బ్రేకప్‌కు అదే కారణమన్న నటుడు.. అబద్ధమన్న నటి | Anusha Dandekar Gives Clarity On Jason Shah Claims About Their Failed Relationship | Sakshi
Sakshi News home page

అందరూ నా పేరు వాడుకుంటున్నారు: బాలీవుడ్‌ నటి

Published Fri, Jun 7 2024 3:47 PM | Last Updated on Fri, Jun 7 2024 4:09 PM

Anusha Dandekar Gives Clarity On Jason Shah Claims About Their Failed Relationship

కలిసున్నప్పుడు ఎక్కడలేని ప్రేమ చూపించుకుంటారు. విడిపోయాక ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తారు. ఇక్కడ చెప్పుకునే జంట విషయంలో ఇదే నిజమైంది. బాలీవుడ్‌ జంట వీజే అనుష దండేకర్‌- జేసన్‌ షా విడిపోయి చాలా రోజులవుతోంది. జేసన్‌ షా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్‌ గురించి మాట్లాడుతూ.. అవతలి వ్యక్తి తనను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నాడు. వారికి నచ్చినట్లు ఉండేలా మలుచుకోవాలని చూశారని ఆరోపించాడు. 

అది అబద్ధం
తాజాగా ఈ వ్యాఖ్యలపై అతడి మాజీ ప్రేయసి అనుష స్పందించింది. నా పేరును గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. మొదట కనిపించే వార్త ఏంటంటే.. నేను ఎవరినో నాకు నచ్చినట్లు ఉండాలని ఆంక్షలు పెట్టానట! అది పూర్తిగా అబద్ధం. ఇప్పుడేమో బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌లో పార్టిసిపేట్‌ చేయబోతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. 

నా ఆన్సరేంటో వారికి బాగా తెలుసు
ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు. అసలు ఆ షో నిర్వాహకుల నుంచి నాకు ఎటువంటి ఫోన్‌ కాల్‌ రాలేదు. ఎందుకంటే నా సమాధానమేంటో వారిక్కూడా స్పష్టంగా తెలుసు. నేను ఎప్పటికీ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనను. ఏంటో, అందరూ నా పేరు వాడుకుంటున్నారు.. అందుకు పొంగిపోతున్నాను అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇకపోతే అనుష.. ఇటీవల రిలీజైన 'జూనా ఫర్నీచర్‌' సినిమాలో కనిపించగా జేసన్‌.. 'హీరామండి' వెబ్‌ సిరీస్‌లో విలన్‌గా మెప్పించాడు.

చదవండి: రజనీకాంత్‌ ఇంట్లో శరత్‌కుమార్‌ కుటుంబం.. పెళ్లికి రమ్మని ఆహ్వానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement