నటుడు విశాల్, నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ల వ్యవహారం తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో హాట్ హాట్‌గా మారింది. ఈ సంచలన జంట గురించి ఇప్పటికే పలు వదంతులు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. విశాల్, వరలక్ష్మి ప్రేమలో పడ్డారని, ఆ తరువాత మనస్పర్థలతో విడిపోయారని, కాదు కాదు వారిద్దరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి లాంటి పలు రకాల ప్రచారం కోలీవుడ్‌ను వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే విశాల్, వరలక్ష్మీ మాత్రం తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. తాజాగా మరోసారి ఈ జంట గురించి సమాచారం వార్తల్లో వైరల్ అవుతోంది.
విశాల్‌కు పెళ్లి కుదిరింది
నటుడు విశాల్‌కు వివాహ ఘడియలు దగ్గర పడ్డాయన్నది తాజా వార్త. విశాల్ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలతో పాటు దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా ఉన్నారు. నటీనటుల సంఘానికి నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ పెళ్లి చేసుకోను. తన పెళ్లి ఆ నూతన భవనంలోని కల్యాణ మండపంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ తండ్రి, నిర్మాత, వ్యాపారవేత్త జీకే.రెడ్డి ఇటీవల ఒక భేటీలో విశాల్‌కు పెళ్లి కుదిరిందని, అమ్మాయి పేరు అనీషా అని తెలిపారు. హైదరాబాద్‌లో ఎప్పుడైనా వివాహ నిశ్చితార్థం జరగవచ్చునని పేర్కొన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా నటి వరలక్ష్మీశరత్‌కుమార్ స్పందనే ఘాటుగా ఉంది.
బెటర్ లక్ నెక్ట్స్‌టైమ్
విశాల్‌కు అమ్మాయి సెట్ కావడంతో ఆయనతో కలిసి వదంతులను ఎదుర్కొంటున్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కూడా త్వరలో పెళ్లికి సిద్ధం అవుతోందని, వివాహానంతరం నటనకు గుడ్‌బై చెప్పనుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రచారానికి నటి వరలక్ష్మి ట్విట్టర్‌లో కాస్తా ఘాటుగానే స్పందించింది. తన పెళ్లి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఇంతకుముందు మాదిరిగానే ఈ ఏడాది చివరిలోనూ కొందరు పనీపాటా లేని వారు నా పెళ్లి గురించి మాట్లాడటం మొదలెట్టారు. నిజానికి నేనెక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను. సినిమాల్లో నటిస్తూనే అందరి పని పడతాను. కాబట్టి ప్రియమైన ప్రచారకులారా మీకు బెటర్ లక్ నెక్ట్స్‌టైమ్. ఈ సారి ఇంకా గట్టిగా ప్రయత్నించండి. మీరెవరన్నది నాకు తెలుసు అని పేర్కొంది. ఇలా వరలక్ష్మీ తన పెళ్లి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment