నటి శ్రుతిపై ఫిర్యాదుల వెల్లువ
చెన్నై: వివాహం చేసుకుంటానని చెప్పి యువకుల నుంచి కోట్ల రూపాలు స్వాహా చేసి మోసానికి పాల్పడినట్లు నటి శ్రుతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామక్కల్ జిల్లా పరమత్తివేలూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంతోష్‌కుమార్(32) వధువు కోసం ఇంటర్నెట్‌లో పేరు నమోదు చేసుకున్నారు.ఇంటర్నెట్ ద్వారా కోవై,పిళమేడుకు చెందిన నటి శ్రుతి ఆయనకు పరిచయమయ్యారు.
ఆమె సంతోష్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంటానని ఆయనతో సన్నిహితంగా మెలిగింది. అలా అతని నుంచి 80 లక్షల వరకూ గుంజింది.ఆ తరువాత కనిపించకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో చిదంబరం, శివశక్తి నగరానికి చెందిన అరుళ్‌కుమార్ రాజానూ పెళ్లి చేసుకుంటానని శుత్రి రూ.50 లక్షల వరకూ మోసం చేసినట్లు సమాచారం.
అలాగే చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్(28),ప్రసాద్(31) శనివారం కోవై పోలీసులకు శ్రుతిపై ఫిర్యాదు చేశారు.అందులో నటి శ్రుతి వివాహం చేసుకుంటానని చెప్పి లక్షల్లో మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదైన ఫిర్యాదు ప్రకారం శ్రుతి 11 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పెళ్లి చేసుకుంటానని రెండు కోట్లకు పైగా కాజేసినట్లు వెల్లడైనట్లు సమాచారం.