Varalaxmi Sarathkumar
-
నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా.. ఎలాంటి పాత్రలనైనా ఇట్టే చేయగలదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూతురైన వరలక్ష్మి.. పోడాపొడి (2012) సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. నిజానికి ఈ సినిమాకంటే ముందే ఆమెకు శంకర్ 'బాయ్స్' మూవీలో ఆఫర్ వచ్చింది. కానీ తండ్రి వద్దనడంతో మంచి అవకాశాన్ని వదులుకుంది.సౌత్‌లో విలక్షణ నటిగా గుర్తింపుఅయినప్పటికీ వరుస ఆఫర్లు వస్తూనే ఉండటంతో కాదనలేకపోయింది. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్. నాంది, క్రాక్, యశోద, వీర సింహా రెడ్డి, ఏజెంట్, హను-మాన్, కోట బొమ్మాళి ఐపీఎస్, శబరి వంటి పలు చిత్రాల్లో నటించింది.వెండితెర.. బుల్లితెరఓపక్క వెండితెరపై బిజీగా ఉంటూనే మరోపక్క బుల్లితెరపైనా సందడి చేస్తోంది. డ్యాన్స్ జోడీ డ్యాన్స్ రీలోడెడ్ 3 (తమిళ) షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజైంది. అందులో ఓ కంటెస్టెంట్ అద్దం ముందు నిలబడి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. మన జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు కుటుంబమే మద్దతుగా నిలబడుతుందంటారు. కానీ నా జీవితంలో మాత్రం కుటుంబం, బంధువులెవరూ నాకు సాయంగా నిలబడలేదు. పైగా నన్ను తిడుతూ వేధించారు, టార్చర్ పెట్టారు అంటూ ఏడ్చేసింది. నీది నాదీ ఒకే కథఅది విన్న వరలక్ష్మి.. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా అమ్మానాన్న పనిలో బిజీగా ఉండటం వల్ల చిన్నప్పుడు నన్ను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లిపోయేవారు. నన్ను చూసుకోమని బంధువులకు అప్పజెప్పేవారు. అలా ఓసారి నా ఇంట్లోనే ఐదారుగురు మంది నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యంగా తాకారు. నీదీ నాదీ ఒకే కథ.. అంటూ కంటెస్టెంట్‌ను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని వరలక్ష్మి కోరింది.చదవండి: లూసిఫర్2: 'మోహన్‌లాల్' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్ -
కేవలం రూ. 2500 కోసం రోడ్డుపైనే డ్యాన్స్ చేశా: వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలు నటి వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈమె తండ్రి సపోర్ట్ లేకుండానే దక్షిణాదిలో ప్రముఖ నటిగా ఎదిగారు అన్నది వాస్తవం. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన పోడాపోడి చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మి . శంభో కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు వెంటనే మరో అవకాశం రాలేదు. అలాంటి సమయంలో దర్శకుడు బాల తాను దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయితే, హీరోయిన్గా టాప్ స్టార్ ఇమేజ్ ని మాత్రం ఇప్పటికీ పొందలేకపోయింది. కానీ, ఆమె కథానాయకిగానే కాకుండా ప్రతి కథానాయకిగా కూడా నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు పొందింది. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాది నటిగా ముద్ర వేసుకుంది. డేరింగ్ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ 39 ఏళ్ల వయసులో గత ఏడాది తన చిరకాల మిత్రుడు నికోలాయ్ సచ్దేవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ తర్వాత తన భర్తతో పాటుగా కనిపిస్తున్న ఆమె ఇటీవల ఒక డాన్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ డాన్స్ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయిన మరో మహిళ కూడా పాల్గొంది. తనదైన స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆమె టాలెంట్‌ను చూసిన వరలక్ష్మీ ఫిదా అయిపోయింది. అయితే, మ్యూజిక్ వినగానే తనకు డాన్స్ చేయాలనిపిస్తుందని ఆ మహిళ తెలిపింది. దీంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యాన్ని ఈ వేదికపై చెబుతానని పేర్కొంది. గతంలో తాను కూడా ఒక్కోసారి రోడ్డుపైనే డాన్స్ చేసిన సంర్భాలను గుర్తుచేసుకుంది. తాను సినీ రంగ ప్రవేశం చేయకముందు 2500 రూపాయల కోసం మొట్టమొదటిసారిగా ఒక షో కోసం రోడ్లో డాన్స్ చేశానని చెప్పింది. రోడ్డుపై డాన్స్ చేయడం ఎవరూ తప్పుగా భావించవద్దని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. -
మహిళలకు సందేశమిచ్చిన ‘శివంగి ’
ఆనంది ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా... చాలా పద్ధతిగా కనిపించే సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా ‘శివంగి’ సినిమాలో బోల్డ్ డైలాగ్‌తో రెచ్చిపోయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘వంగే వాళ్లు ఉంటే... మింగే వాళ్లు ఉంటారు... నేను వంగే రకం కాదు... మింగే రకం...’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ చిత్రానికి దర్శకత్వం దేవరాజ్ భరణి ధరన్ వహించారు. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. నేడు(మార్చి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సత్యభామ(ఆనంది)ఓ సాధారణ గృహిణి.ఓ వైపు భర్త అనారోగ్య పరిస్థితులు... మరో వైపు ఆర్థిక సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానికి తోడు తన అత్త నుంచి ఎదురయ్యే వేధింపులు తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. మరోవైపు తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడంతో మరింత సతమతమవుతుంది. చివరకు పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరైనా హత్యకు గానీ, ఆత్మహత్యకు గానీ గురయ్యారా? సత్యభామ తనకు ఎదురైన హార్డిల్స్ ను ఎలా అధిగమించిందనేది తెలియాలంటే మూవీని ఓసారి చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఓ సాధారణ మహిళ తనకున్న సమస్యలను ఛేదించే క్రమంలో ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొంది అనేదే ఈ సినిమా కథ. దేవరాజ్ భరణి ధరన్ రచన ఇంకా దర్శకత్వంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది మీ చిత్రం చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఎక్కువగా ఒకటే వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ఆడియన్స్ సాధారణంగా బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవసరం రాదు. ఎంతో ఇంటెన్సిఫైడ్ గా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. అసలు జరిగేది నిజమా కాదా అనే ఒక డౌట్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసే విధంగా స్క్రీన్ ప్లే వచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు.సింగిల్ లోకేషన్ లో... క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొత్తం సింగిల్ లొకేషన్ లో చిత్రీకరణ చేసినప్పుడు ఆర్ట్ వర్క్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే బ్యాగ్రౌండ్ యాంబియన్స్ ను సెట్ చేసుకున్నాడు కళాదర్శకుడు రఘు కులకర్ణి. అలాగే ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు సంగీత దర్శకుడు. చిత్రంలో ఎక్కడ కూడా వల్గారిటీ లేదా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, చాలా డీసెంట్ గా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా సినిమాను తెరకెక్కించారు. ఒక మహిళకు అనేక సమస్యలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ ఆమె ఆ సమస్యలను మొక్కవోని ధైర్యంతో... ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎలా నిలబడ్డారు అనేది నేటి మహిళలకు మెసేజ్ ఇచ్చేలా సినిమా వుంది. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ప్రేక్షకులకు మంచి ఇన్స్ పిరేషన్ ఇచ్చే సినిమా ‘శివంగి’. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కోనే అనేక సమస్యలును ఇందులో చూపించి... వాటికి పరిష్కార మార్గాలు చూపించారు.ఎవరెలా చేశారంటే..సత్యభామగా చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆనంది నటన మనం గతంలోనే ఎన్నో చిత్రాలలో చూశాం. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తనదైన మార్క్ సృష్టిస్తూ ఆనంది తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చిత్రం అంతా తానే కనిపిస్తూ ప్రేక్షకులు ఎక్కడా బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎక్కడా గ్లామర్ షో లేకుండా... కేవలం రెండు చీరలలో మాత్రమే సినిమా అంతా కనిపిస్తూ... తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ రోల్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ, ఈ చిత్రంలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనలో మరో యాంగిల్ యాక్టింగ్ స్టైల్ ఉందని నిరూపించుకున్నారు. అదేవిధంగా చిత్రంలో నటించిన జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
మంచి మనసు చాటుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్
దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మదగజరాజా. ఈ చిత్రంలో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్రం జనవరి 31 తెలుగులో విడుదలైంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేంటో తెలుసుకుందాం.గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి తర్వాత తన కోసం పూర్తిగా మారిపోయాడని తెలిపింది. నా కోసం ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారని పేర్కొంది. ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారని వెల్లడించింది. నా కోసం ఆయన తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నారని వివరించింది.ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ..'నికోలయ్‌తో పెళ్లి తర్వాత నా జీవితం ఏమీ మారలేదు. నాకోసం అతని జీవితాన్నే పూర్తిగా మార్చుకున్నాడు. నా కోసం ఆయనే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. అంతేకాదు తన పేరును నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నారు. నా కెరీర్ పరంగా ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనుకునేదాన్ని. కానీ నికోలయ్‌తో పరిచయం తర్వాత నా జీవితానికి అతనే సరైన భాగస్వామి అని అర్థమైంది. అలా పెద్దల అంగీకారంతో వివాహాబంధంలోకి అడుగుపెట్టాం' అని చెప్పింది. సినిమాల విషయానికొస్తే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వీరసింహారెడ్డి, కోట బొమ్మాళి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీలోనూ కీలకపాత్ర పోషించింది.పెళ్లి తర్వాత నా కోసం మా ఆయన చాలా మార్చుకున్నాడు - Actress #VaralaxmiSarathkumar#NicholaiSachdev #MadhaGajaRaja #TeluguFilmNagar pic.twitter.com/doquPrV0ft— Telugu FilmNagar (@telugufilmnagar) January 31, 2025 -
యాక్షన్ థ్రిల్లర్ కి సై
నెగటివ్ రోల్స్‌తో దూసుకెళుతూ, పాజిటివ్ క్యారెక్టర్స్‌లోనూ భేష్ అనిపించుకున్నారు వరలక్షీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). కథ నచ్చినప్పుడుల్లా కథానాయికప్రాధాన్యం ఉన్న చిత్రాలు కూడా చేస్తుంటారామె. తాజాగా ఆ తరహా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకి ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి(Sanjeev Megoti) దర్శకత్వం వహించనున్నారు.‘‘సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథకి వరలక్ష్మి ఓకే చెప్పారు. ఈ మూవీలో ఆమె మెయిన్ లీడ్ చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోనున్నాం. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. -
వరలక్ష్మీ శరత్ కుమార్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ(Varalaxmi Sarathkumar ).. తనదైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు కీలక పాత్రలు పోషించి సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లోనూ ఈమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతేడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ చిత్రంలో వరలక్ష్మీ పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఆమెకు ఇక్కడ వరుస సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ విలక్షణ నటి చేతికి భారీ ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. 'ఆదిపర్వం' మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శత్వంలో వరలక్ష్మీ ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టు కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయనుంది.భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోబోతున్నారట. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. -
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
'నిడదవోలుకు రైలుబండి' అంటూ హీరోయిన్లతో విశాల్ స్టెప్పులు
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన 'చికుబుకు రైలుబండి' సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 12 ఏళ్ల పాటు పక్కనపడేసిన సినిమా కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లతో సుమారు రూ. 100 కోట్ల వరకు రాబట్టింది.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి(Anjali), వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. ప్రస్తుతం విడుదలైన సాంగ్‌లో ఇద్దరు హీరోయిన్లతో విశాల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. -
అదిరిపోయే పంచ్‌లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కు దగ్గరలో ఈ మూవీ ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. తెలుగు వర్షన్లో సినిమా రానున్నడంతో తాజాగా ‘మదగజరాజా’ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జానర్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్.సి. దిట్ట అని చెప్పవచ్చు. ఆయన తన మార్క్ మాస్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో హీరోయిన్ సదా కూడా ఒక ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. -
రాజకీయాల్లోకి వస్తానంటోన్న హీరోయిన్.. ఆమెనే ఆదర్శం!
సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని వేరుచేసి చూడలేం. నటులే కాదు.. నటీమణులు కూడా రాజకీయ రంగప్రవేశానికి సై అంటున్నారు. ఈ మధ్య నటి త్రిష ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. తాజాగా మరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమంటోంది. దక్షిణాదిలో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న ఆ నటి ఎవరో తెలుసుకుందాం.తాజాగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తానూ రాజకీయాల్లోకి వస్తానని అంటోంది. తెలుగులో గతేడాది హనుమాన్తో మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ దక్షిణాదిలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది సచ్ దేవ్ నికోలయ్‌ను పెళ్లి చేసుకుని నటనను కొనసాగిస్తున్నారు.తాజగా విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటి అంజలి హీరో, హీరోయిన్లుగా నటించిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో కార్యక్రమంలో పాల్గొన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు.12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా చిత్రం పొంగల్ సందర్భంగా తెరపైకి రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. పోడా పోడీ చిత్రం తరువాత తాను నటించిన రెండవ చిత్రం ఇదేనని చెప్పారు. కమర్శియల్ అంశాలతో కూడిన వినోదభరిత కథా సినిమా అన్నారు. పది ఏళ్లలో సినిమా చాలా మారిపోయిందన్నారు.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నెగెటివ్ కామెంట్స్‌పై వరలక్ష్మి స్పందిచారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా వదంతులు ప్రచారం చేస్తున్తన్నారని అన్నారు. తాను ఒక సారి విమానాశ్రయంలో విమానం బయలుదేరే సమయం కావడంతో అత్యవసరంగా వెళుతుండగా పలువురు వచ్చి తనతో ఫొటోలను తీసుకున్నారన్నారు.అప్పుడు ఒకతను వచ్చి ఫొటో తీసుకుంటానని అడిగారన్నారు. కానీ నాకు సమయం మించి పోవడంతో తాను వద్దని చెప్పాన్నాననీ, దీంతో అతను తమతో ఫొటో తీసుకోనివ్వరా? మరి మీరెందుకు నటనలోకి వచ్చారని కామెంట్ చేశాడన్నారు. అలాంటి వారికి బుద్ధి లేదని, వారికి బదులివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక రాజకీయ రంగప్రవేశం చేస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ కచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టం చేశారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. తనకు స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి జయలలిత అని అన్నారు. -
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. అలా ఆయన పాన్ ఇండియా రేంజ్లో పరిచయం అయ్యాడు. అయితే, ఇప్పుడు మ్యాక్స్ సినిమాతో థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా విలన్‌గా సునీల్ కన్నడలో ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానున్నడంతో మ్యాక్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా డేట్ అనౌన్స్ మెంట్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం పోస్టర్స్ ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. క్రిస్మస్ రేసులో ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉంది. -
వైరల్ అవుతున్న నటి వరలక్ష్మి బీచ్ వెడ్డింగ్ ఫొటోలు
-
ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకుంది. నికోలయ్ సచ్దేవ్ అనే వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లికి ముందు గానీ తర్వాత గానీ భర్త గురించి పెద్దగా మాట్లాడని వరలక్ష్మి.. ఇప్పుడు అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రేమనంతా ఒలకబోసింది. ఓ వీడియో షేర్ చేసి బోలెడన్ని సంగతులు చెప్పింది.(ఇదీ చదవండి: క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్)'ఈ ఏడాది చాలా వేగంగా చాలా విషయాలు జరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ మధుర జ్ఞాపకాలే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడం చాలా కష్టం. నీ కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. మగాడు ఎలా ఉండాలనే దానికి నువ్వు ఉదాహరణ. నువ్వు నన్ను భద్రంగా కాపాడుకుంటున్నావ్. ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండట్లేదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నీ లాంటి భర్త దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఇంతకు మించి నిన్నేం అడగనులే. హ్యాపీ బర్త్ డే టూ వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్' అని వరలక్ష్మి తన భర్త గురించి చెప్పుకొచ్చింది.ఈ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన వీడియోలో వరలక్ష్మి.. బోలెడన్ని ఫొటోలని షేర్ చేసింది. పెళ్లి, టూర్స్ వెళ్లినప్పుడు ఫొటోలు చాలానే ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ఏడాది 'హనుమాన్', 'శబరి' సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొత్త సినిమాలేం చేయట్లేదు. భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.(ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
స్టార్ హీరో సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఛాన్స్
నటుడు విజయ్ చివరి చిత్రంగా చెప్పుకుంటున్న ఆయన 69వ చిత్రం షూటింగ్ చెన్నైలో శరవేగంగా సాగుతోంది. హెచ్ వినోద్ వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం ఇది సమకాలీన రాజకీయ కథా చిత్రం కావడమే. అంతే కాకుండా దర్శకుడు హెచ్ వినోద్ ఈ కథను నటుడు కమలహాసన్ కోసం సిద్ధం చేసిన కథ అనే ప్రచారం కూడా సాగుతోంది. అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఈ చిత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇందులో నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, ప్రియమణి బాలీవుడ్ స్టార్ నటుడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి.ఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే నిర్మాత లలిత్‌కుమార్ ఫ్యాన్సీ రేటుకు హక్కులు పొందినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు, ఇప్పుడు విజయ్, వరలక్ష్మి మధ్య జరిగే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిసింది. ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్ చిత్రంలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రను పోషించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్న అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
హీరోగా టాలీవుడ్ రచయిత మనవడు.. ఆసక్తిగా ట్రైలర్!
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ సినిమాకు రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్ పాండురంగారావు, చిన్నా రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.(ఇది చదవండి: అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సినీయర్ నటుడు ఆగ్రహం)ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రిటీగా మారాలనుకునే యువకుడి కథనే సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా సీనియర్ నటి ఆమని,శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. Wishing best wishes to #ParuchuriSudarshan and the entire team of #MrCelebrity!The trailer looks very promising 👍🏻https://t.co/wxnwA3YIQCIn theatres from October 4th@varusarath5 #ChandinaRaviKishore #NPandurangarao— Rana Daggubati (@RanaDaggubati) October 2, 2024 -
మీ అందరి సపోర్ట్ కి చాలా థాంక్స్: మీడియా ఇంటరాక్షన్ లో వరలక్ష్మి (ఫొటోలు)
-
వరలక్ష్మి శరత్‌కుమార్ ఫస్ట్ లవ్ నేను కాదు: నికోలాయ్ సచ్దేవ్
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ముంబై గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్లు కొద్దిరోజుల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జూలై 10న థాయిలాండ్‌లోని క్రాబీ బీచ్ రిసార్ట్‌లో సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి ముగియడంతో ఈరోజు వీరిద్దరూ చెన్నైలో తమ నివాసంలో తొలిసారి మీడియాతో మాట్లాడారు.వరలక్ష్మీ భర్త నికోలాయ్ ఇలా చెప్పుకొచ్చాడు. 'నేను కూడా తమిళం నేర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు తమిళంలో పొంతటి (భార్య) అనే పదం మాత్రమే తెలుసు. ఇకనుంచి నా ఇల్లు ముంబై కాదు.. చెన్నైనే నా ఇల్లు. నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నికోలాయ్ సచ్దేవ్. నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్లయింది. అందరూ అనుకున్నట్లు పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్‌గా మార్చుకోవడం లేదు. నాకు కూడా ఆమె పేరు వరలక్ష్మి శరత్కుమార్గానే నచ్చింది. కానీ, నేను మాత్రం ఆమె పేరును తీసుకుంటున్నాను. ఇకనుంచి నా పేరు 'నికోలాయ్ వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్దేవ్'గా మార్చుకుంటున్నాను. శరత్‌కుమార్, వరలక్ష్మిల కీర్తి ఇప్పుడు నా సొంతం. వరలక్ష్మి నన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె ఫస్ట్ లవ్ మాత్రం నేను కాదు. ఆమె మొదటి ప్రేమ ఎప్పుడూ సినిమాల్లో నటించడమే. పెళ్లి తర్వాత కూడా నటిస్తూనే ఉంటుంది. గతంలో మాదిరే మీ అందరి ప్రేమ,మద్దతు ఆమెకు అవసరం.' అని నికోలాయ్ అన్నారు.నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. 'ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నికోలాయ్ చెప్పినట్లు అయన నా ప్రేమ అయితే.. సినిమా నా జీవితం. కాబట్టి పెళ్లి తర్వాత కూడా తప్పకుండా సినిమాల్లో నటిస్తాను. మాకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది. -
థాయ్‌లాండ్‌లో బీచ్ పక్కనే పెళ్లి.. సంతోషం పట్టలేకున్న వరలక్ష్మి (ఫోటోలు)
-
సంప్రదాయబద్ధంగా నటి వరలక్ష్మి వివాహం
కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన ప్రేమికుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నికోలయ్ సచ్దేవ్ను వరలక్ష్మీ ప్రేమించి వివాహం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఒక బీచ్ రిసార్ట్‌లో 2024 జులై 10న వారి వివాహం జరిగింది. దక్షిణ భారత సంప్రదాయ పద్ధతుల్లో వారి వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, వరలక్ష్మీ శరత్‌కుమార్ కుటుంబం నుంచి పెళ్లి తేదీ ఎప్పుడు అనేది గతంలో వారు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అందరూ వారి వివాహం జులై 2 అని భావించారు.జులై 4న చెన్నైలోని తాజ్ హోటల్లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. దీంతో వారి వివాహం జులై 2న పూర్తి అయిందని అందరూ భావించారు. ఆ కార్యక్రమంలో టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. రజనీకాంత్, బాలకృష్, వెంకటేశ్, మంచు లక్ష్మి, సిద్ధార్థ్, ఖుష్బూ, శోభన వంటి స్టార్స్ ఆ రిసెప్షన్లో సందడి చేసిన విషయం తెలిసిందే. పెళ్లితో సమానంగా ఆ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కానీ, వారి వివాహం జులై 10న థాయ్‌లాండ్‌లో జరిగింది. -
నెట్టింట వైరల్ అవుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి ఫోటోలు!
-
హనీమూన్ ట్రిప్‌లో కొత్తజంట.. ఎవరో గుర్తుపట్టారా..?
కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, నికోలయ్ సచ్దేవ్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. థాయ్‌లాండ్ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. చెన్నైలో జరిగిన రిసెప్షన్లో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.కొన్నిరోజులుగా తమ పెళ్లికి రావాలంటూ చాలామంది ప్రముఖులను ఆహ్వానించే పనిలో వరలక్ష్మీ బిజీగా గడిపేసింది. ఇలా కొద్ది రోజులుగా శుభలేఖలు పంచడం, హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్, వివాహానరంతరం జరిగే విశేష కార్యక్రమాలతో ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు. అయితే, ఈ కొత్తజంట హనీమూన్‌కు ఏ దేశానికి వెళ్లారో మాత్రం చెప్పలేదు.అందమైన ప్రదేశాల్లో వారు తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో వరలక్ష్మీ పంచుకుంది. తుపాన్ తరువాత ప్రశాంతత అంటూ వారు ఆనందంగా ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
వరలక్ష్మి శరత్‌కుమార్ - నికోలయ్ సచ్దేవ్ సంగీత్ వేడుకల్లో ప్రముఖులు (ఫోటోలు)
-
గ్రాండ్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్.. ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
టాలీవుడ్ నటి మెహందీ వేడుక.. డ్యాన్స్‌తో ఇరగదీసిన ఆమె తండ్రి!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన ప్రియుడిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించింది. టాలీవుడ్ హీరోలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది. ఆమె వివాహా వేడుక థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. జూలై 2న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు.తాజాగా వీరి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్‌కుమార్ డ్యాన్సు వేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్‌కుమార్ డ్యాన్సుతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. హనుమాన్ చిత్రంలో మెరిసిన వరలక్ష్మి ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Radikaasarath_love❤️ (@virad_15) -
పెళ్లి సందడి షురూ.. ఘనంగా వరలక్ష్మి మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
ఏకంగా ప్రధానిని పెళ్లికి ఆహ్వానించిన నటి వరలక్ష్మి (ఫొటోలు)
-
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
సమంతను పెళ్లికి ఆహ్వానించిన హనుమాన్ నటి..!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 2వ తేదీన థాయ్‌లాండ్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి తన పెళ్లికి అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లకు వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించారు.తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను తన పెళ్లికి ఆహ్వానించింది. వ్యక్తిగతంగా కలిసి వారికి ఆహ్వాన పత్రికలు అందజేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కాగా... టాలీవుడ్లో ఇప్పటికే రవితేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కలిసి పెళ్లికి రావాలని కోరింది. ఇటీవల తన తండ్రి శరత్‌కుమార్, రాధికాతో పాటు కోలీవుడ్ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో వరలక్ష్మి, నికోలాయ్ల నిశ్చితార్థం జరిగింది. నికోలయ్ సచ్దేవ్తో దాదాపుగా 14 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు వరలక్ష్మి తెలిపింది. మరోవైపు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ధనుష్ నటిస్తోన్న రాయన్ చిత్రంలో వరలక్ష్మి కనిపించనుంది. -
నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఆహ్వానం (ఫోటోలు)
-
'హనుమాన్' నటి పెళ్లి డేట్ ఫిక్సయిందా? ఎప్పుడంటే?
హీరోయిన్ల పెళ్లి అంటే మినిమం హడావుడి గ్యారంటీ. అలా కాకుండా ఎవరైనా చేసుకున్నారా అంటే చాలా తక్కువ మందే ఉంటారు. ఇకపోతే హీరోయిన్లలో చాలామంది ఏజ్ బార్ అయిన తర్వాతే ఏడడుగులు వేస్తుంటారు. ఈ లిస్టులోకి ఇప్పుడు 'హనుమాన్' వరలక్ష్మి శరత్ కుమార్ చేరబోతుంది. ఇదివరకే నిశ్చితార్థం చేసుకోగా, ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టైల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిందట.(ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన హీరోయిన్ అంజలి.. త్వరలో శుభవార్త)తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలు వరలక్ష్మీ. 2012లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్టు అయింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళంలో వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీసెంట్గా 'హనుమాన్' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.39 ఏళ్లు వచ్చేసినా సరే పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ ఏడాది మార్చిలో నికోలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆ డేట్ ఫిక్స్ అయిందని, జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో వివాహ వేడుక జరనుందని తెలుస్తోంది. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారని టాక్. అది అయిన తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఉండనుందని సమాచారం.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది) -
మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్‌గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్‌కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
నాకు కాబోయే వాడికి ఇది రెండో పెళ్లి.. అయితే ఏంటి?: వరలక్ష్మి
వరలక్ష్మి శరత్‌కుమార్... టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిపోయింది. క్రాక్, నాంది, యశోద, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్, హనుమాన్.. ఇలా వరుసగా అన్నీ విజయాలే అందుకుంది. ఇటీవలే ఆమె ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం రిలీజైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియకు ఇంటర్వ్యూ ఇచ్చిన వరలక్ష్మి తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఆ క్వాలిటీ నచ్చింది'నికోలయ్‌కు, నాకు మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టింది. అతడు నా వృత్తిని గౌరవిస్తాడు. సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చో అని ఎన్నడూ చెప్పలేదు. పైగా తను నన్ను చూసి గర్వపడతాడు. నాతో పాటు షూటింగ్‌కు వచ్చి ఖుషీ అవుతుంటాడు. నేను చేసే పనిని ఎంజాయ్ చేస్తాడు. ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. నా జీవితాన్ని అతడితో పంచుకోవాలనిపించింది. ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటాం.అదే ఆయన చేసే పనిఅతడు గ్యాలరిస్టు.. అంటే పెద్దపెద్ద కళాకారులు వేసే పెయింటింగ్స్‌ను కొనుక్కుంటూ అమ్ముతుంటాడు. అదే ఆయన చేసే పని! నా భర్తకు ఇదివరకే పెళ్లయిందని వార్తలు రాశారు. అది నిజమే! అయినా తనకు ఆల్రెడీ పెళ్లయితే తప్పేముంది? దీని గురించి మాట్లాడేవారికి ఒకటే చెప్తున్నా.. మీ పని మీరు చూసుకోండి.డబ్బు కోసమే పెళ్లి?అందరూ ఐశ్వర్యరాయ్, బ్రాడ్పిట్లేం కాదు. ముందు మీ ముఖాలు మీరు చూసుకోండి. మీరు ఏం అనుకుంటున్నారనేది నాకవసరమే లేదు. నా లైఫ్ నా ఇష్టం. డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటోందని కూడా అన్నారు. డబ్బు నా దగ్గర కూడా ఉంది. ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు నచ్చింది అనుకోండి.. డోంట్ కేర్' అని వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పుకొచ్చింది. చదవండి: రెండు సార్లు ప్రేమలో విఫలమైన హీరో.. ఆ ఇద్దరి హీరోయిన్ల వల్లే? -
'శబరి' సినిమాలో 'అలిసిన ఊపిరి' పాట రిలీజ్
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా.. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. మే 3న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. గత కొన్నాళ్ల నుంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'అలిసిన ఊపిరి...' పాటను దర్శకుడు కరుణ కుమార్ చేతుల మీదగా విడుదలైంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)'శబరి' నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటల్లో తల్లి కూతుళ్ల అనుబంధం, ప్రేమను చూపిస్తే... 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం స్పృశించారు. గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీనినొక మోటివేషనల్ సాంగ్ తరహాలో మార్చాయి.(ఇదీ చదవండి: అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార) -
స్టార్ హీరోకు కూతుర్ని.. నన్నే రూమ్‌కు వస్తావా అన్నాడు: వరలక్ష్మీ శరత్ కుమార్
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో ట్రెండింగ్‌లో కొననసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందడమే కాకుండా అందుకు తగ్గట్లుగా.. తన మాట కూడా చాలా స్ట్రైట్‌గా ఉంటుంది. తప్పు చేస్తే ఎదుట ఉన్నది ఎంతటివారైనా సరే ముక్కు సూటిగా హెచ్చరిస్తుంది. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటేడ్ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్‌లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్ బుక్ చేస్తాను కలుద్దాం అన్నాడు. ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్ శక్తి ఫౌండేషన్' స్థాపించాను.' అని ఆమె చెప్పింది.స్టార్ హీరో కూతురిని అయనంత మాత్రాన నాకు అవకాశాలు రాలేదు.. నన్ను కూడా చాలా సినిమాల్లో నుంచి తొలగించారు. కొంతమంది కమిట్మెంట్ అడగడం వల్ల చాలా సినిమాలను వదులుకోవాల్సి కూడా వచ్చిందని వరలక్ష్మీ తెలిపింది. సేవ్ శక్తి ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్‌లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది. -
ప్రియుడితో కలిసి పెట్స్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన వరలక్ష్మి (ఫోటోలు)
-
హనుమాన్ నటి థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'శబరి'. ఈ చిత్రాన్ని మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'సరికొత్త కథాంశంతో తీసిన సినిమా 'శబరి'. కథ, కథనాలు ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. ఇది స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం. వరలక్ష్మీ శరత్ కుమార్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె నటన సూపర్‌గా ఉంటుంది. సినిమా మాకు చాలా నచ్చింది. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతమందించారు. -
Varalaxmi Sarathkumar: ప్రియుడితో తొలిసారి విహారయాత్రకు వెళ్లిన బ్యూటీ
వరలక్ష్మీ శరత్‌కుమార్.. లేడీ విలన్, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ సినీప్రియుల్ని మెప్పిస్తోంది. రీసెంట్గా హనుమాన్, కోట బొమ్మాళి పీఎస్ చిత్రాలతో మెప్పించింది. శరత్‌కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె సరైన పాత్రలు ఎంచుకుంటూ రాణిస్తుంది. త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కబోతుందనే విషయం తెలిసిందే. ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్దేవ్తో వరలక్ష్మీ శరత్‌కుమార్ నిశ్చితార్థం కొద్దిరోజుల క్రితం జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత తొలిసారి కాబోయే భర్తతో సరదాగా విదేశాలకు విహారయాత్రకు వెళ్లింది. ఇద్దరూ జంటగా థాయ్‌లాండ్ వెళ్లి అక్కడ సేద తీరుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నికోలయ్ సచ్దేవ్ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. నికోలయ్, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారు. దంతో వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ బ్రో.. ఇంత అందాన్ని మర్చిపోయారా?
కోలీవుడ్ భామ ఇటీవలే హనుమాన్ సినిమాతో అలరించారు. తేజ సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది టాలీవుడ్లో వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. అయితే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన బ్యూటీ.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెనే లేడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మ్యాచ్‌లో తళుక్కున మెరిసింది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వరలక్ష్మి సందడి చేసింది. చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్‌లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్‌లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు.. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మరిచిపోయారు? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Cameraman ka focus Aaj kahan hai 🙄🤪Itna glamor nahi notice kiya ? pic.twitter.com/bJqvmluOo8 — aCute 📐 (@chaoticalm_090) March 26, 2024 -
అర్జునుడి గీతోపదేశంలో...
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమాకు ‘అర్జునుడి గీతోపదేశం’ టైటిల్‌ను ఖరారు చేశారు. అఖిల్ రాజ్, దివిజా ప్రభాకర్, రాజీవ్, ఆదిత్యా శశికుమార్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాతో సతీష్ గోగాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిలోక్‌నాథ్. కె, ప్రదీప్ రెడ్డి .వి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి మల్లాల సీతారామరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, కె. అమ్మిరాజు క్లాప్ ఇచ్చారు. లక్కంశెట్టి వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సతీష్ గోగాడ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. మొదటి షెడ్యూల్‌ను మార్చి 20న అమలాపురంలో మొదలుపెడుతున్నాం. ఆ తర్వాత వైజాగ్, హైదరాబాద్, చెన్నై లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. రాజీవ్, దివిజ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్. -
జైలుకు వెళ్లనున్న హనుమాన్ నటి? స్పందించిన వరలక్ష్మి
టాలీవుడ్లో లేడీ విలన్‌గా పేరు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఇటీవలే ఆమె పెళ్లికి సిద్ధమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్దేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇకపోతే గతేడాది డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్ పేరు మార్మోగిపోయింది. ఆమె దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పని చేసిన ఆదిలింగం డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఆమెకు కూడా ఏమైనా సంబంధాలున్నాయేమోనని ఎవరికి వారు అనుమానించారు. ఇష్టారీతిన తప్పుడు ప్రచారం తాజాగా ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మికి సమన్లు అందాయని, ఆమెను విచారణకు హాజరవాలని అధికారులు ఆదేశించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొందరైతే ఏకంగా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారంటూ ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. దీంతో సదరు వార్తలపై ఘాటుగా స్పందించింది నటి. ఇన్స్టాగ్రామ్ వేదికగా తప్పుడు ప్రచారంపై మండిపడింది. 'ఈ మీడియాకు నేను తప్ప ఎవరూ దొరకడం లేదేమో.. మళ్లీ పాత ఫేక్ న్యూస్‌నే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా అసలైన జరల్నిజం అంటే ఏంటో తెలుసుకోండి. బయట ఇంకా చాలా సమస్యలున్నాయ్ సెలబ్రిటీలుగా మేము నటిస్తాం, నవ్విస్తాం.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం.. మాలో లొసుగులు వెతకడం మానేసి మీ పని మీరు సరిగా చేయండి.. లోకంలో ఇంకా చాలా పెద్ద సమస్యలున్నాయి. వాటిపైన ఫోకస్ చేయండి. మా నిశ్శబ్ధాన్ని వీక్నెస్గా చూడకండి. మీకు తెలీదేమో.. పరువునష్టం దావా అనేది కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. కాబట్టి అసత్య ప్రచారాలు, అబద్ధపు రాతలు మానేసి నిజమైన జర్నలిజాన్ని బయటకు తీయండి' అని చురకలంటించింది. It’s so sad that our talented media has no news than to start circulating old #fakenews. Our dear journalists especially the self proclaimed news sites and your articles, why don’t you actually start doing some real journalism! Stop finding flaws with your celebtrities, we are… — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 14, 2024 చదవండి: శ్రీకాంత్ మేనకోడలితో లవ్.. డైరెక్ట్‌గా అడగలేక ఆ నటుడితో రాయబారం.. -
వరలక్ష్మి శరత్‌కుమార్ బర్త్ డే.. సర్ప్రైజ్ చేసిన రాధిక
నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి నేడు (మార్చి 5) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాధిక ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రేర్ ఫోటోలతో ఓ వీడియోను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. నటుడు శరత్‌కుమార్ 1984లో ఛాయాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జన్మించిన కూతురే వరలక్ష్మి. 2000 సంవత్సరంలో శరత్‌కుమార్ ఛాయతో విడాకులు తీసుకుని నటి రాధికను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ ప్రస్తుతం తన కూతురు వరలక్ష్మితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ నటిగా ఆమె కొనసాగుతున్నారు. కొద్దిరోజులుగా ఆమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. దీంతో ఆమెకు భారీ అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టెడ్ సినిమాలకే ప్రధాన్యత ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే వరలక్ష్మి పెళ్లి వార్త చెప్పింది. ఆమె త్వరలో నికోలయ్ సచ్దేవ్ను పెళ్లి చేసుకోబోతోంది. ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న అతనితో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ నేడు పుట్టినరోజు సందర్భంగా మొదట రాధిక ప్రేమతో ఒక వీడియో క్రియేట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వరలక్ష్మి ఫ్యాన్స్ కూడా విషెష్ చెబుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
వరలక్ష్మి ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు!
ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్‌ను పెళ్లాడనుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్‌ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్ సచ్దేవ్ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
Varalaxmi Sarathkumar Engagement: బాయ్ ఫ్రెండ్‌తో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్
-
సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ
ప్రముఖ నటి పెళ్లికి రెడీ అయిపోయింది. తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్‌ని నిజం చేసింది. అయితే పెళ్లి కొడుకు విషయం మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదని చెప్పొచ్చు. ఇంతకీ వరలక్ష్మి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది? ఏంటి విషయం? (ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్) తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి అందరికీ తెలుసు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో విలన్ తరహా పాత్రలు చేసింది. ఇవి కలిసి రావడంతో అలానే కొనసాగుతూ వచ్చింది. కొన్నేళ్ల వరకు తమిళంలో స్టార్స్‌తో కలిసి పనిచేసిన ఈమె.. కొన్నేళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది. గతంలో హీరో విశాల్‌తో వరలక్ష్మి ప్రేమాయణం నడిపిందని, కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కొన్నేళ్ల క్రితం కూడా హీరోలు ధనుష్, శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని నెలల గ్యాప్‌లో రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. నికోలయ్.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే వరలక్ష్మి-నికోలాయి పెళ్లి జరగనుంది. గత 14 ఏళ్ల నుంచి వీళ్లిద్దరికీ పరిచయముంది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!) -
స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?
'హనుమాన్' సినిమా చూశారా? మీలో చాలామంది చూసే ఉంటారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరూ అద్భుతంగా చేశారు. అలానే హీరో అక్కగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నంతలో అదరగొట్టేసింది. ఈ మధ్య తెలుగు చిత్రాల్లో మంచి మంచి రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ఈ నటి.. 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వివాహంపై రూమర్స్ వచ్చాయి. ఏకంగా ఓ స్టార్ హీరోతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్) అసలేం జరిగింది? వరలక్ష్మి.. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. తండ్రిలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తొలుత హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక పాత్రలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె గతంలో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. అందులో నిజం పక్కనబెడితే ఇప్పటికీ వీళ్లిద్దరూ సింగిల్‌గానే ఉండిపోయారు. నిజమెంత? ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ధనుష్‌తో పెళ్లి ఉండొచ్చని అన్నారు. ఇప్పుడేమో తమిళ స్టార్ హీరో శింబుతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. వరలక్ష్మిలానే శింబు కూడా సింగిల్‌గా ఉండటంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
నా టీం జోలికి వస్తే ఒక్కొక్కడికి టెంకాయలు ప్పగిలిపోతాయ్
-
హీరోయిన్స్ ని మించి రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న వరలక్ష్మి..!
-
పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?. వరలక్ష్మి క్లారిటీ మామూలుగా లేదుగా!
టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న నటి క్రేజీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం అంజమ్మ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాల్లో కనిపించిన బెంగళూరు బ్యూటీ కొత్త ఏడాదిలో హనుమాన్ చిత్రం ద్వారా పలకరించింది. ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న భామ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పెళ్లి చేసుకునే విషయంపై తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చింది. వివాహం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. 'పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మన లైఫ్‌లో అది ఒక పార్ట్. అంతే కానీ అది గోల్ కాదు. నేను వివాహానికి వ్యతిరేకం కాదు. ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడటం 18 ఏళ్ల క్రితమే అపేశారు. నా దృష్టిలో పెళ్లి అనేది ముఖ్యం కాదు. మ్యారేజ్ చేసుకున్నా ఓకే.. చేసుకోపోయినా ఓకే. చాలామంది పెళ్లి చేసుకోకుండా కూడా ఉన్నారు. నా బెస్ట్‌ఫ్రెండ్ త్రిష కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు.' అని అన్నారు. దీంతో పెళ్లి అనేది జీవితంలో కేవలం ఒక పార్ట్ మాత్రమేనని తనదైన శైలిలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. కానీ పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్. -
చిరంజీవి లాంటి మంచి మనసుండాలి : వరలక్ష్మీ శరత్‌కుమార్
‘‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి సార్ నా పని గురించి, నా నటన గురించి చాలా ΄పాజిటివ్‌గా మాట్లాడారు. ‘నీలాంటి ప్రతిభ ఉన్న నటి తెలుగు చిత్రపరిశ్రమలో ఉండాలి.. హైదరాబాద్‌లోనే ఉండు’ అని ఆయన చెప్పడంతో ఇన్నాళ్ల నా కష్టానికి ఒక అవార్డు వచ్చిందని సంతోషంగా అనిపించింది. సహ నటీనటుల గురించి అలా మాట్లాడాలంటే ఎంతో మంచి మనసుండాలి. ప్రీ రిలీజ్ వేడుక అయిన తర్వాత కృతజ్ఞతలు చెబుతూ ఆయనకు మెసేజ్ చేశాను’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ పంచుకున్న విశేషాలు. ♦‘హను–మాన్’లో తేజ సజ్జాకి అక్క (అంజమ్మ) పాత్రలో కనిపిస్తాను. ఇది సూపర్ హీరో ఫిల్మ్. ఇందులో తేజ సూపర్ హీరో. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాను. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ ఉండే ఫైట్ నాది. అంజమ్మ పాత్ర నా కెరీర్లో వైవిధ్యంగా ఉంటుంది. ♦ తేజ, ప్రశాంత్, నిరంజన్ రెడ్డిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నా అంజమ్మ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుంది. నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే పేరు వచ్చింది.. ఆ పేరుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. ♦ ఏ సినిమా చేసినా ‘ఇది నా తొలి చిత్రం.. నేను కొత్త’ అనే ఆలోచనతో చేస్తాను. విలన్, హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ అని చూడను. నా పాత్రకి ప్రాధాన్యత ఉంటే ఏదైనా చేస్తాను. కొంతమందికి నా పేరు తెలియదు. వాళ్లు నేను చేసిన పాత్రలతో జయమ్మ, భానుమతి అని పిలుస్తారు.. అదే నాకు అసలైన అవార్డ్. హిందీ, బెంగాలీలో అవకాశాలు వచ్చాయి. కానీ ΄ాత్రలు నచ్చక΄ోవడం, డేట్స్ కుదరక΄ోవడం వల్ల చేయలేదు. మా నాన్న (శరత్ కుమార్) నా ప్రతి సినిమా చూసి, నా నటన గురించి చెబుతారు. ‘కోట బొమ్మాళి పీఎస్’లో నా ΄ాత్రకి ఆయన ఎలాంటి వంక పెట్టలేదు.. చాలా బాగా చేశావని అభినందించారు. ప్రస్తుతం సుదీప్గారితో ‘మ్యాక్స్’, ధనుష్గారితో ‘ఢీ 50’లో చేస్తున్నాను. మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. -
చిరంజీవి గారి ముందు.. ఏదోలా ఉంది
-
‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
వరలక్ష్మి శరత్ కుమార్ ఇంతలా కష్టపడిందా.. రివీల్ చేసిన టాప్ డైరెక్టర్
వరలక్ష్మి శరత్ కుమార్‌ను ప్రశంసించని వారు ఉండరనే చెప్పాలి. ఆమె స్టార్ వారసురాలైనా ప్రతిభతోనే కథానాయకిగా రంగ ప్రవేశం చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ సూపర్ బెల్లీ డ్యాన్సరన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. తన తండ్రి శరత్ కుమార్ సిఫార్సునే తీసుకోని ఆమె ప్రతిభనే నమ్ముకుని వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆమెను దర్శకుడు బాలా తనకు నచ్చిన నటి అని ప్రశంసించడం విశేషం. సేతు, నందా, శివ పుత్రుడు వంటి పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు బాలా. ఈయన ప్రస్తుతం కోలీవుడ్‌లో వణంగాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మొదట నటుడు సూర్య కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఆయన చిత్రం నుంచి వైదొలగడంతో నటుడు అరుణ్ విజయ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు బాలా ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ తాను చాలా తక్కువ మంది కథానాయకిలతోనే చిత్రాలు చేశానని, అందులో తనకు నచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు తెరకెక్కించిన తారై తప్పట్టై చిత్రం షూటింగ్లో ఘనంగా నటించిన ఆర్కే సురేష్‌కు నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు మధ్య జరిగిన సన్నివేశంలో ఆమె ఒంటి ఎముక చిట్లినా లెక్కచేయకుండా మళ్లీ మళ్లీ టేక్ చెప్పినా నటించారని చెప్పారు. అసలు ఆర్కే సురేష్ ఆమైపె బలంగా పడాలన్నారు. షార్ట్ సరిగ్గా రావాలని తాను గట్టిగా అరవడంతో ఆర్కే సురేష్ ఆమైపె బలంగానే పడ్డారన్నారు. అలా తొలి షాట్ లోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఒంటి ఎముక చిట్లిందన్నారు. ఆమె తనతో ఆ విషయాన్ని చెప్పలేదన్నారు. తాను పర్ఫెక్షన్ కోసం మరో రెండు మూడు టేకులు చేశానన్నారు. ఆమె కాదనకుండా నటించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఊరికి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరిస్తున్నప్పుడు తన ఒంటి ఎముక చిట్లినదానికి సంబంధించిన ఎక్స్‌రేను చూపించడంతో ఇది నిజమా అని అడిగానన్నారు. దాంతో ఆమె నిజమేనని చెప్పి చాలా కష్టపడినట్లు చెప్పారన్నారు. అలా ఆమె కఠిన శ్రమజీవి అని దర్శకుడు బాలా పేర్కొన్నారు. -
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Kotabommali PS Pre Release Photos: ‘కోట బొమ్మాళి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వరలక్ష్మి వెంటబడుతున్న తెలుగు డైరెక్టర్
తెలుగు సినీ పరిశ్రమలో పవర్ఫుల్ లేడీ విలన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'రమ్యకృష్ణ'. నరసింహా, నీలాంబరి చిత్రాల్లో హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడా ప్లేస్‌లోకి వరలక్ష్మి శరత్‌కుమార్ వచ్చేసిందని చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుంటారు. అంతలా ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. వరలక్ష్మికి తెలుగులో స్టార్ ఇమేజ్ అందించిన చిత్రం ‘క్రాక్’ . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయమ్మగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్ వాయిస్ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది. తరువాత ఇదే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' సినిమా తనకు మరింత పేరును తీసకువచ్చింది. ఇదే ఏడాదిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మికి తెలుగులో మరో హిట్ అందుకుంది. ఇందులో ఆమె 'భానుమతి' పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించి మరింత స్టార్ ఇమేజ్ను పెంచుకుంది. సీమ యాసలో ఆమె చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌లు సినీ ప్రియులను కట్టిపడేశాయి. ఈసినిమా విడుదలయ్యాకనే ఆమె నటన చూసే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో లేడీ విలన్ వచ్చేసిందంటూ అప్పట్లో వరుస కామెంట్స్ కూడా చేశారు. వరలక్ష్మికి మరో ఛాన్స్ వరసు విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మళ్లీ రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో మళ్లీ మరో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇందులో కూడా తన లక్కీ ఛార్మ్ అయిన వరలక్ష్మి కోసం ప్రత్యేక రోల్‌ను ఆయన క్రియేట్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక చేయడం కంటే ముందు వరలక్ష్మి ఎంపిక జరిగిపోయిందట. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను గోపీచంద్ ఇప్పటికే సంప్రదించాడని టాక్. ఇలా తన సినిమాలో జయమ్మ ఉంటే అది సూపర్ హిట్ ఖాయం అని ఆయన భావిస్తున్నారట. -
50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని సంచలన నటిమణులలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. నటిగానూ, వ్యక్తిగతంగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన నటి ఈమె. ఈమె కోలివుడ్లో శింబుకు జంటగా 'పోడాపొడి' చిత్రం ద్వారా కథానాయకగా పరిచయం అయ్యారు. అయితే నిజానికి ఈమె శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ చిత్రం ద్వారానే నాయకిగా పరిచయం కావలసి ఉందట. నటనపై ఆసక్తితో ముంబాయిలో అనుపమ్ ఖేర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వరలక్ష్మి శరత్ కుమార్‌ను చదువు పూర్తి అయిన తరువాత నటించాలని ఆమె తండ్రి శరత్ కుమార్ చెప్పడంతో బాయ్స్ చిత్ర అవకాశాన్ని వదులుకున్నారట. ఇదే విధంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో సరోజా చిత్రంలోనూ నటించలేకపోయారట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల స్పష్టం చేశారు. ఆ తర్వాత నటుడు శింబు సరసన పోడా పోడి చిత్రంలో నటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటి వరలక్ష్మి కెరీర్‌కు మాత్రం మంచి పునాది వేసింది. ఆ తర్వాత తారై తప్పట్టై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతే ఆమెకు ఇక నటిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కలగలేదు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) కథానాయకగా, ప్రతినాయకగా తమిళం, తెలుగు తదితర చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ అర్ధసెంచరీ మైలు రాయిని అధిగమించేశారు. దీని గురించి ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాబై చిత్రాలు పూర్తి చేయడానికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ముఖ్యంగా తన టీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్ అనీ, తాను ఇంతకాలం నటిగా కొనసాగుతానని గానీ, ఇన్ని చిత్రాల్లో నటిస్తానని అనుకోలేదన్నారు. ఇకపై నటనను ఆపే ప్రసక్తే లేదని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
నాన్న వల్ల వచ్చిన అవకాశాలు పోయాయి : వరలక్ష్మీ శరత్‌కుమార్
చాలెంజింగ్ పాత్రలకు కేరాఫ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె సుప్రీమ్ స్టార్ శరత్ కుమార్ వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే స్వశక్తితోనే నటిగా ఎదిగి తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఈమె రాకింగ్ నటన ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. నాయకి, ప్రతినాయకి ఇలా ఏ తరహా పాత్రకైనా రెడీ అంటారు. కథానాయకిగా రంగ ప్రవేశం చేసినా, ప్రతినాయకిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో శింబుకు జంటగా పోడాపొడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి అవకాశాల కోసం కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలా బాలా దర్శకత్వంలో నటించిన తారై తప్పటై చిత్రంలో నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆపై వరలక్ష్మి నటిగా వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ముఖ్యంగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్, విశాల్ హీరోగా నటించిన సండై కోళీ 2 వంటి చిత్రాల్లో ప్రతి నాయకిగా తనదైన శైలిలో అదరగొట్టారు. చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా? ఆ తర్వాత ఈమె ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే నటిస్తున్నారు. మధ్య మధ్యలో కథానాయిక పాత్రలనూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా దశాబ్దం పాటుగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో జెనీలియా పాత్రలో తాను నటించాల్సి ఉందని చెప్పారు. దర్శకుడు శంకర్ నుంచి తనకు పిలుపు వచ్చిందన్నారు. ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందన్నారు. ఆ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్న సమయంలో తాను నటించడానికి తన తండ్రి అనుమతించలేదని చెప్పారు. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దాన్ని నాన్న వద్దన్నారని చెప్పారు. ముందు చదువు పూర్తి చెయ్యి ఆ తర్వాత నటన గురించి ఆలోచిద్దామని చెప్పారన్నారు. అలా తన తండ్రి వల్ల చాలా అవకాశాలు మిస్ అయ్యానని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు. -
తమిళంలో అవకాశాలు రావడం లేదు : వరలక్ష్మీ శరత్‌కుమార్
తమిళంలో తనకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారని నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈమె కథానాయకిగా నటించిన చిత్రం కొండ్రాల్ పావం. నటుడు సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఈశ్వరి రావు, చార్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రతాప్ కృష్ణ మనోజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి దయాళ్ పద్మనాభన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. కొండ్రాల్ పావం చిత్రాన్ని తెలుగులో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా తమిళనాడుకు చెందిన ఈయన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 3వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తరువాత తమిళంలో కథానాయకిగా నటిస్తున్నానని తెలిపారు. దర్శకుడు కన్నడ చిత్రాన్ని చూపించగానే ఇందులో తాను నటిస్తానని చెప్పానన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్నారు.. ఎందుకని అడుగుతున్నారని, అయితే తనకు తమిళంలో అవకాశాలు రావడం లేదని స్పష్టం చేశారు. 2011లో పోడా పోడి చిత్రం ద్వారా తమిళంలో కథానాయకిగా పరిచయం అయ్యానని, అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు ఇక్కడ నటించినా రాని గుర్తింపు తెలుగులో క్రాక్ చిత్రంతో వచ్చిందని చెప్పారు. తాను ప్రతినాయకిగా రకరకాల పాత్రల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ నటించానని, అయినా ఇక్కడ సరైన స్థానం కల్సించడం లేదని అన్నారు. కారణం తనను చూసి భయపడుతున్నారో, లేక ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారో తెలియదన్నారు. అయితే తెలుగులో మంచి పాత్రలతో పాటు గౌరవం, అడిగినంత పారితోషికాన్ని కరెక్టుగా చెల్లిస్తున్నారని తెలిపారు. అందుకే చాలా మంది కళాకారులు తెలుగు చిత్రపరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. సంతోష్ ప్రతాప్ మాట్లాడుతూ.. తాను కూడా తెలుగు చిత్రాలపై శ్రద్ధ చూపడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపారు. -
వరలక్ష్మి ఆనంద తాండవం.. వీడియో వైరల్
ప్రస్తుతం కోలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటీ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు వరలక్ష్మి శరత్‌కుమార్. నిజ జీవితంలోనే కాకుండా సినిమాల్లో ఈ తరహా పాత్రల్లోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రారంభ దశలో కథానాయికగా నటించినా అలాంటి పాత్రలు ఈమెకు సరిపడలేదనే చెప్పాలి. కాని హీరోయిన్గా వరలక్ష్మి శరత్‌కుమార్‌కు పెద్దగా సక్సెస్ కాలేదు. తొలి చిత్రం పోడాపోడిలో నటుడు శింబుతో జత కట్టినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో నటించిన తార్ తప్పటై చిత్రంలో విలక్షణతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఆటోమేటిక్‌గా ప్రతినాయకి పాత్రలు తలుపు తట్టడం మొదలెట్టాయి. అలా సర్కార్ చిత్రంలో విజయ్ను, సండైకోళి–2 చిత్రంలో విశాల్‌ను ఢీ కొట్టి సరైన ప్రతినాయకిగా పేరు తెచ్చుకున్నారు. అలా వరలక్ష్మి శరత్‌కుమార్ పేరు టాలీవుడ్, మాలీవుడ్ అంటూ దక్షిణాది వరకు పాకింది. ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు ఎదురు నిలిచారు. అలా వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అభిమానగణం నానాటికి పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈమెకు ఫాలోవర్స్ రెండు మిలియన్లు ఉన్నారంట. దీంతో ఆమె ఆనంద సాగరంలో తేలిపోతున్నారు. తన సంతోషాన్ని వ్యక్తం చేసే విధంగా ఆనంద తాండవం చేసిన ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తనకు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్పడానికి ఈ విధంగా డాన్స్ చేసినట్లు పేర్కొన్నారు. ఇది తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని, ఈ విషయాన్ని మీకు తెలియచేయడం వల్ల మరింత దగ్గరైనట్టుగా భావిస్తున్నానని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అందులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
'వీర సింహారెడ్డి' విజయోత్సవం..(ఫొటోలు)
-
ఉత్కంఠ రేపుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ‘శబరి’ టీజర్
విలక్షణ పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో ఈ రోజు(జనవరి 10) వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సుమారు నిమిషం నిడివి కల వీడియోలో 'శబరి' థీమ్, మూడ్ ఎలా ఉంటుందనేది చూపించారు. ప్రకృతికి చిరుమానా లాంటి ఓ హిల్ స్టేషన్లో ఓ మహిళ. తన చిన్నారి కుమార్తెతో జీవిస్తుంటుంది. 'మమ్మీ...' అనే అరుపుతో ఒక్కసారి మూడ్ మారింది. మృగం మీ ఇంటిలోకి అడుగు పెడితే... మీరు ప్రేమించే మనుషులను కాపాడటం కోసం ఎంత దూరం వెళతారు? అని వీడియోలో ఓ కోట్ వచ్చింది. విజువల్స్ చూస్తే... పాపను ఎవరో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కన్నబిడ్డను కాపాడుకోవడం కోసం శబరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఎటువంటి పోరాటం చేశారనేది కథగా అర్థం అవుతోంది. బుల్లెట్ రైడ్ చేస్తున్న వరలక్ష్మిని వీడియోలో చూపించారు. విలన్ రోల్ 'మైమ్' గోపి చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. అంతే కాదు... వరలక్ష్మి, 'మైమ్' గోపి మధ్య ఫేస్ ఆఫ్ సీన్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ వీడియోలో మిగతా పాత్రలనూ చూపించారు. తల్లీ కూతుళ్ళ మధ్య ప్రేమ, అనుబంధంతో పాటు కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం, రాహుల్ శ్రీవాత్సవ విజువల్స్ బాగున్నాయి. ''స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆమె అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని దర్శక నిర్మాతలు చెప్పారు. -
అందుకే గ్లామర్ పాత్రలు చేయను : వరలక్ష్మీ శరత్‌కుమార్
తమిళసినిమా: డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్. పోడా పోడీ చిత్రం ద్వారా నటుడు శింబుకు కథానాయకిగా పరిచయమైన ఈమె తర్వాతి కాలంలో ట్రెండ్ మార్చుకుని ప్రతినాయకిగా అవతారం ఎత్తారు. అప్పటి నుంచి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రశంసలు, విజయాలు వరిస్తున్నాయి. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, మలయాళం తదితర భాషల్లోనూ ఈమె కెరీర్ పీక్స్‌లో కొనసాగుతోంది. నాయకిగా, ప్రతినాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్రకైనా రెడీ అంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తమిళంతో పాటు తెలుగులోనూ వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మంచి డిమాండ్ ఉంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో ఈమె విలనిజం ప్రదర్శించారు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రతినాయకిగా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల ఒక భేటీలో బదులిస్తూ గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్ కాదని భావించానని, అయినా అలాంటి పాత్రలు చేయడానికి చాలామంది ఉన్నారని అన్నారు. అందుకే తాను ప్రతినాయక బాటను ఎంచుకున్నానని తెలిపారు. ఇలాంటి కొన్ని పాత్రలు తానే చేయగలనని అభిప్రాయపడ్డారు. అయితే తనకు గురువు, దర్శకుడు బాల అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో గరగాటకారిగా నటించి ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు. అయినా తాను ప్రతినాయకి పాత్రల్లో నటిస్తూ సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు. -
'ఆహా' కోసం పోలీస్ అవతారం ఎత్తిన వరలక్ష్మీ శరత్‌కుమార్
తమిళసినిమా: ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె హీరోయిజం, విలనిజం, క్యారెక్టరిజం ఇలా పాత్ర ఏదైనా నచ్చితే చేసేస్తున్నారు. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ అధికారి అవతారం ఎత్తారు. దర్శకుడు దయాళ్ పద్మనాభన్ ఆహా ఓటిటీ కోసం తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈమె పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి కథ, కథనం దర్శకుడు అందిస్తున్నారు. కాగా ఇందులో ఆమెతో పాటు నటుడు సంతోష్ ప్రతాప్, మహత్, రాఘవేంద్ర, దర్శకుడు సుబ్రమణ్యం, శివ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణికాంత్ కాంద్రీ సంగీతాన్ని, శేఖర్ చంద్ర చాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శుక్రవారం బెంగళరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర కథా పోలీస్‌స్టేషన్ నేపథ్యంలో సాగుతుందన్నారు. ఆది నుంచి అంతం వరకు చిత్రం ఉత్కంఠ భరితంగా సాగుతుందని పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు ఈయన దర్శకత్వంలో వరలక్ష్మి, సంతోష్ ప్రతాప్ కలిసి కొండ్రాల్ పావం అనే చిత్రంలో నటించడం విశేషం. -
'శబరి' షూటింగ్ కంప్లీట్ చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. ఈ మూవీతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నేను పనిచేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో మహేంద్రగారు ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. రెండు మూడు రోజుల్లో ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభిస్తా’’ అన్నారు. ‘‘ఇదొక స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించాం. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ‘‘స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతి శబరి పాత్రలో వరలక్ష్మి నటించారు’’ అన్నారు అనిల్ కాట్జ్. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపీ సుందర్. -
శరవేగంగా వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా షూటింగ్
తమిళసినిమా: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కొండ్రాల్ పావం. నటుడు సంతోష్ ప్రతాప్, ఈశ్వరిరావు, చార్లీ, మనోబాల, జయకుమార్, మీసై రాజేంద్రన్, సుబ్రమణ్యం శివ, ఇమ్రాన్, సెండ్రాయన్, టీఎస్ఆర్ శ్రీనివాసన్, రాహుల్, కవితా భారతి, తంగదురై, కల్యాణి మాధవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇన్చ్ స్టూడియోస్ పతాకంపై ప్రతాప్ కృష్ణ, మనోజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ఈ నెల మొదట్లో ప్రారంభించిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే అధిక భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. రచయిత మోహన్‌బాబు రాసిన ప్రముఖ నాటకాన్ని కొండ్రాల్ పావం పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. దీనిని తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు వెర్షన్ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఆహా ఓటీటీ కోసం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి షూటింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిందని, త్వరలోనే మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి చెళియన్ చాయాగ్రహణను, శ్యామ్ సీ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి టీ పిక్చర్స్ సంస్థ సహ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. -
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. యశోద నటి ఎమోషనల్ పోస్ట్
క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజాగా యశోద మూవీలో నటించింది. ఆమె సినీ ప్రయాణం మొదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్‌మీడియాలో ఏమోషనల్ పోస్ట్ చేసింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది. (చదవండి: యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు) వరలక్ష్మీ శరత్ కుమార్ లేఖలో ప్రస్తావిస్తూ.. 'సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు యశోద చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ దశాబ్ద కాలంలో నా సినీ ప్రయాణం సులభంగా, అనుకున్న విధంగా సాగలేదనే చెప్పాలి. పదేళ్లలో ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొన్నా. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. వాటినుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. దశాబ్ద కాలంగా ఎంతో కృషి చేశా. వెనక్కి తిరిగి చూసుకుంటే 45 సినిమాల్లో నటించి నేనెంటో నిరూపించుకున్నా. అలాగే నన్ను తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా కెరీర్ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు వరలక్ష్మీ శరత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. Thank you ❤️#10years #blessed #grateful pic.twitter.com/AJ6x57MLRg — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) November 13, 2022 -
అలాంటి వారే సెలబ్రెటీల లైఫ్ గురించి మాట్లాడుకుంటారు: నటి అసహనం
నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో విలనిజంతో మెప్పిస్తోంది. తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె రవితేజ క్రాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాంది, చేజింగ్ వంటి చిత్రాల్లో నటించి లేడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రం యశోదలో నటించింది. సమంత లీడ్ రోల్‌తో తెరకెక్కిన ఈచిత్రంలో ఆమె ఓ కీ రోల్ పోషించింది. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరోగసి నేపథ్యంలో యశోద సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో సరోగసి అంశం హాట్‌టాపిక్ మారింది, దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా.. ‘సరోగసీ అనేది కాంప్లికేటెడ్ అంశం కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల దీనిపై చర్చ నడుస్తోంది. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పిల్లలు పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ’ అని పేర్కొంది. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే ఇటీవల లేడీ సూపర్ నయనతార సరోగసిని ఆశ్రయించడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు వ్యక్తిగత జీవితాన్ని చర్చనీయాంశం చేయడంపై మీ అభిప్రాయం చెప్పాలని యాంకర్ వరలక్ష్మిని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. పని పాట లేని వాళ్లే పక్కవారి లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం సెలబ్రెటీల జీవితంలో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. అందరు తమ జీవితాలకు సంబంధించిన విషయాలను పక్కన పెట్టి పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పని పాట లేనివాళ్లే ఇలా చేస్తారు. వాళ్లకు ఏం పని ఉండదమో అందుకే పక్కవాళ్ల గురించి ఆలోచిస్తుంటారు’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. -
వైజాగ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ వైజాగ్‌లో పూర్తయింది. ఈ సంద్భంగా అనిల్ కాట్జ్ మాట్లాడుతూ– ‘‘శబరి’ భిన్నమైన చిత్రం. స్వతంత్ర భావాలున్న యువతి పాత్రలో వరలక్ష్మి కనిపిస్తారు. మూడో షెడ్యూల్లో భాగంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, ఒక పాట, కీ సీన్స్ చిత్రీకరించాం. నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెలలో హైదరాబాద్‌లో నాలుగో షెడ్యూల్ మొదలు కానుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల. -
'అది పెద్ద సమస్యేమీ కాదు.. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుంటా'
ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా అన్ని భాషల్లోనూ అన్ని రకాల పాత్రలను ఛాలెంజ్‌గా తీసుకుని నటించే నటీమణులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరు. ఈమె వారికి, వీరికి అన్న భేదం చూపకుండా పాత్ర నచ్చితే నటించడానికి సిద్ధం అంటున్నారు. అలా తాజాగా నటి సమంత ప్రధాన పాత్ర ధరించిన యశోద చిత్రంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. ఇది ఈ నెల 11వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ఒక భేటీలో పేర్కొంటూ యశోద చిత్రంలో తాను అద్దె తల్లిని సమకూర్చిన వైద్యురాలిగా నటించానని చెప్పారు. ఇలాంటి ఇతివృత్తంతో కథలను ఎలా రాస్తారో? అని తానే ఆశ్చర్యపోయనని చెప్పా రు. అద్దె తల్లి విధానం గురించి ఇటీవల పెద్ద చర్చే జరిగిందని, నిజానికి అంత క్లిష్టమైన సమస్య కాదని పేర్కొన్నారు. అయితే ఈ చర్చకు నటి నయనతార, విఘ్నేష్ శివన్ వంటి సెలబ్రిటీస్ కావడంతో పెద్ద వివాదం జరిగిందన్నారు. ఇక యశోద చిత్రం విషయానికొస్తే కథానుగుణంగా తనలో ప్రతినాయకి ఛాయలు కనిపిస్తాయని, చిత్రంలో సమంత మాదిరిగా తాను ఫైట్స్ చేయలేదని, అయితే ఆమె పాత్రకు సమాంతరంగా తన పాత్ర ఉంటుందని చెప్పారు. సమంతకు ఎప్పుడైతే ఇతరుల సాయం అవసరం అవుతుందో అప్పుడు తన పాత్ర కథలోకి వస్తుందని చెప్పారు. అయితే ఆమెతో తనకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది చిత్రం చూసే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పారు. అయితే చిత్రంలో అద్దె తల్లి విధానం రైటా తప్పా అన్నది చర్చించలేదని, సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని చెప్పడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. మంచి కథా పాత్రల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను వాటిని ఛాలెంజ్‌గా తీసుకుంటానని వరలక్ష్మీశరత్‌కుమార్ చెప్పారు. -
ఆ తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చు : నటి
సమంత అనారోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సమంత పోస్ట్ చేయడంతో ఇండస్ట్రీ సహా ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. తాజాగా సమంత అనారోగ్యంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. '12 ఏళ్లుగా సామ్‌తో పరిచయం ఉంది. యశోద సినిమాలో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. సెట్స్‌లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ టైంలో సామ్ అనారోగ్యంతో బాధపడుతుందని మాకు తెలీదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. యశోద షూటింగ్ పూర్తయిన తర్వాతే సామ్ ఆరోగ్యం క్షీణిందని అనుకుంటున్నా. కానీ ఆమె ఒక ఫైటర్. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. -
ప్లీజ్.. అలాంటివేవైనా ఉంటే చెప్పండి: వరలక్ష్మి శరత్‌కుమార్
ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించే సత్తా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ వారసురాలైన ఆమె శరత్‌కుమార్ బ్రాండ్‌ను పెద్దగా ఉపయోగించుకోకుండానే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో శింబుకు జంటగా పోడాపోడి చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈమె నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకున్నారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై, పుష్కర్, గాయత్రిల దర్శకత్వంలో విక్రమ్ వేదా హిట్ చిత్రాలలో కథానాయికగా నటించారు. ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన సండైక్కోళి–2 చిత్రంతో ప్రతినాయకిగా అవతారమెత్తారు. అదే విధంగా విజయ్ కథానాయకుడుగా నటించిన సర్కార్ చిత్రంలో మరోసారి విలనిజాన్ని ప్రదర్శించారు. చదవండి: (Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్) ఆపై నాయకి, ప్రతినాయకి అన్న భేదం లేకుండా వైవిధ్యం అనిపించిన పాత్రలకు ఓకే చెప్పేసుకుని నటిస్తూ ఆల్‌రౌండర్‌గా మారిపోయారు. అదే విధంగా ఒక్క తమిళ భాషలోనే కాకుండా తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అన్నట్టు వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి డాన్సర్ కూడా. బెల్లీ డాన్స్ సూపర్‌గా చేస్తారు. ప్రస్తుతం పాంబన్, గ్రంథాలు పిరందాళ్ పరాశక్తి, కలర్స్, యశోద, శబరితో పాటు తెలుగులో బాలకృష్ణ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు హాస్యభరిత కథా చిత్రంలో నటించాలన్నది చిరకాల కోరిక అన్నారు. అయితే తనకు అలాంటి పాత్రలో నటించే అవకాశాలు రావడం లేదని, అన్ని ప్రతినాయకి పాత్రలే వస్తున్నాయన్నారు. కాబట్టి ఎవరైనా కామెడీ కథా చిత్రాల్లో నటించే అవకాశం చెప్పండి ప్లీజ్ అని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అంటున్నారు. చదవండి: (దర్శకుడు భారతీరాజా ఇంటికి సీఎం స్టాలిన్) -
హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన కోలీవుడ్ స్టార్
కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలుగులో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. క్రాక్, నాంది వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ నటికి ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాలని డిసైడ్ అయింది. తన బర్త్‌డే సందర్భంగా భాగ్యనగరానికి షిఫ్ట్ అయింది కూడా! ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'నా లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు. మీరంతా ఈ బర్త్‌డే ఎంతో స్పెషల్‌గా చేశారు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న అందరికీ థ్యాంక్స్. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అదే హైదరాబాద్. అవును, నేను హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. కొంత భయంగా, ఆందోళనగా ఉంది. కానీ నాకు తెలుసు, అంతా మంచే జరుగుతుందని! నేను ఎక్కడున్నా మీరంతా నా వెనకే ఉంటారని తెలుసు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. మిమ్మల్ని స్నేహితులుగా పిలవలేను, ఎందుకంటే మీరే నా కుటుంబం. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
క్రీడాకారిణిగా పవర్‌ఫుల్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్.. పోస్టర్ వైరల్
Varalaxmi Sharath Kumar First Look From Aadya Movie Revealed: తెలుగు ప్రేక్షకులకు వరలక్ష్మీ శరత్ కుమార్ సపరిచితమే. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. క్రాక్, నాంది సినిమాలతో సూపర్ హిట్ అందుకోవడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే ఆమె కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద' మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే 'హనుమాన్' సినిమాలోని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇవే కాకుండా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోన్న మరో తాజా చిత్రం 'ఆద్య'. ఆమెతో పాటు హెబ్బా పటేల్, ఆశిష్ గాంధీ తదితరులు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎం. ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం (మార్చి 5) ఆమె పుట్టిన రోజు సందర్భంగా వరలక్ష్మీ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఆమె క్రీడాకారిణిగా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి 11న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచడం విశేషం. -
'మధుబాల'గా వరలక్ష్మీ శరత్‌కుమార్.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొడుతుంది. ఇటీవలె క్రాక్, నాంది సినిమాలతో హిట్ అందుకున్న ఆమెకు తెలుగులో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శనివారం ఆమె పుట్టినరోజు కావడంతో యశోద టీం ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ వదిలారు. ఈ చిత్రంలో ఆమె 'మధుబాల' అనే పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్లో స్పష్టమవుతుంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్, హరీశ్ నారాయన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. -
హనుమాన్: వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
Pan Indian Movie Hanuman First Look Out: యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్ పోస్టర్ రిలీజైంది. పెళ్లికూతురిగా ముస్తాబైన అంజనమ్మ(వరలక్ష్మి) చేతిలో కొబ్బరి బోండాల గుత్తి ఉంది. దీన్ని చేత పట్టుకున్న ఆమె ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తూ ఆవేశంతో ఊగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ సినీప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. Introducing the Mighty “Makkal Selvi” as the braveheart #Anjamma from the World of Anjanadri Advance HBD @varusarath5 🤩 -Team #HanuMan HANU🔶MAN A @PrasanthVarma Film@tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets#HanuManTheOrigin pic.twitter.com/L1iSOrxkya — Kichcha Sudeepa (@KicchaSudeep) March 4, 2022 -
ఐశ్వర్యా, అభిషేక్‌లను కలిసిన నటి వరలక్ష్మీ.. పోస్ట్ వైరల్
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఐశ్వర్యా రాయ్‌ని నటుడు శరత్‌కుమార్, ఆయన కుమార్తె, నటి వరలక్ష్మి కలిశారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, ఆనందం వ్యక్తం చేశారు వరలక్ష్మి. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
కామాంధుల ఆట కట్టించనున్న హీరోయిన్
డ్రగ్స్ ముఠా అంతుచూసే పోలీస్ అధికారి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం "చేజింగ్". విదేశాల నుంచి డ్రగ్స్ చట్టవిరుద్ధంగా మన దేశానికి సరఫరా చేస్తూ కోట్లకు పడగెత్తిన మాఫియా ముఠా కన్నెపిల్లలపై మత్తు మందును ప్రయోగిస్తూ వారి మాన ప్రాణాలతో చెలగాటమాడే కామాంధుల ఆట కట్టించడానికి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆమె ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఎలా పట్టుకుంది? అన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రం చేజింగ్. ఇందులో స్పెషల్ పోలీస్ అధికారిణిగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఏషియన్ మీడియా పతాకంపై మదియళగన్ మునియాండి నిర్మించారు. కేకే కుమార్ దర్శకత్వం వహించగా, దసి సంగీతాన్ని, కృష్ణ స్వామి ఛాయాగ్రహణం అందించారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో జూ.ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ ధరెంతో తెలుసా? -
‘నాంది’ మూవీ రివ్యూ
టైటిల్ : నాంది జానర్ : ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : అల్లరి నరేశ్,వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రవీన్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తదితరులు నిర్మాణ సంస్థ : ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ నిర్మాత : సతీష్ వేగేశ్న దర్శకత్వం : విజయ్ కనకమేడల సంగీతం : శ్రీచరణ్ పాకల సినిమాటోగ్రఫీ : సిద్ విడుదల తేది : ఫిబ్రవరి 19, 2021 అల్లరి నరేశ్ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో. వరుస కామెడీ సినిమాలతో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టేవాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇటీవల ఆయన తీసిన సినిమాలు డిజాస్టర్ట్స్ అయ్యాయి. దీంతో ఈ ‘అల్లరి’హీరో సీరియస్‌గా మారి 'నాంది' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో శుక్రవారం (ఫిబ్రవరి 19)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా 'నాంది'లో అల్లరి నరేశ్ నగ్నంగా నటించడం, సీరియస్ రోల్ పోషించడంతో ప్రతి ఒక్కరిలో ఆసక్తినెలకొంది. ఇక వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నరేశ్ కూడా నాందిపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. మరి నరేశ్ ప్రయోగం ఫలించి విజయం సాధించాడా? అల్లరోడి కెరీర్లో 57వ సినిమాగా రాబోతున్న ‘నాంది’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ బండి సూర్యప్రకాశ్ అలియాస్ సూర్య( అల్లరి నరేశ్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తల్లిదండ్రులంటే అతనికి ఎనలేని ప్రేమ. తన చదువు కోసం తల్లిదండ్రులు ఎలాంటి సుఖాలను వదులుసుకున్నారో.. ఉద్యోగం వచ్చాక వాటన్నింటినితిరిగి ఇస్తాడు. ఇక కొడుకుకు ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అమ్మాయిని కూడా చూస్తారు. ఇలా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సూర్యప్రకాశ్ అనుకోకుండా పౌరహక్కుల నేత రాజగోపాల్ హత్యకేసులో అరెస్ట్ అవుతాడు. చేయని నేరాన్ని బనాయించి సూర్యని టార్చర్ పెడతాడు ఏసీపీ కిషోర్ (హరీష్ ఉత్తమన్). కేసుల మీద కేసులు పెట్టి ఐదేళ్ల పాటు సూర్యని బయటకు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో జూనియర్లాయర్ ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) ఈ కేసును టేకప్ చేసి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయంపై ఏరకంగా పోరాడాడు? అసలు పౌరహక్కుల నేతను ఎవరు,ఎందుకు చంపారు? ఈ కేసులో సూర్యని ఏసీపీ కిషోర్ ఎందుకు ఇరికించాడు? జైలులో ఉన్న సూర్యకి, లాయర్ ఆద్య మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్యకు జరిగిన అన్యాయంపై లాయర్ ఆద్య ఏరకంగా పోరాటం చేసిందనేదే మిగతా కథ నటీనటులు కేవలం నవ్వించడమే కాదు.. ఏడిపించడం కూడా తెలుసు అని మరోసారి నిరూపించాడు అల్లరి నరేశ్. నేను, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్న నరేశ్.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. కేవలం కామెడీ పాత్రలే కాదు భావోద్వేగ పాత్రలను కూడా చేయగలడని మరోసారి నిరూపించుకున్నాడు. సూర్య అనే మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో జీవించేశాడు. ప్రతి సన్నివేశాన్ని ప్రాణంపెట్టి చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. ఇక అడ్వకేట్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒదిగిపోయింది. ఈ సినిమాకు నరేశ్ పాత్ర ఎంత ముఖ్యమో..వరలక్ష్మీ పాత్ర కూడా అంతే. తన అద్భతమైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరోలెవల్‌కి తీసుకెళ్లింది. ఏసీపీ కిషోర్ అనే నెగెటివ్ పాత్రలో హరీష్ ఉత్తమన్ మెప్పించారు. ప్రవీన్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తమ పరిధి మేరకు నటించారు. చదవండి: ('చక్ర' మూవీ రివ్యూ!) విశ్లేషణ ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211కు సంబంధించిన కథే ‘నాంది’ సినిమా. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన కథ,కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై చూపించాడు. ‘ఆవేశం సమస్యని సృష్టిస్తుంది.. ఆలోచన దాన్నిపరిష్కరిస్తుంది’, ‘దేవుడు.. మంటలు ఆర్పడానికి నీళ్లు ఇస్తే.. గుండె మంటల్ని ఆర్పడానికి కనీళ్లు ఇచ్చాడు’ లాంటి డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి. ప్రీక్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ‘నాంది’ నరేశ్ కెరియర్లో అద్భతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక శ్రీచరణ్ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు చాలా బాగుంది. ఎక్కడా సాగతీత లేకుండా సినిమాను చకచకా నడించాడు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ఓ మంచి సందేశాత్మక చిత్రం లభించిందని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ నరేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన కథ, కథనం ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ భావోద్వేగ సన్నివేశాలు మైనస్ సెకండాఫ్‌లో కథ రోటీన్‌గా సాగడం కొన్ని సన్నివేశాలు రియాల్టీ నుంచి సినిమాటిక్ జోన్లోకి వెళ్లడం - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నా పెళ్లా? నాకు తెలియదే!
హీరోయిన్లకు నిరంతరం ఎదురయే కామన్ గాసిప్ – పెళ్లి. పెళ్లికి సిద్ధమవుతున్నట్టు అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. తాజాగా ‘త్వరలోనే వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతోంది. వరుడు ఫలానా క్రికెటర్. పెళ్లి తర్వాత వరలక్ష్మి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటోంది’ అంటూ ఇంటర్నెట్లో ఓ వార్త వైరల్ అయింది. ఆ వార్త వరలక్ష్మి కంట కూడా పడింది. వెంటనే దాన్ని కొట్టిపారేశారామె. ఈ విషయాన్ని తన ట్వీటర్లో పంచుకుంటూ – ‘‘ఏంటీ నాకు పెళ్లా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనే విషయం నాకు ఆలస్యంగా తెలిసింది (వ్యంగ్య ధోరణిలో). అందరికీ నా పెళ్లి మీద అంత ఆసక్తి ఎందుకు? ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే అందరికీ వినపడేలా గట్టిగా అరచి చెబుతాను. అప్పుడు నా పెళ్లి గురించి ఎంచక్కా రాసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను పెళ్లి చేసుకోవడం లేదు. సినిమాలను వదిలేయడం లేదు’’ అన్నారు వరలక్ష్మి. -
ప్రముఖ క్రికెటర్‌ను పెళ్లాడనున్న వరలక్ష్మీ?
చెన్నై : సంచలన నటిగా ముద్రవేసుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ క్రికెటర్‌ను పెళ్లాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురు అయిన వరలక్ష్మి 'పోడా పోడీ' చిత్రంలో కోలీవుడ్‌కు కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కథానాయకి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతి నాయకి, ఇతర ప్రాధాన్యత గల పాత్రలను పోషిస్తూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుకుంటోంది. అలాంటి నటి త్వరలో పెళ్లి పీఠలెక్కడానికి సిద్ధమవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ఒక ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడితో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇండియన్ క్రికెట్ జట్టులో కొనసాగుతున్న అతను విరాట్ కోహ్లి, ధోనీలకు సన్నిహితుడని తెలుస్తోంది. శరత్‌కుమార్ కుటుంబానికి, అతని కుటుంబానికి మధ్య కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్టు సమాచారం. వీరి పెళ్లికి ఇరుకుటుంబాల సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. త్వరలోనే పెళ్లి నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌కు, నటుడు విశాల్‌కు మధ్య ప్రేమాయణం అనే వదంతులు జోరుగా సాగిన విషయం తెలిసిందే. విశాల్ హైదరాబ్‌ద్‌కు చెందిన ఒక వ్యాపార వేత్త కూతురితో వివాహ నిశ్చితార్థం జరగడంతో వరలక్ష్మి, విశాల్‌కు మధ్య ప్రేమాయణం వదంతులకు ఫుల్స్టాప్ పడ్డాయి. మరో విశేషం ఏమిటంటే నటి రాధిక కూతురు కూడా క్రికెట్ క్రీడాకారుడు అభిమన్యు మిథిన్‌ను ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శరత్ కుటుంబంలో మరో క్రికెట్ క్రీడాకారుడు భాగం కాబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం. -
రాధిక నాకు తల్లి కాదు!
చెన్నై : నటి రాధికా శరత్‌కుమార్ తనకు తల్లి కాదు అని పేర్కొంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. సంచలనాలకు మారు పేరు ఈ బ్యూటీ. అంతేకాదు తెగువ, ధైర్యం వంటి వాటిలో తనకు తానే సాటి అని చెప్పవచ్చు. విదేశాల్లో పెరిగిన వరలక్ష్మీశరత్‌కుమార్ మంచి బెల్లీ డాన్సర్ అన్నది చాలా మందికి తెలియదు. పోడాపోడీ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కన్నడంలో నటించింది. తాజాగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో అయితే పాత్రలో నటించడానికి అవకాశం ఉంటే అది కథానాయకి అయినా, ప్రతినాయకి అయినా, ఇంకేదయినా నటించడానికి సై అంటోంది. అలా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీశరత్‌కుమార్ అతి తక్కువ కాలంలోనే 25 చిత్రాలను దాటేసింది. (‘చాన్స్ కోసం గదికి రమ్మన్నారు’) కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పేర్కొంటూ తనకు కోపం ఎక్కువని, రౌడీనని, చిన్న వయసు నుంచి ఏది సరి అనిపిస్తే అది చేసేస్తానని చెప్పింది. అందుకే తనతో మాట్లాడడానికి చాలా మంది భయపడతారని అంది. మరో విషయాన్ని కూడా వరలక్ష్మీశరత్‌కుమార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. నటి రాధికశరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమిళంలో కిళక్కే పోగుమ్ రైల్ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు సహా ఇతర భాషల్లో నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ ముఖ్య పాత్రల్లో నటిస్తూ, మరో పక్క బుల్లితెర రాణిగా రాణిస్తున్న ప్రముఖ నటి రాధికాశరత్‌కుమార్. అయితే ఈమె నటుడు శరత్‌కుమార్‌ను రెండవ వివాహం చేసుకున్నారన్న విషయం తెలిసిందే. కాగా శరత్‌కుమార్ మొదటి భార్య కూతురు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈమె ఇంటర్వ్యూలో పలు విషయాలను తనదైన స్టైల్లో చెప్పారు. అందులో ముఖ్యంగా తాను రాధికను ఆంటీ అనే పిలుస్తానని చెప్పింది. ఎందుకంటే ఆమె తన తల్లి కాదని అంది. తన తండ్రి రెండవ భార్య. తనకు అమ్మ అంటే ఒక్కరేనని పేర్కొంది. తనకే కాదు ఎవరికైనా అమ్మ ఒక్కరే అని అంది. అందుకే రాధిక తనకు తల్లి కాదని, ఆంటీ అని చెప్పింది. అయితే తాను ఆమెను తన తండ్రి శరత్‌కుమార్‌తో సమానంగా గౌరవం ఇస్తానని చెప్పి దటీజ్ వరలక్ష్మీశరత్‌కుమార్ అనిపించుకుంది. ఆమె బోల్డ్నెస్కు ఇంతకన్నా రుజువు ఏం కావాలి. -
‘చాన్స్ కోసం గదికి రమ్మన్నారు’
చెన్నై : అంతా అయిన తరువాత ఫిర్యాదు చేయడం అంగీకారం కాదని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ అంటోంది. కోలీవుడ్‌లో డేరింగ్ అండ్ డైనమిక్ నటి ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. పోడాపోడీ చిత్రంతో నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురన్నది తెలిసిందే. కథానాయకిగా పయనాన్ని ప్రారంభించినా, అవకాశాలు రాకో, నటిగా నిరూపించుకోవాలన్న తపనతోనో ప్రతినాయకిగా నటించడానికి కూడా సై అంది. అలా రకరకాల పాత్రలతో కూడిన పలు చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈమె ప్రేమ వ్యవహారం గురించి చాలానే ప్రచారం జరిగింది. అలా కూడా సంచలన నటిగా ముద్ర వేసుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్ కాస్టింగ్ కౌచ్ గురించి పలువురు ప్రముఖ నటీమణులు కథలు కథలుగా వెతలను చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అలాంటి సమస్యను తానూ ఎదుర్కొన్నానని బహిరంగంగానే చెప్పింది. (చదవండి : ‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’) అంతేకాదు తనను ఇంటర్వ్యూ చేసిన ఒక టీవీ చానల్ విలేకరి అడ్జెస్ట్మెంట్ కావాలని అడగడంతో అతని చెంప చెళ్లుమనిపించినట్లు చెప్పింది. కాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో తాజాగా మళ్లీ అలాంటి ఆరోపణలు ప్రసారం అవుతుండడంతో దీనిపై నటి వరలక్ష్మీ స్పందిస్తూ మీటూ సమస్యను తానూ ఎదుర్కొన్నానని చెప్పింది. ఒక నటుడి వారసురాలినని తెలిసి కూడా సినిమా అవకాశం కోసం పడక గదికి రమ్మన్నారని చెప్పింది. దర్శక, నిర్మాతలతో అడ్జెస్ట్ కావాలని కొందరు చెప్పారని తెలిపింది. దీంతో అలాంటి అవకాశం తనకు అవసరం లేదని నిరాకరించినట్లు చెప్పింది. అలా మాట్లాడిన వారి ఆడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పింది. కాగా ఇలాంటి విషయాల్లో అంతా జరిగిన తరువాత ఫిర్యాదు చేయడం అంగీకారం కాదంది. మహిళలు తమను తాము రక్షించుకోవడానికి తయారవ్వాలని చెప్పింది. కాగా ఈమె మహిళారక్షణ కోసం, సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పోరాడడానికి స్త్రీశక్తి పేరుతో ఒక సమాఖ్యను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు వెల్వెట్ నగరం, పాంబన్ చేజింగ్, డానీ పిరందాల్ పరాశక్తి తమిళ చిత్రాలతో పాటు, తెలుగులో క్రాక్ చిత్రం, కన్నడ చిత్రం రణం చిత్రాల్లో నటిస్తోంది. కాగా ఈమె నటించిన కన్నిరాశి, కాటేరి చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి. -
వ్యతిరేకించిన వారికి కృతజ్ఞతలు
చెన్నై : తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలు పోషిస్తూ తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్యారెక్టర్ ఏదైనా ఒదిగిపోయి నటించడం వరలక్ష్మీ ప్రత్యేకత. 2012లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన పోడాపోడి చిత్రంతో వరలక్ష్మీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో శింబుతో జతకట్టింది. గత ఎనిమిది సంవత్సరాలలో ఇప్పటికీ 25 చిత్రాల్లో నటించి గొప్ప ఘనతను సాధించింది. ఈ సందర్భంగా వరలక్ష్మీ తన స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞత తెలుపుతూ ఓ లేఖ రాశారు. ‘ఎనిమిదేళ్ల ప్రయాణంలో నాతో కలిసి ఉన్న స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు. అలాగే నాకు వ్యతిరేకంగా ఉండి, నాపై చెడుగా, కించపరిచేలా మాట్లాడిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీ వ్యతిరేకత లేకుంటే నేను ఇంత ధ్యైర్యవంతురాలిని అయ్యుండే దానిని కాదు. అదే విధంగా మీ వాదనలు తప్పు అని నిరూపించలేకపోయేదాన్ని’ అని పేర్కొన్నారు. కాగా హీరో శరత్ కుమార్ మొదటి భార్య ఛాయ శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ. తన మనసులోని మాటలను నిర్మోహమాటంగా చెప్పే వరలక్ష్మీకి మంచి నటిగా పేరుంది. -
కనీసం వచ్చే జన్మలోనైనా.. !!
మళ్లీ జన్మంటూ ఉంటే కచ్చితంగా పోలీసు ఆఫీసర్‌గానే పుడతానంటున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. శింబుకు జోడీగా పోడాపోడీ సినిమాతో హీరోయిన్గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారామె. గ్లామర్ రోల్స్‌కే పరిమితమై పోకుండా విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తనను వరించిన పాత్రలకు తనదైన శైలిలో జీవం పోసి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ.. ధనుష్ నటించిన మారి 2 సినిమాలో ఐఏఎస్‌గా ఆకట్టుకున్నారు. తాజాగా ‘రాజపార్వై’ అనే సినిమాలో ఐపీఎస్‌గా నటించినట్లు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు.. ‘ మరో జన్మంటూ ఉంటే కచ్చితంగా పోలీసు అవ్వాలనుకుంటున్నాను. వృత్తిని ఎంతగానో ప్రేమించే నాకు.. విభిన్న పాత్రలు ఇస్తున్న దర్శకులకు ధన్యవాదాలు. అలాగే ఏ క్యారెక్టర్ చేసినా నన్ను అంగీకరిస్తున్న నా అభిమానులకు కూడా కృతఙ్ఞతలు. మీ అందరి ప్రోత్సాహంతో మరిన్ని విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తా అంటూ రాజపార్వై సినిమాలో పోలీసు గెటప్‌లో ఉన్న ఓ వీడియోను వరలక్ష్మీ ట్విటర్లో షేర్ చేశారు. ఇందుకు బదులుగా... ‘ పోలీసు ఆఫీసర్‌గా నటించేందుకు మీరే కరెక్ట్ పర్సన్. ఐపీఎస్ అనే కాదు ఏ పాత్రలోనైనా మీరు అవలీలగా ఒదిగిపోగలరు. పోలీస్‌గా.. పక్కా పొలిటిషియన్‌గా, విలన్‌గా మెప్పించడంలో మీకు మీరే సాటి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్న వరలక్ష్మీ.. విశాల్ సండైకోళి, విజయ్ సర్కార్ సినిమాల్లో విలన్‌గా తనదైన శైలిలో అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. In another life I’m sure I would have been a #PoliceOfficer #rajapaarvai love my job.. so grateful to my directors for allowing me to play so many different roles n gratitude towards my fans for accepting me and loving me in whatever I do.. u all keep me going to do better 😘😘 pic.twitter.com/IrQpiULRbx — varalaxmi sarathkumar (@varusarath) April 25, 2019 -
ప్రతి సీన్ పసందుగా..
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్, జై ముఖ్యపాత్రల్లో ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాగకన్య’. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు మంచిపేరొచ్చేలా ఉంటుంది. వీరి ముగ్గురి లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో జై క్యారెక్టర్ మరో హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వచ్చింది. పిల్లలతో పాటు పెద్దలు మా సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
మగవారూ ప్రసవవేదనను తెలుసుకునేలా..
సినిమా: మగవారికి లేదు మనమెందుకు జరుపుకోవాలి అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈమె ఇతర నటీమణులకు కాస్త భిన్నం అని చెప్పక తప్పుదు. ఏ విషయంలోనూ మొహమాటానికి పోదు. మగవారైతే వారికేమైన అదనంగా కొమ్ములుంటాయా అని ప్రశ్నించే రకం. నటనలోనూ అ అమ్మడి రూటు సపరేటే. కాగా శుక్రవారం భారతదేశం అంతా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. దేశ నాయకులంతా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి సమయంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ మాత్రం పురుషుల దినోత్సవం అంటూ లేనప్పుడు మనమెందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి అన్న ప్రశ్న లేవనెత్తింది. నిజానికి ప్రతిరోజూ మహిళాదినోత్సవమేనని అంది. మహిళలందరూ ప్రతిరోజూ వేడుకగా జరుపుకోండి అని చెప్పింది. అంతే కాదు మీపై మీరు నమ్మకం ఉంచుకోండని అంది. సంవత్సరంలో ఒక్క రోజు కాదు ఏడాదిలో ప్రతి రోజూ మహిళలకు మర్యాద లభించడమే నిజమైన సమానత్వం అని ట్విట్టర్లో ట్వీట్ చేసింది. చైనాలో మగవారూ ప్రసవవేదనను తెలుసుకునేలా ఒక పరికరం ఉందని, దాని గురించిన ఒక వీడియోను బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ కురానా విడుదల చేసి మహిళాదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారని చెప్పింది. అదే నిజమైన మహిళాదినోత్సవం అని పేర్కొంది. అలాంటి పరికరం మన దేశానికి రావాలని నటి వరలక్ష్మీ అంది. రాజకీయాల్లోకి రావడం పక్కా అంటున్న ఈ సంచలన నటి ప్రస్తుత చిత్రాలతో చాలా బిజీగా ఉంది. -
విశాల్ పెళ్లి.. వరలక్ష్మి ఘాటు రిప్లై
నటుడు విశాల్, నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ల వ్యవహారం తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో హాట్ హాట్‌గా మారింది. ఈ సంచలన జంట గురించి ఇప్పటికే పలు వదంతులు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. విశాల్, వరలక్ష్మి ప్రేమలో పడ్డారని, ఆ తరువాత మనస్పర్థలతో విడిపోయారని, కాదు కాదు వారిద్దరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి లాంటి పలు రకాల ప్రచారం కోలీవుడ్‌ను వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే విశాల్, వరలక్ష్మీ మాత్రం తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. తాజాగా మరోసారి ఈ జంట గురించి సమాచారం వార్తల్లో వైరల్ అవుతోంది. విశాల్‌కు పెళ్లి కుదిరింది నటుడు విశాల్‌కు వివాహ ఘడియలు దగ్గర పడ్డాయన్నది తాజా వార్త. విశాల్ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలతో పాటు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా ఉన్నారు. నటీనటుల సంఘానికి నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ పెళ్లి చేసుకోను. తన పెళ్లి ఆ నూతన భవనంలోని కల్యాణ మండపంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ తండ్రి, నిర్మాత, వ్యాపారవేత్త జీకే.రెడ్డి ఇటీవల ఒక భేటీలో విశాల్‌కు పెళ్లి కుదిరిందని, అమ్మాయి పేరు అనీషా అని తెలిపారు. హైదరాబాద్‌లో ఎప్పుడైనా వివాహ నిశ్చితార్థం జరగవచ్చునని పేర్కొన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా నటి వరలక్ష్మీశరత్‌కుమార్ స్పందనే ఘాటుగా ఉంది. బెటర్ లక్ నెక్ట్స్‌టైమ్ విశాల్‌కు అమ్మాయి సెట్ కావడంతో ఆయనతో కలిసి వదంతులను ఎదుర్కొంటున్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కూడా త్వరలో పెళ్లికి సిద్ధం అవుతోందని, వివాహానంతరం నటనకు గుడ్‌బై చెప్పనుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రచారానికి నటి వరలక్ష్మి ట్విట్టర్లో కాస్తా ఘాటుగానే స్పందించింది. తన పెళ్లి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఇంతకుముందు మాదిరిగానే ఈ ఏడాది చివరిలోనూ కొందరు పనీపాటా లేని వారు నా పెళ్లి గురించి మాట్లాడటం మొదలెట్టారు. నిజానికి నేనెక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను. సినిమాల్లో నటిస్తూనే అందరి పని పడతాను. కాబట్టి ప్రియమైన ప్రచారకులారా మీకు బెటర్ లక్ నెక్ట్స్‌టైమ్. ఈ సారి ఇంకా గట్టిగా ప్రయత్నించండి. మీరెవరన్నది నాకు తెలుసు అని పేర్కొంది. ఇలా వరలక్ష్మీ తన పెళ్లి ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టింది. -
నేనే దగ్గరుండి వారి పెళ్లి చేస్తా..
చెన్నై, పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు రాజకీయ ప్రేరేపిత శక్తి. తాను రాజకీయాల్లోకి రావడం ఖయం అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. స్త్రీశక్తి పేరుతో సేవాసంఘాన్ని నెలకొల్పిన ఈ భామ క్యాస్టింగ్ కౌచ్ వంటి వివాదాస్పద అంశాలపైనా ధైర్యంగా స్పందించిందన్నది గమనార్హం. కాగా ఈ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. కథానాయకి, ప్రతినాయకి అని తారతమ్యం చూపకుండా అ అమ్మడు నచ్చిన కథా పాత్రలను ఎడా పెడా చేసేస్తోంది. కాగా వరలక్ష్మీపై వదంతులు చాలానే దొర్లుతున్నాయి. అందులో నటుడు విశాల్‌తో ప్రేమ, త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్నది ఒకటి. అలాంటిది ఈ సంచలన నటి విశాల్ హీరోగా నటించి, నిర్మించిన సండైకోళి–2లో విలనిజాన్ని ప్రదర్శించింది. తాజాగా విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్రంలో రాజకీయ నాయకురాలిగానూ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించింది. కీర్తీసురేశ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకుడు. సర్కార్ చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఛానల్‌కు భేటీ ఇచ్చిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. ప్ర: విశాల్‌తో పెళ్లా? జ: నటుడు విశాల్ తనకు అత్యంత సన్నిహితుడు. ఏ విషయాన్నైనా మేమిద్దరం షేర్ చేసుకుంటాం. అయితే మేమిద్దరం ప్రేమించుకోవడం లేదు. విశాల్‌కు ఏ అమ్మాయితోనైనా పెళ్లి కుదిరితే నేనే దగ్గరుండి వారి పెళ్లి జరిపిస్తాను. విశాల్ పెళ్లి చేసుకుంటే సంతోష పడేవారిలో నేను ముందుంటాను. అలాంటిది ఏ కారణంతో విశాల్‌తో నన్ను కలిపి ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు. ఇకపోతే చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేస్తారా? అని అడుగుతున్నారు. వారందరికీ చెప్పేదొకటే కచ్చితంగా నేను రాజకీయాల్లోకి వస్తా. అయితే అందుకు మరో ఐదేళ్లు పడుతుంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ నాయకత్వ శూన్యత నెలకొన్న మాట నిజమే. దాన్ని పూర్తి చేయడానికే నటుడు రజనీకాంత్, కమలహాసన్ వంటి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు వారిని ఆదరిస్తారా? అన్నది వేచి చూడాలి. జయలలిత ఉత్తమ పరిపాలనాధక్షురాలు. ఆమెను మూడు సార్లు కలిసే అవకాశం నాకు లభించింది. రాజకీయపరంగా జయలలితనే నాకు ప్రేరణ. గొప్ప పాలకురాలే కాదు, మంచి విద్యావేత్త కూడా. ఒంటరి స్త్రీగా రాష్ట్రాన్ని పరిపాలించారు. నాన్న పార్టీలో చేరను మరో ఐదేళ్లలో నా రాజకీయ రంగప్రవేశం ఉంటుంది. నా తండ్రి శరత్‌కుమార్ తన పార్టీలో చేరమని ఎప్పుడో ఆహ్వానించారు. నేనే నిరాకరించాను. ఆయన పార్టీ ద్వారా నేను రాజకీయాల్లోకి పరిచయం కాను. ఏ పార్టీలో చేరేది తరువాత వెల్లడిస్తాను. కాగా ఇంతకు ముందు రాష్ట్రంలో రాజకీయ నాయకత్వ శూన్యం ఏర్పడిందనే వ్యాఖ్యలు చేసిన నటుడు రజనీకాంత్‌పై అన్నాడీఎంకే నేతలు మాటల దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి. -
పెళ్లి వార్తలపై ఫైర్ అయిన వరలక్ష్మీ!
సాక్షి, తమిళసినిమా: వారు అనుకున్నది జరగదు అంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్.. కోలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీగా పేరొందిన వరూ.. హీరోయిన్ పాత్రలనే చేస్తానని మడికట్టుకుని కూర్చోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కోలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. మరో పక్క సేవ్ శక్తి పేరుతో సంస్థను నెలకొల్పి స్త్రీల సమస్యల గురించి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ గురించి ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరలక్ష్మి పెళ్లికి సిద్ధమైందని, ఇటీవల ఆమె వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన వరలక్ష్మీశరత్‌కుమార్ అవన్నీ వదంతులు లేని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. ‘ నాకు వివాహ నిశ్సితార్థం జరగలేదు. పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటి ఏ ఆధారాలు లేకుండా కొందరు పనికట్టుకుని వదంతులు ప్రచారం చేస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఈ రంగంలోకి పనిచేయడానికే వచ్చాను. పనీపాటా లేనివారే ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తుంటారు’ అని ఆమె మండిపడ్డారు. ‘నా కఠిన శ్రమ ఎప్పటికీ అపజయాన్ని ఇవ్వదు. నా పని నేను చేసుకుపోతున్నాను. మీరు అనుకున్నది జరగదు’ అని గాసిప్ రాయుళ్లపై ఆమె ఫైర్ అయ్యారు. వరలక్ష్మీ విశాల్‌తో కలిసి నటించిన సండైకోళి-2 చిత్రం ఈ నెల 19న, విజయ్‌తో కలిసి నటించిన సర్కార్ చిత్రం వచ్చే నెల దీపావళి సందర్భంగా తెరపైకి రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం కన్నిరాశి, వెల్వెట్ నగరం, అమ్మాయి, నీయా-2 తదితర చిత్రాల్లో వరూ నటిస్తున్నారు. తాజాగా బుల్లితెరపైనా ప్రత్యక్షం కానున్నారు. జయటీవీలో సామాజిక ఇతివృత్తంతో ప్రసారం కానున్న ‘ఉన్నై అరిందాళ్’ అనే కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. -
#మీటూ : చాలా సంతోషంగా ఉంది
హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మహిళలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. బాలీవుడ్లో తనుశ్రీతో మొదలైన మీటూ.. దక్షిణాదిన గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్లతో తీవ్ర రూపం దాల్చింది. ఎంతో మంది మహిళా జర్నలిస్టులు కూడా తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువ గాయని ఆరోపించారు. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేస్తున్న అకృత్యాల గురించి జర్నలిస్టు సంధ్య మీనన్‌తో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉంటే.. తనుశ్రీ- నానా పటేకర్ వివాదంలో ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కానీ చిన్మయికి సపోర్టుగా కోలీవుడ్ పెద్దలు మాత్రం ఇంత వరకు నోరు విప్పడం లేదు. అలాగే వైరముత్తు వ్యవహారంపై కూడా మౌనంగానే ఉన్నారు. అయితే హీరోయిన్లు సమంత, వరలక్ష్మీ శరత్‌కుమార్ మాత్రం చిన్మయికి మద్దతుగా నిలిచి ఆమె ఒంటరి కాదంటూ ‘మీటూ’ ఉద్యమం మరింత ఉధృతం కావాలని ఆశిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది..: సమంత ‘నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మహిళలు ముందుకు వస్తున్నారు. మీ ధైర్యానికి జోహార్లు. కానీ కొంతమంది వ్యక్తులు.. (వారిలో మహిళలు కూడా ఉండటం బాధాకరం) మీ మాటల్లో నిజమెంత, ఆధారాలు చూపించండి అంటూ మిమ్మల్ని మరోసారి వేధిస్తున్నారు. కానీ ఎంతో మంది మీకు మద్దతుగా ఉంటారు. మీటూ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నా అంటూ ట్వీట్ చేసి.. బాధిత మహిళలకు అండగా నిలుస్తానని చెప్పారు సమంత. అదే విధంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా ‘మీటూ’కి తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బాధితులు తమని తాము బలహీనులమని అనుకోవద్దని.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
‘పందెంకోడి 2’ మూవీ స్టిల్స్
-
‘పందెంకోడి 2’ ట్రైలర్ లాంచ్
-
రివ్యూలను పట్టించుకోవద్దు
సినిమా: సినిమా రివ్యూలను పట్టించుకోవద్దు అని అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. కథానా యకి పాత్ర, ప్రతినాయకి పాత్ర? ప్రధాన పాత్ర అన్న విషయాలను అసలు పట్టించుకోకుండా, నటనకు అవకాశం ఉంటే, పాత్ర తనకు నచ్చితే నటించడానికి రెడీ అనే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. వివిధ రకాల పాత్రలతో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న సంచలన నటి ఈ బ్యూటీ. నటుడు విశాల్‌లో ప్రేమ, కాదు మనస్పర్థలు, విడిపోయారు లాంటి ఒకదానికొకటి పొంతన లేని ప్రచారాలతో వార్తల్లో నానే వరలక్ష్మీశరత్‌కుమార్ తాజాగా విశాల్ హీరోగా నటిస్తూ, సొంతంగా నిర్మిస్తున్న సండైకోళి–2 చిత్రంలో ప్రతినాయకిగా నటిస్తూ ఆమె గురించి ఉన్నది లేనిది రాసేవారిని మరోసారి అయోమయంలో పడేసింది. కాగా ఇటీవల ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన హెచ్చరికై చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు వరలక్ష్మీ శరత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం ఆమె ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో హెచ్చరికై చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా నిజాయితీగా విమర్శలు రాసిన కొందరు పాత్రికేయులకు థ్యాంక్స్ చెబుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో పెయిడ్ రివ్యూలు అధికం అవుతున్నాయి. అఫ్ కోర్స్ కొందరు తారలు అందుకు కారణం అవుతున్నారనుకోండి. అలాంటి రివ్యూలు రాసే వారు కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే నేనింకా ఇండస్ట్రీ గురించి నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఇక్కడ చిన్న డిస్ట్రిబ్యూటర్స్, పెద్దవారు అంటూ రాజకీయాలు జరుగుతున్నాయి. దీని వల్ల నష్టపోతున్నది ప్రేక్షకులే. కారణం ఇక్కడ జరిగే గేమ్ వల్ల మంచి కథా వస్తువు కలిగిన హెచ్చరికై లాంటి చిన్న చిత్రాలను మిస్ అవుతున్నారు. అందుకే రివ్యూలను చూసి చిత్రాల గురించి ఒక అభిప్రాయానికి రాకండి. నిజానికి ఇప్పుడు మంచి చిత్రాలు చాలా వస్తున్నాయి. అలాంటి చిత్రాలను రక్షించేది మీరే. స్టార్స్ ట్రాక్‌లో పడకండి. చిన్న చిత్రాలను ఆదరించండి. అలాంటి చిత్రాల వల్లే చిత్రపరిశ్రమకు మనుగడ. దాని భవిష్యత్ అనేది మీ చేతుల్లోనే ఉంది. టికెట్ కొని సినిమాలు చూడండి, ఆనందించండి. మరోసారి నిజాయితీగా రివ్యూలు రాసిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా చిన్న చిత్రాల మనుగడ అనేది ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది. అదే విధంగా నేను మంచి కథా పాత్రలను ఎంచుకుని నటించడానికి కారణమైన, ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. రివ్యూలు ఎలా ఉన్నా, నేను ఎంచుకున్న పాత్రలకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమించి మిమ్మల్ని సర్ప్రజ్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తాను అని పేర్కొంది. -
మొత్తంగా అమ్ముడు పోయింది..
తమిళసినిమా: వరలక్ష్మీ చిత్రం అమ్ముడు పోయింది అంటే ఇదేదో చిత్ర టైటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నటించిన హెచ్చరికై ఇదు మనిదర్గళ్ నడమాడుం ఇడం మొత్తంగా అమ్ముడు పోయింది. ఈరోజుల్లో చిత్రం నిర్మించడం సులభమే కానీ, దాన్ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు దొరకడం అన్నది ఆక్సిజన్ లాంటిదే. అలా కొనేవారు లేక చాలా చిత్రాలు అటకెక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్చరికై ఇది మనిదర్గళ్ నడమాడుం ఇడం చిత్రం చూసిన క్లాప్ బోర్డు సంస్థ అధినేత వి.సత్యమూర్తి చాలా బాగుందని ప్రశంసిండంతో పాటు చిత్ర విడుదల హక్కులను మొత్తంగా కొనేశారు. ఆయన ఇంతకు ముందు తప్పుదండా చిత్రం ద్వారా హీరోగా, నిర్మాతగానూ పరిచయం అయ్యారన్నది గమనార్హం. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజిల్ తునిచ్చల్ ఇరుందాల్, విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ఒరు నల్లనాళ్ పార్తు సొల్రేన్ చిత్రాల విడుదల హక్కులను పొంది విడుదల చేశారు. తాజాగా సత్యరాజ్ రిటైర్డ్ పోలీసు అధికారిగా ప్రధాన పాత్రలో నటించిన హెచ్చరికై ఇదు మనిదర్గళ్ నడమాడుమ్ ఇడమ్ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేశారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సీపీ.గణేశ్, సుందర్ అన్నామలై కలిసి నిర్మించారు. కథ, దర్శకత్వం బాధ్యతలను సర్జన్ నిర్వహించారు. ఈయన మణిరత్నం, ఏఆర్.మురుగదాస్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. అంతే కాదు యూ ట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన మా, లక్ష్మీ చిత్రాల దర్శకుడు ఈయనే. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ కిడ్నాప్ ఇతివృత్తంతో తెరకెక్కించిన సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా హెచ్చరికై ఇదు మనిదర్గళ్ నడమాడుమ్ ఇడమ్ ఉంటుందన్నారు. ఇందులో రిటైర్డ్ పోలీస్అధికారిగా సత్యరాజ్ దుమ్మురేపుతారని చెప్పారు. దీనికి కేఎస్.సుందరమూర్తి సంగీతాన్ని, సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహణం అందించినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేని సత్యమూర్తి తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా నిర్మిస్తున్న ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలో ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
కామెడీ దెయ్యం చిత్రంగా కాటేరి
తమిళసినిమా: మా కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు డీకే. ఈయన ఇంతకు ముందు యామిరుక్కు భయమేన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైభవ్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా వరలక్ష్మిశరత్‌కుమార్, ఆద్మిక, మనాలి రాథోడ్ నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. పొన్నంబళం, కరుణాకరన్, రవిమరియ, జాన్‌విజయ్, కుట్టిగోపి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఎంఎస్.ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు డీకే తెలుపుతూ కాటేరి అంటే అందరూ రక్తం తాగే దెయ్యం అనుకుంటున్నారని, పూర్వ మనుషులు, ముత్తాతలు అని కూడా అర్థం ఉందన్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజాను కలిసి ఈ చిత్ర ఒన్లైన్ కథను చెప్పానన్నారు. ఆయకు నచ్చడంతో పాటు కాటేరి అనే టైటిల్ ఈ కథకు బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇందులో నటిస్తున్న నలుగురు హీరోయిన్లలో కాస్త స్వార్థం కలిగిన అమ్మాయిగా సోనం బాజ్వా, మనోతత్వ వైద్యురాలిగా ఆద్మిక నటిస్తున్నారని, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, మానాలి రాథోడ్‌లు 1960 కాలానికి చెందిన పోర్షన్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తన గత చిత్రం యామిర్కు భయమేన్ చిత్రంలో పాపులర్ అయిన పన్ని మూంజి వాయన్ లాంటి పాత్ర ఈ చిత్రంలోనూ చోటు చేసుకుంటుందన్నారు. కాటేరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, పిల్లలను అలరిస్తుందని చెప్పారు. తమ కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు డీకే పేర్కొన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
‘కురుక్షేత్రం’ మూవీస్టిల్స్
-
వరలక్ష్మీ చుట్టూ రాజకీయం!
తమిళసినిమా: నటి వరలక్ష్మి బీజేపీలో చేరారా? తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం ఇదే. కథానాయకి, ప్రతి కథానాయకి అంటే తారతమ్యాలు చూపకుండా చేతి నిండా చిత్రాలతో యమ బీజీగా ఉన్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. అంతే కాకుండా మహిళా రక్షణ కోసం సేవ్‌శక్తి అనే సేవాసంస్థను నెలకొల్పి మహిళల కోసం గళం విప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను బుధవారం బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరన్ ఆమె ఇంట్లో కలిశారు. అంతే మీడియా వరలక్ష్మీ శరత్‌కుమార్ చుట్టూ రాజకీయాన్ని అల్లేస్తోంది. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మీశరత్‌కుమార్ తన ట్విట్టర్లో పేర్కొంటూ మహిళా రక్షణ తదితర విషయాల గురించి తాను మురళీధరన్‌తో భేటీ అయిన సందర్భంగా చర్చించిన మాట వాస్తవమేనని, ఇది మంచి భేటీగా అమరిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకోవడం మంచి పరిణామం అని అన్నారు. అయితే మురళీధరన్‌తో తన భేటీని మీడియా నిరాధార వార్తలను ప్రచారం చేస్తోందని అన్నారు. అలాంటి వారికి తాను చెప్పేదొక్కటేనన్నారు. తానూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతను గుర్తు చేసుకోవలసిన పరిస్థితిది. పైగా సినీ తారలు రాజకీయాలపై మోజు పడుతున్న తరుణం ఇది. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో! నటి వరలక్ష్మిది రాజకీయ నేపథ్యమే కదా! ఆమె తండ్రి శరత్‌కుమార్ ఒక పార్టీని నడుపుతున్న విషయం తెలిసిందే. -
బీజేపీలో చేరిన ప్రముఖ నటి.. కాదు నేను చేరలేదు!
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు శరత్‌కుమార్ తనయురాలు, సినీ నటి వరలక్ష్మి బుధవారం బీజేపీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారని తమిళ మీడియా పేర్కొంది. అయితే, ఈ వార్తలపై నటి వరలక్ష్మి వివరణ ఇచ్చారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మురళీధర్‌రావు బుధవారం వరలక్ష్మిని కలిశారు. మోదీ ప్రభుత్వ విజయాలను ఆమెకు వివరించారు. దీంతో ఆమె బీజేపీలో చేరిందన్న కథనాలు ఊపందుకున్నాయి. దీంతో తాను బీజేపీలో చేరలేదని ఆమె వివరణ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ విజయాల గురించి తెలుసుకునేందుకే తాను బీజేపీ నేతలను కలిశానని, ఆ సమావేశంలో దేశ ప్రగతి,మహిళల భద్రత గురించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన కృషిని వివరించారని, ఈ విషయాలు తనకు సంతృప్తి కలిగించాయని ఆమె అన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం దళపతి 62, మిస్టర్ చంద్రమౌళి, శక్తి, కదల్ మన్నన్ వంటి పలు సినిమాల్లో నటిస్తున్నారు. వరలక్ష్మి తండ్రి, ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన గతంలో ఆలిండియా మక్కల్ సమథువ కచ్చి పార్టీని స్థాపించారు. -
ఇండియన్ సినిమానే తిరిగి చూస్తుంది
తమిళసినిమా: తమిళసినిమాను ఇండియన్ సినిమానే తిరిగి చూస్తుందని నటుడు, నిర్మాతలమండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. బాఫ్టా మీడియా వర్క్స్ సమర్పణలో క్రియేటివ్ మీడియా ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై ధనుం జయన్ నిర్మించిన చిత్రం మిస్టర్ చంద్రమౌళి. సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్‌కార్తీక్ కలిసి నటించిన క్రేజీ చిత్రం ఇది. నటి రెజీనా హీరోయిన్గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీ కీలక పాత్రను పోషించారు. సీనియర్ దర్శకుడు మహేంద్రన్, అగస్త్యన్, సతీశ్ ముఖ్య పాత్రలను పోషించారు. తిరు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో ఘనంగా జరిగింది. ఇందులో విశాల్ పాల్గొన్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా నటుడు శివకుమార్ కూతురు బృందా గాయనిగా పరిచయం అవుతున్నారు. నా సోదరి కలను నెరవేర్చారు ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటుడు సూర్య మాట్లాడుతూ కార్తీక్ నటించిన చిత్రాలు చూసి లవ్ చేయడం ఎలా అన్నది నేర్చుకున్నామన్నారు. నటుడు కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం చాలా గొప్ప అనుభవం అని పేర్కొన్నారు. నటుడు విశాల్ మాట్లాడుతూ చిత్రపరిశ్రమ సమ్మెకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో తమిళ సినిమా భారతీయ సినిమానే తిరిగి చూసేలా ఉంటుందని అన్నారు. నటి వరలక్ష్మీశరత్‌కుమార్, విశాల్ పక్కపక్కనే కూర్చోవడం ఫొటోగ్రాఫర్లకు పండగే అయ్యింది. -
మోదీజీ మీకో విన్నపం
తమిళసినిమా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీకో విన్నపం అని అన్నది ఎవరో తెలుసా? సంచలన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సంచలన నటి సమాజంలో జరుగుతున్న సంఘటనలపైనా తనదైన బాణిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. సేవ్‌శక్తి అనే స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి మహిళా రక్షణ కోసం పోరాడుతున్న వరలక్ష్మీశరత్‌కుమార్ ఇటీవల దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె ఇక ప్రకటనను విడుదల చేస్తూ జమ్ముకశ్మీర్‌లోని చిన్నారి హత్యాచారం దేశాన్నే కదిలించి వేసిందన్నారు. అలాంటి దారుణాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వయసు మళ్లిన వ్యక్తి మనవరాలి వయసున్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాల వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఆ ముదుసలి వ్యక్తిని ప్రజలు చితకబాదారు. ఈ వీడియోలోని దృశ్యాలు నటి వరలక్ష్మీశరత్కుమార్ని మరింత ఆగ్రహానికి గురి చేశాయట. అంతే వెంటనే తన ట్విట్టర్లో ప్రధానికో విన్నపం అంటూ మొదలెట్టి, ఇదేనా మనం నివశిస్తున్న ప్రపంచం? ఇలాంటి దేశాన్నే మీరు పరిపాలించాలని కోరుకుంటున్నారా? ప్రధాని మోదీ గారూ మీకు ఓట్లు వేసిన ప్రజల ఆలోచనలను గౌరవించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని ఉరిశిక్ష విధించే చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను అని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్ చేశారు. మరి ఈమె ట్వీట్‌కు ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం. -
రఫ్పాడిస్తానంటున్న వరలక్ష్మి
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలు నటి వరలక్ష్మీని వెతుక్కుంటూ వస్తున్నాయి. తారైతప్పట్టై చిత్రంలో డాన్స్‌లో దుమ్మురేపిన ఈ బ్యూటీ తాజాగా ఫైట్స్‌లో అదరగొడుతున్నారట. వరలక్ష్మీశరత్‌కుమార్ చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రాల్లో వెల్వెట్ నగరం ఒకటి. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఈ తరహా కథా చిత్రంలో వరలక్ష్మి నటించడం ఇదే ప్రథమం. ఇందులో తను డైనమిక్ రిపోర్టర్‌గా నటిస్తున్నారట. దీనికి మనోజ్ కమార్నటరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది కథానాయికకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రం అని చెప్పారు. కొంత కాలం క్రితం కోడైకెనాల్, చెన్నైలో జరిగిన వేర్వేరు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం వెల్వెట్ నగరం అని తెలిపారు. భారీ ఫైట్స్ సన్నివేశాలతో కూడిన సస్పెన్స్ «థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. 48గంటల్లో జరిగే కథాంశంతో కూడిన ఈ చిత్రం జెట్ వేగంతో సాగుతుందన్నారు. ఇందులో మదురైకి చెందిన క్రైమ్ రిపోర్టర్‌గా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారని చెప్పారు. కోడైకెనాల్‌లో నివశించే గిరిజన సామాజిక వర్గ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఆధారాలు సేకరించడానికి మదురై నుంచి చెన్నైకి వచ్చిన వరలక్ష్మి ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా వెల్వెట్ నగరం ఉంటుందన్నారు. చెన్నై, మదురై, కోడైకెనాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించినట్లు తెలిపారు. చివరి ఘట్ట షెడ్యూల్ చెన్నైలో జరపనున్నట్లు తెలిపారు. -
కొట్టింది భర్త అయినా తిరిగి కొట్టండి.!
తమిళసినిమా: మిమ్మల్ని కొట్టింది భర్త అయినా తిరిగి కొట్టండి అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. డేరింగ్ అండ్ డైనమిక్ నటిగా అవతరించిన ఈ అమ్మడు కథానాయకి పాత్రా, కాదా? వ్యత్యాసం చూడకుండా నచ్చిన పాత్రల్లో నటిస్తోంది. తారైతప్పట్టై చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ అవకాశాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో 10 చిత్రాల వరకూ ఉన్నాయి. వరలక్ష్మీకి తాజాగా మరో బంపర్ఆఫర్ తలుపు తట్టింది. ఇలయదళపతి విజయ్ 62వ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కీర్తీసురేశ్ కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. వరలక్ష్మీ ప్రతినాయకి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇదిలా ఉంటే వరలక్ష్మీకి మరో ముఖం కూడా ఉందన్న విషయం తెలిసిందే. మహిళల రక్షణ కోసం సేవ్‌శక్తి అనే సంస్థను ప్రారంభించిన విషయం విదితమే. ఈ సంస్థ తరఫున సోమవారం ప్రపంచ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై,వ్యాసార్పాడిలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా రక్తదాన శిబిరం, దివ్యాంగ మహిళలకు త్రిచక్రవాహనాలు, చీరలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ సేవ్‌శక్తి తరఫున గతేడాది జిల్లాకో మహిళా కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు మహిళలు బానిసలుగా జీవించకూడదని, కట్టుకున్న భర్త అయినా సరే కొడితే తిరిగి కొట్టాలని వరలక్ష్మీ అన్నారు. సోమవారం ఈమె పుట్టిన రోజు కావడంతో ఇదే వేదికపై కేక్ కట్ చేసి అందరికీ పంచారు. -
బర్త్‌డే రోజే గోల్డెన్ చాన్స్!
సాక్షి, సినిమా: నటుడు శరత్‌కుమార్ వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్. తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో వరుస అవకాశాలు చేజిక్కుంచుకుంటూ దూసుకెళ్తున్న నటి వరలక్ష్మి పుట్టినరోజు నేడు. అయితే ఈ పుట్టినరోజు తనకెంతో ప్రత్యేమని అంటున్నారు. ఇళయదళపతి, స్టార్ హీరో విజయ్ చిత్రంలో తనకు ఛాన్స్ రావడం బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని ఈ బ్యూటీ ట్వీట్ చేశారు. కాగా, బర్త్‌డే బ్యూటీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇళయదళపతి, హీరో విజయ్‌తో కలిసి పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు బహుమతి. ఏఆర్ మురుగదాస్ ఈ మూవీకి దర్శకుడు. చాలా హ్యాపీగా ఉన్నానంటూ' నటి వరలక్ష్మి తన పోస్టులో రాసుకొచ్చారు. కాగా, ఈ బర్త్‌డే హీరోయిన్ చేతిలో భారీగా చిత్రాలున్న విషయం తెలిసిందే. అందులో తాజాగా విజయ్ చిత్రం చేరింది. శక్తి, కన్నిరాశి, పంభన్, నీయ2, ఇచారిక్కై, మిస్టర్ చంద్రమౌళి, సందయ్ కోజి2, విజయ్ 62వ చిత్రంతో కలిపి మొత్తం 9 చిత్రాలతో ఈ బ్యూటీ ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అత్యధికంగా 8 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బర్త్‌డే గాళ్ వరలక్ష్మి అంటూ మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Yes it’s the best birthday gift I can ask for.. it’s official I’m joining the cast of #thalapathy62... sooperrrr excited to be working with @actorvijay sir and @ARMurugadoss sir.. looking forward to it..!! — varu sarathkumar (@varusarath) 5 March 2018 At present, Birthday Gal @varusarath has the most number of Tamil movies on hand.. 1. #Thalapathy62 2. #SandaiKozhi2 3. #MrChandramouli 4. #Echarikkai 5. #Neeya2 6. #Paambhan 7. #KanniRaasi 8. #Shakthi pic.twitter.com/DGfUi7IO1i — Ramesh Bala (@rameshlaus) 5 March 2018 -
బుసలు కొట్టబోతున్నది ఎవరు?
రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్షీ శరత్‌కుమార్... ఈ ముగ్గురి భామల్లో బుసలు కొట్టబోతున్నది ఎవరు? అప్సరసల్లా ఉండే వీళ్లు బుసలు కొట్టడమేంటి అనుకుంటున్నారా? దానికి కారణం లేకపోలేదు. ఈ ముగ్గురూ కలసి ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు. ఇదొక లవ్ థ్రిలర్. ఈ కథలో పాములకు ప్రాధాన్యం ఉంది. మరి.. ఈ ముగ్గురిలో ఎవరు నాగినిగా నటిస్తారు? అనేది మాత్రం చిత్రబృందం బయటపెట్టలేదు. ఆ చాన్స్ ఉందని చెన్నై టాక్. ‘జర్నీ’, ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జై ఇందులో హీరో. ఐటీ ఉద్యోగిగా కనిపించబోతున్నారాయన. జైని ముగ్గురు కథానాయికలూ ప్రేమిస్తారట. ఒకరు మాత్రం పగ తీర్చుకోవడానికి ప్రేమ నటిస్తారని సమాచారం. ‘ఏతన్’ మూవీ ఫేమ్ సురేష్ ఈ చిత్రానికి దర్శకుడు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. చెన్నై, మధురై, కేరళలో చిత్రీకరించనున్నారు. ‘‘షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ లవ్ థ్రిల్లర్ షూటింగ్ అంతా సరదాగా జరగాలని ఆశిస్తున్నా’’ అని రాయ్ లక్ష్మీ అన్నారు. ఇంత చెప్పారు కదా? స్నేక్ ఎవరూ అంటే.. ‘అది మాత్రం సస్పెన్స్’ అంటున్నారు. -
ప్రభాస్‌తో ఛాన్స్ వస్తే..!
‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ తెచ్చుకున్నారు ప్రభాస్. దీంతో ఆయన సరసన ఒక్క ఛాన్స్ కోసం తెలుగులో నటిస్తున్న హీరోయిన్లే కాదు... పరభాషా చిత్రాల హీరోయిన్లూ ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్‌తో నటించే చాన్స్ రావాలే కానీ ఎవరు మాత్రం వదులుకుంటారు? అనేవారి జాబితాలోకి తాజాగా నటుడు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి చేరారు. తమిళంలో హీరోయిన్గా కొనసాగుతోన్న వరలక్ష్మి ‘శక్తి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రభాస్‌తో కలిసి నటిస్తారా? అని చాలామంది అడుగుతున్నారు. ఆయనతో నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ నటన సూపర్బ్. నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి టాలెంట్ ఉన్న నటులున్నారు. వారితోనూ సినిమాలు చేయాలనుంది’’ అన్నారు. -
పాడడమే నాకిష్టం
తమిళసినిమా: నటి రమ్యానంబీశన్ది మంచి ఫిజిక్. చూడ సక్కని అందం. మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ మలయాళీ బ్యూటీకి తమిళంలో పిజ్జా, సేతుపతి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయినా ఎందుకో తనకు పాడడం అంటేనే చాలా ఇష్టం అంటోంది. ఈ ముద్దుగుమ్మ తమిళంలో తొలిసారిగా పాడిన ఫైఫైఫై అనే పాట యువతను ఉర్రూతలూగించింది.అక్కడి నుంచి గాయనిగా రాణించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఇప్పటికే మాతృభాషలో 20 వరకూ పాటలు పాడేసిన రమ్యానంబీశన్‌కు కోలీవుడ్‌లో చేతి నిండా ఆఫర్లు ఉన్నాయట. సిబిరాజ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను హీరోయిన్లుగా నటిస్తున్న సత్య చిత్రం కోసం ఇటీవల ఒక పాట పాడిందట. ఈ పాట వినగానే తానే పాడాలనిపించిందట. అదే విషయాన్ని చిత్ర హీరో సిబిరాజ్‌కు, సంగీత దర్శకుడు సీమోన్ కే.కింగ్‌కు చెప్పగా వారిద్దరూ ఒకే అనడంతో స్టూడియోకు వెళ్లి పాడానని, ఆ పాట తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ తెగ నచ్చేసిందంటున్న రమ్యానంబీశన్ ఇలాంటివి బోలెడన్ని పాడాలని ఆశపడుతోందట. సింగర్‌గా తానింకా ప్రారంభ దశలోనే ఉన్నానని, సినిమా పాటలకే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ పాటలను పాడాలని కోరుకుంటున్నానని అంది. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం సత్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా మెర్కురీ అనే మరో చిత్రంలోనూ నాయకిగా నటిస్తోంది. అదే విధంగా కన్నడంలో కురుక్షేత్రం అనే పురాణ ఇతిహాసం మహాభారతం కథా చిత్రంలో నటిస్తోంది. -
కొందరు నిప్పు అవుతారు
వరలక్ష్మి.. తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. వరలక్ష్షీ్మ శరత్‌కుమార్ అంటే ఆ... ఎక్కడో విన్నట్టుందే! అనక మానరు. తమిళ హీరో, తెలుగువారికి సుపరిచితులైన సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. 2012లో ‘పోడాపోడి’ చిత్రంతో కథానాయిక అయిన వరలక్ష్మి తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించారు కానీ తెలుగులో చేయలేదు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘శక్తి’ సినిమా ద్వారా ఆమె తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్నారు. సమాజంలో నేటి మహిళలు ఎదుర్కొంటున్న సంఘటనల నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్‌గా మూడు భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగు వెర్షన్ ‘శక్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో రానా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ‘‘సమ్ ఫియర్ ఫైర్ సమ్ సింప్లీ బికమ్ ఇట్’’ (నిప్పంటే కొందరికి భయం.. కొందరు నిప్పు అవుతారు) అని పోస్టర్ మీద ఉంది. దీన్ని బట్టి సినిమాలో వరలక్ష్మి నిప్పు అంత పవర్ఫుల్ రోల్ చేస్తున్నారని ఊహించవచ్చు. ఈ శక్తివంతమైన పాత్ర కోసం వరలక్ష్మి ఫిజిక్వైజ్గా చాలా మేకోవర్ అయ్యారు. -
మూడేళ్ల దాకా ఆ ప్రసక్తే లేదు!
పెళ్లి ప్రసక్తి మరో మూడేళ్ల వరకూ కచ్చితంగా ఉండదంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్. పోడాపోడి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ మధ్య తారైతప్పట్టై చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. పాశ్చాత్య సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగిన వరలక్ష్మి పేరిప్పుడు కోలీవుడ్‌లో మారు మోగుతోంది. ఆ మధ్య విశాల్‌తో చెట్టాపట్టాల్, త్వరలో పెళ్లి, లేదు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు అంటూ రకరకాల ప్రచారాలకు కేంద్రబిదువుగా మారిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్.ఇలాంటి వదంతుల మధ్య నటిగా తన వృత్తిలో బిజీగా ఉన్న వరలక్ష్మి ఇటీవల మహిళల రక్షణ కోసం నడుంబించారు.అందుకు సేవ్ శక్తి అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ విధి విధానాలు, సినిమా, వ్యక్తిగత అంశాల గురించి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో చిట్‌చాట్.. సేవ్ శక్తి సంస్థను ప్రారంభించాలన్న అనూహ్య నిర్ణయానికి కారణం? మహిళలపై హింసాత్మక సంఘటనలనేవి మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి.అయితే ఇటీవల మరీ మితిమీరిపోతున్నాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు నేరస్తులెవరన్నది గుర్తించగలిగేవారం.ఇప్పుడు ఎవరిలో మృగత్వం ఉందో తెలియనంతగా ఉన్నత స్థాయిలో ఉన్న వారే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరం అమ్మాయిలు అరకొర దుస్తులు ధరించడం కారణం గానే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఒక వర్గం పురుషులు చేస్తున్న ఆరోపణలు.అయితే మూడేళ్ల చిన్నారి ఎలాంటి దుస్తులు ధరించిందని పాపపుణ్యాలు కూడా చూడకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి ఆటవిక మృగాలనుంచి మహిళలు తమను తాము రక్షించుకునే విధంగా అవగాహన కలించాలన్న ఒక లక్ష్యంతో ప్రారంభించిన సంస్థ సేవ్ శక్తి. ఇలాంటి సమాజక సేవకు ప్రత్యక్షంగా నడుంబిగించారు.వ్యక్తిగతంగా సమస్యలను ఎదర్కోవలసి వస్తుందేమో? ఎలాంటి సమస్యలు తలెత్తవనే భావిస్తున్నాను. ఒకవేళ అలాంటివి ఎదరైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధమే. స్త్రీ అనే నా జాతికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. చిత్రాలను ఎక్కువగా చేయడం లేదే? నేను అవకాశాలను వెతుక్కుంటూ ఎప్పుడూ వెళ్లను.వచ్చిన అవకాశాల్లో నాకు బాగున్నాయనిపించిన పాత్రలనే ఎంచుకుని నటిస్తున్నాను. తారైతప్పట్టై చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయి.అందులో చాలా మంది దర్శకులు తారాతప్పట్టై చిత్రంలోని సూరావళి పాత్రలా అంటూ చెప్పడం మొదలెట్టారు. సూరావళిలా ఒక సారే నటించగలం. ప్రస్తుతం విక్రం వేద, సత్య, నిపుణన్, అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాను. వీటితో పాటు రెండు మలయాళ చిత్రాలు అంగీకరించాను. మీ వ్యక్తిగతం కూడా చర్చనీయాంశంగా మారింది.పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? నటి అన్నాక ఇలాంటి చర్చనీయాంశాలు సాధారణమే. అలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోను. ఇక పెళ్లి అంటారా,మరో మూడేళ్ల వరకూ ఆ ప్రసక్తే లేదు. -
అవును! పడక గదికి రమ్మంటారు : సీనియర్ నటి
నటీమణులపై లైంగిక వేధింపులపై ఇటీవల మీడియాలో కథలు కథలుగా కథనాలు ప్రచారం జరుగుగుతున్న విషయం తెలిసిందే. అడ్జెస్ట్మెంట్ అంటూ నటి రెజీనా, ఒక ఛానల్ ప్రతినిధి మళ్లీ ఎప్పుడు కలుద్దామని అన్నారంటూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను ఇలాంటి వేధింపులను ఎదర్కొన్నానంటూ నటి సంధ్య ఇలా ఇటీవల పలువురు నటీమణులు ఛేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నటి కస్తూరి తాను అలాంటి బాధితురాలినేనని చెప్పారు. అంతే కాదు అవకాశాల పేరుతో పడక గదికి రమ్మనే అలవాటు సినిమ పరిశ్రమలో ఉందనే విషయాన్ని నొక్కి వక్కానించారు. ఒక్కప్పుడు బిజీ నాయకిగా రాణించిన నటి కస్తూరి. ఆ తరువాత అమెరికాకు చెందిన డాక్టరును పెళ్లాడి అక్కడే సెటిల్ అయ్యారు. ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి నృత్యం నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన నటి కస్తూరి ఒక అంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అవకాశాల పేరుతో నటీమణులను పడక గదికి రమ్మనే అలవాటు చిత్ర పరిశ్రమలో ఉందని అన్నారు. కొందరు నటీమణులు ఆలోచనా రాహిత్యంతో మాట్లాడతారు. మరికొందరు పారితోషికం డిమాండ్‌తో అవకాశాలను కోల్పోతారు. ఇంకొందరు సరైన నిర్ణయం తీసుకొవడంతో ఫెయిల్ అయ్యి నటిగా ఎదగలేకపోతారని అన్నారు. ఇక తన విషయంలో తాను ఆశించింది జరగకపోవడంతో తనను చిత్రాల నుంచి తొలగించారని చెప్పారు. అదీ ఒక హీరో కారణంగానే జరిగిందన్నారు. ఇప్పుడా హీరో రాజకీయవాదిగా ఉన్నారని చెప్పారు. ఆయనకు ఈగో అధికం అని తాను భావిస్తానన్నారు. అయినా తానా హీరోను గౌరవిస్తానని, అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని అన్నారు. ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించానని, షూటింగ్ సమయంలో ఎప్పుడూ నాపై కోపం ప్రదర్శించేవారని తెలిపారు. ఆ తరువాత ఆయన రెండు చిత్రాల నుంచి తనను తప్పించారని చెప్పారు అన్న కస్తూరి ఆ నటుడెవరన్నది మాత్రం చెప్పలేదు. ఈమె ఒక్క తమిళంలోనే కాకుండా పలు భాషా చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. నటి కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో చూడాలి మరి. అలాగే ఇలా ఇంకెందరు నటీమణులు స్పందిస్తారో కూడా వేచి చూడాల్సిందే. -
ప్రేమ పరిహాసంగా మారుతోంది
ప్రేమ పవిత్రమైనది. అదో అనిర్వచనీయమైన అనుభవం అలాంటి మాటలు చాలా విన్నాం. అలాంటిది ప్రేమ పరిహాసంగా మారింది. అనే ఆవేదన మాటలు వినాల్సి వస్తోంది. నటి వరలక్ష్మి సరిగ్గా ఇలాంటి అపనమ్మకపు వ్యాఖ్యలనే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ బ్యూటీ నటుడు శరత్‌కుమార్ కూతురన్న విషయం తెలిసిందే. విదేశాల్లో చదువుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి డ్యాన్సర్. ముఖ్యంగా కల్సా నృత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. పోడాపోడీఆ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ ఆ మధ్య విడుదలైన తారాతప్పట్టై చిత్రంతో మంచి ప్రాచుర్యం పొందారు. నటుడు విశాల్‌తో చెట్టాపట్టాలంటూ మరింతగా వార్తల్లో నిలిచారు. విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం చాలా కాలంగానే హల్చల్ చేస్తోంది. విశాల్ కూడా వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని వెల్లడించారు. అయితే ఎవరిని చేసుకుంటారో స్పష్టం చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో నటి వరలక్ష్మి ఇటీవల ప్రేమ పరిహాసంగా మారిపోతోందని, ఏడేళ్ల ప్రేమను చాలా తేలిగ్గా వద్దంటున్నారని అదీ తన మేనేజర్‌తో చెప్పి పంపిస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. అసలు ప్రేమ ఏమైపోతుందోనన్న ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే తను ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది క్లారిటీ లేకపోయినా, ఆమె వ్యాఖ్యలు మాత్రం మరోసారి కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. ఇటీవల దర్శకుడు ప్రియదర్శిన్, నటి లిజి సుమారు 14 ఏళ్లు కాపురం చేసి విడిపోయి విడాకులు పొందారు. అదే విధంగా రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య ఏడాదిగా భర్త అశ్విన్ కుమార్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి విడాకులు పొందే విషయం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు కూడా. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాఖ్యలు రకరకాల ఊహలకు దారి తీస్తున్నాయంటున్నారు సినీ వర్గాలు. ఇక వరలక్ష్మి వ్యాఖ్యల్లోని అర్థం, పరమార్థం ఏమిటో తను నోరు విప్పితే గానీ తెలియదు. -
‘లక్ష్మీ’కరమైన అమ్మాయితో పెళ్లి
సక్సెస్ఫుల్ కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు విశాల్. అలాగే మోస్ట్ బ్యాచిలర్ యువకుల పట్టికలో చేరిన నటుడు కూడా.తన పెళ్లిని చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం విశాల్ నటుడిగా నిర్మాతగా చాలా బిజీగా ఉన్నారు. అంతేకాదు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మరో వైపు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో ప్రేమాయణం అనే వదంతులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గురించి విలేకరులు చాలాసార్లు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన ఒకే ఒక్క సమాధానం వరలక్ష్మీ శరత్‌కుమార్ నా బాల్య స్నేహితురాలన్నదే. కాగా ఇటీవల విశాల్ ఒక ఇంటర్వ్యూలో నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం పూర్తి అయిన తరువాత అదే ఆవరణలో జరిగే పెళ్లి తనదే అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయం గురించి నడిగర్‌సంఘం కోశాధికారి కార్తీతో చర్చించినట్లు తెలిపారు.అదే విధంగా లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నట్లు అన్నారు. దీంతో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌నే ఆ లక్ష్మీకరమైన అమ్మాయి అనే ప్రచారం సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న తన వివాహం జరుగుతుందని, ఆ తేదీన సంఘ భవనంలో వివాహానికి ముందుగానే హాలును రిజర్వ్ చేసినట్లు విశాల్ వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రేమికులుగా ప్రచారం జరుగుతున్న విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నిజంగా పెళ్లి చేసుకుంటే సంతోషకరమే కదా.