Anusha Dandekar Undergoes Surgery To Remove Lump From Ovary - Sakshi
Sakshi News home page

Anusha Dandekar:17 ఏళ్ల నుంచి ఆ పని చేస్తున్నా.. నేను అదృష్టవంతురాలిని: అనూష

Published Tue, Jun 13 2023 8:29 PM | Last Updated on Tue, Jun 13 2023 9:22 PM

Anusha Dandekar Undergoes Surgery To Remove Lump From Ovary - Sakshi

ప్రముఖ టీవీ హోస్ట్, నటి అనూషా దండేకర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది నటుడు కరణ్ కుంద్రాతో బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ షోలకు హోస్ట్‌గా పనిచేస్తున్న అనుషా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. 

( ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్‌.. మెగా ఫ్యామిలీ గ్రీన్‌ సిగ్నల్‌!)

ఆమె తన అండాశయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాలో షేర్ చేసింది. అండాశయంలో ఉన్న గడ్డలు వైద్యులు విజయవంతంగా తొలగించారని వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. పూర్తిగా కోలుకునేందుకు మరిన్నీ రోజులు పడుతుందని తెలిపింది. ఈ విషయాన్ని మహిళలు, యువతుల కోసం చెబుతున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. 

ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా అండాశయంలో గడ్డలు ఉండడంతో శస్త్రచికిత్స జరిగింది. కోలుకోవడం కాస్త టైం పడుతుంది. కానీ నేను నిజంగా అదృష్టవంతురాలిని. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నేను ఈ విషయాన్ని అమ్మాయిలందరికీ చెప్పాలనుకుంటున్నా. మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే క్రమం తప్పకుండా ఏడాది ఒకసారైనా గైనకాలజిస్ట్‌ను కలవండి. నేను నా 17 ఏళ్ల వయసు నుంచి డాక్టర్‌ను కలుస్తున్నా. మీ ఆరోగ్యమే ముఖ్యమని తెలుసుకోండి. తనకు చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు. నిజంగా నేను అదృష్టవంతురాలిని.' అంటూ పోస్ట్ చేసింది. 

( ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్.. సోషల్ మీడియాలో వైరల్!)

కాగా.. అనూషా దండేకర్  2003లో 'ముంబయి మ్యాట్నీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'విరుద్ధ్', 'ఢిల్లీ బెల్లీ' వంటి చిత్రాలలో నటించింది. అంతేకాకుండా 'హౌస్ ఆఫ్ స్టైల్', 'లవ్ స్కూల్', 'తీన్ దివా' వంటి అనేక రియాల్టీ షోలకు కూడా హోస్ట్‌గా పనిచేసింది. ప్రస్తుతం 'బాప్ మనుస్'సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement