Ovary
-
సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!
ప్రముఖ టీవీ హోస్ట్, నటి అనూషా దండేకర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది నటుడు కరణ్ కుంద్రాతో బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ షోలకు హోస్ట్‌గా పనిచేస్తున్న అనుషా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ( ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!) ఆమె తన అండాశయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాలో షేర్ చేసింది. అండాశయంలో ఉన్న గడ్డలు వైద్యులు విజయవంతంగా తొలగించారని వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. పూర్తిగా కోలుకునేందుకు మరిన్నీ రోజులు పడుతుందని తెలిపింది. ఈ విషయాన్ని మహిళలు, యువతుల కోసం చెబుతున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా అండాశయంలో గడ్డలు ఉండడంతో శస్త్రచికిత్స జరిగింది. కోలుకోవడం కాస్త టైం పడుతుంది. కానీ నేను నిజంగా అదృష్టవంతురాలిని. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నేను ఈ విషయాన్ని అమ్మాయిలందరికీ చెప్పాలనుకుంటున్నా. మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే క్రమం తప్పకుండా ఏడాది ఒకసారైనా గైనకాలజిస్ట్‌ను కలవండి. నేను నా 17 ఏళ్ల వయసు నుంచి డాక్టర్‌ను కలుస్తున్నా. మీ ఆరోగ్యమే ముఖ్యమని తెలుసుకోండి. తనకు చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు. నిజంగా నేను అదృష్టవంతురాలిని.' అంటూ పోస్ట్ చేసింది. ( ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్.. సోషల్ మీడియాలో వైరల్!) కాగా.. అనూషా దండేకర్ 2003లో 'ముంబయి మ్యాట్నీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'విరుద్ధ్', 'ఢిల్లీ బెల్లీ' వంటి చిత్రాలలో నటించింది. అంతేకాకుండా 'హౌస్ ఆఫ్ స్టైల్', 'లవ్ స్కూల్', 'తీన్ దివా' వంటి అనేక రియాల్టీ షోలకు కూడా హోస్ట్‌గా పనిచేసింది. ప్రస్తుతం 'బాప్ మనుస్'సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ తిరగబెట్టకుండా నయం చేయవచ్చా?
నా వయసు 43 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎమ్. రాధాబాయి, మిర్యాలగూడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా? నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువై డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన ఎమ్మారై తీసి డిస్క్ బల్జ్‌తో పాటు సయాటికా అంటున్నారు. నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా? దయచేసి వివరంగా చెప్పండి. – వెంకటరామ్, తాడేపల్లిగూడెం సయాటికా అనే పదాన్ని రోజుల్లో వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీలతో పాటు హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యలను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటిది అయిన నరం పేరు సయాటికా. అది వీపు కింది భాగం నుంచి పిరుదుల మీదుగా కాలి వెనక భాగం మీదుగా కాలి మడమల వరకు వరకు వెళ్తుంది. ఈ నరం మీద వెన్నుపూసల ఒత్తిడి పడి, నరం నొక్కుకుపోవడం వల్ల కాలి వెనక భాగం తీవ్రమైన నొప్పికి గురవుతుంది. దీన్నే సయాటికా నొప్పి అంటారు. దీని కారణంగా తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరు అవుతుంటారు. కారణాలు : నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ కావడం వల్ల నొప్పి వస్తుంది. స్పైనల్ డిస్క్ హెర్నియేషన్: ఎల్4, ఎల్5 నరాల రూట్స్ ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్‌లో ఒంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది. స్పైనల్ కెనాల్ స్టెనోసిస్: వెన్నుపూసల మధ్య ఒక సన్నటి కెనాల్ ఉండి, అందులో వెన్నుపాము నుంచి వచ్చే నరాల వ్యవస్థ ఉంటుంది. ఆ వెన్నుపూసల మధ్యనున్న నాళం (కెనాల్) సన్నబారడం వల్ల వెన్నుపాములోని నరాలు నొక్కుకుపోవడం వల్ల కూడా ఈ నొప్పి వస్తుంది. పెరిఫార్మిస్ సిండ్రోమ్ : దెబ్బలు, గాయాలు పెరిఫార్మిస్ అనే కండరం నర్వ్రూట్స్ను నొక్కుతుంది. దీనివల్ల కూడా సయాటికా నొప్పి వస్తుంది. శాక్రో ఇలియాక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్ : శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు. గర్భవతులకు, తమ ప్రెగ్నెన్సీ చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్రూట్స్ మీద ఒత్తిడి పడటం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పరీక్షలు : ఎక్స్‌రే తో పాటు ఎమ్మారై స్కాన్ సహాయంతో డిస్క్హార్నియేషన్, డిస్క్‌ప్రొలాప్స్ నిర్ధారణ చేయవచ్చు. ఏ నర్వ్‌రూట్ ఎక్కడ కంప్రెస్ అయ్యిందో తెలుసుకోవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. నొప్పిమాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, అసిడిటీ, అల్సర్ రావచ్చు. చికిత్స : సయాటికాకు రోగలక్షణాలు, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. ఇప్పుడు ఇందుకోసం రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్ వంటి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల సర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తిన్నవెంటనే కడుపునొప్పి... ఏమిటీ సమస్య? నా వయసు 43 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – జి. సుధీర్‌బాబు, విజయవాడ ►మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. ►అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ►జన్యుపరమైన కారణలు చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
నీటి బుడగల వల్లేనా...
నా వయసు 26 సంవత్సరాలు, తరచుగా జుట్టు ఊడుతుంది. అవాంఛిత రోమాలు వస్తున్నాయి. అండాశయంలో నీటిబుడగల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని విన్నాను. మా అమ్మ అండాశయంలో నీటిబుడగల సమస్య ఎదుర్కొంది. ఇది జెనెటికల్ ప్రాబ్లం అంటున్నారు. మా అమ్మాయికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? – కె.వందన, ఏటూరునాగారం నీటి బుడగల సమస్య అంటే ‘పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్’ (పీసీఓడీ) అనేది జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు వంటి వాటితో పాటు ఇంకా అనేక తెలియని కారణాల వల్ల ఏర్పడుతుంది. జన్యుపరమైన కారణాల్లో తల్లిదండ్రుల్లో సుగర్ వ్యాధి ఉండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి ఉన్నట్లయితే, అది వారి పిల్లల్లో, ఆ జన్యువుల వల్ల నీటి బుడగలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు మగవారిలో ఎక్కువగా ఉండే ఎండ్రోజెన్ హార్మోన్ ఆడవారిలో ఎక్కువగా స్రవిస్తుంది. దీనివల్ల అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం, మొటిమలు, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే సమస్యను రాకుండా ఆపలేము. కాకపోతే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల వాటి లక్షణాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. దీనిలో భాగంగా ఎక్కువ బరువు పెరగకుండా నడక, వ్యాయామాలు, యోగా, ధ్యానం, మితమైన పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చెయ్యడం మంచిది. అంతేకాకుండా డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణం నిర్ధారణ చేయించుకుని, దానికి తగ్గ మందులు ఎక్కువ కాలం వాడుతూ, అవాంఛిత రోమాలకు మందులతో పాటు చర్మవ్యాధి నిపుణుల సంరక్షణలో లేజర్ వంటి కాస్మొటిక్ చికిత్సలు తీసుకోవలసి ఉంటుంది. రాకుండా ముందు జాగ్రత్తలేమీ ఉండవు. నేను నిద్ర తక్కువగా పోతాను. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఈ సమయంలో ఎన్నిగంటలు నిద్ర పోవాలి? ఒకవేళ నిద్ర తక్కువైతే సమస్యలు ఎదురవుతాయా? మంచి నిద్ర కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో బ్యాక్‌పెయిన్, శ్వాస సమస్యల వల్ల నిద్ర సరిగ్గా పట్టదని చెబుతుంటారు. వీటికి అధిగమించడానికి ఏంచేయాలి అనేది తెలియజేయగలరు. – బి.నీరజ, హైదరాబాద్ గర్భిణులు రోజూ రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవడం మంచిది. గర్భిణులలో హార్మోన్లలో మార్పులు, శరీరంలో మార్పుల వల్ల తొందరగా అలసిపోవడం జరుగుతుంది. సరిగా నిద్రపోవడం వల్ల అలసట తగ్గుతుంది. నిద్ర తక్కువైతే రోజంతా చిరాకుగా, మగతగా ఉండటం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. గర్భం పెరిగి, పొట్ట పెరిగే కొద్దీ నడుం మీద భారం పడి, నడుము నొప్పి, అటూ ఇటూ తిరగడానికి ఇబ్బందితో నిద్ర సరిగా పట్టకపోవడం, పొట్ట, ఊపిరితిత్తుల మీద అదుముతున్నట్లయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడి నిద్ర సరిగా పట్టకపోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. రాత్రిపూట తొందరగా భోజనం చేసి కనీసం పదిహేను నిమిషాల పాటు మెల్లగా నడవడానికి ప్రయత్నించాలి. పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగడం మంచిది. దీనివల్ల బాగా నిద్రపడుతుంది. తల కింద దిండు కొద్దిగా ఎత్తుగా పెట్టుకుని పడుకుంటే, గ్యాస్ ఎక్కువ పైకి రాకుండా, ఊపిరితిత్తులు అదుముకోకుండా బాగా నిద్ర పడుతుంది. ఓరల్ ఐరన్ థెరపీ గురించి వివరంగా తెలియజేయగలరు. ప్రెగ్సెన్సీ సమయంలో ఇది తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి?– ఎన్.సరళ, విశాఖపట్టణం ఐరన్ మాత్రలను నోటి ద్వారా తీసుకోవడాన్ని ఓరల్ ఐరన్ థెరపీ అంటారు. సాధారణంగానే ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత తల్లి శరీరంలోని మార్పులకు, బిడ్డకు తల్లి ద్వారా పోషకాహారం వెళ్లడానికి రక్తం ఎంతో అవసరం. ఇందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకు చేరవేస్తుంది. కాబట్టి ఈ సమయంలో రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హీమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ అవసరం ఉంటుంది. ఐరన్ మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తంలోకి చేరుతుంది. ఇది ఎక్కువగా తాజా ఆకు కూరలు, బఠాణీలు, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలు, ఖర్జూరం, అంజీర, దానిమ్మ వంటి పండ్లలో, మాంసాహారంలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ తీసుకున్న ఆహారంలో కేవలం 10–20 శాతం మాత్రమే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి గర్భిణులు రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గకుండా, అలాగే రక్తహీనత ఉన్నప్పుడు కూడా రోజూ ఐరన్ మాత్రలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. హీమోగ్లోబిన్ శాతం బట్టి రోజుకు ఒకటి లేదా రెండు మాత్రలు చొప్పున సూచించడం జరుగుతుంటుంది. ఐరన్ మాత్రల వల్ల కొందరిలో మలబద్ధకం, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉండవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో ,హైదర్‌నగర్ హైదరాబాద్ -
పరీక్ష ఉంది.. పరిష్కారమూ ఉంది
పిల్లలు లేకపోవడం ఓ పెద్ద పరీక్ష. అందరూ సలహాలిచ్చేవాళ్లే! ‘లేకపోతేనేమీ? నీకు మీ ఆయన మీ ఆయనకు నువ్వు పిల్లలేగా’ అని సర్దిచెప్పే మంచివాళ్లూ ఉంటారు. ‘మన కడుపులో పడితేనేనా బిడ్డ?’ అంటూ చెప్పే గొప్పవాళ్లూ ఉంటారు. ఇక తప్పుబట్టి వెక్కిరించేవాళ్లూ ఉంటారు.వాళ్లను మనం పట్టించుకోనక్కర్లేదు. ఇదిగో మీ కోసం ‘సాక్షి’ పిల్లలు పుట్టడం కోసం చేయించాల్సిన పరీక్షల గురించి, వైద్య ప్రపంచంలోని పరిష్కారాల గురించి వివరాలు అందిస్తోంది. మీ పెద్ద ‘పరీక్ష’లో విజయం సాధించేలా చేయూతనందిస్తోంది. మీరు పాస్ కావాలని మా ఆకాంక్ష. కిందటి వారాల్లో మనం మహిళల్లో గర్భధారణకు అడ్డంకిగా ఉండే అనేక అంశాలను చర్చించాం. సాధారణ సామాజిక అంశాలు మొదలుకొని అండం విడుదలలో, గర్భాశయంలో, ఫెలోపియన్ ట్యూబ్స్‌లో, ఫలదీకరణ, ఇంప్లాంటేషన్ లోపాలు మొదలుకొని మానసిక అంశాలు సైతం గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తాయో చూశాం. ఆయా లోపాలను అధిగమించే మార్గాలనూ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో సంతానలేమితో బాధపడే మహిళకు తొలి నుంచీ చేసే అవసరమైన పరీక్షలూ, సంతానం కోసం నిర్వహించే ప్రక్రియల తాలూకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంతానలేమి సమస్యతో డాక్టర్ ఒక మహిళ దగ్గరికి రాగానే ముందుగా ఆమె వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) గురించి డాక్టర్ విపులంగా అడిగి తెలుసుకుంటారు. మెడికల్ హిస్టరీ : ...అంటే... ఆమె పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా; ఒకవేళ ఆ సమయంలో ఏమైనా ఇబ్బందులున్నాయా, ఆ జంట క్రమం తప్పకుండా సెక్స్‌లో పాల్గొంటున్నారా, కలయికలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా; ఆ జంట ఇద్దరిలోనూ ఎవరికైనా దీర్ఘకాలికంగా ఏవైనా జబ్బులు ఉన్నాయా; వాటి కోసం లేదా ఇతరత్రా ఏమైనా మందులు వాడుతున్నారా... వంటి అనేక అంశాలను అడిగి తెలుసుకుంటారు. దాంతో వారికి ఎలాంటి పరీక్షలు అవసరమవుతాయనే దానిపై డాక్టర్‌కు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ : ఆమె బరువు, ఎత్తు, బీఎమ్ఐ వంటి శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. పెల్విక్ పరీక్షతో పాటు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా గర్భసంచి సైజు, షేప్, పొజిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. దాంతో పాటు ఇన్ఫెక్షన్ లేదా పూత వంటివి ఏవైనా ఉన్నాయా, గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది వంటి వివరాలు తెలుస్తాయి. ట్రాన్స్ వెజైనల్ స్కానింగ్ : ఈ పరీక్షతో గర్భసంచి సైజు, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అండాశయంలో కణతులు, సిస్ట్ల వంటివి ఏవైనా సమస్యలు ఉన్నాయా వంటి అవకతవకల వివరాలు తెలుస్తాయి. అలాగే ఫాలిక్యులార్ స్టడీస్ ద్వారా పీరియడ్స్ మొదలైన 10వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదలవుతోందా, లేదా తెలుస్తోంది. ఆ విషయంలో తేడాలేమైనా ఉంటే అది ఎప్పుడు విడుదలవుతోందనేది కూడా తెలుస్తుంది. డాప్లర్ స్కానింగ్ : ఈ పరీక్ష ద్వారా అండం విడుదలయ్యే సమయంలో అండం చుట్టూ ఉండే ఫాలికిల్, గర్భాశయ పొరలోకి రక్త ప్రసరణ ఎలా ఉంది వంటి అనేక అంశాలను తెలుసుకోవచ్చు. రక్తపరీక్షలు : ఇందులో సాధారణ రక్తపరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలూ చేస్తారు. వాటిల్లో... రక్తం ఎలా ఉందో తెలుసుకునే బ్లడ్‌కౌంట్ పరీక్ష అవసరం. మహిళ గర్భధారణకు హీమోగ్లోబిన్ పాళ్లు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆరోగ్యకరమైన గర్భధారణకు మహిళ రక్తంలోని హీమోగ్లోబిన్ తగినంత ఉండాలి. హీమోగ్లోబిన్ రక్తహీనత సమస్య ఉంటే మహిళకు రక్తం (హీమోగ్లోబిన్) పెరగడానికి ఐరన్ మాత్రలు సూచిస్తారు. సాధారణంగా వాటితో పాటు మహిళకు భవిష్యత్తులో గర్భం వస్తే బిడ్డలో వెన్నుపూస సమస్యలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) రాకుండా ఉండేందుకు ఫోలిక్ యాసిడ్ మాత్రలూ సూచిస్తుంటారు. ఇక మరో సాధారణ రక్తపరీక్షలో మహిళకు డయాబెటిస్ సమస్య ఉందేమో తెలుసుకోవడం కోసం రాండమ్ బ్లడ్ షుగర్ (ఆర్బీఎస్) పరీక్ష కూడా చేస్తారు. రక్తంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే తెలుసుకోడానికి ఈఎస్ఆర్ పరీక్ష, హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్ఎల్ పరీక్షలు దంపతులిద్దరికీ చేయించాలి. ఇక మరో రకం రక్తపరీక్షలు కాస్తంత అడ్వాన్స్డ్గా పరిగణించవచ్చు. వీటిలో మహిళల గర్భధారణను ప్రభావితం చేసే హార్మోన్లయిన ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, టీఎస్‌హెచ్ (థైరాయిడ్), ప్రోలాక్టిన్ వంటివి నార్మల్‌గానే ఉన్నాయా లేదా వాటిలో ఏవైనా హెచ్చుతగ్గులున్నాయా అన్న విషయం అర్థమవుతుంది. అలాగే కొందరిలో సీరమ్ ఈస్ట్రోడయాల్, ఏఎమ్‌హెచ్ వంటి పరీక్షలు అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఇక మగవారికి సీమెన్ ఎనాలిసిస్ పరీక్ష చేయించడం ద్వారా శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత వంటి అంశాలు తెలుసుకోవచ్చు. వాటిలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు కారణం తెలుసుకోడానికి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. మరో ముఖ్యవిషయం ఏమిటంటే... మహిళలకు అడ్వాన్స్డ్ పరీక్షలు చేయించబోయే ముందు, పురుషులు కూడా తప్పనిసరిగా సీమెన్ ఎనాలిసిస్ పరీక్షలు చేయించాలి. మహిళకు అన్ని పరీక్షలు చేయించి, చికిత్స మొదలయ్యాక తర్వాత ఎప్పుడో పురుషులు సీమెన్ టెస్ట్ చేయించుకుని, దానిలో ఏమైనా లోపాలున్నట్లు తేలితే, అప్పటికే మహిళలకు చేయించిన పరీక్షలకూ, చికిత్సలకూ చాలా డబ్బు, సమయం వృథా అవుతాయి. ట్యూబ్ టెస్టింగ్ : ఫెలోపియన్ ట్యూబ్స్ తెరచుకొని ఉన్నాయా లేదా మూసుకుపోయాయా అన్న విషయం తెలుసుకోడానికి ఉపయోగపడే పరీక్ష. హిస్టరో సాల్పింగోగ్రామ్ అనే ఎక్స్–రే పరీక్ష ఇందుకు ఉపయోగపడుతుంది. పోస్ట్ కాయిటల్ టెస్ట్ : మహిళలోకి ప్రవేశించిన శుక్రకణాలను నిర్వీర్యం చేసే ‘యాంటీ స్పెర్మ్ యాంటీబాడీస్’ను తెలుసుకునేందుకు చేసే పరీక్ష ఇది. లాపరోస్కోపీ : కొంచెం మత్తు ఇచ్చి, పొట్ట మీద మూడు చోట్ల చిన్న గాట్లు పెట్టి, సన్నని గొట్టం వంటి స్కోప్‌తో లోపల గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్స్ పరిస్థితి తెలుసుకోడానికి ఉపకరించే పరీక్ష ఇది. అయితే ఏవైనా లోపాలుంటే ఇదే ప్రక్రియలో దానికి అప్పటికప్పుడు చికిత్స చేసే సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది. హిస్టరోస్కోపీ : సన్నని గొట్టం వంటి పరికరంతో గర్భసంచి లోపల ఏమైనా అడ్డుపొరలు (సెప్టమ్), కొయ్యకొండలు/అతుకులు (అడ్హెషన్స్), కండ పెరగడం (పాలిప్స్) వంటివి ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. ఉంటే అప్పటికప్పుడే చికిత్స కూడా చేయవచ్చు.కొంతమంది దంపతులలో అన్ని పరీక్షల్లోనూ ఎలాంటి లోపమూ కనిపించదు. అయినా వారికి సంతానం కలగకపోవచ్చు. ఇలా అన్ని బాగుండి కూడా సంతానం కలగకపోవడాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటారు. అయితే ఇక్కడ పేర్కొన్న అన్ని పరీక్షలూ, అందరికీ ఒకేసారి అవసరం ఉండవు. వాళ్ల వాళ్ల ఆరోగ్యచరిత్రనూ, పరిస్థితిని బట్టి వాళ్లలో ఉన్న లోపాల ఆధారంగా పరీక్షలు చేస్తుంటారు. కొన్ని కొన్ని పరీక్షల్లో బయటపడ్డ అంశాల ఆధారంగా ఆ తర్వాతి అడ్వాన్స్డ్ పరీక్షలు చేయడం కూడా జరుగుతుంటుంది. చికిత్సలు సంతానయోగం కోసం చేసే చికిత్సలు... ఆయా దంపతులకు ఉన్న సమస్యలను బట్టి ఉంటాయి. 20 – 30 శాతం మందిలో వారి శారీరక స్థితిపైనా, రుతుచక్రం, అండం విడుదల వంటి అంశాలపై అవగాహన పెంచుకొని, శ్రద్ధవహించి, కొంచెం ఓపిక చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చికిత్సలు అవసరం లేకుండానే గర్భం ధరించవచ్చు. కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే అవి ఇటు సంతానయోగ్యతకూ, అటు సాధారణ ఆరోగ్యానికీ మేలుచేస్తాయి. ఉదాహరణకు... ►మంచి ఆహార నియమాలు ►సరైన వ్యాయామంతో పాటు ఎత్తుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త తీసుకోవడం. ►జీవనశైలిలో మార్పులు... వీటిలో మంచి ఆహారం, సరైన వ్యాయామంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి అంశాలపై జాగ్రత్త వహించాలి. ►థైరాయిడ్ సమస్యలు : థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లలో లోపాలు ఉంటే దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. చాలామందిలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు దాన్ని సరిచేయగానే గర్భం ధరించే అవకాశం బాగా పెరుగుతుంది. అండం విడుదల జరగనప్పుడు : క్లోమఫిన్, లెట్రోజల్ వంటి మాత్రలను నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తగిన మోతాదుల్లో వాడాలి. అలాంటప్పుడు ఈ మాత్రలు వాడిన కొద్దిరోజుల్లోనే గర్భధారణ జరగడం నిపుణులు సాధారణంగా చూస్తుంటారు. ►మాత్రలతో అండం విడుదల కానప్పుడు, కొన్ని రకాల హార్మోన్ ఇంజెక్షన్లను ఇచ్చి చూస్తారు. దాంతో గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. ►గర్భాశయానికి ఇన్ఫెక్షన్ ఏవైనా ఉంటే... సరైన యాంటీబయాటిక్‌ను సరైన మోతాదుల్లో వాడటం వల్ల ... ఇక ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే గర్భధారణ జరుగుతుండటం నిపుణులు చూస్తుంటారు. డీ అండ్ సీ : కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉంటుంది. అలాంటప్పుడు డీ అండ్ సీ అనే చిన్న ఆపరేషన్ చేసి, యోని మార్గాన్ని వెడల్పు చేస్తారు. అలాగే గర్భసంచి లోపలి పొరను శుభ్రం చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల కొంతమందిలో గర్భాశయం లోపలి పొర ఆరోగ్యంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అవసరాన్ని బట్టి పొరను బయాప్సీకి పంపడం వల్ల, హార్మోన్ అసమతౌల్యతలు ఏవైనా ఉంటే తెలుస్తాయి. ఇన్ఫెక్షన్స్ వంటివి ఏవైనా ఉన్నా అవి బయటపడతాయి. అలాగే కొందరిలో ఈ పొరను టీబీ పరీక్షకు కూడా పంపించడం జరుగుతుంది. ఇందులో టీబీ నిర్ధారణ అయితే, దానికి చికిత్స తీసుకుంటే కూడా చాలామందిలో గర్భం నిలుస్తుంది. ► హిస్టరోసాల్పింగోగ్రామ్ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ తెరచుకొని ఉన్నాయా లేక మూసుకొని ఉన్నాయా అన్న విషయం తెలుస్తుంది. ఒకవేళ మూసుకుపోయినట్లు అనిపిస్తే, అప్పుడు లాపరోస్కోపీ ద్వారా ట్యూబ్స్ మూసుకుపోయిన విషయాన్ని నిర్ధారణ చేసుకుని, కొందరిలో చికిత్స కూడా చేయవచ్చు. మరికొందరిలో సర్జరీ ద్వారా మూసుకుపోయిన ట్యూబ్స్‌ను సరిచేయడానికి ప్రయత్నించవచ్చు. ►గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడ్డుపొరలు, అండాశయంలోని నీటిబుడగలను లాపరోస్కోపీ, హిస్టరోస్కోపీ ద్వారా సరిచేయవచ్చు. గర్భం దాల్చడానికి చేసే అడ్వాన్స్డ్ ప్రక్రియలు ఐయూఐ : కొంతమందిలో గర్భాశయ ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ లేదా పూత ఉన్నప్పుడు లేదా యాంటీ స్పెర్మ్ యాంటీబాడీస్ ఉన్నప్పుడు; వీర్యకణాలు గర్భాశయంలోకి వెళ్లలేనప్పుడు, మందుల ద్వారా ప్రయత్నించినా గర్భం రానప్పుడు ఇంట్రా యుటిరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) అనే ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందులో భర్త వీర్యాన్ని చిన్న కంటెయినర్లో సేకరించి, దాన్ని స్పెర్మ్ వాషింగ్ మీడియాలో శుభ్రపరచి, మంచి ఆరోగ్యవంతమైన వీర్యకణాలను వేరుపరచి, అండం విడుదలయ్యే రోజుల్లో గర్భాశయంలోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముందుగా సేకరించిపెట్టుకున్న ఆరోగ్యకరమైన వీర్యకణాలను ఒక సన్నటి కాన్యులాలోకి తీసుకుంటారు. సరిగ్గా అండం విడుదలయ్యే సమయానికి ఆ కాన్యులాను యోని ద్వారా గర్భాశయంలోకి పంపి అక్కడ వీర్యకణాలను ఇంజెక్ట్ చేస్తారు. దాంతో వీర్యకణాలు... యోని మొదలుకొని, గర్భాశయముఖద్వారంలోని అడ్డంకులను దాటుకొని, గర్భాశయం వరకు ప్రయాణించాల్సిన దూరం తగ్గుతుంది. ఇలాంటి అడ్డంకులు దాటడం వల్ల సాధారణ ప్రయత్నం కంటే గర్భం వచ్చేందుకు ఒకసారికి సాధారణం కంటే 10 – 20 శాతం ఎక్కువగా అవకాశాలు పెరుగుతాయి ఇలా ఐయూఐ ప్రక్రియను 3 నుంచి 6 సార్లు ప్రయత్నించవచ్చు. ట్యూబ్స్ తెరచుకొని ఉండి, గర్భాశయంలో ఎలాంటి అడ్డంకులు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఐయూఐకి ప్రయత్నించడం మంచిది. గర్భాశయంలోకి ప్రవేశించిన వీర్యకణాలు వాటంతట అవే అక్కడినుంచి ట్యూబ్స్‌లోకి ప్రయాణం చేయాలి. అక్కడ చేరిన అండంలోకి దూరి, దానికి ఫలదీకరణం చేయాలి. ఆ తర్వాత పిండం తయారై, అది గర్భాశయంలోకి చేరి, అక్కడ అంటుకుంటుంది. దీన్నే ఇంప్లాంటేషన్ అంటారు. అప్పుడది గర్భంగా (శిశువుగా) పెరుగుతుంది. వీర్యకణాలను లోపలికి వదిలాక మిగతావన్నీ వాటంతట అవే జరగాలి. అక్కడ ఏవైనా సమస్యలుంటే ఐయూఐతో వాటిని అధిగమించలేము. కాబట్టి ఒక మూడుసార్లు ఈ ప్రయత్నం చేయవచ్చు. మూడుసార్లకు ఈ ప్రక్రియతో సక్సెస్‌రేటు 30% వరకు పెరగవచ్చు. తర్వాత మళ్లీ ఒకసారి కారణాలను విశ్లేషించుకొని, సమస్యలను బట్టి చికిత్సను మార్చుకోవచ్చు. ఇలా మరో మూడు సార్లు ప్రయత్నం చేయవచ్చు. ఐయూఐ... ఎవరిలో, ఎప్పుడు? ఏ అన్నీ బాగున్నా గర్భం రాని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నవారికి ఏ సర్వైకల్ సమస్యలు ఉన్నవారికి ఏ సాధారణ చికిత్సలతో రానప్పుడు ఏ మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు ఏ కలయికలో సమస్యలు ఉన్నప్పుడు ఏ మగవారిలో అంగస్తంభన, స్ఖలనం (ఎరక్షన్, ఎజాక్యులేషన్) సమస్యలున్నప్పుడు ఏ వీర్యకణాల సంఖ్య కొద్దిగా తక్కువగా (అంటే 10 నుంచి 15 మిలియన్లు మాత్రమే)ఉండి, కదలికలు మందకొడిగా ఉన్నప్పుడు ఏ దాత వీర్యకణాలు వాడాల్సి వచ్చినప్పుడు సాధారణంగా అండం తయారవుతున్నా కూడా కొందరిలో ఎక్కువ అండాలు తయారు కావడానికీ, వాటి నాణ్యతకూ, సక్సెస్‌రేటు పెరగడానికి కొన్ని మందులు, ఇంజెక్షన్లు అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఐవీఎఫ్ లేదా టెస్ట్‌ట్యూబ్ బేబీ: పైన పేర్కొన్న పద్ధతిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేనప్పుడు, మరికొన్ని అధునాతన ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ఒకటి. దీన్నే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ అని కూడా అంటారు. ఫెలోపియన్ ట్యూబ్స్ పూర్తిగా మూసుకుపోయి, ఏమాత్రం సరిదిద్దడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఈ పద్ధతి ద్వారా గర్భం వచ్చేలా ప్రయత్నించవచ్చు. పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయి, మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు రీ–ఆపరేషన్ వల్ల ఉపయోగం లేకపోతే కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించవచ్చు. గుర్తుంచుకోండి గర్భధారణ కోసం పైన వివరించిన ప్రక్రియలన్నింటినీ ఒకేసారి నిర్వహించడం జరగదు. అవసరాన్ని బట్టి, దశల వారీగా ఒకటి తర్వాత మరొకటి ప్రయత్నించడం జరుగుతుంది. అందుకని దంపతులందరికీ ఇవన్నీ ఒకేలా వర్తించవు. కాబట్టి వారికి అవసరమైన నిర్ణీత ప్రక్రియను కనుగొనేందుకు కాస్త ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పిల్లల కోసం డాక్టర్ దగ్గరికి వచ్చే దంపతుల్లో కొందరికి చికిత్స మొదలుకాగానే తర్వాతి నెలలోనే గర్భం రావాలంటూ ఆత్రుత పడుతుంటారు. రెండు మూడు నెలలకే మరో డాక్టర్‌ను సంప్రదిస్తుంటారు. ఇలా డాక్టర్లను మారుస్తూ వారి సమయం వృథా చేసుకుంటుంటారు. ఒకరి సమస్యలు, శరీరతత్వం, లోపాల వంటివి తెలుసుకునేందుకే ఒక్కోసారి డాక్టర్‌కు రెండు నెలలు లేదా అంతకంటే కాస్తంత ఎక్కువ సమయం పట్టవచ్చు. పీరియడ్స్ సక్రమంగా లేకపోతే కొందరిలో పీరియడ్స్ సక్రమంగా ఉండవు. అంటే సాధారణంగా మహిళల్లో 28 నుంచి 30 రోజులకొకసారి పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా వచ్చే వారిలో పీరియడ్ మొదలైన మొదటిరోజు నుంచి లెక్కపెడితే 11 నుంచి 16వ రోజు లోపల చాలావరకు అండం విడుదల అవుతుంది. అయితే కొద్దిమందిలో విధిగా 35, 40 రోజలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. ఇలాంటి వారిలో పీరియడ్స్ కనపడటానికి 14 రోజుల ముందు అండం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే వారిలో పీరియడ్ వచ్చాక గానీ అండం ఎప్పుడు విడుదలయ్యిందో అంచనా వేయలేం. అంటే... వీరివిషయంలో జరిగేదేమిటంటే... ►నెలసరి సక్రమంగా రానివాళ్లలో అండం విడుదల కూడా సక్రమంగా ఉండదు. పీరియడ్‌కీ, పీరియడ్‌కీ మధ్య ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు. లేదా అసలు కాకపోనూవచ్చు. ►కాబట్టి సంతానం కావాలనుకునే దంపతుల్లో సక్రమంగా పీరియడ్స్ వచ్చేవారు పీరియడ్స్ వచ్చి 11 నుంచి 16 రోజుల సమయంలో తప్పక కలవాలి. పీరియడ్స్ సక్రమంగా రాని వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, ఆ మేరకు అవసరమైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలి. డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
అమ్మ కావాలని ఉందా?
అమ్మ కావడం చాలామందికి సులువు. కొందరిలో సమస్య ఉంటుంది.ఎదురుచూపు ఉంటుంది.అడ్డంకులు ఏమిటో బోధ పడవు.వైద్య సహాయానికి వెళితే సమస్య ఏమిటో తెలుస్తుంది.అది గర్భాశయంలో లోపం కావచ్చు, ట్యూబుల్లో అడ్డంకి కావచ్చు,ఫలదీకరణ సమస్య కావచ్చు, మానసిక ఒత్తిడీ కావచ్చు.డాక్టర్ని కలవండి. అవగాహన పెంచుకోండి. ఆనందంగా మాతృత్వపు మాధుర్యం అనుభవించండి. గత వారం సంతానలేమి తాలూకు కొన్ని అంశాల గురించి చర్చించాం. ‘అండాల విడుదలలో ఎదురయ్యే సమస్య’ గురించి, వాటికి పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మహిళల్లో సంతానలేమికి కారణమయ్యే మరికొన్ని అంశాల గురించి విపులంగా తెలుసుకుందాం. గర్భాశయంలో లోపాలు సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకు ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. ఉదాహరణకు... గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే మ్యూకస్ స్రావాలు మరీ చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోనిలోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉండటం వల్ల అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి. కొంతమందిలో సర్విక్స్ దగ్గర వీర్యకణాలకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ–స్పెర్మ్ యాంటీబాడీస్ ఉంటాయి. అవి వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోకి వెళ్లనివ్వవు. మరికొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడ్డుపొరలు (యుటెరైన్ సెప్టమ్) వంటి సమస్యలు ఉండటం వల్ల... అవి ఉన్న స్థితి (పొజిషన్), పరిమాణం (సైజు) వంటి అంశాలు గర్భధారణకు అడ్డుగా నిలవవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సమస్య తీవ్రతను బట్టి గర్భం దాల్చడం కష్టం కావచ్చు. పరీక్షలు/చికిత్స: స్పెక్యులమ్, వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా యోని, సర్విక్స్ భాగంలో ఉండే ఇన్ఫెక్షన్, పూత, గీరుకుపోయినట్లుగా అయ్యే పుండు (ఎరోజన్), సర్వైకల్ పాలిప్ వంటి సమస్యలను తెలుసుకోవచ్చు. అలాగే పాప్‌స్మియర్ పరీక్ష కూడా చేయించుకోవడం మంచిది. కేవలం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడటం వల్ల సమస్య సమసిపోతుంది. దీంతో పుండు తగ్గకపోతే అప్పుడు క్రయోకాటరీ (ఐస్ ట్రీట్మెంట్) చికిత్స అవసరమవుతుంది. పాలిప్ (కండపెరగడం) వంటి సమస్యలు ఉంటే, వాటిని శస్త్రచికిత్సతో తొలగించాలి. గర్భాశయ ముఖద్వారం కొందరిలో మరీ సన్నగా (సర్వైకల్ స్టెనోసిస్) ఉన్నప్పుడు దానిని డీ అండ్ సీ అనే చిన్న ప్రక్రియ ద్వారా వెడల్పుచేయడం వల్ల ఉపయోగం ఉండవచ్చు. ఇన్ఫెక్షన్, పూత, పుండు ఉన్నప్పుడు సర్విక్స్‌లో స్రవించే ద్రవాలు సరిగా లేకపోవడం వల్ల చికిత్స తీసుకున్నా గర్భం రాకపోతే ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) అనే పద్ధతి ద్వారా వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపడం జరుగుతుంది. పెల్విక్ స్కానింగ్ చేయడం వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ వంటి అనేక సమస్యలు తెలుస్తాయి. అవసరమైతే 3డీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి, సమస్య తీవ్రతను నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలను నిర్ధారణ చేసి, అదే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేయవచ్చు. లేదా పాత పద్ధతుల్లోనే పొట్టను కట్ చేయడం ద్వారా సర్జికల్ పద్ధతిలో వాటిని తొలగించవచ్చు. ఇక హిస్టరోస్కోప్ ద్వారా గర్భాశయం లోపలి పొరలో ఉండే పాలిప్స్, సెప్టమ్ (అడ్డుపొర), అడ్హెషన్స్ (అతుకులు), సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలను నిర్ధారణ చేసుకొని, వాటిని తొలగించవచ్చు. ఇలా గర్భధారణకు అడ్డుపడే అంశాలను కనుగొని, వాటిని తొలగిస్తే గర్భం దాల్చడానికి అవకాశాలు పెరుగుతాయి. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే...: అన్ని రకాల ఫైబ్రాయిడ్స్‌ను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్స్ గర్భాశయ పొరలో ఉన్నప్పుడు (సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) వాటిని తొలగించాల్సి వస్తుంది. గర్భాశయ కండరాల్లో ఉన్నవి (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) 5 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండి, సర్విక్స్ భాగంలో ఉండి, వీర్యకణాలను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుపడటం, పిండం పెరగకుండా చేయడం వంటి సమస్య ఏర్పడుతున్నప్పుడు మాత్రమే వాటిని తొలగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న ఫైబ్రాయిడ్లు, గర్భాశయం బయటకు ఉన్నవీ (సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్) గర్భం రావడానికి పెద్దగా అడ్డుపడకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటికి ఆపరేషన్ కచ్చితంగా చేయాలని ఏమీలేదు. ఎండోమెట్రియాసిస్ సమస్య ఉన్నప్పుడు, కొందరిలో గర్భాశయం లోపలిపొర (ఎండోమెట్రియమ్) కడుపులోకి వెళ్లడం, మరికొందరిలో గర్భాశయం బయటా, అండాశయం పైనా, ఇలా పలుచోట్ల అతుక్కొని నెలనెలా రుతుస్రావం సమయంలో లోపలివైపున రక్తస్రావం అయి, అక్కడ అండాశయంలో చాక్లెట్ సిస్ట్లూ, ట్యూబ్స్, గర్భసంచి, పేగులు... ఇలా అన్నీ అంటుకుపోయి అండం నాణ్యత, విడుదలలో, ఫలదీకరణలో ఇబ్బందులు ఏర్పడి, గర్భం రాకపోవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు అండాశయం నుంచి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ట్యూబ్‌లను ఫెలోపియన్ ట్యూబ్‌లు అంటారు. అండం అండాశయం నుంచి ఈ ట్యూబ్‌లలోకి చేరుతుంది. యోని నుంచి శుక్రకణాలు, గర్భాశయంలోనుంచి ట్యూబ్‌లలోకి చేరుతాయి. అండం, శుక్రకణంతో కలిసి, ట్యూబ్‌లో పిండంగా మారాక అది గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొరలోకి చేరిపోయి, శిశువుగా పెరుగుతుంది. గర్భం దాల్చడంలో ఫెలోపియన్ ట్యూబ్‌లు కూడా కీలకమైన భూమిక పోషిస్తాయి. అందుకే ఫెలోపియన్ ట్యూబ్లలో లోపాలు కూడా గర్భం రావడంలో అవరోధాలు కలిగిస్తాయి. గర్భాశయం నుంచి లేదా పొట్టలోని పేగుల నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఫెలోపియన్ ట్యూబ్స్కి చేరి వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేయడం వల్ల వాటి పనితీరు తగ్గుతుంది. అప్పుడు ట్యూబ్స్ వాయడం, తర్వాత అవి మూసుకుపోవడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రావడంతో పాటు కడుపులో ఏదైనా అపరేషన్ జరిగి ఉంటే ఆ కారణంగా, లేక ఎండోమెట్రియోసిస్‌తో కొందరిలో అతుకులు (అడ్హెషన్స్) ఏర్పడటం వల్ల ట్యూబ్స్ అండాశయాలకు దూరంగా జరుగుతాయి. దాంతో అండం ట్యూబ్లోపలికి ప్రవేశించదు. నిర్ధారణ ఇలా: ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి ఉన్నాయా లేదా తెరచుకుని ఉన్నాయా తెలుసుకోడానికి హిస్టరోసాల్పింగోగ్రామ్ (హెచ్ఎస్జీ) అనే ఎక్స్‌రే లేదా సోనోసాల్పింగోగ్రామ్ (ఎస్ఎస్జీ) అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో పరీక్ష చేసినప్పుడు పొట్టకండరం బిగుసుకుపోవడం వల్ల ట్యూబ్స్ బిగుసుకుపోయినట్లయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయని (అడ్డంకులు ఏర్పడ్డాయని) తప్పుడు రిపోర్ట్ రావచ్చు. చికిత్స: ట్యూబ్స్ మూసుకుపోయి ఉంటే, దాన్ని నిర్ధారణ చేసుకోడానికి లాపరోస్కోపీ ప్రక్రియలో డై–టెస్ట్ చేస్తారు. ఇందులో అడ్డంకి (బ్లాక్) ఎక్కడుందో చూసి, హిస్టరోస్కోపీ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్ కాన్యులేషన్ అనే ప్రక్రియతో దాన్ని తెరవడానికి ప్రయత్నించవచ్చు. ఇది కొందరికి ఉపయోగపడుతుంది. కొందరిలో సత్ఫలితం ఇవ్వకపోవచ్చు. కొందరిలో ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరి (హైడ్రో సాల్పింగ్), అవి వాచి, మూసుకుపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చికిత్స చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కారణం... ట్యూబ్స్ పాడైపోయి, వాటి పనితీరు సరిగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో గర్భం వచ్చినా అది ట్యూబ్స్‌లో ఇరుక్కుపోయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు ట్యూబ్స్‌లో కనీసం ఒక్కటైనా తెరచుకొని ఉంటే గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్యూబ్స్ రెండూ మూసుకుపోయినప్పుడు, అలాంటివారిలో గర్భం కోసం ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. కొందరిలో ఐవీఎఫ్‌కు వెళ్లేముందు ట్యూబ్స్‌లో హైడ్రోసాల్పింగ్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే, ట్యూబ్స్‌ను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే దానిలోనుంచి వచ్చే ద్రవం పిండం గర్భాశయంలో అతుక్కోకుండా చేస్తుంది. మానసిక కారణాలు మహిళల్లో కనిపించే మానసిక ఒత్తిడి అంశం కూడా గర్భధారణపై చాలావరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు, గర్భం రాలేదని బంధువుల, ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు, మానసిక వ్యథ వంటి కారణాల వల్ల గర్భధారణకు మొదటి నుంచీ అవసరమైన హార్మోన్ల విడుదలలో అసమతౌల్యత ఏర్పడి అండం విడుదల కాదు. అలాగే ఫలదీకరణ, ఇంప్లాంటేషన్‌లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇలాంటి వారికి బయట నుంచి ఎన్ని మందులు ఇచ్చినా, లోపల విడుదల కావాల్సిన హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల గర్భం రావడంలో ఆలస్యమవుతుంది. అందుకే మానసికంగా కుంగుబాటు వంటి సమస్యలను దరిచేరనివ్వకూడదు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు (వారితో పాటు ఇలాంటి సమస్యను దరిచేరనివ్వకూడదని భావించే సాధారణ ఆరోగ్యవంతులు కూడా) యోగా, ధ్యానం, వాకింగ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అవసరమైతే కౌన్సెలింగ్ వంటివి ప్రయత్నించవచ్చు. దాంతో మనకు తెలియకుండానే అసమతౌల్యత తొలగిపోయి, హార్మోన్లు సరిగా పనిచేసి, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంప్లాంటేషన్ సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్‌ల ద్వారా వచ్చే అండం అక్కడ శుక్రకణాలతో కలిశాక పిండంగా మారి, గర్భసంచిలోకి వచ్చి అక్కడ కాస్తంత పరుపులాగా తయారుగా ఉన్న ఎండోమెట్రియమ్ పొరలోకి అంటుకుపోయి శిశువుగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలా అండంగా మారిన పిండం, ఎండోమెట్రియమ్లోకి అంటుకుపోవడాన్ని ‘ఇంప్లాంటేషన్’ అంటారు. కొందరిలో ఈ ఇంప్లాంటేషన్ సమస్య వల్ల కూడా పిండం పెరగక సంతానలేమి సమస్య రావచ్చు. కారణమేమిటి: కొందరిలో ఎలాంటి సమస్యలూ కనిపించకపోయినా, అన్ని పరీక్షలూ మామూలుగా (నార్మల్‌గా)నే ఉన్నా, ప్రాథమికంగా వాడే మందులు వాడినా, నేరుగా వీర్యకణాలను లోపలికి తీసుకెళ్లి వదిలే ప్రక్రియ అయిన ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) చేసినా, పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు తీసుకెళ్లే ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) జరిపినా, లేదా వీర్యకణాలను నేరుగా అండంలోకే ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టే ఇక్సీ (ఐసీఎస్ఐ – ఇంట్రా సైటోప్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) పద్ధతి ద్వారా పిండాన్ని నేరుగా యుటెరస్ వరకు పంపినా గర్భం రాకపోవచ్చు. కొందరిలో గర్భాశయం పిండాన్ని స్వీకరించదు. ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు ఇంకా తెలియరావడం లేదు. ఇందుకోసం అనేక రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. పిండం ట్యూబుల్లోకి వచ్చి, గర్భాశయంలో అంటుకుంటేనే అది శిశువుగా రూపొందడం మొదలువుతుంది. ఇంప్లాంటేషన్గా చెప్పే ఈ సమయంలో అనేక రకాల హార్మోన్లు, రసాయనాలు, కెమికల్ మీడియేటర్లు, గర్భాశయ పొరలో రక్తప్రసరణ, ఇంకా బయటకు తెలియని చాలా ప్రక్రియలు అన్నీ సరిగా ఉన్నప్పుడే గర్భధారణ జరుగుతుంది. వాటిలో ఏదైనా సమస్య ఉంటే ఎన్ని చికిత్సలు చేసినా ఉపయోగం ఉండదు. అందుకే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా ప్రయత్నించినా, అందులోనూ 40% నుంచి 50% మేరకు మాత్రమే గర్భధారణ కలిగే అవకాశం ఉంటాయి. ఇంప్లాంటేషన్ సమస్యలకు చికిత్సలో భాగంగా ఐవీఎఫ్‌లో గర్భసంచిలోకి ఎండోమెట్రియమ్ పొరను ప్రేరేపించడం, పిండం పైనా, పొరకీ చిన్నగా చిల్లు పెట్టడం (అసిస్టెడ్ హ్యాచింగ్) వంటి ప్రక్రియలతో పాటు గర్భాశయం పిండాలన్ని తిరస్కరించకుండా ఉండటం కోసం, స్వీకరించేలా చేయడం కోసం యాంటీఇమ్యూన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్టెరాయిడ్స్ వంటి అనేక రకాల మందులతో చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. కొందరిలో ఎన్ని చేసినా ఇంప్లాంటేషన్ నూటికి నూరు పాళ్లు విజయవంతం కాకపోవచ్చు. ఫలదీకరణ (ఫర్టిలైజేషన్) సమస్యలు ప్రతినెలా అండాశయం నుంచి విడుదలైన అండం ట్యూబ్‌లలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి విడుదలైన తర్వాత అండం 24 గంటలు మాత్రమే జీవిస్తుంది. (అంటే యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత నిర్వీర్యమవుతుంది). ఆ సమయంలో కలయిక ద్వారా విడుదలైన వీర్యకణాలు ట్యూబ్‌లలోకి చేరి అండాన్ని చుట్టుముడతాయి. అనేక వీర్యకణాల నుంచి విడుదలయ్యే హైలురానిక్ యాసిడ్ వంటి అనేక ఎంజైములు... అండం మీద చిల్లుపడేలా చేస్తాయి. అందులోనుంచి ఒక్క వీర్యకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే చిల్లు మూసుకుపోతుంది. అలా ఒక వీర్యకణం, అండం కలిసి ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపాలు ఉన్నాగానీ గర్భం రాకపోవచ్చు. ఈ ప్రక్రియలో శుక్రకణాలు గర్భాశయంలో వెళ్లిన తర్వాత అక్కడ వాటి సంఖ్య తక్కువగా ఉన్నా, వాటి నాణ్యత (క్వాలిటీ), కదలిక (మొటిలిటీ) సరిగా లేనప్పుడు, వాటి నుంచి విడుదలయ్యే ఎంజైములు సరిగా ఉండనప్పుడు గర్భం రాదు. అలాగే అండం నాణ్యత సరిగా లేకపోయినా, అండంపైన పొర బాగా మందంగా ఉన్నా ఫలదీకరణ జరగకపోవచ్చు. వీర్యకణాలు 48 గంటల నుంచి 72 గంటల వరకు జీవించి ఉంటాయి. ఫలదీకరణ లోపాలను తెలుసుకోవడం మామూలుగా కష్టం. పరీక్షలలో వేరే సమస్యలు ఏవీ కనిపించనప్పుడు దంపతులకు ఒక కోర్స్ యాంటీబయాటిక్, మల్టీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ మాత్రల వంటి రకరకాల మందులు ఇచ్చి చూడటం జరుగుతుంది. అన్ని రకాలుగా ప్రయత్నించినా ఐయూఐ చికిత్స చేసినా గర్భం రానప్పుడు ఫలదీకరణలో సమస్యలు ఉన్నట్లుగా భావించి, ఆ దంపతులకు ఐవీఎఫ్, ఇక్సీ (ఐసీఎస్ఐ / టెస్ట్‌ట్యూబ్ బేబీ) పద్ధతులను సూచించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో అండాలను శుక్రకణాలను మైక్రోస్కోప్ కింద విశ్లేషించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి కొన్ని లోపాలను సైతం గుర్తించే అవకాశం ఉంది. అందులో అనేక అండాలను, శుక్రకణాలను నేరుగా ల్యాబ్‌లో అనేక న్యూట్రిషన్ మీడియాలో కలిపి చూస్తారు. కాబట్టి ఈ ప్రక్రియల ద్వారా ఫలదీకరణ సమస్యలను అధిగమించవచ్చు. అయినా ఫలదీకరణ కాకపోవడం జరగడం, వాటి నాణ్యత బాగా లేకపోయినా, అవసరమైతే దాతల నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను కూడా దంపతులు ఆమోదిస్తే వాడి చూడవచ్చు. తెలియని కారణాలు: (అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ): కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా, ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయినా ఎంతకూ గర్భం రాదు. ఇందుకు కారణాలు తెలియదు. డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్ -
హీరోయిన్ సంజనకు సర్జరీ
సాక్షి, బెంగళూరు : 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ నటి సంజనా గల్రానీకి సర్జరీ జరిగింది. తన అండాశయంలో పెరిగిన 550 ఎమ్ఎల్ డెర్మాయిడ్‌ని సర్జరీ చేసి తీసివేశారని సంజన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు తెలిపారు. అందుకే దాదాపు ఒక నెల నుంచి ఎక్కువగా బయటకు రావడం లేదని పేర్కొన్నారు. ప్రతి మహిళ కనీసం ఆరునెలలకొకసారి అయినా మమ్మోగ్రామ్ చేపించుకోవాలని, అండాశయం, గర్భాశయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 45 సినిమాల్లో సంజనా నటించారు. సంజనా ప్రస్తుతం తెలుగులోని ఓ ప్రముఖ టీవీ చానెల్లో ప్రసారమవుతున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్లో నటిస్తున్నారు. -
దానివల్ల బిడ్డకు ప్రమాదమా?
నా వయసు 40, నేను ఈ మధ్యకాలంలో చాలా బరువు తగ్గిపోయాను. కారణమేమిటో అర్థం కావట్లేదు. సిస్ట్ క్యాన్సర్ లక్షణాల్లో బరువు తగ్గిపోవడం ఉంటుందని ఓ పుస్తకంలో చదివాను. అసలు ఎలాంటి లక్షణాల ద్వారా సిస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకోవచ్చు? సిస్ట్ క్యాన్సర్ ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ చర్యలను వివరంగా తెలియజేయగలరు. – జి.బిందు, హైదరాబాద్ సిస్ట్ క్యాన్సర్ అన్నారు కానీ అది ఎక్కడ అనేది వివరంగా రాయలేదు. సిస్ట్ క్యాన్సర్ అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. శరీరంలో ఎక్కడైనా కూడా సిస్ట్లు తయారు అవుతాయి. మరీ గట్టి పదార్థాలు కాకుండా ఏదైనా ద్రవంతో నిండిన తిత్తులను సిస్ట్లు అంటారు. ఇవి చర్మంపైన రావచ్చు. అన్ని అవయవాలలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఇది ఎందుకు..? ఎలా ఏర్పడతాయి..? అనే విషయాలు కచ్చితంగా చెప్పలేము. చాలావరకు సిస్ట్లు అపాయం కానివే ఉంటాయి. కొన్ని మట్టుకే క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. సెబేసియస్ సిస్ట్, ఒవేరియన్ సిస్ట్, ఎండోమెట్రియల్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ వంటివి ఎన్నో మన శరీరంలో ఏర్పడుతుంటాయి. ఇవన్నీ క్యాన్సర్లు అవ్వాలని ఏమి లేదు. క్యాన్సర్ సిస్ట్ లక్షణాలు ప్రాధమిక స్టేజీలో పెద్దగా కనిపించవు. అవి మెల్లగా పెరుగుతూ ఉండి మిగితా అవయవాలకు పాకేటప్పుడు ఇవి ఏ అవయవంలో వచ్చాయనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. కడుపులో నొప్పి, కడుపు బరువుగా ఉండటం, ఆకలిలేకపోవడం, నీరసం, బరువు తగ్గటం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు క్యాన్సర్ పాకే కొద్ది.. ఏర్పడతాయి. ఇవి అనేక వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి చాలావరకు వీటిని అశ్రద్ధ చెయ్యడం, లేదా నిర్ధారణ ఆలస్యం కావచ్చు. సిస్ట్ క్యాన్సర్లు అన్నింటికి నివారణ మార్గాలు చెప్పలేము. చెడు అలవాట్లు లేకుండా.. పౌష్టిక ఆహారం తీసుకుంటూ.. వ్యాయామాలు చేసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినప్పుడు కొంతవరకు కొన్ని రకాల క్యాన్సర్లకు నివారణ మార్గం అవుతుంది. నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. నాకు కామెర్లు వచ్చాయి. దీనివల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం ఉంటుందా? ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వివరంగా తెలియజేయగలరు. – జి.సృజన, కరీంనగర్ గర్భంలో ఉన్నప్పుడు అనేక రకాల కారణాల వల్ల.. లివర్ పనితీరులో మార్పుల వల్ల.. బైలురూబిన్ పదార్థం రక్తంలో ఎక్కువగా చేరుకుని జాండిస్ అంటే పచ్చకామెర్లు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల, రక్తంలో మార్పులవల్ల, హీమోలైటిక్ జాండిస్, జ్వరాలు, గాల్‌బ్లాడర్ స్టోన్స్, బీపీ పెరగడం వల్ల, కొన్ని మందుల వల్ల, హార్మొన్లలో మార్పుల వల్ల జాండిస్ రావచ్చు. మాములు వారిలో కంటే గర్భిణిలలో జాండిస్ వస్తే అది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. ప్రెగ్నెన్సీలో జాండీస్ వల్ల తల్లిలో లివర్ పనితీరు సరిగా ఉండదు. అంతే కాకుండా ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటాయి. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సరిగా పనిచేయవు. దానివల్ల గర్భిణీలలో అధిక బ్లీడింగ్, బిడ్డ కడుపులో చనిపోవడం, కిడ్నీలపై ప్రభావం, అవి దెబ్బతినటం, తల్లి కోమాలోకి వెళ్లిపోవటం, ప్రాణాపాయం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు. నీకు కామెర్లు ఏ కారణం చేత వచ్చాయి అని తెలుసుకోవటానికి డాక్టర్ పర్యవేక్షణలో అనేక రక్తపరీక్షలు చెయ్యించుకుని నిర్ధారణ చెయ్యించుకోవాలి. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవాలు, నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు, ప్రొటీన్ కలిగిన పోషకపదార్ధాలు తీసుకోవటం అన్నివిధాలా మంచిది. డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్లటం, రక్తపరీక్షలు క్రమం తప్పకుండా చెయ్యించుకుంటూ ఉండటం ముఖ్యం. జాండిస్ తీవ్రతను బట్టి చికిత్స తీసుకుంటూ కాన్పును అన్ని వసతులు ఉన్న హాస్పిటల్లో చేయించుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే పెను ప్రమాదం తప్పదు. నా వయసు 25, నాకు ఈ మధ్యకాలంలో అవాంఛిత రోమాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ విషయం నా ఫ్రెండ్‌కి చెబితే.. ‘నువ్వు ఈ మధ్యకాలంలో లావు కూడా అయ్యావు కదా! నీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చి ఉంటుంది’ అని చెప్పింది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి వివరంగా తెలియజేయగలరు. దీనివల్ల పురుషలక్షణాలు వస్తాయట నిజమే? వివాహం చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయా?– కె.ఎన్, పిడుగురాళ్ల గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో అండాలు పెరిగే చిన్న ఫాలికల్స్ ఉంటాయి. కొందరిలో ఈ ఫాలికల్స్ ఉండవలసిన సంఖ్య కంటే ఎక్కువగా చిన్న చిన్న నీటి బుడగలు లాగా ఉంటాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇది హార్మొన్ల అసమతుల్యత వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. ఇవి ఉన్నవారిలో టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ ఆడవారిలో ఉండవలసినదానికంటే ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల అవాంఛిత రోమాలు, (పై పెదవిపైన, చెంపలపైన, గడ్డాలపైన, ఇతర శరీరభాగాలపైన) మొటిమలు, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా తయారుకావడం తలపైన జుట్టు రాలడం, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడవచ్చు. దీనినే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. వివాహం తర్వాత హార్మొన్ల సమతుల్యత సరిగా లేకపోవడంత వల్ల, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం తయారు కాకపోవడం, దాని వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. గర్భందాల్చిన తర్వాత, అబార్షన్లు, షుగర్ రావటం వంటి సమస్యలు రావచ్చు. అశ్రద్ధ చేస్తే, తర్వాత కాలంలో షుగర్, బీపీ వంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్నవారు వాకింగ్‌తో పాటు వ్యాయామాలు చెయ్యడం, బరువు పెరగకుండా చూసుకోవడం, ఆహారంలో నియమాలను పాటించడం వంటి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల పాలిసిస్టిక్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఇంకా ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో లక్షణాల తీవ్రతను బట్టి మందులు వాడుకోవడం అన్నివిధాలా మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్\ -
ఫైబ్రాయిడ్స్ మళ్లీ మళ్లీ రాకుండా తగ్గించవచ్చా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 46 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – సుహాసిని, విశాఖపట్నం గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు: ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ బాబుకు ఏడీహెచ్‌డీ.. తగ్గుతుందా? మా బాబు వయసు ఆరేళ్లు. ఎప్పుడూ కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. పదే పదే ఒకే మాట రిపీట్ చేస్తుంటాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్‌కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – ఎస్. రంగారావు, భీమవరం ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. సమస్యకు కారణాలు: ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. లక్షణాలు: ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ: రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స: హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గుతాయా? నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఈ సమస్యతో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు వస్తుంది? హోమియోతో పరిష్కారం లభిస్తుందా? – ఆర్. శంకర్రావు, కావలి చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం ∙జన్యుపరమైన కారణాలు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్లలో లోపాలు ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఫైబ్రాయిడ్స్ సమస్య తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 41 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎల్. నాగమణి, నూజివీడు గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఐబీఎస్‌కు పరిష్కారం చెప్పండి నా వయసు 36 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే ఐబీఎస్ అన్నారు. మందులు వాడినా ఏమీ తగ్గలేదు. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – వి. చంద్రశేఖర్‌రావు, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి.సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్య పానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ పొద్దున్నే మడమల్లో నొప్పి... తగ్గేదెలా? నా వయసు 45 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. విశ్నాంతి తీసుకున్నప్పుడు తగ్గి, మళ్లీ నడవగానే వస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. నా సమస్య పరిష్కారం కోసం హోమియో పరిష్కారం చెప్పండి. – ఆర్. చంద్రలేఖ, అనకాపల్లి అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి వస్తుంది. దాంతో పాటు మడమ నొప్పి, వాపు కూడా కనిపిస్తుంది. ఉదయం పూట మొట్టమొదట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి కలుగుతుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. కారణాలు : డయాబెటిస్ ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో) లక్షణాలు : మడమలో పొడినట్లుగా నొప్పి ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం కండరాల నొప్పులు చికిత్స : మడమనొప్పికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
హార్మోన్ల లోపంతో నెలసరి సక్రమంగా లేదు.. ఏం చేయాలి?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 22 ఏళ్లు. హార్మోన్ లోపంతో నెలసరి సరిగా రావడం లేదు. బరువు పెరుగుతోంది. హోమియోలో చికిత్స ఉందా? – ఎస్. శ్రీవాణి, కాకినాడ గర్భాశయంలోని పిండ దశ మొదలుకొని జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం చూపుతుంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణకు తోడ్పడతాయి.ఈ హార్మోన్లు అన్నీ రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసౌమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. ఇది నిర్ధారణ అయితే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మందులు బాగా పనిచేస్తాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్ నయమవుతుందా? నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాను. యానల్ ఫిషర్‌కు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటే భయం. హోమియోలో చికిత్స ఉందా? – వి.వి. సుందరరావు, అమలాపురం మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అప్పుడు మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇలా రోగి ముక్కే సమయంలో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ బాబుకు ఆటిజమ్ తగ్గుతుందా? మా బాబు వయసు మూడేళ్లు. ఇటీవల వాడెప్పుడూ ఒంటరిగా ఉండటం, చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ చెబుతుండటంతో డాక్టర్‌కు చూపించాం. డాక్టర్ పరీక్షించి ‘ఆటిజమ్’ అన్నారు. అంటే ఏమిటి? దీనికి హోమియోలో చికిత్స ఉందా? – డి. సురేశ్‌కుమార్, నల్లగొండ ఒకప్పుడు ఆటిజమ్‌ను పాశ్చాత్యదేశాలకు చెందిన రుగ్మతగా భావించేవారు. అయితేఇటీవల ఈ కేసులు మన దగ్గర కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఆటిజమ్ అంటే... చిన్న పిల్లల్లో మానసిక వికాసం చక్కగా జరగని, నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మతగా చెప్పవచ్చు. ఇలాంటి పిల్లలు నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఆటలు ఆడకుండా ఉండటం, చేసిన పనినే పదే పదే చేయడం, వల్లించిన మాటనే మళ్లీ మళ్లీ మాట్లాడటం వంటివి చేస్తారు. వారు నేర్చుకునే పదసంపద (వకాబులరీ) కూడా తక్కువే. కారణాలు: ఆటిజమ్‌కు నిర్దిష్టమైన కారణం తెలియకపోయినా ప్రధానంగా జన్యుపరంగా ఇది వస్తుందని భావిస్తున్నారు. అలాగే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం, ఆమె భారలోహాలకు ఎక్స్పోజ్ కావడం, యాంటీడిప్రెసెంట్ తీసుకోవడం లేదా ఆమెకు పొగతాగే / మద్యం తీసుకునే అలవాటు ఉండటం, చాలా ఆలస్యంగా గర్భందాల్చడం, జీవక్రియల్లో అసమతౌల్యత, ప్రసవం సమయంలో బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వంటివి దీనికి కారణం. లక్షణాలు: బిడ్డ పుట్టిన ఆర్నెల్ల నుంచే ఆటిజమ్ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే సాధారణంగా రెండేళ్లు లేదా మూడేళ్ల సమయంలోనే తల్లిదండ్రులు వాటిని గమనిస్తారు. చిన్నపిల్లల్లో సహజంగా ఉండాల్సిన కమ్యూనికేటిషన్ నైపుణ్యాలు లోపించడం ద్వారా పేరెంట్స్ ఆటిజాన్ని గుర్తిస్తారు. పిల్లలు నేరుగా మాట్లాడేవారి కళ్లలోకి చూడకుండా ఉండటం, తమ వయసు పిల్లలో ఆడుకోకపోవడం, వారి వయసుకు తగినన్ని మాటలు నేర్చుకోకపోవడం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. తీవ్రతను బట్టి దీన్ని మైల్డ్, ఒక మోస్తరు (మోడరేట్), తీవ్రమైన (సివియర్) ఆటిజమ్గా వర్గీకరించవచ్చు. చికిత్స: హోమియోలో ఆటిజమ్‌కు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే ఆటిజమ్‌ను చాలావరకు నయం చేయవచ్చు. ఇలాంటి పిల్లల్లో చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆరేడు ఏళ్ల వయసులో చికిత్స ప్రారంభించినా మంచి ఫలితాలే కనిపించడం హోమియో చికిత్సలోని విశిష్టత. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ గౌట్ సమస్యను తగ్గించవచ్చా? నా వయసు 37 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. మందులు వాడినా సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎల్. రామేశ్వర్రావు, నిజామాబాద్ గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
అమ్మో..కణితి
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం డాన్బరిలోని ఓ ఆస్పత్రిలో 38 ఏళ్ల మహిళ అండాశయం నుంచి తొలగించిన 60 కిలోల కణతి ఇది. రెండు నెలల పాటు వారానికి అసాధారణంగా 5 కిలోల చొప్పున బరువు పెరుగుతున్నట్లు గుర్తించిన ఆమె వైద్యులను సంప్రదించడంతో అది కణతి అని తెలిసింది. దాని పరిమాణం రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆమె జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో ఆమెకు తక్కువ పోషకాలు ఉన్న ఆహారమిచ్చి క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారా ఫిబ్రవరిలో కణతిని విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. -
ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 40 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స అవసరమనీ, అయితే భవిష్యత్తులో తిరగబెట్టవచ్చని అంటున్నారు. మళ్లీ రాకుండా హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? – శ్రీదుర్గ, విజయవాడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తుల్లా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కారణాలు : ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఆపరేషన్ లేకుండా పైల్స్ నయం చేయవచ్చా? నా వయసు 38 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా? – రమేష్‌బాబు, కందుకూరు పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. రకాలు : ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ∙ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స : హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం మందులతోనే సమస్య నయమయ్యేలా చేయవచ్చు. పైల్స్ చికిత్స కోసం బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వీటిని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ స్పాండిలోసిస్‌కు పరిష్కారం చెప్పండి నా వయసు 39 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె. రామారావు, నల్లగొండ ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు : ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : ∙సర్వైకల్ స్పాండిలోసిస్ : మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ∙లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స : రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 42 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా?– సుధారాణి, కర్నూలు గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు: ఇవి ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి! నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి. – శ్రీదేవి, కొత్తగూడెం మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య ఎక్కువ. లక్షణాలు: ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో మంట! నా వయసు 28. ఈమధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఒక సోదరి, విజయవాడ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ►అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ►లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ప్రభావితమవుతాయి. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి హోమి యో మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఇన్ఫెక్షన్స్ రాకుండా..?
పొత్తి కడుపు ఇన్ఫెక్షన్లు రాకుండా ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరంగా తెలియజేయగలరు. – కె.స్వాతి, వరంగల్ పొత్తికడుపులో గర్భాశయం, ట్యూబ్‌లు, అండాశయాలు, మూత్రాశయం, పేగులు వంటి ఎన్నో అవయవాలు ఉంటాయి. వీటిలో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చినా దానిని పొత్తికడుపు ఇన్ఫెక్షన్ కిందే పరిగణించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల, పొత్తికడుపులో నొప్పి, మూత్రం మంట, జ్వరం, విరోచనాలు, నడుంనొప్పి, వాసనతో కూడిన తెల్లబట్ట వంటి అనేక లక్షణాలు, ఇన్ఫెక్షన్ సోకిన అవయవాన్ని బట్టి ఉంటాయి. సాధారణంగా శారీరక పరిశుభ్రత, మంచినీళ్లు రోజుకి కనీసం 2–3 లీటర్లు తాగడం, జననేంద్రియాల శుభ్రత, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకి శుభ్రపరుచుకోవడం, పౌష్టికాహారం, బయట అపరిశుభ్ర ఆహారం తీసుకోవటం, రక్తహీనత లేకుండా చూసుకోవడం, ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవడం వంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చాలావరకు పొత్తికడుపు ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. కొద్దిగా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినా, వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవటం వల్ల, ఇన్ఫెక్షన్ మరింత సోకే ప్రమాదం రాకుండా అరికట్టవచ్చు. ∙ ప్రెగ్నెన్సీ సమయంలో ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల లావు పెరిగే అవకాశం ఉందా? – జీఆర్, అమలాపురం ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్‌లో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో చేప శరీరం నుంచి తీసే సప్లిమెంట్స్‌లో ఉండే డీహెచ్ఏ మరియు ఈపీఏ అనే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ శిశువు యొక్క మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే బిడ్డ కళ్లకు కూడా మంచిది.వీటివల్ల తల్లికి కూడా చర్మానికి, గుండెకి మంచిది. అలాగే బీపీ పెరిగే అవకాశాలు, నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, మన శరీరంలో తయారు కావు. వీటిని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్లాగా మాత్రమే మన శరీరంలోకి చేరుతాయి. ఇవి చేపలు తినడం వల్ల లభ్యమవుతాయి. వెజిటబుల్ ఆయిల్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, డార్క్ లీఫీ వెజిటబుల్స్ (పాలకూర), సోయా బీన్స్, బ్రొకోలీ వంటి వాటిలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, చేపలలో దొరికేంత కాకపోయినా, కొద్దిగా లభ్యమవుతాయి. సప్లిమెంట్స్ బదులు చేపలు వారానికి ఒకటి రెండుసార్లు తీసుకోవటం వల్ల ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్స్, విటమిన్ డి, అయోడిన్, సెలీనియమ్ వంటి పోషక పదార్థాలు కూడా లభ్యమవుతాయి. ఈ సప్లిమెంట్స్ వల్ల లావు పెరగరు. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటూ, కాన్పు తర్వాత కూడా మూడు నెలలపాటు తీసుకోవటం వల్ల, తల్లిపాల ద్వారా బిడ్డకు ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ectopic pregnancyఅనేది ప్రమాదకరమని విన్నాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. దీనికి సంబంధించిన సంకేతాలను ముందుగా ఎలా తెలుసుకోవచ్చు? – పీఎన్, శ్రీకాకుళం సాధారణంగా అండాశయం నుంచి అండం విడుదలయ్యి ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశించి, యోని భాగం నుంచి వీర్య కణాలు గర్భాశయం ద్వారా, ట్యూబ్‌లోకి ప్రవేశించిన తర్వాత, వీర్య కణం అండంలోకి దూరుతుంది. తద్వారా అండం ఫలదీకరణ చెంది, అది వృద్ధి చెందుతూ పిండంగా మారి, పిండం గర్భాశయంలోకి ప్రవేశించి, గర్భాశయ పొరలోకి అతుక్కుని, గర్భం పెరగడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పిండం, గర్భాశయంలోకి ప్రవేశించకుండా, ట్యూబ్‌లోనే ఉండిపోయి అక్కడ పెరగడం మొదలవుతుంది. కొందరిలో అండాశయంలో, పొత్తి కడుపులో, సర్విక్స్‌లో కూడా పిండం పెరగవచ్చు. గర్భాశయంలో కాకుండా పిండం ఇతర భాగాలలో పెరగడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది 95% ట్యూబ్స్‌లో ఏర్పడుతుంది. పెరిగే పిండానికి అనుగుణంగా గర్భాశయం సాగినట్లు, ట్యూబ్స్ సాగలేవు కాబట్టి, కొంత సమయానికి ట్యూబ్స్ పొత్తికడుపులో పగిలిపోయి విపరీతమైన కడుపునొప్పి, కడుపులో బ్లీడింగ్ అయిపోవటం, తల్లి షాక్‌లోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తిస్తే, ప్రాణాపాయ స్థితిని తప్పించుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ట్యూబ్స్‌లో ఇన్ఫెక్షన్ వల్ల, లేదా ఎన్నో తెలియని కారణాల వల్ల, ట్యూబ్స్ పాక్షికంగా మూసుకోవటం, లేదా వాటి పనితీరు సరిగా లేకపోవటం వల్ల పిండం గర్భాశయంలోకి ప్రవేశించలేక ట్యూబ్‌లోనే ఉండిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. ఇందులో లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. కొందరిలో పీరియడ్ రావలసిన సమయానికి కొద్దికొద్దిగా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కనిపించడం, కొందరిలో పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి ఉండటం. కొందరిలో పీరియడ్ మిస్ అయ్యి, ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన తర్వాత, కొద్దిగా స్పాటింగ్ అవ్వటం, కడుపులో విపరీతమైన కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి ఎమర్జెన్సీ పరిస్థితులలో హాస్పిటల్‌కు రావటం జరుగుతుంది. ఈ పరిస్థితిని వెజైనల్ స్కానింగ్ చేయించుకోవటం ద్వారా తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించవచ్చు. కొందరిలో గుర్తించేటప్పటికే ట్యూబ్ పగిలిపోయి, కడుపులో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆపరేషన్ చేసి ట్యూబ్ తీసివేయవలసి ఉంటుంది. చాలా ముందుగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తిస్తే, చాలావరకు కొందరిలో ఆపరేషన్ లేకుండా మందులు, ఇంజెక్షన్ల ద్వారా కరిగించే ప్రయత్నం చేయవచ్చు. - డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ కూకట్పల్లి హైదరాబాద్ -
కడుపులో నొప్పి, అజీర్ణం... తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 42. కడుపులో విపరీతమైన మంట, నొప్పి వస్తున్నాయి. కడుపు ఉబ్బరం. డాక్టర్ గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఇది హోమియో ద్వారా నయమవుతుందా? – ఆర్. రాంబాబు, శ్రీకాళహస్తి జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా కొనసాగితే క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: 20 – 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్ర చికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: హోమియో వైద్య విధానంలో గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం ఉంది. మూల కారణాలైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మాకు పిల్లలు పుడతారా? నా వయసు 32. వివాహమై ఎనిమిదేళ్లయింది. సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీకి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? – సరోజ, కోదాడ ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ∙హార్మోన్ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్ ∙పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు: ∙ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. గర్భాశయంలో లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా: థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
నేను గర్భసంచిని..
గులాబి రంగులో ఉండే కండర సంచిని నేను. పొత్తికడుపు లోపల లిగమెంట్ల మధ్య ముడుచుకుని ఉంటాను. చూడటానికి పియర్ పండు ఆకారంలో ఉంటాను. నా బరువు దాదాపు 60 గ్రాములు ఉంటుంది. కొన్ని కణా సముదాయాన్ని లక్షల కోట్ల సంక్లిష్ట కణాలతో కూడిన కొత్త శిశువుగా మారేంత వరకు పోషిస్తాను. నేను ఆనంద్ భార్య లలిత గర్భసంచిని. బోలుగా ఉండే కండరాన్ని నేను బోలుగా ఉండే కండర నిర్మిత అవయవాన్ని. నా లోపలి భాగం దాదాపు ఒక టీస్పూన్ ద్రవపదార్థాన్ని ఇముడ్చుకునేందుకు అనువుగా ఉంటుంది. నా కండరాలు తరచు ముడుచుకుంటూ ఉంటాయి. అయితే, ఫలదీకరణ చెందిన అండానికి ఈ కండర సంకోచాలు ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు నా కండరాలను రిలాక్స్ చేసేందుకు లలిత అండాశయం ప్రొజెస్టిరాన్ హార్మోన్‌ను స్రవించడం ప్రారంభిస్తుంది. కొత్త జీవికి ఆస్కారమిచ్చేలా ప్రొజెస్టిరాన్ నన్ను సన్నద్ధం చేస్తుంది. ఫలదీకరణ చెందిన అండం ఎదుగుదలకు తగిన పోషకాలను స్రవించేలా నాలోని గ్రంథులను ప్రేరేపిస్తుంది. బిడ్డ పుట్టిన వేళ లలితకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు నేనెంతగానో సంతోషించాను. నా ఘనతను ప్రదర్శించే అవకాశం దక్కినందుకు గర్వంతో పొంగిపోయాను. లలిత అండాశయం విడుదల చేసిన అండం ఎట్టకేలకు ఫలదీకరణ చెందింది. కణ విభజన మొదలైంది. కణాల సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉంటే, ఫాలోపియన్ ట్యూబ్ నుంచి తాపీగా వాటికి ఆహారం అందేది. అండం నాలోకి చేరే సరికి దానిలోని సొన మాయమవుతుంది. ఆ సమయానికి దానికి ఆధారపడదగ్గ పోషణ వెంటనే అందాల్సిందే. లేకుంటే, కొత్త ప్రాణి మనుగడ సాగించే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అలాంటి పరిస్థితులను నేను చాలాసార్లే ఎదుర్కొన్నాను. అండం నాలోకి చేరేటప్పుడు నాలోని ఎండోమెట్రియమ్ను అంటిపెట్టికోవాలంటూ సంకేతాలిస్తుంది. ఇక అప్పుడు దానికి నిరంతరం ఆహారం సరఫరా చేసే ఒక సురక్షితమైన, వెచ్చని గూడు ఏర్పడుతుంది. బొడ్డుతాడే ఆధారం. నాలోకి కొత్తగా చేరిన అతిథికి తొమ్మిది నెలల పాటు ఇరవై నాలుగు గంటలూ పోషణ అందించాల్సిందే. ఇందుకు నాలో ఏర్పడే ప్లాసెంటా ఎంతగానో సాయం చేస్తుంది. ఫలదీకరణ చెందిన అండం నుంచి ముందుగా మెడ భాగం మొలకెత్తుతుంది. క్రమంగా ఇది దాదాపు కిలో బరువుతో ఎర్రని పిండం ఏర్పడుతుంది. దీని చుట్టుకొలత దాదాపు 18 సెంటీమీటర్లు ఉంటుంది. చూడటానికి ఇదేమంత అందంగా కనిపించదు. ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు, జీర్ణాశయం... వేటికవే పనిచేస్తూ ఉంటాయి. పిండానికి అంటిపెట్టుకుని ఏర్పడే బొడ్డుతాడే శిశువుకు ఆధారంగా ఉంటుంది. బాహ్యప్రపంచంలోకి వచ్చేంత వరకు దానికి ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. బొడ్డుతాడులో రెండు ధమనులు, ఒక సిర ఉంటాయి. ఇందులోని ధమనులు శిశువుకు చెందిన వ్యర్థాలను ప్లాసెంటాలోకి చేరుస్తాయి. అక్కడ ఇవి విచ్ఛిన్నమై లలిత రక్తంలో కలుస్తాయి. ఆ తర్వాత ఆమె లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తుల ద్వారా బయటకు పోతాయి. బొడ్డుతాడుకు ఉండే సిర ద్వారా లలిత రక్తం నుంచి శిశువుకు నిరంతరం పోషకాలు అందుతూ ఉంటాయి. నొప్పులతో నవ శిశూదయం ఒకరోజు నొప్పులు మొదలయ్యాయి. నాలోని శిశువు బయటి ప్రపంచంలోకి వచ్చేయాలని ఆత్రపడుతోంది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోగానే నేను ప్రసవానికి సిద్ధపడ్డాను. వెన్నులోంచి నొప్పి తన్నుకొస్తుంటే, వేలుమొన అంత పరిమాణంలో ఉండే నా సెర్విక్స్ పన్నెండు సెంటీమీటర్ల వ్యాసానికి వ్యాకోచించి, శిశువు తల బయటకు రావడానికి అనువుగా మారింది. క్రమంగా నాలోని కండర సంకోచాలను పెంచుకుంటూ పోయి, శిశువును బయటకు నెట్టడానికి ప్రయత్నించాను. లలిత పొట్ట కండరాలు, డయాఫ్రమ్ కూడా నా ప్రయత్నానికి సహకరించాయి. ఎట్టకేలకు శిశువు ఈ లోకంలోకి అడుగుపెట్టింది. ఇక నా ప్లాసెంటాతో పనిలేదు. దానిని కూడా బయటకు నెట్టేశాను. ఇక రక్తస్రావాన్ని అరికట్టడానికి వీలుగా తెరుచుకున్న నా రక్తనాళాలపై ఒత్తిడి పెంచాను. నాతో ఇబ్బందులివే లలిత జీవితంలో నేను తనకు రకరకాల ఇబ్బందులు కలిగించాను. ఆమె శరీరంలోని సమస్యాత్మక అవయవాల్లో నేనే మొదటి స్థానంలో ఉంటాను. నాతో లలితకు తరచు ఎదురయ్యే ఇబ్బంది ‘డిస్మెనోరియా’... రుతుక్రమం సమయంలో ఒక్కోసారి ఆమెకు నా వల్ల విపరీతమైన నొప్పి కలిగేది. నా కండర గోడలపై ఒక్కోసారి తెల్లని గడ్డలు (ఫైబ్రాయిడ్స్) పెరుగుతాయి. ఇవి కేన్సర్ కావచ్చేమోనని లలిత తెగ భయపడేది. అయితే, రెండువందల మందిలో ఒకరికి మాత్రమే ఈ గడ్డలు కేన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి నాలోని లైనింగ్ సక్రమంగా పెరగకుంటే, రుతుక్రమంలో అతిగా రక్తస్రావం కావడం, వేళ తప్పి రుతుక్రమం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ‘డైలేషన్ అండ్ క్యూరెటేజ్’ అనే చిన్నపాటి శస్త్రచికిత్సతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ప్రాణం పోస్తాను కొత్త జీవికి ప్రాణం పోయడంలో నాలో జరిగే ప్రక్రియ చాలా తేలికైనదని అనుకుంటారు. అయితే, అదంతా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఒక్కోసారి ఇది నన్ను తీవ్ర నిరాశకు కూడా గురిచేస్తుంది. నేను యుక్తవయసుకు వచ్చినప్పటి నుంచి మెనోపాజ్ దశ వరకు ప్రతినెలా రుతుక్రమాన్ని ఎదుర్కొంటూనే ఉంటాను. జీవితకాలంలో దాదాపు 400 సార్లు ఇలా జరుగుతుంది. నెలనెలా జరిగే ఈ ప్రక్రియ గొప్ప రసాయనిక చర్యతో కూడి ఉంటుంది. నాలో కొత్త రక్తనాళాలు, కొత్త గ్రంథులు, కొత్త కణజాలాలు తయారవుతూ ఉంటాయి. లలిత అండాశయంలో తయారయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంతో ఇదంతా జరుగుతుంది. కొత్త ప్రాణికి తగిన పోషణ అందించేందుకు వీలుగా నాలోని లైనింగ్ ఎరుపుగా మారుతుంది. సుతిమెత్తగా ఉండే ఎండోమెట్రియమ్ దళసరిగా మారుతుంది. గర్భధారణకు సిద్ధమయ్యే ఈ ప్రక్రియలో ప్రతిసారీ గర్భం దాల్చలేకపోవచ్చు. లలితకు ఇప్పటి వరకు మూడుసార్లు గర్భధారణ జరిగింది. నాలో మూడు మార్గాలు నాలో మూడు మార్గాలు ఉంటాయి. రెండు ఫాలోపియన్ ట్యూబులు ప్రతినెలా లలిత అండాశయం ఒక అండాన్ని విడుదల చేసేలా నా ఎగువ భాగానికి పోషణనిస్తుంటాయి. నాలోని మూడో మార్గం బోలుగా ఉండే గడ్డిపరకలాంటి నాళం. ఇది నా సెర్విక్స్ గుండా వ్యాపించి ఉంటుంది. పురుషుడి వీర్యం నాలోకి చేరడానికైనా, నాలో ప్రాణం పోసుకున్న శిశువు బయటకు రావడానికైనా ఇదే మార్గం. అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయంలో నా సెర్విక్స్లోని మ్యూకస్ గ్రంథులు ఒక ప్రవాహాన్ని సృష్టిస్తాయి. పురుషుడి వీర్యం దీనిలోంచి ఈదుకుంటూ అండాన్ని చేరుకుంటుంది. పురుషుడి వీర్యం అండాన్ని చేరుకున్నాక నేను కొత్త ప్రాణికి రూపునిచ్చే పనిలో పడతాను. అయితే, అన్నిసార్లూ అండం ఫలదీకరణ చెందలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ ప్రక్రియ కోసం సిద్ధమైన నాలోని కొత్త కణజాలం, గ్రంథులు, రక్తనాళాలను నేను వెలుపలకు పంపేయాల్సిందే. లలితకు రుతుక్రమం రాగానే నాలో జరిగే ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది. శిశువుతో పాటేనేనూ పెరుగుతాను ఫలదీకరణ చెందిన అండం నాలోకి చేరిన మొదటి నెలలోనే శిశువు నెమ్మదిగా ఆకారం సంతరించుకోవడం మొదలుపెడుతుంది. నాలో రోజురోజుకు పెరుగుతున్న శిశువుతో పాటే నేనూ పెరుగుతాను. అలా నా అసలు పరిమాణానికి 500 రెట్ల వరకు పెరుగుతాను. ఇలా పెరగడంలో బాగా బలాన్ని సంతరించుకుంటాను. నాలోని కండరాల పరిమాణమే కాదు, బరువు కూడా పెరుగుతాయి. పియర్ పండులాంటి నా ఆకారం క్రమంగా గోళాకారాన్ని సంతరించుకుంటుంది. ఏడోనెల వరకు శిశువు తరచు ఇటూ అటూ తిరుగుతూనే ఉంటుంది. ఏడో నెల తర్వాత గురుత్వాకర్షణ ప్రభావానికి లోనవుతుంది. శరీరంలోని మిగిలిన అవయవాల కంటే బరువుగా ఉన్న తల కింది వైపు పెట్టుకుని ఉంటుంది. గర్భస్థ స్థితిలో దాదాపు 96 శాతం శిశువులు ఇలాగే ఉంటారు. తొమ్మిదో నెల నిండే సరికి నేను బాగా పెరగడంతో పొట్టలోని చాలాభాగాన్ని ఆక్రమించేసుకుంటాను. అప్పటికి నా పని దాదాపు పూర్తయ్యే దశకు వస్తుంది. -
గైనకాలజీ కౌన్సెలింగ్
ఆ పుండుకు ఎన్నో కారణాలు... నా వయసు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ట్యూబెక్టమీ అయిపోయింది. నాకు ఈమధ్య కొద్దికాలంగా పీరియడ్స్ ముగిశాక, అప్పుడప్పుడూ కొంచెం స్పాటింగ్ అవుతోంది. కొన్నిసార్లు కలయిక తర్వాత కూడా కనిపిస్తోంది. డాక్టర్ని సంప్రదిస్తే గర్భాశయ ముఖద్వారానికి పుండు ఏర్పడిందని అన్నారు. మందులు రాసిచ్చారు. అవి వాడి రెండు వారాల తర్వాత రమ్మన్నారు. పుండు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని తెలిసిన వారు భయపెడుతున్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - కల్పన, పాలకొల్లు గర్భసంచి ముఖద్వారానికి పుండు అంటే సర్వైకల్ ఎరోజన్ అయి ఉండవచ్చు. అంటే అక్కడ ఉండే స్క్వామస్ ఎపిథీలియల్ పొర దెబ్బతిని దాని కింద ఉండే కాలమ్నార్ ఎపిథీలియల్ పొర, దాని రక్తనాళాలు బయటకు ఎర్రగా కనిపించడాన్ని సర్వైకల్ ఎరోజన్ ఉంటారు. కాలమ్నార్ ఎపిథీలియమ్లో మ్యూకస్ గ్రంథులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి నీళ్లలాగా వైట్‌డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. అక్కడ లోపలి పొర, అక్కడి రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటంతో ఏదైనా దెబ్బతగలడం వల్ల ఎర్రగా కందిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా స్క్వామస్ ఎపిథీలియల్ పొర దెబ్బతినడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఇన్ఫెక్షన్లు, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఎక్కువ మోతాదులో వెలువడటం, ఎక్కువకాలంపాటు గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల ఇలా జరగవచ్చు. ఇంకా ఎన్నో తెలియని కారణాలు కూడా ఉండవచ్చు. కొంతమందిలో సాధారణ కాన్పుల తర్వాత గర్భాశయ ముఖద్వారం దెబ్బతిని పుండు ఏర్పడవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే, పచ్చిగా ఉన్న పుండు వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి అంటే గర్భాశయంలోకి, అక్కడినుంచి పొత్తికడుపులోకి పాకి, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి వంటి ఇతర సమస్యలు రావచ్చు. పుండు ఉన్న ప్రాంతంలోని రక్తనాళాల మీద ఒత్తిడి పడటం వల్ల అప్పుడప్పుడూ స్పాటింగ్ కనిపించవచ్చు. ఇది చాలా అరుదుగా మాత్రమే క్యాన్సర్‌గా మారుతుంది. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్‌లోని ఆరంభదశలో పుండు కూడా ఒక భాగం. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... అన్ని పుండ్లూ క్యాన్సర్ కాదు. పుండు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేక క్యాన్సర్ వల్లనా అనేది నిర్ధారణ చేయడానికి పాప్‌స్మియర్ అనే చిన్న స్క్రీనింగ్ పరీక్ష చేయించడం తప్పనిసరి. ఈ పరీక్షలో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే సర్వైకల్ బయాప్సీ చేసి అది ఎటువంటిదో నిర్ధారణ చేసుకోవాలి. పాప్‌స్మియర్ రిపోర్టులో అది కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే అని వస్తే, దానికి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. భయపడనవసరం లేదు. కొంతమందిలో ఇది దానంతట అదే తగ్గిపోతుంది కూడా. మరికొంతమందిలో మందులు, ఇంజెక్షన్లతో నయం అవుతుంది. కాకపోతే క్రయోకాటరీ (ఐస్ ట్రీట్మెంట్) లేదా ఎలక్ట్రోకాటరీ వంటి చికిత్సలతో దీన్ని నయం చేయవచ్చు. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
సరోగసీ మోసే మారుటమ్మే అద్దె అమ్మ! పెంచే అసలు తల్లే మాయమ్మ!!
సాధారణంగా ఒక స్త్రీ కడుపు పండి, పండంటి బిడ్డను ప్రసవించడానికి పిండాన్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే ఆమె శరీరంలోని అనేక అవయవాలు... అంటే గర్భాశయం, అండాశయం, ఫెలోఫియన్ ట్యూబ్స్... ఇవన్నీ సక్రమంగా పనిచేయాలి. అలాగే హార్మోన్లన్నీ సక్రమంగా విడుదలవ్వాలి. వీటితో పాటు భర్త శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత కూడా ప్రధానమే. ఈ అన్ని అంశాలలో ఏ ఒక్కదాని పనితీరు సక్రమంగా లేకపోయినా గర్భధారణ ప్రక్రియలో ఆటంకం ఎదురవుతుంది. చాలా సందర్భాల్లో 100 మంది దంపతుల్లో 80 మందికి గర్భధారణకు ఏడాది వ్యవధి పట్టవచ్చు. మిగతా 20 మందిలో పదిమందికి రెండేళ్లు పట్టవచ్చు. అయితే చివరి పది మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుంది. వీరిలోనూ 80 శాతం మందికి సమస్యను బట్టి హార్మోన్ల (మాత్రలు, ఇంజెక్షన్లు)తో చికిత్స చేస్తే గర్భం దాలుస్తారు. మిగతా 20 మందికి ఐయూఐ, ఐవీఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునికమైన, ఖర్చుతో కూడిన చికిత్సా విధానాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా సాధ్యపడనప్పుడు కొన్ని సందర్భాల్లో ‘సరోగసీ’ పద్ధతిని ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు కొందరు బిడ్డలను పెంచాలనే తమ కోరికను సాకారం చేసుకోడానికి బిడ్డను పెంచుకుంటారు. మరికొందరు బిడ్డ తమ సంతానమై ఉండాలనే తపనతో ‘సరోగసీ’ ప్రక్రియను ఆశ్రయిస్తారు. సరోగసీ అంటే... ఒక స్త్రీకి తన అండాశయం తాలూకు అండాల వల్లనే గర్భధారణ జరిగినా, అది పిండంగా మారాక, తన సొంత కడుపు (గర్భాశయం)లో ఆ పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు సదరు పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచడానికి వేరేస్త్రీ ముందుకు వస్తే... అలా ముందుకు వచ్చిన తల్లిని సరోగేట్ మదర్ అంటారు. సరోగేట్ మదర్ ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి,ప్రసవం అయ్యాక బిడ్డను అసలు తల్లికి ఇచ్చేస్తుంది. ప్రక్రియను ‘సరోగసీ’ అంటారు. సరోగసీ... ఎవరికి, ఎప్పుడు? అండాశయాలు ఉండి, గర్భాశయం లేకపోవడం. అది పుట్టుకతో లేకపోవడం గానీ లేదా ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి వచ్చిన సందర్భంలో. గర్భాశయంలో పుట్టుకతో లోపాలు ఉండటం; టీబీ లాంటి ఏదైనా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల గర్భాశయం పాడవడం; లోపలి పొర సన్నగా ఉండటం; అతుకులు ఉండటం. గర్భాశయంలో గడ్డలు; గర్భాశయంపైన చాలాసార్లు ఆపరేషన్ చేయడం; దానివల్ల గర్భం దాల్చినా నెలలు నిండేవరకు గర్భం నిలవకపోవడం. తీవ్రమైన మధుమేహం; గుండెజబ్బులు; కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటివి ఉండి గర్భం దాల్చడం వల్ల తల్లి ప్రాణానికే ముప్పు ఉన్నప్పుడు; కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు. అన్ని రకాల పరీక్షలూ, చికిత్సలూ చేసినా మాటిమాటికీ అబార్షన్లు అవుతూ ఉంటే. ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకపోతే. సింగిల్ పేరెంట్‌గా ఉండదలచిన వాళ్లు. సరోగసీలో రకాలు జెస్టేషనల్ సరోగసీ ఇందులో దంపతుల నుంచి సేకరించిన అండాన్ని, శుక్రకణాలని ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియ ద్వారా ల్యాబ్‌లో ఫలదీకరణ చేసి, తద్వారా వచ్చిన పిండాన్ని వేరొక స్త్రీ (సరోగేట్ మదర్) గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇలా వచ్చే గర్భం వల్ల జన్మించే బిడ్డ జన్యుపరంగా దంపతులిద్దరికీ చెందినదయ్యే ఉంటుంది. (గర్భాన్ని వేరే తల్లి (సరోగేట్ మదర్)మోసినప్పటికీ). కొందరిలో అండం సరిగా లేనప్పుడు దాత నుంచి తీసిన అండాన్ని, భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చేయించి, తద్వారా తయారైన పిండాన్ని సరోగేట్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. సాంప్రదాయిక సరోగసీ (ట్రెడిషనల్ సరోగసీ) ఇందులో భార్య అండాలు, అండాశయం సరిగా లేనప్పుడు భర్త శుక్రకణాలను సరోగేట్ మదర్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. పిండం సరోగేట్ మదర్ గర్భంలో పెరిగేలా చేస్తారు. కమర్షియల్ సరోగసీ ఇందులో గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్)కి గర్భాన్ని మోసినందుకూ, ఆమె సమయాన్ని వెచ్చించినందుకూ, వైద్యపరమైన ఖర్చులకూ... ఇలా వీటన్నింటితో పాటు ఇంకా కొంత ఎక్కువ డబ్బును అందజేస్తారు. ఇలా సరోగసీ ద్వారా గర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. ఇక రష్యా, థాయిల్యాండ్, ఉక్రెయిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్నింటిలో సరోగసీకి ఆమోదం ఉంది. అయితే ఇంగ్లాండ్‌లో కమర్షియల్ సరోగసీకి ఆమోదం లేదు. ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ ఇందులో గర్భాన్ని మోసే తల్లి డబ్బు కోసం చూసుకోదు. తన సొంత బంధువులు లేదా స్నేహితుల సంతృప్తి కోసం డబ్బు ప్రమేయం లేకుండా ఈ పని చేస్తుంది. సాధారణంగా దంపతుల బంధువులు, స్నేహితులు ఈ పనికి ఒప్పుకుంటారు. సరోగసీ జరిగేదిలా... దంపతుల్లోని స్త్రీకి లేదా అండం దానం చేసే దాతకు అండాలు తయారయ్యేలా చికిత్స అందిస్తూ ఉండగానే... అదే సమయంలో సరోగేట్ మదర్ గర్భాశయం పిండాన్ని స్వీకరించేందుకు వీలుగా అయ్యేలా చికిత్స చేస్తారు. అండాశయంలో తయారయ్యే అండాలను బయటకు తీసి వాటిని భర్త తాలూకు శుక్రకణాలతో (కొన్ని పరిస్థితుల్లో దాత శుక్రకణాలతో) ఫలదీకరణం చేయిస్తారు. తద్వారా తయారయ్యే పిండాన్ని సరోగేట్ మదర్ గర్భాశయంలోకి పంపిస్తారు. తర్వాత సరోగేట్ మదర్ తాలూకు గర్భాశయం ఆ పిండాన్ని స్వీకరిస్తే... సాధారణ గర్భం నిలిచి, పెరిగినట్లే... ఈ గర్భమూ నిలుస్తుంది. పెరుగుతుంది. అయితే ఒక్కోసారి గర్భం నిలిచినా ఆ తర్వాత అందరి గర్భవతుల్లోలాగే వీరిలో కూడా అబార్షన్లు, అవయవలోపాలు, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్టబద్ధమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సరోగసీకి సంబంధించిన చట్టాలు, విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. భారత్‌లో అద్దె గర్భం ఆమోదయోగ్యమే కానీ... భారతదేశంలో గర్భాన్ని అద్దెకు తీసుకోవడం 2002 నుంచి ఆమోదయోగ్యంగానే ఉంది. 2008 నాటికి సుప్రీం కోర్టు అధికారికంగా అనుమతించింది. అయితే దీనికి సంబంధించి సరైన నియమావళి లేదు. ఇక 2005లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. పూర్తిస్థాయి చట్టం కోసం మన దేశంలోని ఐయూఎఫ్ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, ఈ రంగాలకు సంబంధించిన ఇతర నిపుణులు కలిసి సరోగసీ సంబంధిత చట్టాన్ని రూపొందించేందుకు గాను ఒక ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు. అయితే ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్లో బిల్లుగా ఇంకా ప్రవేశపెట్టలేదు. ఐసీఎమ్ఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర కుటుంబసంక్షేమ శాఖ కలిసి ఏఆర్టీ రెగ్యులేషన్ బిల్ 2010ని రూపొందించాయి. అయితే ఈ బిల్లు ఇంకా భారత న్యాయశాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. గత కొన్నేళ్లుగా భారతదేశం సరోగసీకి పెట్టింది పేరుగా తయారవుతోంది. స్వదేశీయులే కాకుండా, విదేశీయులు కూడా ఈ చికిత్సా విధానం కోసం మన దేశానికి వస్తున్నారు. మన మహిళల గర్భాలను అద్దెకు తీసుకుంటున్నారు. అయితే విధిలేని పరిస్థితుల్లో ఆచరించాల్సిన నైతిక ప్రక్రియకూ, డబ్బు కోసం పాటించే అనైతిక విధానాలకూ మధ్య తేడాలను గుర్తించినప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఆధునికతను అనైతికత కోసం ఉపయోగిస్తే అది అనర్థాలకు దారి తీస్తుంది. ఆ తేడాను గుర్తించి విచక్షణ ఉన్నప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది. సరోగసీకి మొగ్గు చూపడానికి కారణాలివే... ఈ ఆధునిక కాలంలో ఇటీవల ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, కెరియర్‌కు ఎక్కువగా ప్రాముఖ్యమివ్వడం, గర్భధారణను బాగా ఆలస్యం చేయడం వల్ల వారి శరీరంలో హార్మోన్లపరమైన మార్పులు వచ్చి గర్భధారణ కోరుకున్నప్పుడు జరిగేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం, సాధారణ చికిత్స, ఐవీఎఫ్లతోనూ గర్భం దాల్చలేకపోవడం వల్ల కొంతమంది సరోగసీకి వెళ్తున్నారు. మరికొందరు గర్భాన్ని మోయడానికి భయపడటం, అన్ని నెలల సమయాన్ని గర్భాన్ని మోయడానికి కేటాయించలేకపోవడం, శరీర ఆకృతి పాడవుతుందేమోననే భయంతో కొందరు సరోగసీకి వెళ్తున్నారు. కానీ ఇది నైతికంగా ఆమోదయోగం కాదు. చట్టబద్ధంగా కూడా దీనికి ఆమోదం లేదు. సరోగసీ ప్రక్రియకు వెళ్లాలంటే ఉండాల్సిన అర్హతలు దంపతుల వయసు 21 - 45 మధ్య ఉండాలి ఇద్దరి ఆరోగ్యపరిస్థితి బాగుండాలి ఎలాంటి కాంప్లికేషన్లు ఉండకూడదు జన్యుపరమైన సమస్యలు ఉండకూడదు ఒకవేళ అంతకుముందే వారికి పిల్లల ఉంటే మంచిదే. ఎందుకంటే అది వారి ప్రత్యుత్పత్తి ఆరోగ్యం బాగుందన్న అంశానికి ఒక సూచన గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ మూడు సార్ల కంటే ఎక్కువగా తన గర్భాన్ని అద్దెకు ఇవ్వకూడదు. బిడ్డ పుట్టాక ఇచ్చే బర్త్ సర్టిఫికేట్లో దంపతులిద్దరి పేర్లనే రాస్తారు. ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే ఒక్కరి పేరే ఉంటుంది. డబ్బుకోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ వాళ్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టి దాదాపు రూ. 50,000 నుంచి రెండు లక్షల వరకు వసూలు చేయవచ్చు. మన దేశ మహిళల గర్భాలకు గిరాకీ...? కమర్షియల్ సరోగసీకి సుప్రీం కోర్టు ఆమోదం తర్వాత విదేశీయులు సైతం భారతీయ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కోసం ఇక్కడికి విరివిగా వస్తున్నారు. దీంతో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందింది. దాంతోపాటు విదేశీయులకు ఆ సేవలందించేందుకు వీలుగా అధునాతన వైద్య ఉపకరణాలు, మౌలిక సదుపాయాలు, అత్యున్నత స్థాయి నిపుణుల ఆవిర్భావం... ఇవన్నీ జరిగాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. విదేశీ మహిళల్లాగా మన దేశ మహిళల్లో ధూమపానం, ఆల్కహాల్ వంటి దురలవాట్లు లేకపోవడం వల్ల మన దేశ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇక మన దేశంలోని పేదరికం వల్ల సరోగసీకి సిద్ధపడే మహిళలు ఎక్కువ. వీళ్లు విదేశీ మహిళలతో పోలిస్తే చాలా చవకగా లభించడం వల్ల ఇక్కడ సరోగసీకి ప్రాధాన్యం పెరిగింది . పైగా సరోగసీ ప్రక్రియ కోసం విదేశాల్లో చేయాల్సిన ఖర్చుతో పోలిస్తే మన దేశంలో జరిగే వ్యయం కేవలం ఐదో వంతు మాత్రమే. ఉదాహరణకు యూఎస్ఏలో సరోగసీ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చు రూ. 40 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉంటుంది. అదే మన దేశంలో ఇది రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉండవచ్చు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలు ఇవే... సరోగసీకి వెళ్లాలంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విధించిన మార్గదర్శకాలివే... సాధారణంగానే గర్భధారణ జరిగి, ప్రసవం అయ్యేందుకు అవకాశం ఉన్న దంపతులకు సరోగసీకి అవకాశం లేదు. సరోగసీ ఒప్పందాలు చట్టబద్ధంగా అమలు చేయడానికి యోగ్యమైనవి. (లీగల్లీ ఎన్‌ఫోర్సబుల్) ఒకవేళ వివాహిత ... సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకుంటే భర్త అనుమతి తప్పనిసరి. గర్భాన్ని అద్దెకు వచ్చే సరోగేట్ మదర్... అలా మూడు సార్లకు మించి చేయకూడదు. సొంత బిడ్డలున్న మహిళ అయితే ఆమెఐదుసార్లకు మించి ప్రసవానికి అనుమతించబడదు. అండాన్ని దానం చేసే దాతల వివరాలన్నీ గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. సాఫల్య కేంద్రాలు, శుక్రకణ బ్యాంకుల వివరాలన్నీ ఒక అక్రిడిటేషన్ ప్రక్రియ ద్వారా గుర్తింపును కలిగి ఉండాలి. భారతదేశంలోని ఆరోగ్య సంబంధిత పరిశోధన సంస్థలు ఒక ‘జాతీయ ఏఆర్టీ రిజిస్ట్రీ’ని నిర్వహించాలి. దీంతోపాటు ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు, ఏజెంట్లు, సైంటిస్టులు, ఇతరుల వివరలతో జాతీయ, రాష్ట్ర సలహా బోర్డుల ఏర్పాటు జరగాలి. సరోగసీ ప్రక్రియ జరిగేదిలా... పైన పేర్కొన్న కారణాల వల్ల ఒక తల్లి గర్భాన్ని మోసేందుకు వీలు కాని పరిస్థితుల్లో సరోగసీకి ప్రయత్నిస్తారు. దానికి సిద్ధపడ్డ దంపతులు తొలుత ఈ ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకోవాలి. అన్ని రకాల సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇందులో మిళితమై ఉన్న చట్టపరమైన అంశాలు (లీగల్ యాస్పెక్ట్స్), చట్టపరమైన ఇబ్బందులు (లీగల్ ప్రాబ్లమ్స్) గురించి విపులంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే తర్వాత రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అనుసరించ దలచినప్పుడు బిడ్డను కోరుకునే దంపతులు, గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్), ఆమె భర్త, కుటుంబ సభ్యులు, సాఫల్య చికిత్సా నిపుణులు (ఫెర్టిలిటీ స్పెషలిస్ట్), సరోగసీ ఏజెంట్స్, లీగల్ అడ్వైజర్స్... ఇలా అందరూ కలసి సమష్టిగా నిర్ణయం తీసుకుని పనిచేయాల్సి ఉంటుంది. దంపతులు, సరోగేట్ మదర్... ఈ ఇరువురూ అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వీరిని మానసికంగా సంసిద్ధం చేయడం కోసం సైకలాజికల్ కౌన్సెలింగ్ చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఇందులో గర్భం మోసే తల్లిని ఎంపిక చేసేప్పుడు సరైన వారిని ఎంచుకోవడం ఎంతో అవసరం. ఈ సరోగేట్ మదర్... స్నేహితురాలు, బంధువులు ఇలా ఎవరైనా కావచ్చు. లేదా ఇందుకోసమే ఉద్దేశించిన ఏజెంట్స్ వెతికిపెట్టే సరోగేట్ మదర్స్ కూడా కావచ్చు. సరోగేట్ మదర్‌కు స్కానింగ్, హార్మోన్ పరీక్షలూ, రక్తపరీక్షలూ చేయాల్సి ఉంటుంది. ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో తెలుసుకోవడంతో పాటు హెచ్ఐవీ, వీడీఆర్ఎల్, హెచ్‌బీఎస్‌ఏజీ వంటి పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన అంశాలు... ఇది నేరుగా దంపతులిద్దరికీ సంబంధించిన వ్యవహారం కాకపోవడం వల్ల... గర్భాన్ని మోసేందుకు సిద్ధపడే మరో తల్లి ప్రమేయం కూడా ఉండటం వల్ల కొన్ని చట్టబద్ధమైన అంశాలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల బిడ్డను కోరుకునే దంపతులకూ, గర్భాన్ని మోసే తల్లికీ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఈ ఒప్పందం చట్టబద్ధంగా జరగాల్సి ఉన్నందున న్యాయవాది ప్రమేయమూ ఉంటుంది. ఈ చట్టబద్ధమైన వ్యవహారాలకు అవసరమైన ఖర్చులన్నీ బిడ్డను కోరే దంపతులు భరించాల్సి ఉంటుంది. ఏదైనా అనుకోని అవాంతరాలో, అనుకోని సమస్యలో వస్తే వాటిని పరిష్కరించుకునే దిశగా అనుసరించాల్సిన వ్యవహారశైలిపై కూడా ముందుగానే ఒప్పందాలు, ఒడంబడికలూ జరుగుతుంటాయి. విదేశీయులూ... కాస్త జాగ్రత్త విదేశీయులైన దంపతులు సరోగసీ కోసం భారత్‌కు వస్తే... ఆ దంపతుల్లో ఏ ఒక్కరిదైనా... అండంగానీ లేదా శుక్రకణాలు గాని ఉపయోగించి ఫలదీకరణ జరగాలి. లేకపోతే అలా పుట్టిన బిడ్డకు ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు వంటివి ఇవ్వరు. ఇందుకోసం డీఎన్ఏ పరీక్ష జరిపి, పుట్టిన బిడ్డలో ఆ దంపతుల డీఎన్ఏలు ఉన్నాయని నిర్ధారణ చేశాకనే పౌరసత్వం వంటి హక్కులు ఇస్తారు. ఒకవేళ అలా కాకుండా ఉంటే... వారికి సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డకు భారతదేశపు పౌరసత్వం లభించదు. అందుకే విదేశాలనుంచి వచ్చి ఇక్కడ సరోగసీ ద్వారా బిడ్డను కోరుకునేవారు చట్టబద్ధమైన అన్ని అంశాలనూ ముందుగానే తెలుసుకుని రావడం మంచిది. భారతదేశం... సరోగసీ రంగం మన దేశంలో సరోగసీ ప్రక్రియ ద్వారా ఏటా రూ. 25,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా సరోగసీ ప్రక్రియకు మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏ పాశ్చాత్య దేశాలతో పోల్చినా... ఇక్కడ ఈ సౌకర్యం చాలా చవకగా లభ్యం కావడమే దీనికి కారణం. 2010లో భారతీయ సరోగసీ కేంద్రాల్లో దాదాపు 1500 సరోగసీ ప్రసవాలు అయినట్లు ఒక అంచనా. అంతకు మునుపు రెండేళ్ల గణాంకాలతో పోలిస్తే అది 50 శాతం ఎక్కువ. భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఈ కింది వాటిల్లో ఏడాదికి జరుగుతున్న సరోగసీ ప్రసవాల సంఖ్య... ఢిల్లీ - 300 గుజరాత్ - 300 హైదరాబాద్ - 100 బెంగళూరు - 50 ముంబాయి - 25. ఇదో మహా వ్యాపారం... ఐక్యరాజ్య సమితి 2012లో నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో ఏడాదికి దాదాపు 400 మిలియన్ డాలర్ల వ్యాపారం సరోగసీ ద్వారా జరుగుతోంది. దేశవ్యాప్తంగా 3000 కు పైగా ఫెర్టిలిటీ క్లినిక్స్ (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి. చివరగా... నాణేనికి రెండు పక్కలు ఉన్నట్లే అభివృద్ధికీ రెండు పార్శ్వాలుంటాయి. ఆధునిక వైద్య విజ్ఞానం ఇచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగపరుస్తున్నామా అన్నది మన నైతికత, విచక్షణ మేరకు చేయాల్సిన పని ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
పీసీఓడీ... పర్యవసానాలు
ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ప్రతి పదిమంది మహిళల్లో ముగ్గురు నుంచి నలుగురు పీసీఓడీ అనే సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ప్రతిమహిళలలోనూ రుతుసమయంలో అండాశయంలో పరిపక్వత చెంది నెల తర్వాత అండం విడుదల అవుతుంది. నెలసరి తర్వాత పది నుంచి పద్నాల్గవ రోజుల మధ్యన ఈ అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. కానీ పీసీఓడీ అనే వ్యాధితో బాధపడుతున్న స్త్రీలలో అండం పరిపక్వత చెందకపోవడం వల్ల అవి అండాశయంలో నీటి బుడగల రూపంలో ఉండిపోతాయి. కొన్నిసార్లు అవి ఒకటి, రెండు... మొదలుకొని చాలా ఎక్కువ సంఖ్యలోనూ ఉండవచ్చు. ఈ కండిషన్‌ను ‘పాలీ సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్-(పీసీఓడీ) అంటారు. పీసీఓడీతో సమస్యలు... ఈ సమస్య ఉన్నవారిలో ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టెరాన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు వారి ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఊబకాయం, నెలసరి క్రమం తప్పడం, కొందరిలో నెలసరి రెండు లేదా మూడు నెలలకోసారి రావడం, రుతుసమయంలో రక్తస్రావం తక్కువగా జరగడం జరుగుతుంది. మరికొందరు స్త్రీలలో రుతుక్రమం కచ్చితంగా వచ్చినా రక్తస్రావం ఎక్కువగా జరగవచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో అండం సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల సంతానం కలగడానికి ఇది ఆటంకంగా పరిణమించవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రభావం వల్ల చాలామందిలో అవాంఛిత రోమాలు పెరుగుతాయి. యుక్తవయసులో వారికి మొటిమలు అధికంగా వస్తాయి. జుట్టురాలిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒత్తిడికి గురికావడం వంటివి జరగవచ్చు. పీసీఓడీ లక్షణాలు యుక్తవయసు నుంచి కనిపించవచ్చు అయితే వీటి తీవ్రత అందరిలోనూ ఒకేలా లేకపోవచ్చు. కొందరిలో కేవలం అవాంఛిత రోమాలు మాత్రమే ఉండవచ్చు. లేదా మరికొందరిలో మొటిమలు మాత్రమే బాధించవచ్చు. ఇంకొందరిలో రుతుక్రమ సమస్యలు మాత్రమే ఉండవచ్చు. కొందరిలో పీసీఓడీ సమస్యతో పాటు హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు కూడా తీవ్రమవుతాయి. ఈ సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నవారిలో టైప్-2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశం ఎక్కువ. గర్భం ధరించినప్పుడు మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. నిర్ధారణ: పీసీఓడీని నిర్ధారణ చేయడానికి అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ పెల్విస్ పరీక్షతోపాటు కొన్ని రకాల రక్తపరీక్షలు... ముఖ్యంగా టీఎస్‌హెచ్, ఆర్బీఎస్, పీఆర్ఎల్, డీహెచ్ఈఏ, టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ వంటివి చేయాల్సి ఉంటుంది. నివారణ / చికిత్స: సరైన వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతో దీన్ని నివారించవచ్చు. బరువు తగ్గడం కోసం వ్యాయామం/యోగా, ఆహారంలో ఆకుకూరలు, దంపుడుబియ్యం, బ్రౌన్‌రైస్, ఓట్స్, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే స్వీట్స్, కేక్స్, ఐస్‌క్రీమ్స్, శీతలపానీయాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రోగి లక్షణాలను, వ్యక్తిగత ప్రవర్తనను బట్టి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతుల్లో ప్రకృతి నియమాలను అనుసరించి సరైన హోమియో వైద్యవిధానం ద్వారా వైద్యం చేయించుకోవడం వల్ల ఈ హార్మోన్లలోని సమతౌల్యతను నిర్వహించడానికి వీలవుతుంది.