Santosh Kumar
-
బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదైంది. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్‌నం.14లో భూకబ్జా చేశారంటూ కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ డ్యాకుమెంట్లతో భూ కబ్జాకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. నవయుగ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌తో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేయగా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈనెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బి రెడ్‌విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు: సంతోష్ తనపై చేసిన భూకబ్జా ఆరోపణలు అవాస్తవమని జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం 2016లో పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను. ఫోర్జరీ అనే మాటకు తావులేదు. అది వాస్తవం కాదు. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి’’ అని సంతోష్ వివరణ ఇచ్చారు. ‘‘ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా నాకు అమ్మిన వ్యక్తి, నా ఆధీనంలోనే ఉంది. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలి వివరణ అడగాలి. కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు’’ అని సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా? -
కేసీఆర్ తోడల్లుడిపై కేసు నమోదు
కరీంనగర్‌క్రైం: మాజీ సీఎం కేసీఆర్ తోడల్లుడు, రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అనుచరుడు కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన కూస రవీందర్ భూదందాలకు పాల్పడుతున్నాడని ఓ యూట్యూబ్ చానల్లో వార్త ప్రసారం చేశారు. మిడ్‌మానేరు భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లలో భూకబ్జాకు పాల్పడ్డాడని, అక్రమ పట్టా ఇవ్వమని సిరిసిల్ల ఆర్డీవోను బెదిరింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. దీని వెనుక కేసీఆర్ తోడల్లుడు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్ ఉన్నారని కూస రవీందర్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్, యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.ల -
కర్ర సాయంతో కేసీఆర్ నడక
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు చేతి కర్ర సాయంతో నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారు తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాలు తొంటి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఇటీవలే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ చేరుకున్నారు. చదవండి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన -
పెద్దల సభలో 68 మంది రిటైర్మెంట్!
న్యూఢిల్లీ: తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. పార్లమెంట్లో ఎగువసభ/ పెద్దలసభగా పిలుచుకునే రాజ్యసభలో ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్నవాళ్లలో.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జయా బచ్చన్ కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న ఈ 68 స్థానాల్లో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిషికేషన్ జారీ అయ్యింది. ఆప్ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్‌కుమార్ గుప్తాలు జనవరి 27న తమ పదవీకాలం పూర్తవనుంది. ఇక సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది. ఎస్డీఎఫ్ నేత హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తవుతుంది. ►తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, వైఎస్సార్సీపీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. ►ఇక ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్ 6, మధ్యప్రదేశ్ 5, పశ్చిమ బెంగాల్ 5, కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3, ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్ 2, ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్‌గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేపీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవీయా,యు మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరన్భాయ్ రత్వా ఉన్నారు. ►గుజరాత్‌కు చెందిన అమీ యాగ్నిక్. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్, శివసేన (ఉద్దవ్) సభ్యుడు అనిల్ దేశాయ్ మహారాష్ట్ర నుంచి పదవీ కాలం పూర్తి కానుంది. ►మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ కైలాష్ సోనీ, కాంగ్రెస్ సభ్యుడు రాజమణి పటేల్ ఎగువసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ►కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్‌కు చెందిన ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పెద్దల సభ నుంచి వైదోలగనున్నారు. ►పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అబిర్ రంజన్ బిస్వాస్, సుభాసిష్ చక్రవర్తి, మహమ్మద్ నడిముల్ హక్, శాంతాను సేన్, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ పదవీ విరమణ చేయున్నారు. ►బీహార్‌లో ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ నుంచి అనిల్ ప్రసాద్ హెద్డే, బశిష్ట నారాయణ్ సింగ్, బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీ, కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది. ►ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నుంచి అనిల్ అగర్వాల్, అశోక్ బాజ్‌పాయ్, అనిల్ జైన్, కాంత కర్దమ్, సకల్దీప్ రాజ్‌భర్, జీవీఎల్ నరసింహారావు, విజయ్ పాల్ సింగ్ తోమర్, సుధాంషు త్రివేది, హరనాథ్ సింగ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయ బచ్చన్ పదవీ విరమణ చేస్తున్నారు. ►చత్తీస్‌గఢ్, హర్యానా నుంచి బీజేపీ తరపున సరోజ్ పాండే, డీపీ వాట్స్ పదవీ విరమణ చేయనున్నారు. ►జార్ఖండ్‌లో బీజేపీ నుంచి సమీర్ ఒరాన్, కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పదవీ విరమణ చేయనున్నారు. ►కేరళలో సీపీఎం పార్టీ నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, కేసీఎం సభ్యుడు జోస్ కె మణి జూలైలో పదవీ విరమణ పొందుతున్నారు. ►నామినేటెడ్ సభ్యుల్లో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్‌కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్‌కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్‌ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
కరీంనగర్: బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తుండంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి సెగలు రాజేస్తున్నారు. అధికార పార్టీని వీడి ఇతర పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గులాబీ పార్టీకి రాజీనామా ప్రకటించారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ వైఖరి వల్లే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. కరీంనగర్ నుంచి బరిలో ఉంటానని మీడియా సమావేశంలో ప్రకటించేందుకు సంతోష్ కుమార్ సిద్ధమయ్యారు. అయితే ఏదైనా ప్రధాన పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని లేదా ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగేందుకు సిద్ధమని తెలిపారు. చదవండి:అవినీతిలో ఆస్కార్ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌కు ఎదురుదెబ్బ ఖాయం.. -
చనిపోయి.. ఐదుగురి జీవితాలకు ‘సంతోష’మిచ్చాడు!
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొండా వెంకట సంతోష్ కుమార్ (32) బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవయవాలను దానం చేయడానికి గాను సంతోష్ భౌతికకాయాన్ని విమ్స్‌కు తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శరీరంలో బాగా పనిచేస్తోన్న అవయవాలను తొలగించి జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. విశాఖ సీపీ సహకారంతో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించారు. సంతోష్ భౌతికకాయానికి గురువారం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్‌కు జరిగిన మాదిరిగా ఘన వీడ్కోలు పలికారు. సిబ్బంది రెండు వరసలుగా ఏర్పడి పూలుజల్లుతూ అమర్‌రహే సంతోష్ అంటూ నినాదాలు చేశారు. సంతోష్ తండ్రి శంకర్‌కు రాంబాబు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విమ్స్ అంబులెన్స్‌లో ఆరిలోవలోని నివాసానికి పార్థివదేహాన్ని తరలించగా...కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..సంతోష్ శరీరం నుంచి 2 కారి్నయాలు, కిడ్నీలు, లివర్ తీశామన్నారు. హెల్త్‌సిటీలో అపోలోకు ఓ కిడ్నీ, షీలానగర్‌లో కిమ్స్ ఆస్పత్రికి మరో కిడ్నీ, హెల్త్‌సిటీలో పినాకిల్ ఆస్పత్రికి లివర్, హనుమంతవాక వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి కార్నియాలను జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం తరలించినట్లు తెలిపారు. -
కొండగట్టు ఆలయ అభివృద్ధిలో ‘గ్రీన్ ఇండియా’
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దేశంలోనే ప్రముఖ దేవాలయంగా పునర్ నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని దత్తత తీసుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17న కేïసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున గురువారం తన నిర్ణయాన్ని ఎంపీ ప్రకటించారు. స్వరాష్ట్రం సిద్ధించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఆయన తపనను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కొడిమ్యాల అభివృద్ధి ఇలా... కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్ట్మెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా రూ.కోటి వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని సంతోష్ ప్రకటించారు. దశలవారీగా మిగతా నిధులు కూడా అందించి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఔషధ, సుగంధ మొక్కలు నాటు తామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్దఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
కిలిమంజారోను అధిరోహించే వెన్నెలకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారంపేట గ్రామ గిరిజన విద్యార్థిని బానోతు వెన్నెల ఈనెల 19 నుంచి కిలిమంజారో (5,895 మీటర్ల) పర్వతాన్ని అధిరోహించనుంది. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వెన్నెలకు సంతోష్ రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి ఆశీర్వదించారు. భవిష్యత్‌లో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని, తెలంగాణ, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని వెన్నెల తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. -
మంత్రి తలసాని నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న ప్రముఖులు (ఫొటోలు)
-
ఎంపీ సంతోష్‌పై ‘ఇండియా ఫోర్బ్స్’ కథనం
సాక్షి, హైదరాబాద్: తాను మొక్కలు నాటడంతోపాటు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ద్వారా లక్షలాది మందిని హరిత ఉద్యమంలో భాగస్వాములను చేసిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ‘ఇండియా ఫోర్బ్స్’తాజా సంచికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో ‘పచ్చదనంతోనే పరిపూర్ణత’నినాదంతో 2018 జూలై 17న సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతోపాటు సామాన్యులను కూడా మొక్కలు నాటడంలో భాగస్వాములను చేశారు. మొక్కల ఔషధ గుణాలను తెలుపుతూ వృక్షవేదం అనే పుస్తకాన్ని ప్రచురించడంతోపాటు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 2021 ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’పేరిట ఒకే రోజు కోటి మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో సంతోష్ కృషిపై ఇండియా ఫోర్బ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. -
రవీంద్రభారతిలో ఘనంగా ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
ఎంపీ సంతోష్‌కు ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డ్’
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ అందుకున్నారు. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించు కొని బెంగళూరు డా‘‘బి.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వృక్ష మాత ఆమె చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. సాలుమారద తిమ్మక్క ఇంటర్నేషనల్ ఫౌండేషన్, శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ (కర్ణాటక) సంయుక్తంగా ఇచ్చే ఈ అవార్డుకు ప్రకృతి పరిరక్షణ విభాగంలో 2020 సంవత్సరానికి సంతోష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ.. ఈ నేల భవిష్యత్ తరాలకు అందకుండా పోతుందేమోనని ఆవేద నతో స్పందించే ప్రతీ హృదయానికి, ఈ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రతీ ఒక్క రికి ఈ అవార్డును అంకితం చేస్తున్న. ఇది నా బాధ్యతను మరింత పెంచింది’ అని చెప్పారు. తనతోపాటు అవార్డు అందుకున్న ఇస్రో మాజీ చైర్మన్, పద్మశ్రీ ఎ.ఎస్.కిరణ్ కుమార్, ప్రముఖ నిర్మాత రంగనాథ్ భరద్వాజ్, ప్రముఖ విద్యా వేత్త గురురాజా కరజ్జయిని, సత్యామోర్గానీలకు శుభాకాం క్షలు తెలిపారు. -
సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ నటుడు విజయ్ (ఫొటోలు)
-
Joginapally Santosh Kumar: ఎంపీ కెమెరాలో సింహం బందీ
సాక్షి, హైదరాబాద్: అడవికి రారాజుగా దర్పంతో విశ్రమిస్తున్న సింహాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై ఎంపీ జైరామ్ రమేశ్ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం గుజరాత్‌లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించింది. కమిటీ సభ్యుడిగా జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఈ పర్యటన వివరాలను ట్విట్టర్‌తో పాటు మీడియాతో పంచుకున్నారు. గిర్ సింహాలను దగ్గరిగా చూడటం తనను మంత్రముగ్ధుడిని చేసిందని, రోమాలు నిక్కబొడ్చుకున్నాయని ఆయన తెలిపారు. Could capture few once in a lifetime, photos of this lazy, relaxing #Lion, probably after a scrumptious meal 😊. Countless mesmerising moments, that gave all of us goosebumps in the wild, would definitely last long. Ufff.. this is like a trans and perplexing for me.#Photography pic.twitter.com/edek5EQHLN — Santosh Kumar J (@MPsantoshtrs) May 5, 2022 -
ఎంపీ సంతోష్‌కు ‘వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశ విదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ‘వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్’అవార్డు లభించింది. శనివారం రాజస్థాన్‌లో జరిగిన వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్, ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబాల నుంచి సంతోష్‌కుమార్ తరపున గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవళ్ల రాఘవ, మర్ది కరుణాకర్‌రెడ్డిలు అవార్డును స్వీకరించారు. ‘ఈ అవార్డు నాది మాత్రమే కాదు. నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిదీ’అని సంతోష్ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి ఎరిక్ సోలిమ్ శ్రీకారం చుట్టారు. -
అర్బన్ పార్కులతో ఆహ్లాదం, ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్: నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేవిధంగా అర్బన్ పార్కు లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. దివంగతనటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు పేరిట ఆయన హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అర్బన్‌ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలసి నాగార్జున ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలోని 1,080 ఎకరాల భూమిని దత్తత తీసుకుంటు న్నట్టు ఆయన ప్రకటించారు. నాగార్జున వెంట భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటవీపార్కు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంక ల్పించిన హరితనిధికి రూ.2 కోట్ల చెక్‌ను నాగార్జున అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. బిగ్‌బాస్ ఫైనల్లో ఇచ్చిన మాట ప్రకారం.. గత బిగ్‌బాస్ సీజన్ ఫైనల్ సందర్భంగా అడవి దత్తతపై ప్రకటించినట్లుగానే అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉం దని నాగార్జున అన్నారు. అడవిని దత్తత తీసుకునేం దుకు నాగార్జున ముందుకు రావడాన్ని ఎంపీ సం తోష్ ప్రశంసించారు. అర్బన్ పార్కు అభివృద్ధితో పాటు, అటవీ ప్రాంతంలో దశలవారీగా లక్ష మొక్క లను నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి నట్లు చెప్పారు. నాగార్జున, సంతోష్ వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ) -
మర్రిచెట్టుకు మళ్లీ ప్రాణం
కోనరావుపేట(వేములవాడ): ఎండిన చెట్టుకు ప్రకృతి ప్రకాశ్ జీవం పోస్తే.. చిగురించిన మర్రిచెట్టును తరలించి పునరుజ్జీవం నింపారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 70 ఏళ్ల మర్రిచెట్టు వేళ్లతో సహా పడిపోయింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ చెట్టుకు మూడు నెలలు నీళ్లు పోయడంతో చిగురించింది. మర్రిచెట్టును తరలించేందుకు రూ.50 వేలకు పైగా అవసరం కావడంతో ప్రకాశ్ దాతల సహకారం కోరారు. విషయం తెలుసుకున్న సంతోష్‌కుమార్ చెట్టును తరలించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం రెండు భారీ క్రేన్లను పంపించడంతో చిగురించిన మర్రిచెట్టును సుద్దాల నుంచి తరలించారు. ప్రస్తుతం ఈ మర్రిచెట్టును సిరిసిల్ల కలెక్టరేట్లో నాటే పనులు కొనసాగుతున్నాయి. -
వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకోనున్న నాగ్!
Bigg Boss Telugu 5, Nagarjuna Akkineni: కోట్లాది మొక్కలు నాటించడమే లక్ష్యంగా ఆకుపచ్చని తెలంగాణే ధ్యేయంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎంతో పాటుపడుతున్నారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథమని బిగ్‌బాస్ షో వేదికగా చాటిచెప్పారు. ఆదివారం(డిసెంబర్ 12న) ఆయన బిగ్‌బాస్ షోకు ప్రత్యేక విచ్చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు. ఈ చాలెంజ్ ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తైందన్న ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో నాటమని హోస్ట్ నాగార్జునకు ఒక మొక్కను బహుకరించడం విశేషం. గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటానన్న ఎంపీ సంతోష్‌కుమార్ ఈ చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి అడవులను దత్త తీసుకున్నారని తెలిపారు. హీరో ప్రభాస్ 1650 ఎకరాలు దత్తత తీసుకుని దాన్ని హరితవనంగా మార్చేందుకు సిద్ధపడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు రావడం విశేషం. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా మూడు వారాలు మూడు మొక్కలు నాటి ఈ ఏడాదికి మంచి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చాడు. *King Nagarjuna comes forward to adopt 1000 acres forest:*#greenindiachallenge Reaches Big Boss 5 @MPsantoshtrs @iamnagarjuna @amalaakkineni1 @AkhilAkkineni8 @chay_akkineni @ErikSolheim @StarMaa @DrRanjithReddy @UrsVamsiShekar pic.twitter.com/HU3VqXFeA8 — Raghav s (@raghavtrs) December 12, 2021 -
‘ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది’..ఎంపీ సంతోష్ ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మంగళవారం 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్‌కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త అన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఉప్పల్ భగాయత్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. కాగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని సంతోష్ కుమార్ ఓ అరుదైన చిత్రాన్ని ట్వీట్ చేశారు. కేసీఆర్ సంతోష్ కుమార్‌ను భుజాలపై ఎత్తుకుని ఉన్న పాత ఫోటోను షేర్ చేశారు. ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది.. అని రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా సంతోష్ తల్లిదండ్రులు రవీందర్ రావు, శశికళ.. సంతోష్ తల్లి, సీఎం కేసీఆర్ భార్య శోభా సొంత అక్కా చెల్లెల్లు. పెద్దనాన్న కేసీఆర్‌తో సంతోష్‌కు అనుబంధం ఎక్కువే. అప్పటి నుంచి కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశారు. చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి “ఈ పుట్టుక నాది ..... బ్రతుకంతా మీది ......” pic.twitter.com/LHzUit0jLi — Santosh Kumar J (@MPsantoshtrs) December 7, 2021 -
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో మొక్కలు నాటిన సీజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ ‘గ్రీన్ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన విషయాన్ని సీజే గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు సంతోష్‌ను ప్రశంసించారు. మంగళవారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్య క్రమంలో సీజే, బీఎస్ ప్రసాద్, ఏజీ జె.రామచంద్రరావులతో కలిసి సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు. సీజే సతీశ్‌చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తుల కు ఎంపీ సంతోష్ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ శ్రీసుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్‌గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్‌రావు, జీపీలు జోగినిపల్లి సాయికృష్ణ, సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫండ్ ఏర్పాటు మంచి పరిణామం
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం మంచిపరిణామమని విలక్షణ సినీనటుడు జగపతిబాబు అన్నారు. పచ్చదనం పెంపుదలను ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్‌ఫండ్ కల్పిస్తోందని పేర్కొన్నారు. శనివారం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ‘మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం’ అనే నినాదంతో రూపొందుతున్న ‘సింబా – ద ఫారెస్ట్ మ్యాన్’సినిమా షూటింగ్లో జగపతిబాబు పాల్గొన్నారు. అడవులు, పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు అటవీఅధికారి పాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జగపతిబాబు ఇక్కడ మొక్కలు నాటారు. ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ పీవీ రాజారావు, దర్శకుడు సంపత్ నంది, హీరోయిన్ దివి వధ్వకూడా మొక్కలు నాటారు. కాగా, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌కు మహాబిలం మొక్కను శ్రీనివాస్ బహూకరించారు. -
‘గ్రీన్’ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్
సాక్షి, హైదరాబాద్: ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సహనటుడు, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి విమానాశ్రయంలో ఆయన మొక్కలు నాటారు. జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్ అభినందించారు. ‘మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి. అప్పుడే భవిష్యత్ తరాలు జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లమవుతాం. మొక్కలు నాటడాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి’అని పిలుపునిచ్చారు. -
వారి ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది: ఎంపీ సంతోష్
సాక్షి, మెదక్: హరితహారానికి మేముసైతం అంటున్నారు రేపటి పౌరులు. నాటిన మొక్కలు ఎండిపోకుండా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోటాకింద బస్తీ పిల్లలు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపరుస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు పడకపోవడంతో హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్‌కు డబ్బాకట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకూ నీళ్లు పోస్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ డబ్బాను తయారుచేసి, దానికి పైపును బిగించి తమ సైకిల్‌కు కట్టారు. సమీపంలో ఉన్న కాలువ నుంచి నీటిని డబ్బాలోకి తోడి, సైకిల్ ద్వారా తరలించి మొక్కలకు నీరందిస్తున్నారు. తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఈ మొక్కలు పెరిగి చెట్లయితే తమకు ప్రాణవాయువుతో పాటు నీడనూ ఇస్తాయని వారు చెబుతున్నారు. వెల్దుర్తికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ తమ స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఎంపీ సంతోష్ అభినందనలు.. వెల్దుర్తి పిల్లల పర్యావరణ చైతన్యాన్ని గురించి తెలుసుకున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన పని చేస్తున్నారంటూ పిల్లలను అభినందిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మొక్కలకు నీరు అందించాలన్న వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. Gives me immense pleasure to see these little hearts from Veldurthi(V) of Medak, taking care of the saplings. Look at their enthusiasm and love for the plants. It is very much required for today’s generation for their better future with sustainable environment. LoveYou boys. 👌😊 pic.twitter.com/xEwshTvVjK — Santosh Kumar J (@MPsantoshtrs) August 5, 2021 -
మరో మైలురాయి సాధించిన ‘గ్రీన్ ఇండియా’
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్‌బీతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్, హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను అమితాబ్ అభినందించారు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని అమితాబ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. -
జోగినిపల్లి సంతోష్ కుమార్ తో స్ట్రెయిట్ టాక్
-
ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: శనివారం మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్టు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమతమ ప్రాంతాల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. కేటీఆర్‌కు ఈ మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాట డం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా కీలకమని సంతోష్ పేర్కొన్నారు. ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలునాటేలా కార్యాచరణ... రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలోని సర్పంచులు 2.5 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు. 142 మున్సిపాలిటీలలో చైర్మన్లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటేవారు తాము నాటిన మొక్కతో ఫొటో దిగి 9000365000 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయతీ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించినట్టు తెలియజేశారు. -
సీఎం కావాలన్నదే ‘ఎంపీ సంతోష్’ కోరిక.. 5 వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు?
సాక్షి, కరీంనగర్: మిడ్‌మానేరు ముంపు గ్రామమైన కొదురుపాకలో బీపీఎల్ కోటా కింద పరిహారం పొందిన ఎంపీ సంతోష్ నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడని.. అధికారంపై ఆ కాంక్షతో కుటుంబ సభ్యులను సైతం విడదీసి ప్రగతి భవన్లో పెత్తనం సాగిస్తున్న సంతోష్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టాడని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మ న్ గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతుంటే, ప్రశ్నించిన వారిని బెదిరింపులు భయబ్రాంతులకు గురిచేస్తూ, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పోలీసులతో కేసులు నమోదు చే యిస్తున్నాడని పేర్కొన్నారు. నాడు చెప్పులు లేకుండా ఉన్న ఆయన నేడు ఐదారు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడని ప్రశ్నించారు. కొదురుపాకలో తన కుటుంబం చేస్తున్న అక్రమ ఇసుక దందాతో నష్టపోతున్న అమాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు హేయమని అన్నారు. నాడు కుటుంబం గడిచేందుకే కష్టపడిన సంతోష్ తండ్రి రవీందర్రావు.. నేడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్ర శ్నించారు. తాను చేస్తున్న అక్రమ దందాకు సహకరించడం లేదంటూ 30 మంది పై అట్రాసిటీ కేసులు, ఇతరత్రా కేసులు బనాయించారని మండిపడ్డారు. గ్రీన్ ఛాలెంజ్ పేర మొక్కలు నాటుతున్న సంతోష్ జిల్లాల్లో పర్యటిస్తూ తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడని ఆరోపించారు. నిన్నామొన్నటిదాకా హరీశ్, కేటీఆర్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉండగా, తాజాగా అన్నదమ్ముల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోందన్నారు. ప్రగతి భవన్‌కు రావాలంటే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా సంతోష్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా శాసిస్తున్న ఆయన.. రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారయ్యాడని అన్నారు. కొ దురుపాకలో భూ నిర్వాసితుల కోటాలో తాను, తన తండ్రి వ్యవసాయ కూలీ కింద రూ.2 లక్షల చొప్పున లబ్ధి పొందటంతో పాటు, తన బాబాయ్ గండ్ర ర మణారావు, కూతురు సౌమ్యలకు కూడా రూ.53 వే ల చొప్పున లబ్ధి చేకూర్చాడని విమర్శించారు. ఆ గ్రామంలో 4,231 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం ఆయన సూచించిన 100 మందికి మాత్రమే వచ్చిందన్నారు. కొదురుపాక నుంచి నిత్య ం 150 ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా, ఒక్కో ట్రా క్టర్‌కు నెలకు రూ.13,500 చొప్పున మామూళ్లు వ సూలు చేస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. -
ఎంపీ సంతోష్‌కుమార్‌పై మోదీ ప్రశంసలు
-
సీఎం కేసీఆర్ కుటుంబంలో కరోనా కల్లోలం
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ తెలంగాణలో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులకు కరోనా వ్యాపిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకంతా కరోనా వ్యాపించింది. కల్వకుంట్ల కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాజిటివ్ తేలగా అనంతరం ఆయన వెన్నంటే ఉండే రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్‌కు కరోనా సోకింది. తాజాగా సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ తేలింది. ఈ విధంగా కల్వకుంట్ల కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొనగా అక్కడ ఆయనకు కరోనా సోకిందని తెలుస్తోంది. కరోనా సోకిన వెంటనే సీఎం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ సమయంలోనూ కేసీఆర్ వెన్నంటే ఎంపీ సంతోశ్ కుమార్ ఉన్నారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలకు రాగా అప్పుడు కూడా సంతోశ్ ఉన్నారు. దీంతో ఆయన పరీక్షలు చేయించుకోగా అతడికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్‌కు పాజిటివ్ తేలింది. సీఎం కేసీఆర్ వెంట ఉండడంతో కేటీఆర్‌కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఈ విధంగా కల్వకుంట్ల కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. చదవండి: ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు -
జీహెచ్ఎంసీ పాలనపై గోరటి పాట వైరల్
హైదరాబాద్: ప్రజా కవి, వాగ్గేయకారుడిగా ఉన్న గోరటి వెంకన్నను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలిచి మరి ఎమ్మెల్సీగా నియమించారు. శాసన మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అంతగా కనిపించని ఆయన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో మెరిశారు. ప్రమాణస్వీకారం చేయడానికి టీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కలిసి బస్సులో వెళ్తున్నారు. ఆ బస్సులో వారితో పాటు ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆసువుగా పాట ఎత్తుకున్నారు. ‘రాములోరి సీతమ్మో సీతమ్మో’ అంటూ అప్పటికప్పుడే పాట అందుకున్నారు. పక్కన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ వెంకన్నను ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొడుతుండగా పాట పాడారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగిన మార్పులను వివరిస్తూ వెంకన్న పాట పాడారు. వ్యవసాయం బాగా జరిగిందని.. అద్దాలుగా రోడ్లు ఉన్నాయని.. గులాబీ రేకుల తీరుగా నగరమెల్ల వెలుగులే అంటూ అభివర్ణిస్తూ పాట అందుకున్నారు. పచ్చనైన పార్కులు ఉద్యానవనాలు.. అంటూ పాట పాడారు. దీనికి బస్సులో ఉన్న ఎమ్మెల్సీ నారదాసు, కార్పొరేటర్లు కోరస్ పాడుతూ ఉత్సాహంగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ ట్విటర్లో పంచుకున్నారు. ‘సీఎం కేసీఆర్ గొప్పతనం.. పరిపాలన దక్షతను వివరిస్తూ అప్పటికప్పుడు గోరేటి వెంకన్న గారు పాట పాడారు’ అని ట్వీట్ చేశారు. -
కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలును బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ స్వీకరించారు. షాద్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సంతోష్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ మట్టిమనుషులని, మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉందని కొనియాడారు. తనకు ఇష్టమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ఐదారేండ్లలోనే రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ మార్చారని అన్నారు. (ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మరికొంత మందికి ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు విసిరారు. ఈ జాబితాలో కన్నడ నటుబు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష ఉన్నారు. తన అభిమానులకు కూడా మొక్కలు నాటి, పది మందితో మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా హరితహారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలువురు ప్రముఖులు సైతం మొక్కలు నాటుతున్నారు. -
అటవీ భూమిని దత్తత తీసుకున్న ప్రభాస్
సాక్షి, హైదరాబాద్/జిన్నారం: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ హీరో ప్రభాస్ అర్బన్ ఫారెస్టును దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో 1,650 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ నిర్ణయం వల్ల ఔటర్ రింగ్‌రోడ్డు వెంట దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకోటూరిజం సెంటర్ అందుబాటులోకి రానుంది. సోమవారం సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్బన్ పార్క్ మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ స్ఫూర్తితోనే: ప్రభాస్ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తి, ప్రేరణతో పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఈ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పారు. ముందస్తుగా రూ.2 కోట్ల విలువైన చెక్కును ప్రభుత్వానికి ఆయన అందజేశారు. దశల వారీగా అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తానని వెల్లడించారు. తన తండ్రి వెంకట సూర్యనారాయణ రాజు పేరు మీదుగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మాట నిలబెట్టుకున్న ఎంపీ సంతోష్‌కుమార్.. గతేడాది మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద కీసర అడవిని ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టు 31న కీసరలో అటవీ పునరుజ్జీవన చర్యలు, ఎకో టూరిజం పార్కు అభివృద్ధికి మొక్కలు నాటి శంకుస్థాపన చేశారు. ఆ రోజు జరిగిన సభలో మాట్లాడిన సంతోష్‌కుమార్ తన స్నేహితులు, సన్నిహితులను కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు ఏడాదిలోనే దీనిని కార్యరూపంలోకి తెచ్చారు. కాగా, ఈ ఏడాది జూన్ 11న నాలుగో విడత గ్రీన్ చాలెంజ్‌ను ప్రారంభించి మొక్క నాటిన హీరో ప్రభాస్, ఎంపీ సంతోష్ సూచన మేరకు రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు అటవీ శాఖతో సంప్రదింపులు జరిపిన మీదట ఖాజీపల్లి అటవీ ప్రాంతం ఖరారు చేశారు. -
ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్
సాక్షి, సంగారెడ్డి: గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలోని ఖాజీపేట అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి యంగ్ రెబల్ స్టార్ సోమవారం పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను తన తండ్రి దివంగత యూవీఎస్‌రాజు పేరు మీద ప్రభాస్ దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలను అందించడమే కాకుండా, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (నిర్మాతలను నామినేట్ చేసిన శర్వానంద్) కాగా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. ఇక ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మార్చనున్నారు. (ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్) -
పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపీ సంతోష్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. లోక్‌సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు ఎంపీలు, మొత్తంగా 22 మంది కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాధాన్యతా ఓటు ఆధారంగా రెండు సభలకు చెందిన ఎంపీలు ఈ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. కమిటీకి చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయటం, వాటి ఖాతాలను పరిశీలించటంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ కేంద్రానికి నివేదికలు అందజేస్తుంది. పార్లమెంటరీ కమిటీకి తాను ఎంపిక కావటంపై సంతోష్‌కుమార్ సంతృప్తి వ్యక్తంచేశారు. -
కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్‌తో విషెస్
సాక్షి, హైదరాబాద్: నూతన వధూవరులను వీడియో కాలింగ్ ద్వారా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశీర్వదించారు. తన వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ శుక్రవారం ఉమారాణిని పెళ్లి చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఈ పెళ్లికి సంతోష్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన తన ప్రయాణాన్ని విరమించుకుని, తన అంగరక్షకుడికి ఫోన్ ద్వారా శుభాశీస్సులు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని, వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని అనుకున్నప్పటికీ కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు మనసులో బాధ ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలను పాటించినట్టు చెప్పారు. ప్రముఖులు, ప్రజలు అందరు కూడా జనసమూహానికి దూరంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సంతోష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. (ఎయిర్పోర్ట్ నుంచి అలా బయటకు వచ్చాం..) -
కృష్ణ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ సంతోష్‌కుమార్ విసిరిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను స్వీకరించిన సినీ నటుడు కృష్ణ మంగళవారం మొక్కలు నాటారు. తమిళ నటుడు రజనీకాంత్, తెలుగు నటులు వెంకటేశ్, పవన్ కళ్యాణ్‌కు సవాలు విసిరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించిన సంతోష్‌కుమార్‌ను అభినందించిన కృష్ణ, త్వరలోనే ఇది 10 కోట్ల మొక్కలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు నటుడు కాదంబరి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
‘చెప్పుకోలేని బాధకు’..చలించిపోయారు..
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి.. టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. వాళ్లది చెప్పుకోలేని బాధ... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్‌లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్‌లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు. Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A — Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019 -
కేటీఆర్ బర్త్‌డే.. వారికి చాలెంజ్ విసిరిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా సోషల్ మీడియాలో ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. ఈ చాలెంజ్ సినీ ఇండస్ట్రీ వరకు వెళ్లింది. ఎంపీ సంతోష్ ఈ చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ చాలెంజ్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. దీనికి స్పందిస్తూ.. ‘ఈ చాలెంజ్‌ను విసిరినందుకు ధన్యవాదాలు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అవసరం’ అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్ చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అటవీశాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిలో భాగంగా కీసరగుట్ట అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును సొంత నిధులతో తీర్చిదిద్దుతాం అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. #GiftASmileChallenge Thank You @MPsantoshtrs Anna for this challenge... Glad to be a part of this amazing initiative that will gift many smiles for sure.. much needed.. :) #HappyBirthdayKTR @KTRTRS https://t.co/mheNpVwLc0 — Vamshi Paidipally (@directorvamshi) July 23, 2019 -
పార్టీని మార్చిన ఫోన్‌కాల్
సాక్షి, వేమనపల్లి: మండల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పంతుళ్లుగా చలామణిలో ఉన్న జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ కోళివేణుమాధవ్‌లు కలిసి పనిచేయాలని అధిష్టానం మరోసారి తేల్చి చెప్పింది. తెల్లవారితే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉన్న జెడ్పీటీసీ వర్గం ఒక్కఫోన్‌కాల్‌తో టీఆర్ఎస్ వైపు మారింది. దీంతో ఇద్దరు పంతుళ్లు ఒకే ఒరలో రెండు కత్తులయ్యారని కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో ఐదేండ్లు ఇద్దరు పంతుళ్లు మండలాన్ని పంచుకునుడేనని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ 2016లో టీఆర్ఎస్లో చేరారు. దుర్గం చిన్నయ్య నుంచి సరైన ఆదరణ లేక రెబెల్‌గానే ఉండిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు మద్దతుగా పనిచేశారు. ఆయన ఓటమి పాలు కావటంతో అడ్రస్ లేని బీఎస్పీలో ఉండలేక కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఒక్క ఫోన్‌కాల్‌తో.. తెల్లవారితే కాంగ్రెస్‌లో చేరాల్సిన జెడ్పీటీసీ అనుచర గణం ఎంపీ అభ్యర్థి నేత ఫోన్‌కాల్‌తో రద్దయ్యింది. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావ్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఇందుకోసం నీల్వాయిలో సమావేశ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. సంతోష్ మీరు కాంగ్రెస్‌కు వెళ్లొద్దు.. టీఆర్ఎస్లోనే పని చేయాలని.. ఏఎంసీ వైస్ చైర్మన్ వేణును మిమ్మల్ని సమానంగా చూస్తాం అని ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో పురాలోచనలో పడ్డ జెడ్పీటీసీ కాంగ్రెస్ వెళ్లే ఆలోచన పక్కన పెట్టి ఒక రోజు ముందే టీఆర్ఎస్లోకి పయనమయ్యారు. దీంతో కార్యకర్తలు, అనుచరులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆదివారం కన్నెపల్లి మండలం జన్కాపూర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వ ర్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దుర్గం చిన్నయ్యల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
బెంగళూరులోనే రూ.100 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: సూడో డాక్టర్ సంతోష్ కుమార్ రాయ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు న్నాయి. ఎలాంటి ఎంట్రన్స్‌లు అవసరం లేకుండా వివిధ రకాలైన కోటాల్లో మెడిసిన్ పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఇతడిని బెంగళూరు అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. కేవలం బెంగళూరులోనే ఇతడి స్కామ్ రూ.100 కోట్లు ఉంటుందని వెలు గులోకి వచ్చింది. రూ.30 కోట్లకు సంబంధించి 22 మంది ఫిర్యాదు చేయగా మిగిలినవారు మిన్నకుండిపోయారని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన మిగిలిన సభ్యుల్ని పట్టుకోవడానికి పోలీసుల బృందం ఢిల్లీకి వెళ్లడానికి సన్నా హాలు చేస్తోంది. సంతోష్ దాదాపు పదిహేనేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఒక్కొక్కరి నుంచి ఈ ముఠా కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. ఈ గ్యాంగ్ సూడో డాక్టర్ల రూపంలో ఢిల్లీలో ఓ ఆస్పత్రిని సైతం నిర్వహించగా పోలీసులు దీన్ని సీజ్ చేశారు. పటిష్టమైన నెట్వర్క్ ద్వారా... పోలీసులు దాడి చేసినా ముఠా మొత్తం చిక్కకుండా సంతోష్ జాగ్రత్తలు తీసుకున్నాడని అధికారులు చెప్తున్నారు. వెబ్సైట్లు హ్యాక్ చేయడం, అవసరమైతే నకిలీ వెబ్సైట్లు సృష్టించడం, స్ఫూఫింగ్‌కు పాల్పడటం కోసం బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకున్నారు. బాధితుల నుంచి నగదు సేకరిం చే ఏజెంట్లను ఢిల్లీ నుంచి పంపేవాడు. బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపే అనుచరులు వారణాసి కేంద్రంగా పనిచేస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో సేకరించిన నగదునైనా ఈ గ్యాంగ్ ముంబైకే తరలిస్తుంది. అక్కడ నుంచి హవా లా రూపంలో ఇతర చోట్లకు పంపిస్తుంటుంది. బెంగళూరు పోలీసులు బాధితులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరగా వారు అంగీకరించలేదు. తాము రూ.కోటి వరకు నగదు రూపంలో చెల్లించినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి కొత్త తలనొప్పులు వస్తాయని చెప్పినట్లు తెలిసింది. రిక‘వర్రీ’గా మారిన డబ్బు సంతోష్ అనేకమంది నుంచి కాజేసిన డబ్బు ఏమైందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇతడు ఓ మతపరమైన సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంటాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తాను ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇతర సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చానని, తమకు ఎలాంటి స్థిరచరాస్తులు లేవని పోలీసులకు సంతోష్ చెప్పాడు. ఇందులో నిజానిజాలను సైతం నిర్ధారించాలని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినా కనీసం రూ.కోటి కూడా వాటిలో లేదని పోలీసులు చెప్తున్నారు. సంతోష్ ఈ పంథాలో రెచ్చిపోవడానికి ఢిల్లీకి చెందిన కొందరు బడాబాబుల సహకరించారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అనుమానితుల జాబితా సిద్ధం చేశారు. వీరిలో సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నారని తెలిసింది. -
గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ సంతోష్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్వీకరించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన మూడు మొక్కలను నాటారు. మొక్కలు నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు చేపడతానని ఆయన ట్వీట్ చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, హీరో అక్కినేని నాగార్జునకు గ్రీన్‌చాలెంజ్‌ను విసిరి తన చాలెంజ్ స్వీకరించాలని కోరారు. -
ఆర్థిక బాధలతోనే ఈ పనిచేశా
సాక్షి, హైదరాబాద్: నకిలీ వేలిముద్రలు తయారుచేసిన సంతోష్‌కుమార్‌ను శనివారం కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సంతోష్ డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డులు ఫింగర్ ప్రింట్ల కోసమే వాడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇతడికి ఏ తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని, డబ్బుకోసం మాత్రమే సంతోష్ ఈ నేరానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. 2013 డిసెంబర్ నుంచి వొడాఫోన్ డీలర్‌గా పనిచేస్తున్న సంతోష్ ఐదేళ్లపాటు శ్రమిస్తే తనకు ఏడాదికి రూ.20 వేలే ఆదాయం వచ్చిందన్నాడు. జియో సిమ్ రావడంతో వొడాఫోన్ సిమ్ల కొనుగోలు తగ్గిందని పోలీసులకు వెల్లడించాడు. వొడాఫోన్‌ను మోసం చేయడంలో భాగంగానే నకిలీ సిమ్ కార్డుల యాక్టివేషన్ కోసం ప్లాన్ చేశానని, ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్, ఫింగర్ ప్రింట్ల డౌన్లోడ్ చేస్తున్నట్టు అంగీకరించాడు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన భూ సర్వే నెంబర్లు సేకరించి ఆధార్ కార్డులు డౌన్లోడ్ చేయాలనుకున్నానన్నారు. యంత్రం, రబ్బర్ స్టాంపులు, పాలిమార్ లిక్విడ్, గేట్‌వే పేపర్‌కు రూ.12వేలు మాత్రమే ఖర్చయ్యాయని వెల్లడించాడు. వీటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఈసీ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేయడం మొదలు పెట్టానని, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన రైతుల ఆధార్, ఫింగర్ ప్రింట్లను డౌన్లోడ్ చేశానన్నాడు. ఇలా రోజుకు 200 నుంచి 300 డౌన్లోడ్ చేసేవాడినని సంతోష్ అంగీకరించాడు. గత ఎనిమిదేళ్లలో తాను వివిధ వ్యాపారాలు చేసి కోటిన్నర రూపాయలు నష్టపోయానని పోలీసులకు తెలిపాడు. ఆర్థికంగా నిలబడడం కోసం మాత్రమే ఈ పని చేశానని అంగీకరించాడు. సిమ్ కార్డు యాక్టివేషన్ చేసి, తర్వాత ఆ ఆధార్ కార్డును ఫింగర్ ప్రింట్ పేపర్లను కాల్చేసినట్టు చెప్పారు. అయితే సంతోష్‌ను మరోసారి విచారించేందుకు కస్టడీ కోరామని పోలీసులు వెల్లడించారు. -
ఆ కేసుల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఏటా చోటు చేసుకుంటున్న నేరాల్లో వేలిముద్రల ద్వారా కొలిక్కి వస్తున్న వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ కేసుల్లో నిందితులపై అభియోగాలు మోపడం, నేరం నిరూపించడంలోనూ ఈ వేలిముద్రలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ‘ఆధార్’గోప్యతపై దేశ వ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యవస్థల్లో ఉన్న లోపాలపై మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన ‘వేలికి ‘నకిలీ’ముద్ర!’కథనం తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన పాత సంతోష్ కుమార్ సిమ్‌కార్డుల యాక్టివేషన్ కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై మంగళవారం పోలీసులతో పాటు మరికొన్ని విభాగాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. నష్టనివారణ చర్యలతో పాటు విచారణ దశలో ఉన్న కేసుల అంశాన్నీ చర్చించాయి. వివిధ కేసుల పరిశోధన, నేర నిరూపణలో వేలిముద్రల పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒకేలా ఉండవనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే సంతోష్ సృష్టించిన నకిలీ ‘వేలి ముద్రలు’దీన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ప్రభావం కేసుల దర్యాప్తు, విచారణ తీరుపై ఉండే అవకాశం లేకపోలేదని, అనేక కేసులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీడిపోయే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నేర స్థలిలో సేకరించిన వేలిముద్రలు నిందితులవే అని పక్కాగా నిర్ధారించడానికి అవసరమైన పరిజ్ఞానం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ వ్యక్తి పూర్తి పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర... ఇవి అసాంఘిక శక్తుల చేతికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పడానికి సంతోష్‌దే పెద్ద కేస్ స్టడీగా పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క నకిలీ వేలిముద్రలు తయారు చేయడానికి సంతోష్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన వివరాలనే వినియోగించడంతో ఆ శాఖకు ఓ లేఖ రాయాలని పోలీసులు భావిస్తున్నారు. డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లోకి అప్లోడ్ చేసే సమయంలో ఆధార్ వివరాలు, వేలిముద్రల కాలమ్స్ కనిపించకుండా చేసేలా సిఫార్సు చేయనున్నారు. మరోపక్క సంతోష్ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీలో ప్రతి 3 నెలలకు ఓసారి జరిగే మల్టీ ఏజెన్సీస్ కమిటీ (మ్యాక్) సమావేశం మరో వారంలో జరుగనున్నట్లు తెలిసింది. ఇందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. ఇందులో ఈ కేసును ఓ స్టడీగా చూపించి దేశ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి లోపాలు గుర్తించడంతో పాటు వాటిని సరిచేయడానికి మార్గాలు అన్వే షించాల్సిందిగా అన్ని విభాగాలను కేంద్రం కోరనున్నట్లు సమాచారం. సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా? ధర్మారం (పెద్దపల్లి): నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. అక్రమ సంపాదన కోసం ఆధార్‌కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్‌కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా అని ధర్మారం వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సిమ్‌కార్డుల టార్గెట్ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల నివ్వెరపోతున్నారు. కాగా.. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో సంతోష్ వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటున్నారు. -
టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ ఒకటి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ బరిలోకి దిగారు. ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణ శాసనసభలో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలాల ప్రకారం మూడు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశముంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ తమ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి విప్ జారీ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను చిక్కుల్లో పడేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరోవైపు టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇంకా ప్రకటించలేదు. ఏడుగురు ఎమ్మెల్యేల బలమున్న మజ్లిస్.. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని తెలిపింది. -
ఫేస్‌బుక్కయ్యాడు!
పాతపట్నం: ఫెస్బుక్ అకౌంట్లో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన యువకుడు పుట్టా సంతోష్ కుమార్‌ను సైబర్ నేరం కింద అరెస్టు చేశామని పాతపట్నం సీఐ బీవీవీ ప్రకాష్ తెలిపారు. బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పాతపట్నం దేవాంగులవీదికి చెందిన అంకడాల సతీష్ కుమార్‌తో ఇదే పట్టణానికి చెందిన సింగుపురం సంతోషి అనే అమ్మాయితో పెళ్లి సంబందం కుదిరింది. ఆ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వెర్ కంపెనీలో పనిచేస్తుంది. ఆ అమ్మాయితో అనపర్తికి చెందిన సంతోష్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. అయితే సతీష్ కుమార్‌తో సంబంధం కుదిరిందని తెలుసుకున్న సంతోష్‌కుమార్ 2017 జనవరిలో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు ప్రారంభించి, పాతపట్నంలోని పలువురుకు తనఫొటో, సంతోషి ఫొటోలు ఫేస్బుక్లో పెట్టి అందరికీ పోస్టు చేశాడు. దాంతో సతీష్‌కుమార్, సంతోషిల పెళ్లి ఆగిపోయింది. వెంటనే ఆ అమ్మాయి హైదరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సంతోష్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. సైబర్ నేరం కింద జనవరిలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత సంతోష్‌కుమార్ అంకడాల సతీష్ కుమార్ పేరు మీద ఫెస్‌బుక్‌లో అకౌంట్లు ప్రారంభించి అసభ్యకరమైన పోస్టింగులు అందరికీ పెడుతున్నాడు. దానిపై సతీష్ కుమార్ పాతపట్నం పోలీసు స్టేషన్లో జూన్ నెలలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ.ఎం.హరికృష్ణ పోలీసు బృందంతో కలిసి అనపర్తికి చెందిన సంతోష్ కుమార్‌ను పట్టుకుని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫేస్ బుక్ అకౌంట్ నేరంలో సైబర్ నేరం కింద మొదటి కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఎస్ఐతో పాటు క్రైం పోలీసులు ఎ.మాధవరావు, పి.మాధవరావు, సీహెచ్.హరీష్‌లను సీఐ ప్రకాష్ అభినందించారు. -
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి
మొయినాబాద్: మూల మలుపువద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై చిన్నషాపూర్ గేటు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నయీమొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్(55) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం రమేష్‌కుమార్ అతని బావమరిది కొడుకు సంతోష్‌కుమార్ కలిసి ఓమిని కారులో వికారాబాద్‌కు సరుకులు తేవడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చిన్నషాపూర్ గేటు సమీపంలో మలుపువద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులోఉన్న రమేష్‌కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న సంతోష్‌కుమార్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సంతోష్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. రమేష్‌కుమార్ మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో జేసీబీ, ఇటాచీల సహాయంతో బయటకు తీశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
పెళ్లైన నెల రోజులకే...
మూడుముళ్లు...ఏడడుగులు బంధం...నెల రోజుల్లోనే తెగిపోయాయి. నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన ఆ నవ వధూవరుల్లో వరుడు భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకేదో ప్రాణాంతకమైన వ్యాధి ఉందని అత్తింటి వారు అనుమానించి భార్యను కాపురానికి పంపకపోవడంతో నెల రోజులుగా తిరిగితిరిగి వేసారి చివరకు తనువు చాలించాలని నిర్ణయించాడు. అదీ స్నేహితుని ఇంట్లో...చివరి సారిగా స్నేహితుని ఇంట్లో భోజనం చేసి ఉరి వేసుకొని మృత్యు ఒడిలోకి జారిపోయాడు. దీంతో వరుని ఇంట్లో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్తే... సాలూరు(విజయనగరం) : స్థానిక బంగారమ్మ కాలనీలో నివాసముంటున్న మరిపి సంతోష్‌కుమార్(24) లావుడివీధిలో ఉంటున్న స్నేహితుడు తిరుమరెడ్డి త్రినాధ్ ఇంట్లో మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ పాంగి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు తండ్రి కృష్ణ పోలీసులకు తెలిపిన వివరాలు ప్రకారం సంతోష్‌కుమార్‌కు చినబోగిలి గ్రామానికి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీని వివాహం జరిగింది. తన బిడ్డకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందని అమ్మాయి తరఫు వారు ఆరోపిస్తూ తమ ఇంటికి పంపలేదని తెలిపారు. తన కుమారుడు భార్యని తీసుకువచ్చేందుకు పలుమార్లు వెళ్లినా ఆమెను పంపేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురై తన బిడ్డ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వివరించాడు. ఇదే సంఘటనపై సంతోష్‌కుమార్ స్నేహితుడు త్రినాధ్ మాట్లాడుతూ తమ ఇంట్లో మంగళవారం ఉదయం భోజనం చేశాడని, ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంటనష్టం పరిహారం అందించాలి
పాపన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలు, మంజీర వరదలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ బిజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుభాష్‌చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం పాపన్నపేట తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు బీజేపీ నాయకులు మండల కార్యాలయం ఎదుట అరగంటపాటు బైఠాయించారు. ఈసందర్భంగా సుభాష్‌చంద్రాగౌడ్ మాట్లాడుతూ రైతులు ఓ వైపు నకిలీ విత్తనాలతో నష్టపోతుంటే, మరోవైపు ప్రకృతి సహకరించక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల మెదక్ జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల పంట నష్టపోయినప్పటికీ ఇప్పటి వరకు వారికి పరిహారం అందలేదన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ సకాలంలో కాకపోవడంతో బ్యాంకు వడ్డీల భారం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల సుధాకర్, మండల నాయకులు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం
డీసిఎంను ఓవర్టేక్ చేయబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం మెదక్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన మామిడి ఛంద్రశేఖర్, స్వరూపారాణిలు గత కొంత కాలంగా మేడ్చల్ మండలం కండ్లకోయలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు మామిడి సంతోష్‌కుమార్(20) డిగ్రి చదువుతూ స్థానికంగా ఉన్న రిలయన్స్ గోడౌన్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం తన ద్వచక్రవాహనంపై బట్టలు కుట్టించేందుకు బహుదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. మైసమ్మగూడ చౌరస్తాకు రాగానే జీడిమెట్ల నుండి వరంగల్‌కు వెళ్తున్న డిసీఎంను ఓవర్టేక్ చేయబోయి డిసీఎం వెనుక చక్రాల కింద పడి పోయాడు. సంతోష్ మెదడు చిట్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహన్ని గాందీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
విజయవాడ (కృష్ణలంక): నగరంలోని పనికి వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందిన సంఘటన బస్టాండ్ డార్మిటరీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా, పలాసకు చెందిన అల్లు సంతోష్‌కుమార్(29) మొబైల్ కంపెనీలో రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పదేళ్ల క్రితం శ్వాసకోశవ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. తర్వాత కాలంలో చికిత్స చేయించుకోవడంతో ఆరోగ్యం కుదుటపడ్డాడు. నెలరోజుల క్రితం నగరంలోని ఆ కంపెనీ పనులు నిర్వర్తించేందుకు వచ్చాడు. బస్టాండ్ డార్మిటరీలో అద్దెకు ఉన్నాడు. ఈక్రమంలో మంగళవారం అస్వస్థతగా ఉందని డార్మిటరీ రిసెప్షన్లో పనిచేసే వ్యక్తికి సంతోష్ చె ప్పి వేడినీరు తాగేందుకు ఇవ్వాలని అడిగాడు. అంతలోనే వద్దని చెప్పి సమీపంలోని కుర్చీలో కూర్చొని, కిందపడ్డాడు. వెంటనే రిసెప్షన్లో వ్యక్తి 108కు ఫోన్ చేసి రప్పించగా, వారు చనిపోయినట్లుగా నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. సంతోష్ నాలుగు సంవత్సరాల క్రితం స్వాతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంతోష్ మృతిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేశారు. -
జుట్టుకోసం సర్జరీ.. విఫలమై ప్రాణం హరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన క్రాఫ్‌పై మోజుపడి ఓ విద్యార్థి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. మద్రాస్ మెడికల్ కాలేజీ విద్యార్థి సంతోష్‌కుమార్ బట్టతలతో ఇబ్బంది పడేవాడు. ‘సర్జరీతో జుట్టు తెప్పిస్తాం’ ప్రకటనకు ఆకర్షితుడై నుంగంబాక్కంలోని వైద్యుని వద్దకు వెళ్లాడు. పొద్దున మత్తుమందిచ్చి సర్జరీ ప్రారంభించారు. సాయంత్రం స్పృహలోకొచ్చిన సంతోష్ కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వేలూరు ఆసుపత్రికి తరలించగా అక్కడే చనిపోయాడు. -
బట్టతలపై జుట్టు వస్తుందని చెబితే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన తలకట్టు ఉండాలని ఎవరూ అనుకోరు.. పిన్నవయస్సు నుంచి వృద్ధ వయస్సు దాకా అందరూ ఒతైన జుట్టు కావాలని ఆరాటపడుతుంటారు. దువ్వెన తలనే పదేపదే దువ్వుతూ మురిసిపోతుంటారు. వృద్ధ వయస్సులో రావాల్సిన బట్టతల ముందుగానే వస్తే.. అంతే..! తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. తలపై జుట్టు పెరిగే ఉపాయాల జాబితా తిరిగేస్తారు.. ఎవరైనా పలనా తింటే.. జుట్టు పెరుగుతుందనీ, ఔషధం రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబితే ఆ వ్యక్తి ఊహాలకు రెక్కలు తొడుగుతాయి. బట్టతల నుంచి విముక్తి పొందలన్నా అత్యాశతో ఎంత ఖర్చుకైనా వెనకాడరు. అచ్చంగా అలాగే చేసాడో వైద్యవిద్యార్థి. తన అందమైన క్రాఫ్‌పై మోజుపడిన విద్యార్థి ఏకంగా తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ దయనీయమైన ఘటన చెన్నైలో మంగళవారం వెలుగుచూసింది. మద్రాసు మెడికల్ కాలేజీ విద్యార్థి సంతోష్‌కుమార్ బట్టతలతో తెగ ఇబ్బంది పడేవాడు. ‘బట్టతల మీ వివాహానికి అడ్డంకిగా మారిందా. దిగులుపడొద్దు. మా వద్దకు రండి. అందమైన క్రాఫ్‌ను అమరుస్తాం’ అనే ప్రకటనకు ఆకర్షితుడైన అతడు నుంగంబాక్కంలోని ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. అక్కడి అనస్తీషియా డాక్టర్ చైనాలోని ఒక వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మరో విద్యార్థి సాయంతో సంతోష్‌కుమార్‌కు మత్తుమందు ఇచ్చి చికిత్స ప్రారంభించారు. ఉదయం ప్రారంభించిన చికిత్స సాయంత్రం వరకు కొనసాగగా సృహలోకి వచ్చిన సంతోష్‌కుమార్ తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వేలూరు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అనుభవం లేకుండా బట్టతలకు జుట్టు అమర్చేందుకు చేసిన ప్రయత్నం వికటించిన కారణంగానే సంతోష్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడని అనుమానిస్తూ కుటుంబసభ్యులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. -
విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం
బొబ్బిలి : మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ఓ విద్యార్థినిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని గుడివాడ కాలనీకి చెందిన పదోతరగతి విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన కడగల సంతోష్‌కుమార్ లైంగిక దాడికి యత్నించగా ఆమె కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాలికను వైద్య పరీక్షలకు పంపుతున్నట్లు ఎస్ఐ ఎస్ అమ్మినాయుడు తెలిపారు. -
పెళ్లి పేరుతో రూ.కోట్ల మోసం చేసిన హీరోయిన్
నటి శ్రుతిపై ఫిర్యాదుల వెల్లువ చెన్నై: వివాహం చేసుకుంటానని చెప్పి యువకుల నుంచి కోట్ల రూపాలు స్వాహా చేసి మోసానికి పాల్పడినట్లు నటి శ్రుతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామక్కల్ జిల్లా పరమత్తివేలూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోష్‌కుమార్(32) వధువు కోసం ఇంటర్నెట్లో పేరు నమోదు చేసుకున్నారు.ఇంటర్నెట్ ద్వారా కోవై,పిళమేడుకు చెందిన నటి శ్రుతి ఆయనకు పరిచయమయ్యారు. ఆమె సంతోష్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంటానని ఆయనతో సన్నిహితంగా మెలిగింది. అలా అతని నుంచి 80 లక్షల వరకూ గుంజింది.ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో చిదంబరం, శివశక్తి నగరానికి చెందిన అరుళ్‌కుమార్ రాజానూ పెళ్లి చేసుకుంటానని శుత్రి రూ.50 లక్షల వరకూ మోసం చేసినట్లు సమాచారం. అలాగే చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రవీణ్(28),ప్రసాద్(31) శనివారం కోవై పోలీసులకు శ్రుతిపై ఫిర్యాదు చేశారు.అందులో నటి శ్రుతి వివాహం చేసుకుంటానని చెప్పి లక్షల్లో మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదైన ఫిర్యాదు ప్రకారం శ్రుతి 11 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లను పెళ్లి చేసుకుంటానని రెండు కోట్లకు పైగా కాజేసినట్లు వెల్లడైనట్లు సమాచారం. -
నటి శ్రుతిపై ఫిర్యాదుల వెల్లువ
వివాహం చేసుకుంటానని చెప్పి యువకుల నుంచి కోట్ల రూపాలు స్వాహా చేసి మోసానికి పాల్పడినట్లు నటి శ్రుతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామక్కల్ జిల్లా పరమత్తివేలూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోష్‌కుమార్(32) వధువు కోసం ఇంటర్నెట్లో పేరు నమోదు చేసుకున్నారు.ఇంటర్నెట్ ద్వారా కోవై,పిళమేడుకు చెందిన నటి శ్రుతి ఆయనకు పరిచయమయ్యారు. ఆమె సంతోష్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంటానని ఆయనతో సన్నిహితంగా మెలిగింది. అలా అతని నుంచి 80 లక్షల వరకూ గుంజింది.ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో చిదంబరం, శివశక్తి నగరానికి చెందిన అరుళ్‌కుమార్ రాజానూ పెళ్లి చేసుకుంటానని శుత్రి రూ.50 లక్షల వరకూ మోసం చేసినట్లు సమాచారం. అలాగే చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రవీణ్(28),ప్రసాద్(31) శనివారం కోవై పోలీసులకు శ్రుతిపై ఫిర్యాదు చేశారు.అందులో నటి శ్రుతి వివాహం చేసుకుంటానని చెప్పి లక్షల్లో మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదైన ఫిర్యాదు ప్రకారం శ్రుతి 11 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లను పెళ్లి చేసుకుంటానని రెండు కోట్లకు పైగా కాజేసినట్లు వెల్లడైనట్లు సమాచారం. -
కారు బోల్తా- ఒకరి మృతి
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామ సమీపంలో సోమవారం ఉదయం కారు బోల్తాపడి ఒక వ్యక్తి మృతిచెందాడు. చిలమకూరు ఐసీఎల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సంతోష్‌కుమార్(38) సోమవారం ఉదయం కడప నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడడంతో సంతోష్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఎర్రగుంట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
సియాచిన్‌లో తెలంగాణ జవాను దుర్మరణం
ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నవ్‌గామ్‌బస్తీకి చెందిన ఓ యువ ఆర్మీ జవాను జమ్మూ కాశ్మీర్‌లోని సియాచిన్ పర్వత ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గాయపడి మృతి చెందాడు. వైశాఖ సంతోష్‌కుమార్(29) 9 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా చేరాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఈ నెల 24న అతడు కాలు జారి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్చగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. అతడి మృతదేహం ఆదివారం నవ్‌గామ్‌బస్తీకి తీసుకురానున్నారు. -
విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య
-
విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య
విశాఖపట్టణం: విశాఖ నగరంలో బుధవారం అర్థరాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురంనాడి రోడ్డులో రౌడీ షీటర్ పట్నాల సంతోష్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ఇప్పటికే సంతోష్ పలు కేసుల్లో నిందుతుడిగా ఉన్నాడు. వ్యక్తి గత కక్షలే ఈ హత్యకు పురిగొల్పి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జగన్‌కు మద్దతుగా ఆమరణ దీక్ష
కూకట్పల్లి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా కూకట్పల్లి ఆర్టీసీ కాలనీకి చెందిన పి.సంతోష్ కుమార్ ఆమరణ దీక్ష చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. చికిత్స కోసం ఆయనను సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు స్థానిక రాందేవ్రావ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ ముజిద్ వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలిపారు. ఆయనకు రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్.. విడుదల
హైదరాబాద్ : పోలీసులమని చెప్పి దుండగులు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసి.. తీవ్రంగా కొట్టి ఎల్బీనగర్లో వదిలేశారు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం... హైదర్షాకోట్లో నివాసం ఉండే సంతోష్‌కుమార్ యూఎస్ఏలో ఉంటూ 8 నెలల క్రితం నగరానికి వచ్చాడు. రహేజా మైండ్ స్పేస్‌లోని ఐబీఎంలో టీం లీడర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30కి సంతోష్‌కుమార్ ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా... మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఇద్దరు దుండగులు... పోలీసులమని చెప్పి అతడి కారును అడ్డగించి, తాళం చెవి తీసుకున్నారు. సంతోష్‌ను డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దించి, నీతో మాట్లాడాలి వెనుక సీట్లో కూర్చో అని చెప్పారు. అదే సమయంలో వెనుక కారులో వస్తున్న ఐబీఎం ఉద్యోగి ప్రసాద్ వారి వద్దకు వెళ్లి సంతోష్ కారును ఎందుకు ఆపారని ప్రశ్నించగా తాము పోలీసులమని చెప్పారు. దీంతో ప్రసాద్.. సంతోష్ కారును వెంబడించి... గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వరకు వెళ్లాడు. ఆ తర్వాత సంతోష్ ప్రయాణిస్తున్న కారు కనిపించక పోవడంతో ప్రసాద్ ఆందోళన చెంది... అతడి సెల్‌కి ఫోన్ చేశాడు. సంతోష్ ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో అతను నేరుగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడిని ఎవరో పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లారని ఫిర్యారు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబరాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. పోలీసులమని చెప్పిన ఇద్దరు వ్యక్తులు సంతోష్‌ను చితకబాది ఎల్బీనగర్లో వదిలేశారు. రాత్రి 11.00 గంటల సమయంలో సంతోష్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తాము టాస్క్‌పోర్స్ పోలీసులమని చెప్పిన దొంగలు... అదృశ్యమైన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆచూకీ చెప్పాలని వారు సంతోష్‌పై తీవ్ర ఒత్తిడి చేసి దాడి చేసినట్టు తెలుస్తోంది. -
సంతోష్ మృతదేహం కోసం ఎదురుచూపులు
విశాఖపట్నం: న్యూజిలాండ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంతోష్ కుమార్ మృతదేహం కోసం అతడి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు యాక్సిడెంట్లోల మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంతోష్ మృతితో బంధువులు, కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సంతోష్ మృతి చెంది అయిదురోజులు గడుస్తున్న మృతదేహం స్వస్థలానికి రాక పోవడంతో విశాఖలోని అక్కయ్యపాలెంలో నందగిరి నగర్లో విషాధఛాయలు అలుముకున్నాయి. విశాఖపట్నం నగరానికి చెందిన సంతోష్‌కుమార్ పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక నాలుగు నెలల కిందట అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం జనవరి 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. -
న్యూజిలాండ్‌లో విశాఖ యువకుడి మృతి
న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నందగిరినగర్‌కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (26) మరణించాడు. ఈ నెల 22తేదీ సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. రిటైర్డు ప్రభుత్వోద్యోగి చెరుకూరి నూకరాజు, నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్ పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక నాలుగు నెలల కిందట అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే మరో ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. సంతోష్‌కుమార్ మరణవార్త అతని స్నేహితుల ద్వారా తల్లితండ్రులకు చేరింది. రెండురోజుల్లో మృతదేహం విశాఖకు పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు, అక్కడి తెలుగు సంఘంవారు హామీ ఇచ్చారు. ఇంతవరకు మృతదేహం ఇంటికి చేరకపోవడంతో సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారాంతపు సెలవులు కారణంగా డెత్ సర్టిఫికేట్ రాలేదని, అక్కడివారు చెబుతున్నట్టు మృతుని సోదరుడు రాజేంద్ర తెలిపారు. తమ కుమారుని మృతదేహం స్వస్థలం చేరేలా చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీస్‌కమిషనర్‌లను మృతుని తల్లితండ్రులు ఆదివారం కోరారు. -
తాళి కట్టేవేళ ఆగిన పెళ్లి
రాయచూరు రూరల్ : రాయచూరు తాలూకా రాంపూర్‌లో ఆదివారం యువతి, యువకుల ప్రేమ విషయంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. బైక్‌కు నిప్పు పెట్టారు. పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. గ్రామంలో మాజీ సైనికుడు జాన్ కుమార్తె జాసిమిన్(16), సురేష్ కుమారుడు సంతోష్ కుమార్(16) కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో కుమార్తెను జాన్ నెల రోజుల క్రితం మందలించారు. దీంతో కోపగించుకున్న సంతోష్‌కుమార్ జాన్‌పై కక్ష కట్టాడు. 20 రోజుల క్రితం గుల్బర్గాకి వెళ్లిన జాన్‌ను తన స్నేహితులు ఆరుగురితో కలిసి సంతోష్‌కుమార్ దాడి చేశారు. దీంతో జాన్ గుల్బర్గా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. వారు శనివారం జామీనుపై విడుదలై రాయచూరు చేరుకున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు సంతోష్‌కుమార్, అతని మిత్రులు కలిసి జాన్ ఇంటిపైకి దాడి చేశారు. అక్కడే ఉన్న మోటారు వాహనానికి నిప్పు పెట్టారు. అడ్డం వచ్చిన జాన్ తమ్ముడు నతానియల్, అన్న కొడుకు దిలీప్‌ను కత్తితో గాయపరిచారు. తలుపులు, కిటికీల గ్లాసులను ధ్వంసం చేశారు. గ్రామంలో రక్షణ కల్పించేందుకు వెళ్లిన పోలీసులపైనా వారు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, దాడికి పాల్పడిన 11 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ నాగరాజ్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. -
పార్టీకి పూర్వవైభవం తెస్తాం
ధారూరు: జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కోల్కొంద సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ధారూరు మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకుల అధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోల్కొంద సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకుల సహకారంతో, సలహాలతో పార్టీని ముందుకు నడిపిస్తామని చెప్పారు. 2019లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. తనకు జాతీయ స్థాయిలో పదవి లభించినా.. సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని అన్నారు. చైనాలో జరిగిన యువజన సదస్సుకు పార్టీ తనను పంపిందని సంతోష్‌కుమార్ చెప్పారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల గురించి ప్రసంగించినట్లు ఆయన తెలిపారు. తనకు పదవి ఇచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతవ్, ఇన్చార్జి సూరజ్‌హెగ్డేలకు సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ధారూరు జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ కార్యదర్శి బుజ్జయ్యగౌడ్, యూ త్ కాంగ్రెస్ వికారాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, ఎంపీటీసీలు మాన్సింగ్, గొల్ల బాలప్ప, రమేశ్‌కృష్ణ, నాయకులు వెంకటయ్య యాదవ్, అశోక్ తదితరులు ఉన్నారు. -
గజ్వేల్.. ఇక జిగేల్!
గజ్వేల్: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ అభివృద్ధిలో మరో కీలక మలుపు.. రెండున్నరేళ్ల క్రితం నగర పంచాయతీగా ఏర్పడిన గజ్వేల్.. మున్సిపాలిటీగా ఆవిర్భవించడానికి అవసరమైన అన్ని అర్హతలను సాధించింది. ఈ నేపథ్యంలో స్థానిక కమిషనర్ డెరైక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(డీఎంఏ)కు లేఖ పంపేందుకు సంసిద్ధమయ్యారు. లేఖ పంపగానే కొద్ది రోజుల్లోనే నగర పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కానుంది. మేజర్ పంచాయతీగా ఉన్న గజ్వేల్ 2012 జనవరిలో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నగర పంచాయతీలో గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామాలు విలీనమైన విషయం విదితమే. ఫలితంగా నగర పంచాయతీ పరిధి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర పంచాయతీ పరిధిలో మొత్తం 37,881 జనాభా ఉండగా, 9,011 ఇళ్లు, మరో 15 మురికివాడలున్నట్లు గుర్తించారు. సర్కార్ నిబంధనల ప్రకారం అప్పట్లో ఉన్న పరిస్థితులకనుగుణంగా దీనిని నగర పంచాయతీగానే ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నగర పంచాయతీలో జనాభా 50 వేల పైచిలుకు చేరుకుంది. అదేవిధంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.5.11 కోట్లకుపైగా, 2013-14కు వచ్చేసరికి రూ.8.19 కోట్లకుపైగా ఆదాయాన్నిసాధించింది. పట్టణ పరిధి కూడా మున్సిపాలిటీ స్థాయికి తగ్గట్టుగా విస్తరించింది. అన్ని అర్హతలు కలిగివున్న నేపథ్యంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీని వెంటనే మున్సిపాలిటీగా మారుస్తామని, వెంటనే నగర పంచాయతీకి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన లేఖను అందించాలని వచ్చిన సమాచారం మేరకు స్థానిక కమిషనర్ సంతోష్‌కుమార్ లేఖ పంపించేందుకు సిద్ధమవుతున్నారు. లేఖ వెళ్లిన కొద్ది రోజుల్లోనే గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించే అవకాశం వుంది. ఈ విషయాన్ని కమిషనర్ సంతోష్‌కుమార్ ‘సాక్షి’కి ధ్రువీకరించారు. -
మోడీ సర్కారుపై 'రియల్' ఆశలు!
ముంబై: దేశంలో సుస్థిరమైన మోడీ సర్కారు కొలువుదీరడంతో... ఇక ప్రభుత్వం తీసుకోబోయే సత్వర చర్యలపైనే అందరి దృష్టీ నెలకొంది. ప్రధానంగా తీవ్ర ఇబ్బందులతో నెట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం తమ రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తుందని.. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మళ్లీ 8-9 శాతానికి చేరేందుకు దోహదపడుతుందని రియల్టీ సంస్థలు కొండంత విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. రియల్టీలో సంస్కరణలకు బాటలు వేయడంతోపాటు బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పినవిధంగా ఎనిమిదేళ్లలో అందరికీ సొంతింటి కల హామీని నెరవేర్చేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ పేర్కొన్నారు. గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖలను కలిపేయడం వల్ల మరింత సమన్వయం, పూర్తిస్థాయిలో నియంత్రణకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సామాన్యుడికి గృహయోగం... దేశంలోని సామాన్యులందరికీ సొంత ఇంటి కల త్వరలో సాకారం అయ్యే అవకాశం ఉందని రియల్టీ రీసెర్చ్ సంస్థ జోన్స్ లాంగ్ లాసల్లే ప్రతినిధి సంతోష్ కుమార్ అంటున్నారు. మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చౌక గృహాలు, నిర్మాణ ప్రాజెక్టుల జాప్యాలు తగ్గించడం, లిటిగేషన్ల కారణంగా ప్రాజెక్టులు నిలిచిపోకుండా చూడటం వంటి అంశాలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. వీటికి తగిన పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వృద్ధి మందగమనానికి కారణమవుతున్న ఆటంకాలను తొలగించి, విధానపరమైన జడత్వాన్ని పటాపంచలు చేయడంలో మోడీ ప్రభుత్వం సఫలీకృతం అవుతుందనేది ఆయన అభిప్రాయం. రియల్టీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తే ఈ రంగానికి గొప్ప చేయూతనిచ్చినట్లేనని.. అదేవిధంగా విదేశీ నిధుల ప్రవాహం కారణంగా రూపాయి విలువ కూడా బలపడుతుందని సంతోష్ కుమార్ చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఆశావహ దృక్పథం బలపడుతోందన్నారు. ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐలు రెండింటిద్వారా గతేడాది 29 బిలియన్ డాలర్ల నిధులు దేశంలోకిరాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 60 బిలియన్ డాలర్లకు ఎగబాకవచ్చనేది ఆయన అంచనా. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవాలి... ‘రియల్టీ సంస్థల్లో 49 శాతం వరకూ విదేశీ పెట్టుబడులకు అనుమతించేలా పట్టణాభివృద్ధి శాఖ ప్రస్తుతం నియంత్రణలను సడలిస్తుందని భావిస్తున్నాం. దీనివల్ల తక్కువ వ్యయంతో విదేశీ నిధుల సమీకరణకు దోహదం చేస్తుంది. అదేవిధంగా పట్టణాభివృద్ధి, మురికివాడలకు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ విదేశీ పెట్టుబడుల విషయంలో నియంత్రణలు తొలగుతాయని అంచనావేస్తున్నాం’ అని జైన్ వ్యాఖ్యానించారు. దేశంలో భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి గృహనిర్మాణ రంగం ఇంధనంగా పనిచేస్తుందని జైన్ పేర్కొన్నారు. అనుమతుల్లో సింగిల్ విండో విధానం, గృహనిర్మాణ రంగంపై ఆర్బీఐ దృ క్పథంలో మార్పుతో పాటు భూసేకరణ విధానంలో సంతులన ధోరణి అత్యంత ఆవశ్యకమని ఆయన చెప్పారు. దీనివల్ల అటు డెవలపర్లు, ఇటు రైతులు ఇరువురికీ మేలు చేకూరుతుందనేది ఆయన వాదన. వెంకయ్య వ్యాఖ్యలతో... హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ కొత్త మంత్రిగా సీనియర్ బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడుని నియమించడంపట్ల క్రెడాయ్ హర్షం వ్యక్తం చేసింది. మోడీ ప్రభుత్వంలో రియల్టీ, ఇన్ఫ్రా రంగానికి అత్యధిక ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నట్లు జైన్ చెప్పారు. కాగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంకయ్య తొలి పలుకులు రియల్టీ రంగంలో ఆశలు పురిగొల్పేలా చేసింది. 2020కల్లా అందరికీ సొంతింటి కలను సాకారం చేయడం, గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గింపు తన తొలి ప్రాధాన్యాలని చెప్పారు. రేట్ల తగ్గింపుకోసం త్వరలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. దేశంలో కొత్త 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలు కూడా తాను చేయబోయే పనుల ఎజెండాలో ఉన్నాయంటూ వెంకయ్య చెప్పడం గమనార్హం. -
‘వాడ’లకు నిధుల వరద
గజ్వేల్, న్యూస్‌లైన్: కొత్తగా ఆవిర్భవించిన నగర పంచాయతీల్లోని మురికివాడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పథకాన్ని మురికివాడలకు వర్తింపజేసి వాటిని అభివృద్ధి చేసేం దుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని నగర పంచాయతీల్లో సర్వే వేగంగా సాగుతోంది. ఈనెల 25లోగా ఆయా పంచాయతీల్లో మురికివాడలను గుర్తించి వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపే పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, చేగుంట, జోగిపేట పట్టణాలు కొత్తగా నగర పంచాయతీలుగా ఆవిర్భవించాయి. గతంలో మేజర్ పంచాయతీలుగా ఉన్న వీటి స్థాయి పెరిగిన తర్వాత మెరుగైన వసతులు సమకూరుతాయని అంతా భావించారు. కానీ నగర పంచాయతీలకు తగినన్ని నిధులు రాకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్నట్లు తయారైంది. కనీస సౌకర్యాలు కరువై ప్రజలు అల్లాడుతున్నారు. పారిశుద్ధ్యలోప నిర్వహణ కూడా సక్రమంగా లేకపోడం వల్ల జనం రోగాల బారిన పడుతున్నారు. నగర పంచాయతీల్లో పల్లెలు కలిసిపోవడంతో మురికి వాడలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ వాడలను అభివృద్ధి చేయడం ‘నగర పంచాయతీ’లకు సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో కేంద్రం అమలు చేస్తోన్న ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పథకం ఈ నగర పంచాయతీలకు ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. గతంలో 5 లక్షల జనాభా కలిగిన మున్సిపాలిటీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసే వారు. కానీ ఇపుడు నిబంధనలు మార్చి 35 నుంచి 40 వేల జనాభా కలిగిన కొత్త నగర పంచాయతీలకు కూడా ఈ నిధులు అందించి వాటి అభివృద్ధికి పాటుపడాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్(డీఎంఏ) కార్యాలయంలో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీల కమిషనర్లతో ప్రత్యేకంగా చర్చించి ఆయా పంచాయతీల్లో అభివృద్ధి చేయాల్సిన మురికివాడలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశించారు. అందుకోసం ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం నగర పంచాయతీ కమిషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం సర్వే పనులు ఆయా నగర పంచాయతీల పరిధిలో మురికివాడల గుర్తింపు కార్యక్రమం జరుగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత మురికివాడలకు గుర్తింపునకు సంబంధించిన గెజిట్ ప్రచురిస్తారు. ఆ తర్వాత వాటిని నోటిఫైడ్ మురికివాడలుగా ప్రకటించి, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన ఇళ్లు, డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపనున్నారు. దీని ప్రకారం ఒక్కో నగర పంచాయతీకి రూ.5 కోట్లకుపైగానే నిధులు మంజూరు కానున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలో 15 మురికివాడలను గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక కమిషనర్ సంతోష్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో వెల్లడించారు. ఈనెల 25లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలు వచ్చిన తరుణంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసే పనిలో తలమునకలై ఉన్నట్లు ఆయన తెలిపారు. -
పెళ్లి వాహనం బోల్తా...పది మంది దుర్మరణం
దావణగెరె, న్యూస్‌లైన్ : పెళ్లి వేడుక ముగించుకుని వెనుతిరిగిన పెళ్లి బృందం ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. వారు ప్రయాణిస్తున్న క్యాంటర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో పది మంది అక్కడికక్కడే మృతి చెందగా, దాదాపు 25 మందికి పైగా గాయపడిన ఘటన దావణగెరె జిల్లాలోని హొన్నాళి తాలూకా న్యామతి పోలీసు స్టేషన్ పరిధిలోని తుగ్గలహళ్లి గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల వివరాల మేరకు... జిల్లాలోని హరిహర తాలూకా భానువళ్లి గ్రామం నుంచి హొన్నాళి తాలూకా రామేశ్వర గ్రామంలోని తీర్థరామేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుక ముగించుకుని క్యాంటర్ వాహనంలో తిరిగి భానువళ్లికి వస్తుండగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హొన్నాళి తాలూకా తుగ్గలహళ్లి వద్ద ఏటవాలుగా ఉన్న రోడ్డులో వేగంగా వస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. మృతులను భానువళ్లికి చెందిన హనుమంతరెడ్డి(62), కే.మహేశ్వరప్ప(62), డీజీ మహదేవ గౌడ(60), పూజార్ నాగప్ప(55), వీరభద్రప్ప(55), సంతోష్‌కుమార్(25), మురళీ(9), హనుమంతప్ప (55), నాగరాజు (50), రవి (30)గా గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 25 మందిని సమీపంలోని శివమొగ్గ, దావణగెరె ఆస్పత్రులకు తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని హొన్నాళిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి క్యాంటర్ డ్రైవర్ అజాగ్రత్తే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డ్రైవర్ తమ మాట వినకుండా వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ఇలా ఉండగా ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడమేగాకుండా, చికిత్స కోసం ఆర్థికసాయం కూడా చేసి ఆదుకున్నారు. హొన్నాళి ఆస్పత్రికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఘటన స్థలానికి డీఎస్పీ నాగరాజ్, సీఐ నాగరాజ్ మాడళ్లి, ఎస్ఐ కుమారస్వామిలతో పాటు సిబ్బంది చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై న్యామతి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.