రజనీకాంత్‌ ఇంట్లో శరత్‌కుమార్‌ కుటుంబం.. పెళ్లికి రమ్మని ఆహ్వానం | Varalaxmi Sarathkumar Invites Rajinikanth For Her Wedding With Nicholai Sachdev | Sakshi
Sakshi News home page

'హనుమాన్‌' నటి ఇంట మొదలైన పెళ్లి పనులు.. తలైవాకు వెడ్డింగ్‌ కార్డ్‌

Published Fri, Jun 7 2024 11:58 AM | Last Updated on Fri, Jun 7 2024 12:15 PM

Varalaxmi Sarathkumar Invites Rajinikanth For Her Wedding With Nicholai Sachdev

తెలుగులో టాప్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. అప్పుడే వీరి ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి.

పెళ్లికి ఆహ్వానం
పెళ్లి పత్రికల పంపిణీ మొదలైంది. గురువారం (జూన్‌ 6న) రజనీకాంత్‌ను కుటుంబసమేతంగా కలిసి తన పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. ఈ మేరకు రజనీకాంత్‌తో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తలైవా సర్‌ను, లతా ఆంటీని కలిసి పెళ్లికి ఆహ్వానించాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్యూ సర్‌. ఐశ్వర్య రజనీకాంత్‌.. నువ్వెప్పటిలాగే ఎంతో ప్రేమగా మాట్లాడావు అని రాసుకొచ్చింది. ఫోటోలో రజనీకాంత్‌ దంపతులతో పాటు వరలక్ష్మి తల్లిదండ్రులు రాధిక- శరత్‌కుమార్‌ ఉన్నారు.

సినిమాల సంగతులు..
వరలక్ష్మి శరత్‌కుమార్‌.. పొడా పొడి సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా మాత్రమే చేయాలని రూల్‌ పెట్టుకోలేదు. పవర్‌ఫుల్‌ పాత్ర అయితే చాలనుకుంది. అందుకే సహాయకనటిగా ఎక్కువ సినిమాలు చేసింది. తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ, జాంబి రెడ్డి, నాంది, యశోద, వీరసింహా రెడ్డి, మైఖేల్‌ చిత్రాలతో తెలుగువారినీ అలరించింది. ఇటీవల హనుమాన్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ అందుకుంది.

 

చదవండి: Manamey X Review: ‘మనమే’ టాక్‌ ఎలా ఉందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement