
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తుండంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి సెగలు రాజేస్తున్నారు. అధికార పార్టీని వీడి ఇతర పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు.
ఈ క్రమంలో కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గులాబీ పార్టీకి రాజీనామా ప్రకటించారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ వైఖరి వల్లే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు.
కరీంనగర్ నుంచి బరిలో ఉంటానని మీడియా సమావేశంలో ప్రకటించేందుకు సంతోష్ కుమార్ సిద్ధమయ్యారు. అయితే ఏదైనా ప్రధాన పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని లేదా ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగేందుకు సిద్ధమని తెలిపారు.
చదవండి:అవినీతిలో ఆస్కార్ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌కు ఎదురుదెబ్బ ఖాయం..