![Allu Arjun Graces aha Telugu Indian Idol 2 Finale - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/24/indian-idol.jpg.webp?itok=LcnolqWT)
సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న ఆహా ‘ తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య టాప్-5 లిస్టులో ఉన్నారు.
త్వరలోనే ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇక సీజన్ 1 ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఇక రెండో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రోమోని విడుదల చేసింది ఆహా. ఆ ప్రోమోను బట్టి చూస్తే అల్లు అర్జున్ ఎంట్రీ మాములుగా లేదనిపిస్తుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ 2 వంటి అద్భుతమైన షో గ్రాండ్ ఫినాలేలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని బన్నీ అన్నారు.జడ్జి హోదాలో ఉన్నాను కానీ ఇంత మంచి పాటకు లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తోందని చెప్పాడు. అంతకుముందు ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదేలే’ సాంగ్‌తో స్టేజిపైకి బన్నీ ఎంట్రీ సెలబ్రేషన్‌ను తలపించగా.. గాయని సౌజన్య ఆరాధ్య కుమార్తె మిహిరాతో హ్యాపీ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment