా, క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించిందని క్లాక్ వెల్లడించాడు. హ్యూస్ లేని లోటు తీర్చలేనిదని, డ్రెస్సింగ్ రూమ్ మునుపటిలా ఉండదని క్లార్క్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశవాళీ మ్యాచ్లో తలకు బౌన్సర్ తగిలి హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే.