Ayyan Pranathi of Telugu Indian Idol 2 Meet Megastar Chiranjeevi In Hyderabad - Sakshi
Sakshi News home page

Telugu Indian Idol- 2: మెగాస్టార్‌ను కలిసిన ఇండియన్ ఐడల్ సింగర్ ప్రణతి.. ప్రతిభకు చిరు ఫిదా

Published Sat, May 13 2023 9:08 PM | Last Updated on Sat, May 13 2023 9:21 PM

Ayyan Pranathi of Telugu Indian Idol 2 Meet Megastar Chiranjeevi In Hyderabad - Sakshi

ప్ర‌ముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వ‌హిస్తున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో తన మధురమైన గొంతుతో ప్రేక్షకులను మెప్పించిన ఇండియన్ ఐడల్ ప్రణతి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో కలిసి  ఆశీస్సులు తీసుకున్నారు.  

(ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!)

అక్కడే అన్నమాచార్య కీర్తన పాడి అందరినీ మెప్పించింది. ప్రణతి ప్రతిభకు మెగాస్టార్ దంపతులు ఫిదా అయ్యారు. భవిష్యత్తులో గొప్ప సింగర్ కావాలని ఆకాంక్షించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2లో సక్సెస్ సాధించాలని ఆశీర్వదించారు. కాగా.. విశాఖపట్టణానికి చెందిన ‍ప్రణతి సీజన్ మొదటి రోజే తన గాత్రంతో మెప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. 

(ఇది చదవండి: ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement