అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి | Actress Shruti Seth Undergoes Emergency Surgery | Sakshi
Sakshi News home page

అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి

Published Wed, Dec 30 2020 12:24 PM | Last Updated on Wed, Dec 30 2020 2:37 PM

Actress Shruti Seth Undergoes Emergency Surgery - Sakshi

బాలీవుడ్‌ నటి శృతి సేత్‌ సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా వెల్లడిస్తూ ఆస్పత్రి బెడ్‌ మీద నిద్రిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. "నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో ఒడిదుడుకులకు గురి చేసిన 2020కి ఎమర్జెన్సీ సర్జరీతో ముగింపు పలుకుతున్నాను. హఠాత్తుగా సర్జరీ చేయించుకోవాల్సి వస్తుండటం వల్ల క్రిస్‌మస్‌, కొత్త సంవత్సరం ప్లాన్లు రద్దు చేసుకున్నాను. ఓ పెద్ద అనారోగ్య సమస్య నుంచి బయటపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే నేనింకా కొన్ని జీవిత పాఠాలను నేర్చుకోనట్లు అనిపిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే అవన్నీ నేర్చుకుంటున్నా" అని చెప్తూనే, ఆమె అలవరుచుకుంటున్న పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.

ఆరోగ్యాన్ని లైట్‌ తీసుకోకండి
ఆస్పత్రికి వెళ్తే అక్కడ జీవితమేంటో బోధపడుతుంది.
ఆహారం అనేది మెదడుకు డ్రగ్‌ లాంటిది. తిండి లేకపోతే గ్లూకోజ్‌ ఎక్కించినా మనిషి బతుకుతాడు.
నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు దాన్ని చాలా మిస్సవుతున్నా.
ఉదయాన్నే కళ్లు తెరవగలుగుతున్నందుకు, రాత్రవగానే నిద్రపోగలుగుతున్నందుకు కృతజ్ఞతగా ఉండండి.
ఆరోగ్యాన్ని గాలికి వదిలేయకుండా కాస్త శ్రద్ధ వహించండి.
► మీ మంచి కోరుతూ, మిమ్మల్ని నిజంగా ఇష్టపడేవాళ్ల చేయి వదలకండి.

అంటూ శృతి విలువైన సూచనలిచ్చారు. కాగా శృతి సేత్‌ దర్శకుడు దనీశ్‌ అస్లామ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అలీనా అనే కూతురు ఉంది. ఇక శృతి కెరీర్‌ విషయానికి వస్తే ఆమె 'షరరాత్'‌ అనే పాపులర్‌ టీవీ షోలో మెరిశారు. క్యా హోతా హై ప్యార్‌, ద సూట్‌ లైఫ్‌ ఆఫ్‌ కరణ్‌ అండ్‌ కబీర్‌, ద ఫర్‌గాటెన్‌ ఆర్మీ-ఆజాదీ కె లియే వంటి కార్యక్రమాల్లో మెరిశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement