సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేత జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదైంది. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్‌నం.14లో భూకబ్జా చేశారంటూ కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ డ్యాకుమెంట్లతో భూ కబ్జాకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు.
నవయుగ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌తో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేయగా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈనెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బి రెడ్‌విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు: సంతోష్
తనపై చేసిన భూకబ్జా ఆరోపణలు అవాస్తవమని జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం 2016లో పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను. ఫోర్జరీ అనే మాటకు తావులేదు. అది వాస్తవం కాదు. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి’’ అని సంతోష్ వివరణ ఇచ్చారు.
‘‘ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా నాకు అమ్మిన వ్యక్తి, నా ఆధీనంలోనే ఉంది. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలి వివరణ అడగాలి. కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు’’ అని సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
Comments
Please login to add a commentAdd a comment