Indian Idol 2
-
సంగీత ప్రియులను అలరించే షో.. ప్రోమో అదుర్స్!
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హిట్షో ఇండియన్ ఐడల్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి సంగీత ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇండియన్ ఐడల్ మరో సీజన్ ఈనెల 14 నుంచి ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు.తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 లాంఛ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతామాధురి, శ్రీరామచంద్ర, కార్తీక్ వ్యవహరించనున్నారు. కొత్త సీజన్లో కంటెస్టెంట్ల ఎమోషన్స్ ఫుల్‌గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ షో మూడోసారి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ కానుంది. దీంతో వారం ముందుగానే ప్రోమోను ఆడియన్స్‌కు పరిచయం చేశారు మేకర్స్. Ultimate musical journey ki muhurtham set ayindi 🎙️🗓️.Kotha swarala madya competition, Judges iche entertainment tho Indian Idol resound India antha vinapadutundi.✨.Telugu Indian Idol Season 3 Launch Promo Out▶️https://t.co/6b5B1VURT9🎤🎶 Catch #TeluguIndianIdolS3 starting… pic.twitter.com/Pl33SKG5No— ahavideoin (@ahavideoIN) June 6, 2024 -
స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప పార్ట్-2లో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే బన్నీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. పొలిటికల్ లీడర్ కూతురు స్నేహరెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడాడు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలతో బన్నీ సరదా మూమెంట్స్, వెకేషన్ ఇలా తనకి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. ఈ క్రమంలో స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు స్నేహా కంటే ముందు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో తన ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరును బన్నీ రివీల్ చేసేశాడు. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫైనల్స్‌కు అల్లు అర్జున్ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే సింగర్ పాట పాడిన అనంతరం బన్నీ మాట్లాడుతూ.. 'నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ వీడియో చూసి స్నేహా ఎలా రియాక్ట్ అవుతుందో..! -
'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా బన్నీ
సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న ఆహా ‘ తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య టాప్-5 లిస్టులో ఉన్నారు. త్వరలోనే ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇక సీజన్ 1 ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఇక రెండో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రోమోని విడుదల చేసింది ఆహా. ఆ ప్రోమోను బట్టి చూస్తే అల్లు అర్జున్ ఎంట్రీ మాములుగా లేదనిపిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ 2 వంటి అద్భుతమైన షో గ్రాండ్ ఫినాలేలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని బన్నీ అన్నారు.జడ్జి హోదాలో ఉన్నాను కానీ ఇంత మంచి పాటకు లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తోందని చెప్పాడు. అంతకుముందు ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదేలే’ సాంగ్‌తో స్టేజిపైకి బన్నీ ఎంట్రీ సెలబ్రేషన్‌ను తలపించగా.. గాయని సౌజన్య ఆరాధ్య కుమార్తె మిహిరాతో హ్యాపీ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే.. ఛీఫ్ గెస్ట్ పేరు లీక్!
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!) అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు పాన్ ఇండియా స్టార్ హాజరవుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాకుండా పుష్ప-2 టీజర్‌తో పాటు గెస్ట్ ఎవరో కూడా హింట్ ఇచ్చింది. ఈ సారి గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాగా.. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆమెకు ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) PAN India Charchalu modhalayyayi ante iga thaggede le 🔥🔥🔥 Guess the star 🌟#TeluguIndianIdol2 Masss Finale coming soon. Stay tuned for exclusive updates. #alluarjun @MusicThaman @singer_karthik @GeethaArts @PushpaMovie pic.twitter.com/Y12m87iZVf — ahavideoin (@ahavideoIN) May 19, 2023 -
మెగాస్టార్‌ను కలిసిన ఇండియన్ ఐడల్ సింగర్
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో తన మధురమైన గొంతుతో ప్రేక్షకులను మెప్పించిన ఇండియన్ ఐడల్ ప్రణతి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) అక్కడే అన్నమాచార్య కీర్తన పాడి అందరినీ మెప్పించింది. ప్రణతి ప్రతిభకు మెగాస్టార్ దంపతులు ఫిదా అయ్యారు. భవిష్యత్తులో గొప్ప సింగర్ కావాలని ఆకాంక్షించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2లో సక్సెస్ సాధించాలని ఆశీర్వదించారు. కాగా.. విశాఖపట్టణానికి చెందిన ప్రణతి సీజన్ మొదటి రోజే తన గాత్రంతో మెప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. (ఇది చదవండి: ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!) -
ఆ వయసు ఏంటి ఆ పాట ఏంటి జడ్జెస్‌ని కట్టిపడేసిన ప్రణతి
-
ఒక్క పాట తో కోటి సినిమాలో ఛాన్స్
-
‘ఆహా’ కోసం బాలయ్య కొత్త అవతారం.. న్యూ లుక్ పిక్స్ వైరల్
నందమూరి నట సింహా బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్.. యాంకరింగ్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఆయన హోస్ట్‌గా చేసిన టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ హిట్ అయింది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోతో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇదే జోష్‌తో మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు ఈ నందమూరి నటసింహం. ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నమ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్ రెండో సీజన్లో బాలయ్య గెస్ట్‌గా మెరవబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంపిటీషన్ షో కోసం 12 మంది కంటెస్టెంట్స్‌ని ఫైనల్ చేశారు. ఈ 12 మందిని పరిచయం చేస్తూ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా ట్వీట్ చేసింది.. గతంలో ఇంతకు ముందెన్నపుడు చూడని బాలయ్యను చూస్తారంటూ ట్వీటర్లో పేర్కొంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన న్యూ లుక్స్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. The Fire sets the stage on fire, yet again! Inthaku mundhennadu chudani Balayyani Chusthaaru, March 17&18th na #TeluguIndianIdolS2 #GalaWithBala lo🔥@MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem@southindiamalls @realmeIndia @KhiladiOfficia3 @BingoSnacks @ShaadiDotCom pic.twitter.com/L7jnmaID5K — ahavideoin (@ahavideoIN) March 13, 2023 -
ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ .. ఆకట్టుకుంటున్న ప్రోమో
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తోంది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఊర్రూతలూగిస్తోంది. తాజాగా సీజన్-2 లో మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో అమెరికాకు చెందిన డాక్టర్ శృతి నండూరి తన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్.. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-1 సంగీత ప్రియులను అలరించింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఆహా మరోసారి ప్రేక్షకులకు కనివిందుల చేసేందుకు సిద్ధమైంది. ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ సింగర్స్ ప్రతిభను వెలికితీసేందుకు మరోసారి రెడీ అయింది. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2తో మీ ముందుకొస్తున్నట్లు ప్రకటించింది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడిషన్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మొదటి సీజన్‌కు ప్రేక్షకుల అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు ఇండియన్ ఐడల్‌ను బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీజన్-2 సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన సింగర్స్‌కు ఈ షో చక్కని అవకాశం కల్పించనుంది. ఈ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షోకి సంబంధించిన ఆడిషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆమె ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు. -
ఇండియన్ ఐడల్ విజేత సందీప్ ఆచార్య కన్నుమూత
ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజేత సందీప్ ఆచార్య (29) మరణించాడు. పచ్చకామెర్ల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై అతడు ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. గుర్గావ్ లోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఫలితం లేకపోయింది. బికనీర్‌లో ఓ పెళ్లికి హాజరైనప్పుడు ఆచార్య ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. దాంతో అతడి బంధువులు వెంటనే మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల వల్లే ఇతర అనారోగ్యాలు కూడా తీవ్రంగా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. సందీప్ ఆచార్య మృతిపట్ల పలువురు ప్రముఖ గాయకులు సంతాపం తెలిపారు. గాయకులు శ్రేయా ఘోషల్, సోను నిగమ్ తదితరులు ట్విటర్ ద్వారా తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆచార్యకు భార్య, ఒక నెల వయసున్న కుమార్తె ఉన్నారు. Just heard abt Indian Idol Sandeep Acharya.. Shocked. Too young, and a wonderful guy.. I still hope this news is untrue.. — Shreya Ghoshal (@shreyaghoshal) December 15, 2013 Sandeep Acharya died? Oh my God.. his Wikipedia has been modified 15 minutes back... any1 knows how? I'm so so sad. Wht a btful soul. — Sonu Nigam (@sonuniigaam) December 15, 2013