
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్వీకరించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన మూడు మొక్కలను నాటారు. మొక్కలు నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు చేపడతానని ఆయన ట్వీట్ చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, హీరో అక్కినేని నాగార్జునకు గ్రీన్‌చాలెంజ్‌ను విసిరి తన చాలెంజ్ స్వీకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment