
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
(ఇది చదవండి: NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!)
అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు పాన్ ఇండియా స్టార్ హాజరవుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాకుండా పుష్ప-2 టీజర్‌తో పాటు గెస్ట్ ఎవరో కూడా హింట్ ఇచ్చింది. ఈ సారి గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
కాగా.. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్‌లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆమెకు ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు.
(ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?)
PAN India Charchalu modhalayyayi ante iga thaggede le 🔥🔥🔥
— ahavideoin (@ahavideoIN) May 19, 2023
Guess the star 🌟#TeluguIndianIdol2 Masss Finale coming soon. Stay tuned for exclusive updates. #alluarjun @MusicThaman @singer_karthik @GeethaArts @PushpaMovie pic.twitter.com/Y12m87iZVf