‘గ్రీన్‌’ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌  | Aamir Khan Takes Up Part In Green India Challenge | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌’ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌ 

Published Mon, Sep 20 2021 1:17 AM | Last Updated on Mon, Sep 20 2021 7:17 AM

Aamir Khan Takes Up Part In Green India Challenge - Sakshi

మొక్క నాటిన అనంతరం ఆమిర్‌ఖాన్, నాగచైతన్యలతో  సెల్ఫీ తీసుకుంటున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో భాగంగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సహనటుడు, టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి విమానాశ్రయంలో ఆయన మొక్కలు నాటారు. జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్‌ అభినందించారు. ‘మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి. అప్పుడే భవిష్యత్‌ తరాలు జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లమవుతాం. మొక్కలు నాటడాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి’అని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement