పెద్దల సభలో 68 మంది రిటైర్మెంట్‌! | Manmohan Singh To Jaya Bachchan: 68 Rajya Sabha Members To Retire In 2024 | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌ టు జయా బచ్చన్‌.. ఈ ఏడాది 68 మంది రాజ్యసభ సభ్యుల రిటైర్మెంట్‌!

Published Thu, Jan 4 2024 9:07 PM | Last Updated on Thu, Jan 4 2024 9:28 PM

Manmohan Singh To Jaya Bachchan: 68 Rajya Sabha Members To Retire In 2024 - Sakshi

న్యూఢిల్లీ: తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. పార్లమెంట్‌లో ఎగువసభ/ పెద్దలసభగా పిలుచుకునే రాజ్యసభలో ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్నవాళ్లలో..  మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, జయా బచ్చన్‌ కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న ఈ 68 స్థానాల్లో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిషికేషన్‌ జారీ అయ్యింది.

ఆప్‌ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్‌ సింగ్‌, నారాయణ్‌ దాస్‌ గుప్తా, సుశీల్‌కుమార్‌ గుప్తాలు జనవరి 27న తమ పదవీకాలం పూర్తవనుంది. ఇక సిక్కింలోని  ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది. ఎస్‌డీఎఫ్‌ నేత హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తవుతుంది.

►తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని భావిస్తోంది.

► ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌, వైఎస్సార్‌సీపీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు.

►ఇక ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్‌ 6, మధ్యప్రదేశ్‌ 5, పశ్చిమ బెంగాల్‌ 5,  కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3,  ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్‌ 2,  ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్‌గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు.

పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేపీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవీయా,యు మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరన్‌భాయ్ రత్వా ఉన్నారు.

►గుజరాత్‌కు చెందిన అమీ యాగ్నిక్. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్, శివసేన (ఉద్దవ్‌) సభ్యుడు అనిల్ దేశాయ్ మహారాష్ట్ర నుంచి పదవీ కాలం పూర్తి కానుంది.

►మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ కైలాష్ సోనీ, కాంగ్రెస్ సభ్యుడు రాజమణి పటేల్ ఎగువసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. 

►కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్‌కు చెందిన ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పెద్దల సభ నుంచి వైదోలగనున్నారు.

►పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు అబిర్‌ రంజన్‌ బిస్వాస్‌, సుభాసిష్‌ చక్రవర్తి, మహమ్మద్‌ నడిముల్‌ హక్‌, శాంతాను సేన్‌, కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ పదవీ విరమణ చేయున్నారు.

►బీహార్‌లో ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ నుంచి అనిల్‌ ప్రసాద్ హెద్డే, బశిష్ట నారాయణ్ సింగ్, బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీ, కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది.

►ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నుంచి అనిల్‌ అగర్వాల్‌, అశోక్‌ బాజ్‌పాయ్‌, అనిల్‌ జైన్‌, కాంత కర్దమ్‌, సకల్‌దీప్‌ రాజ్‌భర్‌, జీవీఎల్‌ నరసింహారావు, విజయ్‌ పాల్‌ సింగ్‌ తోమర్‌, సుధాంషు త్రివేది, హరనాథ్‌ సింగ్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయ బచ్చన్‌ పదవీ విరమణ చేస్తున్నారు.

►చత్తీస్‌గఢ్‌, హర్యానా నుంచి బీజేపీ తరపున సరోజ్ పాండే, డీపీ వాట్స్  పదవీ విరమణ చేయనున్నారు.

►జార్ఖండ్‌లో బీజేపీ నుంచి సమీర్ ఒరాన్, కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పదవీ విరమణ చేయనున్నారు.

►కేరళలో సీపీఎం పార్టీ నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, కేసీఎం సభ్యుడు జోస్ కె మణి జూలైలో పదవీ విరమణ పొందుతున్నారు.

►నామినేటెడ్ సభ్యుల్లో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement