
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్ వేలు పట్టుకుని ఏడడుగులు నడిచింది.

జూలై 2న మూడు ముళ్ల బంధంలో అడుగు పెట్టింది.

థాయ్‌ల్యాండ్‌లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంది.

అందుకు సంబంధించిన ఫోటోలను వరలక్ష్మి సోషల్ మీడియాలో వదిలింది.

పెళ్లి చేసుకుంటావా? అని నా కలలరాజు అడిగాడు.

సరేనని తలూపాను. నేను కోరుకున్నట్లుగా అద్భుతంగా నా వివాహం జరిగింది.

మనమిద్దరం జంటగా జీవితాంతం కలిసి ప్రయాణించాలి.

ఐ లవ్యూ నికోలయ్ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు అందమైన క్యాప్షన్ జోడించింది.

ఇప్పుడా పెళ్లి ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.





