
సాక్షి, బెంగళూరు : 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ నటి సంజనా గల్రానీకి సర్జరీ జరిగింది. తన అండాశయంలో పెరిగిన 550 ఎమ్‌ఎల్ డెర్మాయిడ్‌ని సర్జరీ చేసి తీసివేశారని సంజన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు తెలిపారు. అందుకే దాదాపు ఒక నెల నుంచి ఎక్కువగా బయటకు రావడం లేదని పేర్కొన్నారు.
ప్రతి మహిళ కనీసం ఆరునెలలకొకసారి అయినా మమ్మోగ్రామ్ చేపించుకోవాలని, అండాశయం, గర్భాశయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 45 సినిమాల్లో సంజనా నటించారు. సంజనా ప్రస్తుతం తెలుగులోని ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్‌లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment