Allu Arjun Shares His First Girlfriend Name In Telugu Indian Idol Singers Show - Sakshi
Sakshi News home page

Allu Arjun : స్నేహారెడ్డి కంటే అల్లు అర్జున్‌ ఆ అమ్మాయిని ప్రేమించాడా?

Published Tue, May 30 2023 9:23 AM | Last Updated on Tue, May 30 2023 10:12 AM

Allu Arjun Shares His First Girlfriend Name In Telugu Indian Idol Show - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప పార్ట్‌-2లో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుంది. ఇదిలా ఉంటే బన్నీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. పొలిటికల్‌ లీడర్‌ కూతురు స్నేహరెడ్డిని అల్లు అర్జున్‌ ప్రేమించి పెళ్లాడాడు. వీరికి అయాన్‌, అర్హ ఇద్దరు పిల్లలు.

అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలతో బన్నీ సరదా మూమెంట్స్‌, వెకేషన్‌ ఇలా తనకి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. ఈ క్రమంలో స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు స్నేహా కంటే ముందు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు.

వారిలో తన ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరును బన్నీ రివీల్‌ చేసేశాడు. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-2 ఫైనల్స్‌కు అల్లు అర్జున్‌ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే సింగర్‌ పాట పాడిన అనంతరం బన్నీ మాట్లాడుతూ.. 'నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు కూడా శ్రుతినే' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ వీడియో చూసి స్నేహా ఎలా రియాక్ట్‌ అవుతుందో..!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement